Posts

Showing posts from August, 2018

సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు

మనం తరుచుగా వినే కొన్ని సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు తెలుసుకోవాలని అనిపించడం సహజం కదా!  అలాంటి వాటిని కొన్నింటిని మీకోసం సిద్ధం చేశారు. చూడండి: ముందుగా మనం తరుచుగా వినే మూల వాక్యాలు ఇవీ: 👉 *ధర్మో రక్షతి రక్షిత:* 👉 *సత్య మేవ జయతే* 👉 *అహింసా పరమో2ధర్మ:* 👉 *ధనం మూలమిదం జగత్* 👉 *జననీ జన్మ భూమిశ్చ* 👉 *స్వర్గాదపి గరీయసి* 👉 *కృషితో నాస్తి దుర్భిక్షమ్* 👉 *బ్రాహ్మణానా మనేకత్వం* 👉 *యథా రాజా తథా ప్రజా* 👉 *పుస్తకం వనితా విత్తం* 👉 *పర హస్తం గతం గత:* 👉 *శత శ్లోకేన పండిత:* 👉 *శతం విహాయ భోక్తవ్యం* 👉 *అతి సర్వత్ర వర్జయేత్* 👉 *బుద్ధి: కర్మానుసారిణీ* 👉 *వినాశ కాలే విపరీత బుద్ధి:* 👉 *భార్యా రూప వతీ శత్రు:* 👉 *స్త్రీ బుద్ధి: ప్రళయాంతక:* 👉 *వృద్ధ నారీ పతి వ్రతా* 👉 *అతి వినయం ధూర్త లక్షణమ్* 👉 *ఆలస్యం అమృతం విషమ్* 👉 *దండం దశ గుణం భవేత్* 👉 *ఇవీ మన చెవిని పడుతూ ఉండే మూల వాక్యాలు. కదా?* *ఇప్పుడు వీటి పూర్తి పాఠాలు చూదామా ?* ధర్మ ఏవో హతో హంతి "ధర్మో రక్షతి రక్షిత:" తస్మా ధర్మో న హంతవ్యో మానో ధర్మో హ్రతోవ్రధీత్ 🔥ధర్మాన్ని మనం ధ్వంసం చేస్తే ,

శ్రీకృష్ణ జన్మాష్టమి ఉపాసన

Image
*శ్రీకృష్ణ జన్మాష్టమి ఉపాసన(8 రోజులు)* రేపట్నుంచి అంటే శ్రావణ బహుళ పాడ్యమి(ఆగష్టు27) నుంచి జన్మాష్టమి అంటే శ్రావణ బహుళ అష్టమి(సెప్టెంబర్3) వరకు చేసే ఉపాసనని జన్మాష్టమి ఉపాసన అంటారు. అంటే ఈ 8 రోజులు భక్తులు పరమభక్తితో, నియమ నిష్టలతో శ్రీకృష్ణ పరమాత్మను ఉపాసన చేస్తారు. శ్రావణమాసంలో చేసే జన్మాష్టమి ఉపాసన చాలా అద్భుతమైన ఫలితాలనిస్తుంది. *జన్మాష్టమి గొప్పదనం* భక్తులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి, ధర్మాన్ని పునరుద్ధరించడానికి పరమాత్మ అవతారం స్వీకరిస్తూ ఉంటారు. కొన్నిసార్లు అంశావతారాలుగా, కొన్నిసార్లు ఆవేశావతారాలుగా, కొన్నిసార్లు పూర్ణావతారాలుగా వస్తే ఒక్క కృష్ణావతారం మాత్రం పరిపూర్ణ అవతారంగా వచ్చారు. అంటే రాశీభూతమైన పరబ్రహ్మము ఏదీ ఉందో, ఎవరు సాకారరూపమై సమస్తబ్రహ్మాండాలను హేలగా సృష్ఠి, స్థితి, లయములను చేస్తున్నాడో, అట్టి పరాత్పరుడు పరిపూర్ణమైన స్వస్వరూపంతో ఈ భూమిమీద పాదం మోపిన తిధిని జన్మాష్టమి అంటారు. మిగతా పర్వదినాలన్నీ ఒక ఎత్తైతే, జన్మాష్టమి పర్వదినం ప్రత్యేకంగా ఉంటుంది. “కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినష్యతి”, కోటి జన్మలలో చేసిన పాపములు సైతం నశిస్తాయి ప్రతిరోజు కృష్ణప

శ్రీ హయగ్రీవ స్తోత్రం.(సంపద స్తోత్రం)

