Posts

Showing posts from July, 2019

చిట్టి__తంత్రాలు_పెద్ద_లాభాలు

💐💐  💐💐 2 వ వివరణ. 1.నాలుగు చిన్న మేకులు తీసుకుని నృసింహ మంత్రాన్ని చెబుతూ మీ సింహ ద్వారానికి ఇరుప్రక్కలా దించేయండి.ఎలాంటి దుష్టాత్మలు ఇంట్లోకి ప్రవేశించవు. 2.ఇంట్లోకి వచ్చేముందు ద్వారానికి ఎదురుగా చెప్పులు విడవకండి. 3.మీ పిల్లలు మాట వినడం లేదా?ఆదివారం అష్టాక్షారీ మంత్రంతో వారిపై నుండి ఒక బూరు కొబ్బరి కాయను తిప్పి కూడలిలో పారవేయండి. 4.ఇంట్లో డబ్బు నిలవకుంటే నాలుగు గచ్ఛకాయలు లక్ష్మి మంత్రాన్ని నూట ఎనిమిదిసార్లు చేసి బీరువాలో పెట్టండి. 5.ఎప్పుడూ ఏదో సమస్యతో బాధపడేవారు భైరవుని పేరుమీద కొంచెం మద్యాన్ని తీసుకొని భైరవాష్టకాన్ని చదివి తాగేవారికి ఇవ్వండి. 💐*చిట్టి తంత్రాలు*💐 1.తాంబూలంలో కొద్దిగా జాజికాయను కలిపి వేసుకోవడం ద్వారా ముఖంలో చక్కని వర్చస్సుని పొందగలరు, 2.కొన్ని తెల్ల ఆవాలు తీసుకొని భైరవమంత్రం చదువుతూ మీ యింటికి ఎనిమిది పక్కలా చల్లండి,భైరవుడు మీకు రక్షణ గా ఉంటాడు, 3.కొద్దిగా పాతబెల్లం తీసుకొని ముద్దలా చేసి పదకొండు లవంగాలు గుచ్చి నైఋతిలో పాతి పెట్టండి.ఇంటికి పీడలు తొలగిపోతాయి. 4.శుక్ర వారం రాహుకాలంలో రెండు రొట్టెలు వాటిలో కొద్దిగా బెల్లం కలిపి ఆవుకి తినిపించండి.రాహుగ

దత్త క్షేత్రములు..!!💐 దత్తావతారాలు....

Image
1శ్రీపాద శ్రీ వల్లభ స్వామి.💐 1.పిఠాపురం.💐 దత్తుని ప్రదమ దత్తావతారం శ్రీపాద శ్రీ వల్లభుడు జన్మించిన ప్రదేశం. ఆంద్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నది..                  2.కురువపురం.💐 ప్రదమ దత్తావతారులైన శ్రీపాదవల్లబులు తపసు చేసిన స్థలం... ఇది హైదరాబాదు, కర్నూలు రూటులో దేవరకొండ స్టేషను నుండి బస్ లో వెళ్ళవచ్చు. 3.గోకర్ణము.💐 ప్రదమ దత్తావతారు లైన శ్రీపాద వల్లబులు తపసు చేసిన స్థలం ... ఇది కర్నాటక రాష్ట్రము హుబ్లి నుండి బస్ లో వెళ్ళవచ్చు. దత్తావతారం..నృశింహ సరస్వతి.💐 4.కరంజా.💐 రెండవ దత్త అవతారం, నృశింహ సరస్వతి (శ్రీ గురుడు) జన్మస్థలం... ఇది మహరాష్ట్రఅమరావతి జిల్లాలో ఉన్నది 5.నర్సో బావాడిన.💐 శ్రీ గురుడు 12 సం॥తపసుచేసిన స్థలం,... ఇది కొల్హా పూర్ మీరజ్ రూటులో ఉన్నది 6.గాణగా పూర్.💐 శ్రీ గురుడు 23 సం॥ నివసించినస్థలం, ఇది కర్నాటక గుల్బర్గ వద్ద కలదు. ఇచ్చటశ్రీ గురుని నిజపాదుకలు కలవు, చూడవలసి స్థలం, బీమా అమరజా సంగమ స్నానం పరమ పవిత్రం 7.ఔదుంబర్‌.💐 శ్రీ గురుడు చాతుర్మాసం చేసిన .స్థలం. ఇది కూడ మహరాష్ట్రలో ఉన్నది.                                    8.మీరజ్.

శాఖాంభరి దేవి అలంకారాలు

Image

సంస్కారాలు - ముహూర్తములు

Image
   మానవుడు జన్మించినప్పటి నుంచి మరణించే వరకు సంష్కారమయమే. సంస్కారాల వలన జన్మాంతర దోషాలు కూడా వీడిపోయి మానవ జీవిత లక్ష్యమైన మోక్షప్రాప్తి సిద్ధిస్తుంది. జీవి గర్భంలో పడింది మొదలు అంత్య సంస్కారం వరకు జరిగే సంస్కారాలు లేదా కర్మలు ధర్మశాస్త్రల్లో 40 వరకు చెప్పబడ్డాయి. గౌతమ స్మృతుల్లో 40 సంష్కారాలను, అంగీరస మహర్షి 25, వ్యాసుడు 16 సంష్కారాలను చెప్పారు. మనుస్మృతి ఈ సంస్కారాలను 12 సంస్కారాలుగా చెబుతుంది. వివాహము  ఒక సత్రంలో ఇద్దరు వ్యక్తులు ఒక్కటవ్వడమే వివాహము. ముహూర్త వారములు: సోమవారం నిషేధం ఆచారమే కానీ శాస్త్రం కాదు. మంగళవారము నిషేధము. మిగిలిన వారములు గ్రాహ్యమే. నక్షత్రములు: ‘మూల మైత్ర మృగ రోహిణి కరైః పౌష్ణమారుత ఘోత్సరాన్వితైః వీర్య వద్ధిరుడుద్ధిర్ముృగీ దృశాం పాణి పీడన విధిర్విధీయతే’ అని శాస్త్రం. అయితే ధనిష్ఠా, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతీ నక్షత్రముల సమయంలో వివాహం శ్రేష్ఠము అని కొందరు, కాదని కొందరు చెప్పారు. అయితే నాలుగు నక్షత్రములు కూడా ఆచారంలో వున్నవి. అందువలన అశ్వినీ, రోహిణీ, మృగశిర, మఘ, ఉత్తర, హస్త, స్వాతీ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతీ నక్షత్రము

తొలిఏకాదశి విశిష్టత

*తొలిఏకాదశి విశిష్టత*  ఈ రోజున ఏం చేయాలి. 12.07.2019 న హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘‘తొలి ఏకాదశిగా’’ గా పిలుస్తారు. దీనికే ‘‘శయనైకాదశి’’ అని ‘‘హరి వాసరమని‘‘ , ‘‘పేలాల పండుగ’’ అని పేరు. హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘‘తొలి ఏకాదశిగా’’ గా పిలుస్తారు. దీనికే ‘‘శయనైకాదశి’’ అని ‘‘హరి వాసరమని‘‘ , ‘‘పేలాల పండుగ’’ అని పేరు. పురాణాలను అనుసరించచి శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు.. అలా నాలుగు నెలల పాటు ఆయన పడుకుని.. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధినీ ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు.. ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాసదీక్షను ఆచరిస్తారు. ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళలోకంలో బలి చక్రవర్తి వద్ద ఉంది.. కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండు