Posts

Showing posts from September, 2018

సర్వ దేవత అష్ఠోత్తర శతనామావళులు

Image
సర్వ దేవత అష్ఠోత్తర శతనామావళులు 💝 పై వరుస మీద క్లిక్ చేస్తే కనిపిస్తాయి.

_*ఉండ్రాళ్ళతద్ది నోము గురించి తెలుసు కుందాం రండి*_

Image
_భాద్రపద బహుళ తదియ రోజున సుదతులు, సద్గతులు పొందే నిమిత్తం ఆచరించే వ్రతమే ‘ఉండ్రాళ్ళ తద్ది’. భక్తి విశ్వాసాలతో నిష్ఠానుసారంగా ఆచరించిన వారికి సర్వాభీష్ట సిద్ధిని కలిగించే స్త్రీలు నోచుకునే నోము ‘ఉండ్రాళ్ళ తద్ది’ ఈ నోముకు ‘మోదక తృతీయ’ అనే మరోపేరు కూడా కొన్నది. ప్రత్యేకంగా ఉండ్రాళ్ళ నివేదన కలిగిన నోము కావడంచే ‘తద్ది’ అనుమాట మూడవ రోజు ‘తదియ’ అనే అర్థంతో వాడబడినది కనుక ‘తదియ’, ‘ఉండ్రాళ్ళ తద్ది’గా పిలువబడుతున్నది. ఈ నోమును భాద్రపదంలో బాగా వర్షాలు కురిసే ఋతువులో పూర్ణిమ వెళ్ళిన మూడోరోజున, అంటే బహుళ తదియన ‘ఉండ్రాళ్ళతద్ది’ నోమును నోచుకోవాలని మన పూర్వలు నిర్ణయించారని, అంతేకాదు ఈ నోమును గురించి సాక్షాత్తు శివుడే స్వయంగా పార్వతీదేవికి చెప్పాడని ఐతహ్యం. ._ _భాద్రపద తృతీయ తిథినాడు నోమును ఆచరించే స్త్రీలు సూర్యోదయానికి ముందుగానే అభ్యంగన స్నానమాచరించి, సూర్యాస్తమయము వరకు ఉపవాసం ఉండి, బియ్యపుపిండితో ఉండ్రాళ్ళను చేసి వండి గౌరిదేవిని పూజా మందిరంలో ప్రతిష్ఠించి షోడశోపచార విధిగా పూజ గావించి, ఐదు ఉండ్రాళ్ళను గౌరీదేవికి, మరో ఐదు ఉండ్రాళ్ళను వాయనముపై దక్షిణ తాంబూలాలను ఉంచి ఐదుగురు పుణ్యస్త్రీలకు వాయనం

ఏ రోజున ఏ దేవతని పూజిస్తే ఏం లాభం?

*ఏ తిధి రోజున ఏ దేవతను పూజ చేయాలి..!!* ఏ తిధి రోజున ఏ దేవతను పూజ చేయాలి....తిధి రోజున వ్రతములు చేయటం వలన లభించే ఫలితాలు ఏమిటి.. ఒకొక్క తిధికీ ఒక్కో దేవత అధిపతిగా వుండటం జరుగుతుంది. అదే విధంగా, పాడ్యమ్యాది తిధుల యందు.. వాటికి సంబంధించిన వ్రతాన్ని పన్నెండు మాసముల పాటు ఆచరిస్తే సత్ఫలితములు లభిస్తాయి. తిథి అధిపతి మరియు వ్రత ఫలము గురించి..💐 పాడ్యమి.. అధిదేవత – అగ్ని. వ్రత ఫలం – సత్ఫల ప్రాప్తి. విదియ :- అధిదేవత – అశ్విని దేవతలు. వ్రత ఫలం – ఆరోగ్య వృద్ది. తదియ :- అధిదేవత – గౌరీ దేవి. వ్రత ఫలం – సుమంగళీ అనుగ్రహం. చవితి:- అధిదేవత – వినాయకుడు. వ్రత ఫలం – కష్టములు తొలగిపోవుట. పంచమి:- అధిదేవత – నాగ దేవత. వ్రత ఫలం – వివాహము, వంశ వృద్ది. షష్టి :- అధిదేవత – సుబ్రహ్మణ్య స్వామి. వ్రత ఫలం – పుత్ర ప్రాప్తి. సప్తమి:- అధిదేవత – సూర్య భగవానుడు. వ్రత ఫలం – ఆయురారోగ్య వృద్ది. అష్టమి:- అధిదేవత – అష్టమాత్రుకలు. వ్రత ఫలం – దుర్గతి నాశనము. నవమి:- అధిదేవత – దుర్గాదేవి. వ్రత ఫలం – సంపద ప్రాప్తిస్తుంది. దశమి:- అధిదేవత – ఇంద్రాది దశ దిక్పాలకులు. వ్రత ఫలం – పాపాలు నశిస

