రంగులు మారే శివలింగం ధర్శించారా?


ఉదయం ఎరుపు, మధ్యాహ్నం నలుపు, సాయంత్రం తెలుపు రంగులోకి మారుతున్న శివలింగం దర్శించారా???


 మైసూర్ జిల్లా లో కావేరి నది ఒడ్డున తలకాడు ప్రదేశం కలదు. బెంగళూరుకు దగ్గరలోని తలకాడులోగల పంచముఖేశ్వర స్వామి ఆలయం పేరుకు ఒకటే కానీ, ఐదు ఆలయాలున్నాయి. అయిదూ శివాలయాలే. తలకాడు చాలా చిన్న గ్రామం. అయినప్పటికీ పంచముఖ ఆలయాల కారణంగా ప్రసిద్ధికెక్కింది.వీకెండ్ ట్రిప్ లకై బెంగళూరు నుండి వచ్చేవారికి ఈ ప్రదేశం తప్పక నచ్చుతుంది. బెంగళూరు నుండి 140 కి. మీ ల దూరంలో, మైసూర్ నుండి 50 కి. మీ ల దూరంలో తలకాడు ఉంది. మీరు తలకాడు లో ప్రవేశించగానే అక్కడ ప్రవహించే కావేరి నది, చుట్టూ ఉన్న మట్టిని గమనిస్తే నదీ తీరమా ? లేక బీచా ? అని అనిపిస్తుంది. తలకాడు ఐదు ప్రఖ్యాత శివాలయాలకు ప్రసిద్ధి చెందినది. అవి వైద్యనాధేశ్వర, పాతాళేశ్వర, మరుళేశ్వర, అరకేశ్వర మరియు మల్లిఖార్జుల దేవాలయాలు. బాధాకరమైన విషయం ఏమిటంటే, ప్రతి సంవత్సరం కొద్ది కొద్దిగా ఇవి ఇసుకలోకి కూరుకుపోతున్నాయి. ఈ ప్రాంతంలోనే చెప్పుకోదగ్గ మరో ఆలయం - విష్ణు భగవానుడి ఆలయం. దీనిని స్థానికులు 'కీర్తినాధేశ్వర' ఆలయం పేరుతో పిలుస్తారు. ఈ రోజు మనం పాతాళేశ్వర ఆలయం విశేషాలేంటో తెలుసుకుందాం...
పాతాళేశ్వర లింగానికి ఓ ప్రత్యేకత ఉంది.
పాతాళేశ్వర లింగానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ లింగం ఉదయం వేళల్లో ఎరుపు రంగులో, మధ్యాహ్నం నల్లగా, సాయంవేళల తెల్లగా కనిపించడం విశేషం! పాతాళేశ్వరాయలం క్రీ.శ 1004 వరకు పాలించిన గంగవంశ రాజుల కాలం నుండి ఈ ఆలయం ఉంది. కాలక్రమంలో ఇసుకతో కప్పబడినది. పురావస్తు శాఖవారు పరిశోధనల వల్ల బటయపడినది.. నేల మట్టం కన్నా చాలా లోతుగా ఉన్న ఈ ఆలయంలోని శివలింగం ఉదయం ఎరుపు, మధ్యాహ్నం నలుపు, సాయంకాలానికి తెలుపు రంగులోకి మారుతూ కనబడుతుంది.
తలకాడు పట్టణం ఒకప్పుడు ఎంతో ఆకర్షణీయంగా ఉండేది. సుమారు 30దేవాలయాలకు పైగా ఉండేవి. అయితే ఈ పట్టణం 16 శతాబ్దంలో ఇసుకు తిన్నెలతో కప్పబడింది. చరిత్ర ఆధారాల మేరకు ఒడయార్ల పాలనలో ఇక్కడ సహజంగా నాశనం జరిగింది. కానీ స్థానిక కథనాలు, ఊహాగాలు ప్రకారం ఈ ప్రాంతం దేవత అయిన అలమేలు అమ్మవారి శాంపం కారణంగా తలకాడు ఇసుకచే కప్పబడిందని కూడా చెపుతారు.
తలకాడు పట్టణంలో ఒకప్పుడు 5ప్రసిద్ద శివాలయాలుండేవి. ప్రారంభంలో గంగ వంశస్థులు , ఆ తర్వాత చోళులు ఈ ప్రాంతాన్ని పాలించారు. చోళులను హోయసల రాజు విష్ణ వర్థనుడు తలకాడు నుండి తరిమివేశాడు. తర్వాత ఈ ప్రాంతాన్ని విజయనగర రాజులు ఆ తర్వాత వారి నుండి మైసూరు ఒడయార్లు పాలించారు.
