Posts

Showing posts from September, 2020

Dasara navaratri puja vidhanam

Image
 🌸🍃🌸🍃🌸🍃🌸 🍃🌸🍃🌸🍃🌸🍃 *🕉️శరన్నవరాత్రులు,పూజ విధానం🕉️* 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸 ముందు రోజే పీఠాన్ని సిద్ధం చేసుకోవాలి, కొందరు అమ్మవారి ప్రతిమను , కొందరు ఫోటోను, కొందరు  పసుపు గోధుమ పిండితో కలిపిన 9 అమ్మవారి రూపాలను, దీనితో పాటు కళాశాన్ని.. ప్రతిష్ట చేస్తారు..ఎవరి అలవాటు ప్రకారం వారు ప్రతిష్ట చేసుకోవాలి.. కొందరు అమ్మవారి ప్రతిష్ట తో పాటు ఒక కుండలో నవధాన్యాలు వేసి ఉంచుతారు తొమ్మిదవ రోజుకి అవి బాగా మొలకలు వచ్చి పెరుగుతుంది అది శుభ సూచకంగా భావిస్తారు. కొందరికి బొమ్మల కొలువు ఆనవాయితీగా పెడతారు వారు ముందురోజే సిద్ధం చేసుకోవాలి బొమ్మల కొలువు పెట్టేవాళ్ళు కళశాన్ని స్థాపన చేయాలి. వచ్చే ప్రతి ముత్తైదువులకు పసుపుకుంకుమ ఇచ్చి పంపాలి   వారు ఏ సమయంలో వచ్చినా.. ఇవ్వాలి కొలువై ఉన్న దేవతలుగా భావించాలి.. కుమారి పూజ: కుమారి పూజ 9 సంవత్సరాలు లోపు బాలికలకే చేయాలి.. 🕉️ఉపవాసం: ఆరోగ్యం బాగలేని వారు ఉపవాసం చేయడం దోషం , పూజ అయ్యాక ఆల్ఫాహారం తీసుకోవచ్చు..అన్నం తినడం ఇష్టం లేకపోతే పిండి తో చేసిన పదార్థాలు ఆల్ఫాహారం లాంటిది తినవచ్చు..ఇంక ఉపవాసం ఉండే వారు సాయంత్రం పూజ తర్వాత తినవచ్చు..కఠినంగా ఉపవాస దీక్ష ఉండే

Simple remedy for pitru dosha

 పితృ దోషము నుండి బయటపడే సులువైన పరిష్కారం " పితృ దోషం' ... మన తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులను వంశపారంపర్యంగా అనుభవించటానికి మనం ఎలాగ హక్కు అర్హత పొందుతామో ... అలాగే...  తాతలు తండ్రులు చేసిన పాపపుణ్యాలు కూడా ఆ వంశానికి వర్తిస్తాయి. మన పెద్దలు పుణ్యాలు మంచిపనులు చేస్తూ ఉంటే వారి వంశం సుఖ సంతోషాలతో ఉంటుంది. అలాగే అదే పూర్వికులు పాపాలు గనుక చేసి ఉంటే అది తెలుసు కావచ్చు తెలియక కావచ్చు ఏదైనా గాని వారు చేసిన పాప కర్మలు ఆ వంశపారంపర్యంగా ఆ కుటుంబంలోని వారు అనుభవించక తప్పదు -  మేము తెలిసి తెలియక ఏ తప్పు చేయలేదు కానీ బాధలను కర్మలను అనుభవిస్తున్నాను అనే బాధ పడేవారు ముఖ్యంగా తెలుసుకోవలసినది ముఖ్యమైనది ఒక్కటే. అదే " పితృ దోషం " ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విషయం. అందుకే ఈ పోస్టు పెడుతున్నాను. పితృ దోషం ఉన్నవారు ఈ జన్మలో వారు ఏ పాప కర్మలను చేయకపోయినా కుటుంబం ఇబ్బందులపాలు అవుతూ కష్టాలకు లోనవుతూ ఉంటుంది. ఎందుకంటే మన పెద్దలు చేసిన పాప ఫలాలు. వారి ఆస్తులను పంచుకున్నప్పుడు వారి పాపాలను కూడా కచ్చితంగా పంచుకొని తీరవలసిందే. పితృదోష వలన కలిగే దుష్పరిణామాలు కొన్ని చర్చించుకుందాము...

