Posts

దశర సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి విద్యుత్ దీపాలంకరణ

Image

భీమవరం త్యాగరాయ భవన్ లో దశర సందర్భంగా అమ్మవారి ధనలక్ష్మి అలంకారం

Image

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుమల.

Image

ప్రతీఒక్కరూ తెలుసుకోవలసినవి

Image
1 ఏకదంతుడు – వినాయకుడు ఏక పత్నీవ్రతుడు – శ్రీ రాముడు ఏకాహము – 24 గంటలు పాటు చేసే భజన కార్యక్రమం ఏకోనారాయణ – నారాయణుడు ఒక్కడే ఏకాశం – జగతికి ఆకాశం ఒక్కటే. 2 ద్వివిధ అక్షరములు – అచ్చులు (అ నుండి అః వరకు), హల్లులు (క నుండి ఱ వరకు) ద్వివిధకాంతిరూపులు : 1.సూర్యుడు. 2. చంద్రుడు ద్వికటుకములు : 1.పిప్పళ్ళు, 2.మిరియాలు ద్విజన్మలు :1.పుట్టుక, 2.ఉపనయన సంస్కారము ద్వినేత్రములు : వామనేత్రము మరియు దక్షిణనేత్రము. ద్విముఖపక్షులు : 1.గండబేరుండము, 2. దుందుభము ద్వియోగములు : 1.జ్ఞానయోగము, 2.కర్మయోగము ద్వివైనతేయులు : 1.అరుణుడు. 2. వైనతేయుడు ద్వివిధాయుధములు : 1.అశ్త్రములు 2. శస్త్రములు ద్వివిధాయానములు : 1.ఉత్తరాయణము. 2. దక్షిణాయనము. ద్వివిధ హృదయములు : 1.దయార్థ్ర హృద్యము. 2. పాషాణ హృదయము. ద్వివిధ సహజన్ములు : 1.సోదరి 2. సోదరుడు ద్వివిధ సంగీత రీతులు : 1 మార్గము. 2. దేశి. ద్వివిధ శైవాచారములు :1.పండితాచారము, 2. బసవాచారము ద్వివిధదినభాగములు : 1.పగలు. 2. రాత్రి ద్వివిధ దానములు : 1.స్వదానము (తానుగా ఇచ్చుట). 2. ప్రేరణ దానము (ఇతరుల ప్రేరణతో ఇచ్చుట) ద్వివిధ దర్శనములు : 1.అస

కానుక Gift, a short story

Image
పూజ్యులైన అమ్మానాన్నలకు ప్రదీప్‌ నమస్కరించి వ్రాయునది. ఉభయకుశలోపరి. నాకు హైదరాబాద్‌లో ఉద్యోగం దొరికింది. నేనూ మీ కోడలూ ఇక్కడి ఉద్యోగాలకు రాజీనామా చేశాం. ఈ నెలాఖరులోగా ఇండియాకు తిరిగి వచ్చేస్తున్నాం. మిగిలిన వివరాలు వచ్చాక మాట్లాడుకుందాం. ఇట్లు మీ కుమారుడు ప్రదీప్‌ క్లుప్తంగా ఉన్న ఆ ఉత్తరం చదివిన సీతారామయ్య, వైదేహీల ఆశ్చర్యానికి అంతేలేకుండా పోయింది. అయోమయంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఆరు అంకెల జీతంలో ఉన్న కొడుకూ అయిదంకెల జీతంలో ఉన్న కోడలూ ఉద్యోగాలకు రిజైన్‌ చేసి ఇండియాకి తిరిగి వచ్చేయడమేమిటీ..? ఇక్కడ... ఈ హైదరాబాద్‌లో అంత జీతం ఎక్కడుందీ? ఎవరిస్తారూ? అయినా చుట్టపుచూపుగా ఇండియాకి రావడమేగానీ, తాము అమెరికాలో శాశ్వతంగా స్థిరపడిపోతామని ప్రదీప్‌ కచ్చితంగా తన నిర్ణయాన్ని ఏనాడో చెప్పేశాడుగా! మరి ఈ ఉత్తరం ఏమిటీ? వాడు పనిచేసేచోట ఏమన్నా గొడవలు జరిగాయా? భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలు వచ్చాయా? సందేహాల సునామీలో ఉక్కిరిబిక్కిరైపోతున్నారా వృద్ధ దంపతులు. ‘‘ఏమిటండీ ఇది?’’ భర్తని అడిగింది వైదేహి. ‘‘ఉత్తరం’’ సింపుల్‌గా అన్నాడు సీతారామయ్య. భర్త జవాబుతో తెల్లబోయిన వైదేహి మొహంచూసి చిన్న

సర్వ దేవత అష్ఠోత్తర శతనామావళులు

Image
సర్వ దేవత అష్ఠోత్తర శతనామావళులు 💝 పై వరుస మీద క్లిక్ చేస్తే కనిపిస్తాయి.

_*ఉండ్రాళ్ళతద్ది నోము గురించి తెలుసు కుందాం రండి*_

Image
_భాద్రపద బహుళ తదియ రోజున సుదతులు, సద్గతులు పొందే నిమిత్తం ఆచరించే వ్రతమే ‘ఉండ్రాళ్ళ తద్ది’. భక్తి విశ్వాసాలతో నిష్ఠానుసారంగా ఆచరించిన వారికి సర్వాభీష్ట సిద్ధిని కలిగించే స్త్రీలు నోచుకునే నోము ‘ఉండ్రాళ్ళ తద్ది’ ఈ నోముకు ‘మోదక తృతీయ’ అనే మరోపేరు కూడా కొన్నది. ప్రత్యేకంగా ఉండ్రాళ్ళ నివేదన కలిగిన నోము కావడంచే ‘తద్ది’ అనుమాట మూడవ రోజు ‘తదియ’ అనే అర్థంతో వాడబడినది కనుక ‘తదియ’, ‘ఉండ్రాళ్ళ తద్ది’గా పిలువబడుతున్నది. ఈ నోమును భాద్రపదంలో బాగా వర్షాలు కురిసే ఋతువులో పూర్ణిమ వెళ్ళిన మూడోరోజున, అంటే బహుళ తదియన ‘ఉండ్రాళ్ళతద్ది’ నోమును నోచుకోవాలని మన పూర్వలు నిర్ణయించారని, అంతేకాదు ఈ నోమును గురించి సాక్షాత్తు శివుడే స్వయంగా పార్వతీదేవికి చెప్పాడని ఐతహ్యం. ._ _భాద్రపద తృతీయ తిథినాడు నోమును ఆచరించే స్త్రీలు సూర్యోదయానికి ముందుగానే అభ్యంగన స్నానమాచరించి, సూర్యాస్తమయము వరకు ఉపవాసం ఉండి, బియ్యపుపిండితో ఉండ్రాళ్ళను చేసి వండి గౌరిదేవిని పూజా మందిరంలో ప్రతిష్ఠించి షోడశోపచార విధిగా పూజ గావించి, ఐదు ఉండ్రాళ్ళను గౌరీదేవికి, మరో ఐదు ఉండ్రాళ్ళను వాయనముపై దక్షిణ తాంబూలాలను ఉంచి ఐదుగురు పుణ్యస్త్రీలకు వాయనం