దయ్యాల ఆలయం

*దెయ్యాలయం* – *దయ్యాల ఆలయం.*

                ఆలయం అన గానే సాధారణంగా మనం,ఏ  దేవుడి ఆలయం అని అడుగుతాము. కానీ యెక్కడైతే దేవుడిని విగ్రహాన్ని ప్రతిష్టించి, ప్రాణ ప్రతిష్ట, ఇత్యాది కార్యములు మంత్ర పూర్వకంగా చేస్తే, అక్కడికి  దేవుడు వచ్చి నివసిస్తూ వుంటాడని, దేవుడు నివసిస్తాడు కాన “దేవాలయం” అని అంటాము. ఆలయం అనగా నివసించు ఒక భవనం.  దేవాలయం అనగా దేవుడు నివసించు భవనం.

       మరి దెయ్యాలు నివసించు భవనానికి ఏమని పిలువాలి. దెయ్యాలయం అని అనాలా? నేను పొరపాటు పడలేదoడోయి. నిజమే. ఏవరి ఇంట్లోనో దయ్యం కనిపించిందని, భయపడి ఇల్లు ఖాళీ చేసి ఆ దయ్యనికి వదిలి వెళ్ళి పోయిన ఇంటిని మనం “దయ్యాల కొంప” అని అంటాము. మర్రి చెట్టు పై దయ్యం వుంటే “దయ్యాల మర్రి” అని అంటాము. మరి ఒక ఆలయం ఒకటి కట్టి  దానికి “దయ్యాలాలయం” అని అంటే వింతగా లేదు. చూద్దాం రండి.

     ఆంధ్ర కర్నాటక సరిహద్దు వద్ద, హిందూపూర్ (అనంతపురం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్) నుండి       కి,మీ దూరం లో “డొడ్డబళ్లాపూర్” అనే వూరు కర్నాటక రాష్ట్రం నకు చెందినది. ఈ వూరి నుండి దేవనహళ్లి అనే వూరి మార్గం  మద్యలో బొమ్మవర సుందరేశ్వర ఆలయాన్ని దెయ్యాలు నిర్మించినాయి అని చెబుతారు.

        సుమారు 600 సంవత్సరాలు క్రింతo ఈ వూరిలో  దెయ్యాల బుచ్చైయ్య అనే దెయ్యాల మాంత్రికుడు  ఒకడు వుండే వాడట.  అప్పుడు ఈ వూరినిండా దయ్యాలు వుoడేవట. అప్పుడు వూరికి మంచి చేద్దామని అ మాంత్రికుడు సుందరేశ్వర ఆలయం నిర్మిద్దామని, నిర్మాణం చేపడ్డాట. కానీ మాoత్రీకుని ప్రయత్నాలను అ దెయ్యాలు సాగనివ్వక కట్టిన గుడిని, రాత్రి రాత్రే కూలదోసేవట. మాంత్రికుడి యెనలేని కోపం వచ్చి, తాన్ మంత్ర శక్తి తో అ దెయ్యాలను వశ పరచుకొని, వాటి జూట్లను కత్తిరించి, తన వద్దనున్న రోకలి కి ముడి వేసి కట్టి పెట్టుకున్నాడట. అంతా అవి తమ జుట్టు తమకు ఇవ్వమని మాంత్రికుని ప్రాధేయ పడటం ప్రారంభించాయట. అప్పుడు మాంత్రికుడు ఆ దెయ్యాలతో, కూలదోసిన ఆలయాన్ని తిరిగి నిర్మిస్తే వాటి జుట్టు వాటికి ఇస్తానని బేరమాడాట. అ షరతుకు, ఒప్పుకొని అ దెయ్యాలు ఆలయాన్ని పునర్ నిర్మితం చేశాయట. ఈ వృత్తాoతం అ వూరి వారు చెప్పు కథ. (అ వూరి పేరు “బొమ్మవర” ). 
         సామాన్యముగా ఆలయం అన్న గుడి పైన వివిధాకృతుల శిల్పకళలు, పురాణ గాథలు, శృంగార కామ సూత్ర శిల్పాలు  చెక్క బడి వుంటాయి. కానీ ఈ దేవాలయం పై అన్నీ దెయ్యాల బొమ్మలే. యెందుకంటే ఈ గుడి దెయ్యాలచే నిర్మించ బడినది కాన వాటి బొమ్మలు వున్నాయని ఆ వూరి వారు చెబుతారు.  గుడి కట్టారు కానీ, గర్భ గుడి లో ఏ దేవుడి విగ్రహ ప్రతిష్ట చేయలేదు. కానీ 50 సంవత్సరాల  క్రితం, వీరిలోని త్రాగునీటి చెరువు మరమత్తు లో భాగంగా త్రావ్వు తుండగా ఒక పెద్ద శివ లింగం బయట పడినదట. ఆ లింగం సుమారు యెనిమిది అడుగుల శివ లింగం ఆట. ఆ శివ లింగాన్ని తీసుకొని వచ్చి, అంతా వరకు ఖాళీ గా వున్న ఆ అల్యంలో ప్రతిష్ట చేసినారట. ఆ పిదప ఆ ఆలయాన్ని “బొమ్మవర సుందరేశ్వర ఆలయం” గా పిలువ ప్రారంభించినారట.
విశేషం ఏమనగా ఇంత ఎత్తైన శివ లింగం, మనరాష్ట్రంలో ఇంత యెత్తు కల శివలింగం యెక్కడా లేదని, దేశంలో మొత్తం అయిదు ఆలయాలల్లో మాత్రం ఈ విధముగా వుందనేది ఆ వూరి ప్రజల వువాచ.
          మొత్తానికి “దెయ్యాలాలయం”  కాస్త “సుందరేశ్వర ఆలయంగా” ఈ రోజు బొమ్మవర గ్రామం లో నెలకొని వున్నది. మీరు ఎప్పుడైనా బెంగుళూరు వేళ్లునపుడు ఈ ఆలయాన్ని సందర్శించుకోండి.                       
🙏

Comments

Please follow, Like, Comment and share

స్త్రీ కి పర్యాయ పదాలు ఎన్నో తెలుసా?

101 గ్రామ దేవతల పేర్లు

Homam హోమాలు ఎన్ని రకములు వాటి వివరములు

Paka shastram పాక శాస్త్ర వివరణ. భోజనం విధులు

పితృ తర్పణము --విధానము

God photos జీర్ణమైన దేవుని చిత్ర పటాలు ఏమి చేయాలి

సంస్కారాలు - ముహూర్తములు

తద్దినాలు పెట్టడము అవసరమా

శని జయంతి 15.5.2018

Rushi Panchami - Sapta Rushulu