Posts

Showing posts from November, 2018

నవగ్రహ దోషములు..పరిహారాలు..!

Image
💐శ్రీ నవగ్రహ మంత్రములు..💐 మానవుని యొక్క దైనందిన జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతూ ఉం టాయి. జ్యోతిష్యం పై నమ్మకం ఉన్నవారు సమస్యకు కారణం తెలిసిన వెంటనే సంబంధిత గ్రహానికి పూజించి ఆ గ్రహానుగ్రహం పొంది తత్‌సంబంధమైన భాదల నుండి విముక్తి పొందుతుంటారు. జ్యోతిష్య జ్ఞానం లేనివారు కూడా వారికి కలుగుచున్న కష్టాలకు కారణం అగు గ్రహం తెలుసుకొని ఆ గ్రహాని కి శాంతి మార్గములు చేసుకొనిన గ్రహ భాదల నుండి విముక్తి పొందుతారు. సూర్యుడు:💐 ఎవరి జాతకంలో అయితే రవి బలహీనంగా ఉంటాడో వారికి అనారోగ్యము, అధికారుల నుండి వేధింపులు, తండ్రి లేదా పుత్రుల నుండి వ్యతిరేకత, నేత్ర, గుండె సంబంధిత వ్యాధులు, తండ్రి తరుపు బంధువులతో పడకపోవుట, ఏదైనా సాధించాలనే పట్టుదల లేకపోవుట, ఆత్మ విశ్వాసం లేకపోవుట వంటి సమస్యలు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొనేవారు సూర్య గ్రహ అనుగ్రహం కొరకు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొనుట, ఆదిత్య హృదయం పారాయణం, గోధుమ లేదా గోధుమలతో తయా రుచేసిన ఆహారపదార్థ ములు దానం చేయుట. తండ్రి గారిని లేదా తండ్రితో సమానమైన వారిని గౌరవించుట వలన రవి గ్రహదోషము తొలగిపోయి అభివృద్ధి కలుగుతుంది. చంద్రుడు:💐 చంద్రుడు జా

భోదన ఏకాదశి..ఉత్థాన ఏకాదశి.కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఏమి చేయాలి?

కార్తీక ఏకాదశి..19-11-2018సోమవారం.!💐శ్రీ💐 భోదన ఏకాదశి..ఉత్థాన ఏకాదశి.కార్తీక శుద్ధ ఏకాదశి        కార్తీకశుద్ధ ఏకాదశికే భోధన ఏకాదశి, దేవ-ప్రబోధిని ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అని పేర్లు. ఈ ఏకాదశి సోమవారం తో..కూడి రావడం..ఎంతో విశేషమైన ఫలితాలనిస్తుంది. శివకేశవుల మాసం..కార్తికం..!💐 శివకేశవులకు ప్రీతికరమైన మాసం... ఆధ్యాత్మిక శోభను భావితరాలకు అందించే మాసం.. మనిషిగా వికసించడానికీ, ఆధ్యాత్మికంగా ఎదగడానికీ ఈ మాసం లోని ప్రతి తిథీ ఓ జీవనశైలి పాఠమే. పౌర్ణమినాడు కృత్తికా నక్షత్రం ఉండటం వల్లే ఈ నెలకు కార్తిక మాసం అని పేరు. శివకేశవులకు ఎలాంటి భేదం లేదని చెప్పడానికి ఈ మాసానికి మించిన ఉదాహరణ లేదు. కార్తిక సోమవారాలూ, మాసశివరాత్రులూ శివుడికి ప్రీతిపాత్రమైనవి అయితే, కార్తికంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి, త్రయోదశులు విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైనవి. హరిహర మాసంగా పేర్కొనే ఈ మాసంలో కార్తిక స్నానం, దీపారాధన శ్రేష్ఠమైనవి. సూర్యోదయం కంటే ముందే చన్నీటి స్నానం చేసి, ఉసిరిచెట్టూ, రావిచెట్టూ లేదంటే తులసికోట దగ్గరో దీపం వెలిగించి, కార్తిక దామోదరుడిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయంటారు. నిజానికి ఈ మ