Posts

Showing posts from February, 2020

Kashi కాశీలోని కొన్ని వింతలు..విశేషాలు.

Image
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 1. కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు కంపుకొట్టవు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది. 2. కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికీ జాడ దొరకకుండా ఉంటుంది. 3. కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు, పూలచెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు. 4. అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి కాశీి లో అనేక రీసెర్చ్ లు జరిపి ఆశ్చర్యపోయ్యారు. 5. అస్సలు ఈ కాస్మోర్స్ ఎక్కడి నిండి వస్తున్నాయి? 6. అప్పటి పూర్వికులు శక్తి చలనం వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు. 7. అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికీ ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు. 8. కాశీి విశ్వేశ్వరునికి శవభస్మలేపనంతో పూజ ప్రారంభిస్తారు. 9. కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లభిస్తుంద

Myla or Suthakam మైల / సూతకం వివరణ

మైల / సూతకం: ఎప్పుడు ఎలా..? మైల, సూతకం అనే విషయాలు ధర్మసింధు అనే గ్రంథంలో వివరించబడ్డాయి. తాశౌచ(పురుడు) మ్రుతాశౌచ(మైల) కాలాలో అందరూ, రజోదర్శన కాలంలో(ముట్టు) స్త్రీలు అస్ప్రుశ్యులుగా భావించబడతారు. సూతకం రెండురకాలు.. జాతాశౌచం, మృతాశౌచం. షోడశ సంస్కారాల్లో ఒకటి అశౌచం. చావు సంభవించిన ఇంటిలో నివాసముండడం మంచిది కాదనే నమ్మకంతో సంవత్సరకాలం ఆ ఇంటిని ఖాళీగా ఉంచుతారు. దీన్ని సూతకమని అంటారు. సూతకం ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండదు? ఎవరి ఇంట్లో శిశువు జన్మించింది? ఎవరి ఇంట్లో మరణం సంభవించింది? ఆయా ఇళ్ళల్లో నివసించే వారందరికీ మాత్రమే వర్తిస్తుంది. జాతికి, వంశానికి, గోత్రానికి సంబంధం లేదు. వారితో కలిసి కాక దూరంగా ఉండేవారికి వర్తించదు. కొత్తగా పెళ్లయిన అమ్మాయికి మేనమామ చనిపోతే మూడు రోజుల పాటు మైల ఉంటుంది. అయితే, అమ్మాయి భర్తకు ఉండదు. ఇది 12 రోజుల లోపు తెలిస్తే ఒక రోజు మైల ఉండును. మన తెలుగు సంప్రదాయం ప్రకారం బ్రహ్మణ, క్షత్రియ, వైశులకు, మాత్రం తప్పనిసరిగా సంవత్సరికం వరకు గృహప్రవేశాదులు, దైవరాధానులు కూడా నిషిద్ధం. సంవత్సర సూతకం దాటిన తరువాతే వీటిని నిర్వహించే అధికారం ఉంది. ద్వెజీతరాలకు ఈ విషయాలలో కొంత సడలింపు

God photos జీర్ణమైన దేవుని చిత్ర పటాలు ఏమి చేయాలి

ఇంట్లో పాడైపోయిన విరిగిపోయి న లేదా జీర్ణమైన విగ్రహాలు / చిత్ర పటాలు ( photos ) ఏంచేయాలి ?.. ఈ సమస్య మరియు ప్రశ్న  అందరికీ ఉండేదే...చాలా మంది తమ ఇంట్లో పాడైపోయిన విగ్రహాలు, పటాలు ఏ దేవాలయంలోనో లేదా రోడ్డుప్రక్కన చెట్టు క్రిందో వదిలేసి వెళ్లిపోతుంటారు. కానీ తెలిసి తెలియక అలా చేయడం మహాపాపం. క్షమించరాని నేరం. ఇంట్లో వున్నంతకాలం  పూజలు చేసి తరువాత అవసరం లేదని లేదా పాడైపోయాని  వాటిని ఏ చెట్టు🌳 క్రిందో లేదా ఏ రోడ్డు పక్కన పడవేయకండి. అలా రోడ్డు పక్కన ఉన్న మన "హిందూ దేవుళ్ళ" ఫోటోలు చూసి ఇతర మతస్తులు మన మతం గురించి చాలా అవహేళన చేస్తున్నారు. వారికీ ఆ అవకాశం ఇవ్వకండి. ఇతర మతస్థుల దేవుళ్ళ ఫోటోలు అంత దయనీయంగా మనం ఎక్కడన్నా చూస్తామా మీరే ఆలోచించండి. దయచేసి మనకు అవసరం లేని  పటాలను లేదా దేవుడి బొమ్మలను అగ్నికి 🔥ఆహుతి ఇవ్వడం మంచి పద్దతి. అదేంటి దేవుడి పటాలను అలా అగ్నిలో వేస్తారా ఎక్కడైనా ? అన్న సందేహం మీకు రావచ్చు. కానీ అగ్ని 🔥సర్వభక్షకుడు, అన్ని వేళలా పునీతుడు. కనుక పవిత్రాగ్నిలో దేవతా పటాలను సమర్పించడం ఎంతమాత్రం తప్పుకాదు లేదా ప్రవహిస్తున్న నది🌊లో గాని మన ఊరి చెరువుల్లో గాని "న

Pelli or Marriage పెళ్లి లో కన్య ను గంప లో మేనమామ ఎందుకు తేవాలి

వెదురు బుట్ట తయారుచేసి దానిలో కొద్దిగా ధాన్యం పోసి ఆ పిల్లని అందులో కూర్చోమని గౌరీ పూజ చేయిస్తారు. బుట్టలో కూర్చుని వివాహ వేదిక మీదకి రావడం కన్నా ముందే గౌరీ పూజ చేసేటప్పుడు బుట్టలో కూర్చుంటుంది. గౌరీ పూజ చేసేటప్పుడు బుట్టలో ఎందుకు కూర్చుంటోంది అంటే అప్పుడు ఆమె ఒకరికి లక్ష్మి అవుతోంది. అవతలి వారి వద్ద భార్యా స్థానాన్ని పొందుతోంది. పత్నీ స్థానాన్ని పొందుతోంది. సనాతన ధర్మంలో ఆమె కామపత్ని కాదు. సహధర్మచారిణి. ఆమె ఉంటే తప్ప ఆయనకి ధర్మం నడవదు. అసలు ఆయనకి అభ్యున్నతి లేదు. ఆయనకు ఉన్నటువంటి లక్ష్మి అంటే కేవలం ఐశ్వర్యం కాదు. ఆయన అభ్యున్నతి అంతా ఎవరిమీద ఆధారపడింది అంటే ఆమె మీదే ఆధారపడింది. ఆయన ఒక యజ్ఞం చేయాలి అంటే ఆమె ప్రక్కన ఉండాలి. ఆయన కన్యాదానం చేయాలి అంటే ఆమె ప్రక్కన ఉండాలి. ఆమె లేనినాడు ఆయన ఏమీ చేసుకోలేడు. మరి లక్ష్మియే కదా జీవుడికి!  పైగా ఇల్లాలు కాగానే ఐశ్వర్యం ఆయనది కాదు ఆవిడది. ఐశ్వర్యం అంతా ఆమెకి చెందుతుంది. అందుకే ఆయన వృద్ధి కూడా దేనిమీద ఆధారపడుతుంది అంటే భార్య మీద ఆధారపడుతుంది. ఆమెయే ఆతని లక్ష్మి. అందుకే లక్ష్మి ఉండే అయిదు స్థానాలలో ఒక స్థానం సువాసిని పాపట ప్రారంభ స్థానం.