అనంతపద్మనాభ స్వామి అష్ట్తోరం

Image
అనంతపద్మనాభ స్వామి అష్ట్తోతరము ఓం శ్రీకృష్ణాయ నమః ఓం కమలానాథాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం సనాతనాయ నమః ఓం వసుదేవాత్మజాయ నమః ఓం పుణ్యాయ నమః ఓం లీలామానుషవిగ్రహాయ నమః ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః ఓం యశోదావత్సలాయ నమః ఓం హరయే నమః ఓం చ్తుర్భుజాత్తచక్రాసిగదా శంఖాంబుజాయుధాయ నమః ఓం దేవకీనందనాయ నమః ఓం శ్రీశాయ నమః ఓం నందగోపప్రియాత్మజాయ నమః ఓం యమునావేగసంహారిణే నమః ఓం బలభద్రప్రియానుజాయ నమః ఓం పూతనాజీవితహరణాయ నమః ఓం శకటాసురభంజనాయ నమః ఓం నందవ్రజజనానందినే నమః ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః ఓం నవనీతవిలిప్తాంగాయ నమః ఓం నవనీతనటాయ నమః ఓం అనఘాయ నమః ఓం నవనీతనవాహారాయ నమః ఓం ముచుకుందప్రసాదకాయ నమః ఓం షోడశస్త్రీసహస్రేశాయ నమః ఓం త్రిభంగినే నమః ఓం మధురాకృతయే నమః ఓం శుకవాగమృతాబ్ధీందనే నమః ఓం గోవిందాయ నమః ఓం యోగినాంపతయే నమః ఓం వత్సవాటచరాయ నమః ఓం అనంతాయ నమః ఓం ధేనుకసురభంజనాయ నమః ఓం తృణీకృతతృణావర్తాయ నమః ఓం యమళార్జునభంజనాయ నమః ఓం ఉత్తాలోత్తాలభేత్రే నమః ఓం తమాలశ్యామలాకృతాయే నమః ఓం గోపగోపీశ్వరాయ నమః ఓం యోగినే నమః ఓం కోటిసూర్యసమప్రభాయ నమః ఓం ఇళాపతయే నమః ఓం పరంజ్యొతిషే నమః ఓం యాదవేంద

మహాలయ పక్షాల ప్రాధాన్యత

Image
*మహాలయ పక్షాల ప్రాధాన్యత*     ప్రతిఒక్కరూ తెలుసుకోవలసిన విషయం భాద్రపద బహుళ పాడ్యమి నుంచి భాద్రపద అమావాస్య వరకు మధ్యనున్న పదునైదు దినములనూ *‘మహాలయ పక్షములు*’ అంటారు.(ఈ నెల 25.09.2018 నుండి 9.10.2018 వరకు ) మరణించిన మన తండ్రి, తాత, ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ, తర్పణ, పిండప్రదానాది  పితృయఙ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశిచబడిన ఈ పదునైదు రోజులనే ‘మహాలయ పక్షాలు’ అంటారు. వీటినే ‘పితృపక్షము’లనీ.., ‘అపరపక్షము’లనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి, వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశ్యము. *పితృదేవతలకు ... ఆకలా?* అనే సందేహం మీకు కలుగవచ్చు. ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ‘ఆకలి’ అనబడే సూత్రం మీదనే నడుస్తోంది.               *అన్నాద్భవంతి భూతాని  పర్జన్యాదన్న సంభవః               యఙ్ఞాద్భవతి పర్జన్యో  -  యఙ్ఞః కర్మ సముద్భవః అన్నము వలన ప్రాణికోటి జన్మిస్తుంది. వర్షము వలన అన్నము లభిస్తుంది. యఙ్ఞము వలన వర్షము కురుస్తుంది. ఆ యఙ్ఞము కర్మ వలననే సాధ్యమౌతుంది. అంటే....అన్నం దొరకాలంటే .... మేఘాలు వర్షించాలి. మేఘాలు వర్షించాలంటే