అలమేలు అమ్మవారి నగలపై కన్ను వేసిన మైసూరు రాజు తలకాడుపై తన సైన్యంతో దాడిచేయగా, ఆమె తన నగలను కావేరి నదిలో పడేసి అక్కడే మునిగిపోయిందని చనిపోయే ముందు తలకాడు ఇసుక దిబ్బగా మారిపోవాలని శపించిందని మాలంగి ఒక సరస్సుగాను, మైసూరు రాజులు వారసులు లేకుండా పోతారని శపించిందని స్థానిక కథనాలు.
ఈ పట్టణం ఐదు దేవాలయాలకు ప్రసిద్ది, అవి వైద్యనాథేశ్వర, పాతాలేశ్వర, మరుళేశ్వర, అరకేశ్వర మరియు మల్లికార్జునుల దేవాలయాలు. ప్రతి సంవత్సంర కొద్దికొద్దిగా ఇవి ఇసుకలోకి కూరుకుపోతున్నాయి. వీటిని రక్షించటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రాంతంలోనే విష్ణు భగవానుడి ఆలయం కీర్తినీధేశ్వర పేరుతో ఉంది. ఇది అయిదు శివాలయలాలో ఒకటి దీనిని ఇప్పుడు తిరిగి నిర్మిస్తున్నారు.
తలకాడు కావేరి నది పట్టణం గుండా ప్రవహిస్తూ ఒక అందమైన మలుపు తీసుకుంటుంది. సీనరీలు ఎంతో రమణీయంగా ఉంటాయి. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పంచలింగ దర్శనం ఇక్కడ ప్రసిద్ది. చివరి దర్శనం 2009లో జరిగింది. ఈ పంచలింగ దర్శనం కార్తీక పౌర్ణమి రోజున రెండు నక్షత్రాలు ఖుహ యోగ మరియు విశాఖ కలసినప్పుడు ఏర్పడుతుంది.తలకాడు చుట్టుపక్కల గల సోమనాథపూర్, శివసముద్ర, మైసూర్, శ్రీరంగపట్నం, రంగని తిట్టు మరియు బండిపూర్ ల చూడదగ్గ ఆకర్షణీయమైన ప్రదేశాలు.
తలకాడు సందర్శనకు నవంబర్ నుండి మార్చి వరకు అనుకూలంగా ఉంటుంది. అప్పుడు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. తలకాడు మైసూర్ జిల్లాలో మైసూర్ కు 43కిలోమీటర్ల దూరంలో మరియు బెంగళూరు నుండి 120కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ రెండు ప్రధాన నగరాల నుండి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు.
తలకాడు కు సమీపాన 140 కి. మీ ల దూరంలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. బెంగళూరు నుండి మైసూర్ చేరుకొని అక్కడి నుండి ప్రభుత్వ / ప్రవేట్ వాహనాల్లో తలకాడు చేరుకోవచ్చు. తలకాడు కు సమీపాన 50 కి. మీ ల దూరంలో మైసూర్ రైల్వే స్టేషన్ కలదు. క్యాబ్ లేదా టాక్సీ వంటివి మైసూర్ లో అదీకు దొరుకుతాయి.
😊🙏

Comments

Please follow, Like, Comment and share

స్త్రీ కి పర్యాయ పదాలు ఎన్నో తెలుసా?

101 గ్రామ దేవతల పేర్లు

Paka shastram పాక శాస్త్ర వివరణ. భోజనం విధులు

Homam హోమాలు ఎన్ని రకములు వాటి వివరములు

ద్రాక్షారామం దగ్గర నక్షత్ర దేవాలయాలు

108 శక్తి పీఠాలు:

ఎవరు ఏ రుద్రాక్ష ధరించాలి?

హోమము వలన కలుగు లాభములు

108 Temples around Draksharamam

శని జయంతి 15.5.2018