Posts

Showing posts from February, 2019

ధర్మ సందేహాలు - సమాధానాలు .

 * వాస్తు పురుషుడు ఎప్పుడు జన్మించాడు ? భాద్రపద బహుళ తదియ, మంగళవారము, కృత్తిక నక్షత్రము, వ్యతిపాత యోగము, భద్రనాకరణము గుళికతో కూడిన కాలములో వాస్తు పురుషుడు జన్మించాడు.  * ఏడుగురు అప్సరసల పేర్లు ఏవి ? 1.రంభ. 2. ఉర్వశి. 3.మేనక  4.తిలోత్తమ. 5.సుకేశి. 6. ఘ్రుతాచి 7. మంజుగోష .  * సప్త సంతానములు అంటే ఏమిటి ? 1. తటాక నిర్మాణం. 2. ధన నిక్షేపం. 3. అగ్రహార ప్రతిష్ట . 4. దేవాలయ ప్రతిష్ట . 5. ప్రభంధ రచన. 6. స్వసంతానం ( పుత్రుడు ). * తొమ్మిది రకాల ఆత్మలు  ఏవి ?  1. జీవాత్మ. 2. అంతరాత్మ. 3. పరమాత్మ.  4. నిర్మలాత్మ. 5. శుద్దాత్మ. 6. జ్ఞానత్మ  7. మహాధాత్మ . 8. భూతాత్మ . 9. సకలాత్మ.  * పదిరకాల పాలు ఏవి ?  1. చనుబాలు. 2. ఆవుపాలు . 3. బర్రెపాలు .  4. గొర్రె పాలు. 5. మేక పాలు. 6. గుర్రం పాలు.  7. గాడిద పాలు. 8. ఒంటె పాలు. 9. ఏనుగు పాలు.  10. లేడి పాలు.  * యజ్ఞోపవీతం లొ ఎన్నిపోగులు ఉంటాయి?  యజ్ఞోపవీతం లొ 9 పోగులు ఉంటాయి. ఆ తొమ్మిది పోగుల్లో 9 మంది దేవతలు నివసిస్తారు. వారు   1. బ్రహ్మ . 2. అగ్ని. 3. అనంతుడు. 4. చంద్రుడు . 5. పితృ దేవతలు . 6. ప్రజాపతి. 7. వాయువు .  8. సూర్యుడు