స్వర్గానికి దారి
*స్వర్గారోహణ మార్గం* పాండవులు ఈ మార్గం ద్వారానే స్వర్గానికి చేరుకున్నారని ప్రతీతి. భూమి నుండి స్వర్గానికి చేరుకోవచ్చు అనడానికి ఏకైక మార్గం ఇదే. మన : బద్రీనాథ్ క్షేత్రం నుండి 5 km దూరం లో వుండే చిన్న గ్రామం. భారతదేశంలో ఆఖరి గ్రామం ఇదే. ఇక్కడి నుండే ఒకవైపు టిబెట్ ప్రారంభం అవుతుంది. ఈ గ్రామ చివరన సరస్వతి నది మనకు కన్పించే ప్రాంతం ఉంటుంది. ఇక్కడి నుండి కొంత దూరం ప్రవహించాక అలకనంద నది లో కలిసి అంతర్వాహిని గా ప్రవహిస్తుంది. ఇక్కడే సరస్వతి మాత ఆలయం కుడా ఉంటుంది. ఈ సరస్వతి నది పక్కన భీమపుల్ అనే ఒక పెద్ద రాతిబండ ఉంటుంది. పాండవులు నదిని దాటడానికి భీముడు ఈ రాతిని ఒక వంతెన గా ఏర్పాటు చేసాడు అంటారు. ఈ రాతిమీద భీముని వేలిముద్రలు వున్నట్లు గా పెద్ద పెద్ద అచ్చులు కుడా వుంటాయి. ఈ వంతెన దాటాక స్వర్గారోహణ మార్గం ప్రారంభం అవుతుంది. మన నుండి చట్మోలి 8 km:- మార్గ మధ్యమం లో భృగుమహర్షి ఆశ్రమం కన్పిస్తుంది. తరవాత మాతమూర్తి ఆలయం కన్పిస్తుంది. ఈవిడే నరనారాయణుల కన్నతల్లి గా కుడా చెప్తారు. ఈ ప్రాంతం 14000 అడుగుల ఎత్తులో ఉంటుంది. తర్వాత కుబేర్ మకుట్ అనే ప్రాంతం వస్తుంది. ఇక్కడే కుబేర