Posts

Showing posts from December, 2018

కాశిలో చూడవలసినవి

Image
🚩 శ్రీ ఓం నమః శివాయ..!!🙏 కాశీ లో ప్రవేశించగానే ముందుగా.. కాశీ విశ్వేశ్వరుని తలచుకుని, నమస్కరించుకుని కాశీ నేలని తాకి నమస్కరించుకోవాలి. బస చేరుకున్న తరువాత ముందుగా.. గంగా దర్శనం..గంగా స్నానం. కాలభైరవుని దర్శనం కాలభైరవుని గుడి వెనకాల దండపాణి గుడి దర్శనం డుంఠి గణపతి దర్శనం కాశీ విశ్వేశ్వరుని దర్శనం (ప్రొద్దున 4-00amకి తిరిగి సాయంత్రం 7-30pmకి స్పర్శ దర్శనం ఉంటుంది.) కాశీ [భక్తులు దర్శనానికి వచ్చే దాన్ని బట్టి ఇది మారుతుంటుంది అన్నపూర్ణ దర్శనం భాస్కరాచార్య ప్రతిష్ఠిత శ్రీచక్ర లింగ దర్శనం (అన్నపూర్ణ దేవాలయ ప్రవేశ ద్వారం వద్ద కుడివైపు ఉంటుంది). కాశీ విశాలాక్షి దర్శనం వారాహి మాత గుడి ఈ గుడి ప్రొద్దున 8-00 గంటల వరకే తెరిచి ఉంటుంది. లలిత ఘాట్ వద్ద నుండి వెళ్ళవచ్చు. లేకపోతే విశాలాక్షి మాత గుడి వెనుకగా వారాహి మాత గుడికి అడ్డ దారి ఉన్నది ఇది చాలా దగ్గర దారి. ఎవరిని అడిగినా చెపుతారు. మణికర్ణికా ఘట్టంలో స్నానం. (వీలైతే మధ్యాహ్నం 12-00 గంటలకి) గంగా హారతి - దశాశ్వమేధ్ ఘాట్ వద్ద (అస్సి ఘాట్ వద్ద కూడా గంగా హారతి ఇస్తారు) కేదార్ఘాట్ వద్ద కేదారేశ్వరుని దర్శనం చింతామణి గ