మానవుడు నిత్యమూ అచరించవలసిన ధర్మములు ?
*మానవుడు నిత్యమూ అచరించవలసిన ధర్మములు ?* *1. పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఎప్పుడు తీయాలి?* జ. పిల్లలకు ‘9 ‘ వ నెలలో కాని, ’11 ‘వ నెలలో కాని, ‘3 ‘వ సంవత్సరం లో కాని తీయవలెను. *2. పిల్లలకు అన్నప్రాసన ఎన్నో నెలలో చేయాలి ?* జ. ఆడ పిల్లలకు ‘5 ‘ వ నెలలో, మగ పిల్లలకు ‘6 ‘ వ నెలలో అన్న ప్రాసన చేయాలి. *6 నెల 6వ రోజున ఇద్దరికీ పనికివస్తుంది.* *3 .పంచామృతం, పంచగవ్యములు అని దేనిని అంటారు ?* జ. ఆవు పాలు,ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, వీటిని పంచామృతం అని, ఆవు పాలు,ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రము, వీటిని పంచగవ్యములు అంటారు. *4. ద్వారానికి అంత ప్రాముక్యం ఎందుకు ఇస్తారు?* జ. ద్వారానికి పైనున్న కమ్మి లక్ష్మి స్వరూపము, అందుకే దానికి మామిడి తోరణం కడతారు. క్రింద కమ్మి పవిత్రమైనది, కనుక దానికి పసుపు రాస్తారు. శాస్ర పరంగా చెప్పాలంటే గడప కు పసుపు రాయడం వల్ల క్రిమి కీటకాలు, విష పురుగులు ఇంట్లోకి రాకుండా ఉండటానికి అనుకోవచ్చు. *5. తీర్థాన్ని మూడుసార్లు తీసుకుంటారు. ఎందుకు?* జ. తొలితీర్థము శరీర శుద్ధికి,శుచికి…రెండవ తీర్ధం ధర్మ,న్యాయ ప్రవర్తనకు …మూడవ తీర్ధం పవిత్రమ