శ్రీ హయగ్రీవ స్తోత్రం. జ్ఞానానన్దమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ||౧|| స్వతస్సిద్ధం శుద్ధస్ఫటికమణిభూ భృత్ప్రతిభటం సుధాసధ్రీచీభిర్ద్యుతిభిరవదాతత్రిభువనం అనంతైస్త్రయ్యంతైరనువిహిత హేషాహలహలం హతాశేషావద్యం హయవదనమీడేమహిమహః ||౨|| సమాహారస్సామ్నాం ప్రతిపదమృచాం ధామ యజుషాం లయః ప్రత్యూహానాం లహరివితతిర్బోధజలధేః కథాదర్పక్షుభ్యత్కథకకులకోలాహలభవం హరత్వంతర్ధ్వాన్తం హయవదనహేషాహలహలః ||౩|| ప్రాచీ సన్ధ్యా కాచిదన్తర్నిశాయాః ప్రజ్ఞాదృష్టే రఞ్జనశ్రీరపూర్వా వక్త్రీ వేదాన్ భాతు మే వాజివక్త్రా వాగీశాఖ్యా వాసుదేవస్య మూర్తిః ||౪|| విశుద్ధవిజ్ఞానఘనస్వరూపం విజ్ఞానవిశ్రాణనబద్ధదీక్షం దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే ||౫|| అపౌరుషేయైరపి వాక్ప్రపంచైః అద్యాపి తే భూతిమదృష్టపారాం స్తువన్నహం ముగ్ధ ఇతి త్వయైవ కారుణ్యతో నాథ కటాక్షణీయః ||౬|| దాక్షిణ్యరమ్యా గిరిశస్య మూర్తిః- దేవీ సరోజాసనధర్మపత్నీ వ్యాసాదయోఽపి వ్యపదేశ్యవాచః స్ఫురన్తి సర్వే తవ శక్తిలేశైః ||౭|| మన్దోఽభవిష్యన్నియతం విరించః వాచాం నిధేర్వాంఛితభాగధ

శ్రీ కూర్మం - క్షేత్రం ధర్శిద్దాం రండి

Image
శ్రీ కూర్మం - క్షేత్ర దర్శనం మహావిష్ణువు దశావతారాల్లో రెండోది కూర్మావతారం. ఈ రూపంలో ఉన్న ఏకైక ఆలయం శ్రీకూర్మం. భారతదేశంలోనే కాదు ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి ఆలయం లేదు. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి కేవలం 13 కిలోమీటర్ల దూరంలో.. శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వేస్టేషన్‌కు 27 కిలోమీటర్ల దూరంలో గార మండలంలో ఉందీ ఆలయం. బ్రహ్మ ప్రతిష్ఠించిన పంచలింగ క్షేత్రంగానూ ఈ ఆలయం ప్రసిద్ధి. అంతేకాదు మరెన్నో విశిష్ఠతలు ఈ ఆలయం సొంతం. ఎక్కడా లేని విధంగా ఇక్కడ రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి. స్వామివారు కూడా పడమటి ముఖంగా ఉండడం మరో ప్రత్యేకత. కూర్మనాథుడి ఆలయంతో పాటు శ్రీరామానుజాచార్యులు, శ్రీ వరద రాజస్వామి, శ్రీ మధ్వాచార్యులు, శ్రీ కోదండరామస్వామి వారి ఆలయాలు కూడా ఈ ప్రాంగణంలోనే ఉంటాయి. పవిత్ర పుష్కరిణి, విశాలమైన ప్రాకారంతో పాటు కూర్మవతారానికి నిజరూపమైన తాబేళ్లు ఇక్కడ కనువిందు చేస్తాయి. స్థల పురాణం పూర్వం దేవ దానవులు అమృతం కోసం క్షీర సాగరాన్ని మదించడానికియత్నించి, మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నారు. కింద ఆధారం లేకపోవడంతో ఆ పర్వతం నిలవలేదు. దాంతో దేవతలు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా.. విష్ణువు తాబే

వరలక్ష్మి వ్రతం పూజా విధానం

Image
(పూజా విధానం )....!! ★★★★★★★★★★★★★ శ్రీ వర లక్ష్మి పూజ సామగ్రి :- పసుపు ................. 100 grms కుంకుమ ................100 grms గంధం .................... 1box విడిపూలు................ 1/2 kg పూల మాలలు ........... 6 తమలపాకులు............ 30 వక్కలు..................... 100 grms ఖర్జూరములు..............50 grms అగర్బత్తి ....................1 pack కర్పూరము.................50 grms చిల్లర పైసలు .............. Rs. 30/- ( 1Rs coins ) తెల్ల టవల్ .................1 బ్లౌస్ పీసులు .............. 2 మామిడి ఆకులు............ అరటిపండ్లు ................ 1 dazans ఇతర రకాల పండ్లు ........ ఐదు రకాలు అమ్మవారి ఫోటోల ...................... కలశము .................... 1 కొబ్బరి కాయలు ............ 3 తెల్ల దారము లేదా నోము దారము లేదా పసుపు రాసిన కంకణం 2............ స్వీట్లు .............................. బియ్యం 2 kg కొద్దిగా పంచామృతం లేదా పాలు 100 ML పూజా సామాగ్రి :- దీపాలు .... గంట హారతి ప్లేటు స్పూన్స్ ట్రేలు నూనె వత్తులు అగ్గిపెట్టె గ్లాసులు బౌల్స్ శ్రావణమాసంలో