Nitya parayana slokalu

 💢నిత్య పారాయణ శ్లోకాలు💢 మనలో చాలామందికి తెలియని శ్లోకాలు ఏ దైవ సన్నిధిలో ఏ శ్లోకం జపించాలో తెలుసుకోండి...   🌷ప్రభాత శ్లోకం :🌷 కరాగ్రే వసతే లక్ష్మీ: కరమధ్యే సరస్వతీ ! కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ !!   ☘ప్రభాత భూమి శ్లోకం : ☘ సముద్ర వసనే దేవీ పర్వత స్తవ మండలే ! విష్ణుపత్ని సమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే !!   🌝సూర్యోదయ శ్లోకం : 🌝 బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్ ! సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరమ్ !!   🍀స్నాన శ్లోకం : ☘ గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ ! నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు !!   ♨భస్మ ధారణ శ్లోకం : ♨ శ్రీకరం చ పవిత్రం చ శోక నివారణమ్ ! లోకే వశీకరం పుంసాం భస్మం త్ర్యైలోక్య పావనమ్ !!   🍀భోజనపూర్వ శ్లోకం : 🍀 బ్రహ్మార్పణం బ్రహ్మ హవి: బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ ! బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన: !!   అహం వైశ్యానరో భూత్వా ప్రాణినాం దేహ - మాశ్రిత: ! ప్రాణాపాన సమాయుక్త: పచామ్యన్నం చతుర్విధమ్ !!   త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే ! గృమాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర !!   💢 భోజనానంతర శ్లోకం : 💢 అగస్త్యం వైనతేయం చ శమీం చ

Khadga mala stotram

Image
 🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️ 🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹 _*🌷పౌర్ణమి రోజు వెన్నెల పారాయణం ఎంత విశేష ఫలితాన్ని ఇస్తుందో, నవమి రోజు సాయంత్రం దేవి ఖడ్గమాల స్త్రోత్రం పారాయణం అంత ఫలితాన్నిస్తుంది పానకం పెట్టి  16 సార్లు చదవాలి🌷*_ *🌹శ్రీ దేవీ  ఖడ్గమాలా స్తోత్రం (నామావలి)🌹* 👉(ఖడ్గమాల పారాయణ చేయడం అంటే శ్రీచక్రాన్ని అర్చన చేయడం ఇలా లలితా మూల బీజాలతో సంపుటికరణ చేసి నామావలి తో అమ్మవారికి అర్చన చేయడం వల్ల ఎన్నో రకాల సమస్యలు తొలగి పోతుంది, ఉపదేశము లేని వారికి న్యాసాలు అవసరం లేదు)..అవి వదలి నామం చదవండి  హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్జ్వలామ్ | వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీమ్ || అస్య శ్రీ శుద్ధశక్తిమాలామహామంత్రస్య, ఉపస్థేంద్రియాధిష్ఠాయీ వరుణాదిత్య ఋషయః దేవీ గాయత్రీ ఛందః సాత్విక కకారభట్టారకపీఠస్థిత కామేశ్వరాంకనిలయా మహాకామేశ్వరీ శ్రీ లలితా భట్టారికా దేవతా, ఐం బీజం క్లీం శక్తిః, సౌః కీలకం మమ ఖడ్గసిద్ధ్యర్థే సర్వాభీష్టసిద్ధ్యర్థే జపే వినియోగః, మూలమంత్రేణ షడంగన్యాసం కుర్యాత్ | ధ్యానం ఆరక