శని త్రయోదశి ప్రాముఖ్యత

Image
నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని పురాతన తాళపత్రాలు చెబుతున్నాయి. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు, ఇతర పేర్లు కృషాణు, శౌరి, బభ్రు, రోద్రాంతక, సూర్యపుత్ర, కాశ్యపన గోత్రం. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని భక్తుల విశ్వాసం. జ్యోతిష్య శాస్త్రరీత్యా శని శనివారానికి అధిపతి. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత, దుష్కృత ఫలితాలను ప్రదానం చేసే అధికారం శనిది. ఆధ్యాత్మిక జ్యోతిష్యం లో శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టాత గా చెప్పబడింది. శని దశల్లో వ్యక్తికి పూర్వజన్మలోని దుష్కర్మలకు సైతం దండన లభిస్తుంది. బౌతిక దృష్టి లో శని క్రూరుడుగా కనపడినా వాస్తవానికి అగ్ని పరీక్షకు గురి చేసి వ్యక్తిని సత్కర్మల వైపు మళ్ళిస్తాడు.. ఈశ్వర శాసనం లో శని దండనాధికారి. శని మనం చేసిన దుష్కర్మాలకే దండన విధిస్తాడు నిస్పక్షపాతం గా ఉన్న న్యాధిపతి లా శని దండన విధిస్తాడు. శనివారానికి స్థితి కారకుడైన శ్రీమన్నారాయణుడు అధిపతి , త్రయోదశి కి అధిపతి కామదేవుడు. అంటే శి

తెలుగు ముత్యాలు

అధోలోకాలు :- """""""""""""""""""""" (1) అతల, (2) వితల, (3) సుతల, (4) తలాతల, (5) రసాతల, (6) మహాతల, (7) పాతాళ.    జన్మలు :- """"""""""""""" (1) దేవ, (2) మనుష్య, (3) రాక్షస, (4) పిశాచి, (5) పశు, (6) పక్షి, (7) జలజీవ, (8) కీటక.     కర్మలు :- """"""""""""""" (1) స్నానం, (2) సంధ్య, (3) జపం, (4) హోమం, (6) స్వాధ్యాయం, (7) దేవపూజ, (8) ఆతిథ్యం, (9) వైశ్యదేవం.   అష్టదిగ్గజాలు :- """""""""""""""""""""" (1) ఐరావతం, (2) పుండరీకం, (3) కుముదం, (4) సార్వభౌమం, (5) అంజనం, (6) సుప్రతీకం, (7) వామనం, (8) పుష్పదంతం.    అష్టదిగ్గజకవులు :- """"""""""&quo

వినాయక చవితి విశేషాలు

Image
వినాయక  చవితి పత్రి పూజా విశేషములు వినాయక పత్రిలోని విశేష గుణాలు వినాయక చవితి భాద్రపద మాసం శుక్ల పక్షంలో హస్త నక్షత్రానికి దగ్గరగా చంద్రుడు ఉన్నప్పుడు శుద్ధ చవితి రోజున వస్తుంది. వర్షాకాలానికి, చలి కాలానికి వారధిగా ఈ పండుగ వస్తుంది. సూర్యరశ్మి తక్కువగా ఉండి పగలు తక్కువ, రాత్రి ఎక్కువగా ఉంటుంది. అటువంటి సమయంలో సూక్ష్మజీవులు స్వైరవిహారంచేసి మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశాలు అధికం. ఈ పండుగ పేరుతో మనం రకరకాల ఆకులను చెట్లనుంచి త్రుంచి వాటిని దేవునికి సమర్పిస్తాం. ఈ సందర్భంగా ఆయా పత్రాల స్పర్శ, వాటినుంచి వెలువడే సువాసన మనకు మేలు చేస్తాయి. గణపతి పూజావిధాపంలోనే 'పత్రం సమర్పయామి' అని వల్లిస్తాం. పత్రం మాత్రమే పూజలో చోటుచేసుకున్న ప్రత్యేక పండుగ వినాయక చవితి. ఆ రోజున మాత్రమే ఏకవింశతి (21) పత్రాలను పూజలో వినియోగిస్తాం. అదే విధంగా వినాయక చవితి ముందు రోజున 'తదియ గౌరి' వ్రతం గౌరిదేవికి చేస్తారు. ఈ పూజలో గౌరిదేవికి 16 రకాలైన పత్రాలు సమర్పిస్తారు. అందులో ముఖ్యమైనది 'అపామార్గ పత్రం' అంటే ఉత్తరరేణి ఆకు. దానికి ప్రాధాన్యం ఎక్కువ. జ్యోతిర్‌ వైద్యం ఆధారంగా నక్షత్ర