￰తంజావూరు వద్ద గల పున్నైనల్లూరు మారియమ్మన్ దేవికి మొగిలిరేకుల పూల అలంకారం

Image
￰తంజావూరు వద్ద  గల  పున్నైనల్లూరు  మారియమ్మన్  దేవికి  మొగిలిరేకుల పూల  అలంకారం

శివుడి పుష్పార్చన ఎలా చేయాలి? ఫలితం ఏమిటి?

Image
నిత్యం మనం భగవంతునికి చేస్తున్న పూజలలో పుష్పాలదే అగ్రస్థానం. ఏ స్వామి పూజ అయినప్పటికీ, ఏ తల్లి పూజ అయినప్పటికీ, వారి వారి పూజలలో పుష్పాలకే ప్రాముఖ్యత. ఎన్నో పూజా ద్రవ్యాలుండగా, పుష్పాలకే ఎందుకు ఇంత ప్రాముఖ్యత అని అనిపించవచ్చు. పుష్పం యొక్క ముఖ్యత్వాన్ని అనేక గ్రంథాలు పేర్కొన్నాయి. పుష్పామూలే వసేద్బ్రహ్మ మధ్యేచ కేశవః పుష్పాగ్రేచ మహాదేవః సర్వదేవాః స్థితాదలే పుష్పం మొదట్లో బ్రహ్మ, పుష్పమధ్యమంలో కేశవుడు, పుష్పపు కొనలో మహాదేవుడు నివశిస్తుంటారు. పుష్ప దళాలలో సర్వదేవతలుంటారని ప్రతీతి. పరంజ్యోతిః పుష్పగతం పుష్పేణైవ ప్రసీదతి త్రివర్గ సాధనం పుష్పం పుష్టిశ్రీ స్వర్గమోక్షదమ్ పువ్వులలో ఉన్న పరమాత్మ పువ్వులతోనే ప్రసన్నుడవుతుంటాడు. కాబట్టి పుష్పం త్రివర్గ సాధనం. అంటే సంపదలను, స్వర్గాన్ని, మోక్షాన్ని కలిగిస్తుంది. పుష్పైర్దేవాః ప్రసీదంతి పుష్పేదేవాశ్చ సంస్థితాః కించాతి బహునోక్తెన పుష్పస్యోక్తి మత్రంద్రికామ్. పుష్పాలతో దేవతలు ప్రసన్నులవుతుంటారు. ఎందుకంటే వారు పుష్పాలలో నివశిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే పుష్పాలలో చైతన్యం ఉంటుంది. ఇక, మన పురాణాలలో ఒక్కొక్క దేవతకు ఇష్టమైన పువ్వులను గ

శనీశ్వరుడు గురించి తెలుసుకుందాం, శని భాదల నుండి విముక్తులం అవుదాం

Image
నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని పండితులు అంటున్నారు. జనన వృత్తాంతము : అదితి , కస్యపు ముని కుమారుడైన సుర్యభావానునికి ముగ్గురు భార్యలు -- ఉషా(సంజ్ఞా) , చాయ , పద్మిని . లోకాలన్నితికి వెలుగునిచ్చే సుర్యాడు త్వష్ట ప్రజాపతి "విశ్వకర్మ" కూతురు సంజ్ఞా(ఉమా) దేవిని పెళ్ళిచేసుకున్నాడు . పెళ్ళైన నుండే సూర్యకాంతిని , తేజస్సును భారిచలేక , చూడలేక విచారము తో ఉన్న ఉమాదేవి ని నారదుడు చూసి , విషయము తలుసుకొని ... ఈశ్వరుని తపస్సు చేసి శక్తిని పొందమని ఉపాయమార్గము జప్పెను . అప్పటికే తనకి ముగ్గురు పిల్లలు -మొదటివాడు వైవాస్తవ . రెండేవ వాడు యముడు . మూడవది కూతురు యమున. నారద సలహా మేరకు ఉమాదేవి తన నీడకు ప్రాణము పోసి "చాయాదేవి" గా సూర్యుని వద్ద పెట్టి పుట్టింటికి వెళ్ళిపోయెను, కూతురు భర్తకి చెప్పకుండా పుట్టింటికి వచ్చినందున అనరాని మాటలతో నిందించి తిరిగి సుర్యునివద్దకే వెళ్ళిపొమ్మని చెప్పగా .