Homas and its uses
హోమాలు అంటే ఏంటీ..? ముఖ్య హోమాలు వాటి ప్రయోజనాలు ..... గణపతి హోమం :- విఘ్నాలను తొలగించే విఘ్ననాయకుడు గణపతి. మానవులు ప్రారంభించే ప్రతి కార్యాల్లోనూ మొదటగా గణపతిని పూజించడం జరుగుతుంది. ప్రారంభించిన కార్యం ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని కోరుతూ వినాయకుడిని పూజిస్తారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను, ప్రతికూల అంశాలను తొలగించడానికి వినాయకుడికి గణపతి హోమం నిర్వహిస్తాము. ఈ గణపతి హోమం చేయడం వలన విజయము, ఆరోగ్యము, సంపద కార్య సిద్ధి కలుగుతాయి. హిందూ ధర్మం ప్రకారం ఏ శుభకార్యం చేయాలన్నా మొదటగా గణపతి హోమంతోనే ప్రారంభించడం జరుగుతుంది. ఈ గణపతి హోమానికి అష్ట ద్రవ్యలు/ 8 రకాలు. దర్భ మొదలగునవి ఉపయోగించడం జరుగుతుంది. రుద్ర హోమం:-పురాణ కథలను అనుసరించి రుద్ర అనునది శివునికి మరొక నామము. శివుడు లేదా రుద్రుని అనుగ్రహం కొరకు చేసే హోమాన్ని రుద్రహోమము అంటారు. ఈ హోమం చేయుట వలన శివుని అనుగ్రహం పొంది తద్వారా అపమృత్యు భయాలు తొలగింపబడి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొంది శక్తి సంపన్నులు అవుతారు. దీర్ఘాయుష్షుని పొందడం జరుగుతుంది. మృత్యువు మీద విజయాన్ని సాధించడానికి కూడా ఈ రుద్ర హోమం చేస్తారు. ఏ వ్యక్తి