108వైష్ణవ_దివ్య క్షేత్రాలు

Image
#108వైష్ణవ_దివ్య క్షేత్రాలు #విష్ణువు వైష్ణవులకు అత్యంత పవిత్రమైన క్షేత్రాలు 108 ఉన్నాయి. పన్నిద్దరు (12) ఆళ్వారులు తమ రచనలయిన పాశురములలో ఈ 108 విష్ణు రూపాలను కొలిచారు. ఇందులో 105 భారతదేశంలో, 1 నేపాల్ లో, మరియు మిగితా 2 దివ్య తిరుపతులు భూమిలి వెలుపల ఉన్నాయి. #ఈ108_వైష్ణవ_దివ్యదేశాలు_జాబితా★ 1.శ్రీరంగం 2.ఉరైయూర్ 3.తంజమా మణిక్కోయిల్ (తంజావూర్-తిరువయ్యార్ 3 కి.మీ.) 4.అన్బిల్ (బాణాపురం) (లాల్గుడి నుండి 8 కి.మీ.) 5.కరంబనూర్ (ఉత్తమర్ కోయిల్) 6.తిరువెళ్ళరై (శ్వేతగిరి) 7.తిరుపుళ్ళమ్ పూతంగుడి (కుంభఘోణము 10 కి.మీ.) 8.తిరుప్పేర్ నగర్ (అప్పక్కుడుత్తాన్) (లాల్గుడి 10 కి.మీ.) (కోవిలడి) 9.తిరువాదనూర్ (స్వామిమలై 3 కి.మీ.) 10.తిరువళందూర్ (మాయవరం 12 కి.మీ.) (తేరళందూర్) 11.శిరుపులియూర్ 12.తిరుచ్చేరై (కుంభకోణం 12 కి.మీ.) (సార క్షేత్రము) 13.తలైచ్చంగనాణ్మదియమ్ (తలైచ్చగాడ్) 14.తిరుక్కుడందై (కుంభకోణము) 15.తిరుక్కండియూర్ 16.తిరువిణ్ణగర్ (కుంభకోణం 5 కి.మీ.) (ఉప్పిలి యప్పన్ కోయిల్) 17.తిరువాలి తిరునగరి (శీర్గాళి 18 కి.మీ.) 18.తిరుక్కణ్ణపురం (నన్నిలమ్ నుండి 7 కి.మీ.) 19.తిరునాగై (నాగప

తద్దినాలు పెట్టడము అవసరమా

Image
తద్దినాలు పెట్టడము మానేస్తున్నారు ఈ మధ్యన చాలా మంది. బ్రాహ్మణులు దొరకడము లేదు అని, ఎక్కువ దక్షిణ అడుగుతున్నారు అని, సమయము లేదు అని, మడి తో చేసే వాళ్ళు లేరు అని, వంట వాళ్ళు దొరకడము లేదు అని, ఖర్చు ఎక్కువ అవుతుందని…. ఇలా రకరకాల కారణములతో తద్దినములు పెట్టడము మానేస్తున్నారు. ఇది తప్పు. వంశాభివృద్ధి జరగదు. ఇది నిజము. పిల్లలు పుట్టరు, పుట్టినా ఆడ పిల్లలే పుడతారు. మగ పిల్లలు పుట్టరు. ఇది నిజము. నిజము. నిజము. నిజము. నమ్మండి. అందరికీ చెప్పండి. వంశములను కాపాడండి.పితృ దేవతలు సంతోష పడక పోతే వంశాభివృద్ధి జరగదు. మగ పిల్లలు పుట్టరు. వంశము ఆగి పోతుంది. అందరు తెలుసుకొని, జాగ్రత్తగా, పద్ధతిగా, శాస్త్ర ప్రకారముగా విధిగా ఆచరించాలి. దీని మడి వేరు. తడి బట్ట తోనే వంట చేసి, బ్రాహ్మణులకు భోజనము వడ్డించాలి. పొడి బట్ట పనికి రాదు. ముందు రోజు రాత్రి, ఆ రోజు రాత్రి భోజనము చేయకూడదు, బ్రహ్మ చర్యము పాటించి నేల మీద భార్యా భర్తలు పరుండాలి, భక్తితో, శ్రద్ధతో శ్రాద్ధము పెట్టాలి. ఇంటి కోడలు వంట చేస్తే పితృ దేవతలు శ్రీఘ్రముగా అనుగ్రహిస్తారు. పితృ దేవతలకు తద్దినాలుపెట్టండి, మానకండి, మన వంశాన్ని కాపాడేది వాళ్ళే. వాయన