Posts

Showing posts from March, 2019

తులసీ ప్రదక్షిణం పాట

****  గోప ప్రదక్షిణం నీకిస్తినమ్మా ! గోవిందు సన్నిధి నాకియ్యవమ్మా  ఒంటి ప్రదక్షిణం నీకిస్తినమ్మా !వైకుంఠసన్నిధి నాకియ్యవమ్మా  రెండో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ! నిండైన సందలు నాకియ్యవమ్మా  మూడో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ! ముత్తైదువతనం నాకియ్యవమ్మా   నాల్గోప్రదక్షిణం నీకిస్తినమ్మా ! నవధాన్య రాసులను నాకియ్యవమ్మా   అయిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా !ఆయువై దోతనం నాక్య్యవమ్మా   ఆరో ప్రదక్షిణం నీకిస్తినమ్మా! అత్తగల పుత్రుణ్ణి నాకియ్యవమ్మా  ఏడో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ! వెన్నుని ఏకాంత సేవియ్యవమ్మా  ఎనిమిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ! యమునిచే బాధలు తప్పించవమ్మా  తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ! తోడుగా కన్యలకు తోడియ్యవమ్మా   పదోప్రదక్షిణం నీకిస్తినమ్మా !  పద్మాక్షి నీసేవ నాకియ్యవమ్మా  ఎవ్వరు పాడినా ఏకాశి మరణం ! పుణ్యస్త్రీలు పాడితే పుత్రసంతానం  రామతులసీ , లక్ష్మీ తులసీ ! నిత్యం మాయింట కొలువై విలసిల్లవమ్మా ,,

ద్రాక్షారామం దగ్గర నక్షత్ర దేవాలయాలు

ద్రాక్షారామ చుట్టుపక్కల అనేక శివాలయాలు దేవీమందిరాలు ఉన్నాయని అందరికి తెలిసిన విషయమే. ఆ ఆలయాలన్నిటిని ఆకాశమార్గాన చూస్తే అన్ని కలిపి ఒక పద్మాకారం లో వుంటాయి. ఈ ఆలయాల గురించి బహుళ ప్రాచుర్యం లేనందున చాల మందికి ఈ ఆలయాల గురించిన అవగాహన లేదు. విశేషమేమిటంటే, ప్రతి వ్యక్తి 27 నక్షత్రాలు లో ఉన్న 108 పాదాలలో ఏదో ఒక దానిలో జన్మిస్తారు. ప్రతి నక్షత్రానికి దానికి సంబంధించిన ప్రతి పాదానికి సంబంధించి ప్రత్యేకమైన ఆలయం ఉంటుంది  గ్రహదోష నివారణ కోసం  అభిషేకాలు చేయ దలుచుకున్న వారికి ఆ ప్రత్యేకమైన ఆలయంలో మొదట నామ నక్షత్రము,  లేదా జన్మనక్షత్రానికి తరువాత రాశికి సంబంధించిన లింగ ఆరాధన చేసి చివరకు ద్రాక్షారామం దర్శించుకుంటే ఫలితం ఉంటుందట . మేషరాశి నుండి మీనరాశి వరకు అదే క్రమంలో ఆరాధించ వలసిన ఆలయాల సమాచారం. మేష రాశి మేషరాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామం భీమేశ్వర స్వామి వారి ఆలయానికి తూర్పున విలాసగంగావరంలో వుంది.  అశ్విని నక్షత్రం పాదం ----------స్థలం --------   దేవీ దేవతల నామాలు మొదటి---------బ్రహ్మపురి-------శ్రీశ్రీశ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి రెండవ ------- - ఉట్రుమిల్లి -------శ్రీ బా