Posts

Showing posts from 2021

హోమము వలన కలుగు లాభములు

Image
  హోమము వలన కలుగు లాభములు హోమ ధూమము కంటి ని కప్పుట వలన కంటి లో ఉన్న నలతలన్నీ కన్నీటి రూపము లో వెళ్లి పోతుంది.  హోమాగ్ని సెగ మోకాళ్ళ కు తాకటం వలన మోకాళ్ళ నొప్పులు రాకుండా నివారించు కోవచ్చు.  గ్రహాలకు వేరు వేరు వృక్షాల సమిధల తో హోమం చేస్తే వేరు వేరు సత్ఫలితాలు వస్తాయి. రవి:- తెల్ల జిల్లేడు వాత,కఫ వ్యాదులను తగ్గిస్తుంది. తెల్ల జిల్లేడు సమిధల తో ఇంట్లో హోమం చేస్తే వాస్తుదోషాలు నివారణ అవుతాయి.  కళ్ళ కు సంబంధించిన అనారోగ్యాలు నయ మవుతాయి.  కోపము యొక్క తాపము తగ్గుతుంది.  తల నొప్పి భాధలు ఉండవు.  ఆయుర్వేదం ప్రకారం తెల్ల జిల్లేడు కు  కుష్టు వ్యాధి ని నయం చేసే శక్తి వుందని ఆయుర్వేద వైద్యులు చెప్పేవారు. చంద్రుడు:- మోదుగ సమిధల తో హోమం చేస్తే మానసిక సమస్యలు ఉండవు.  ఆలోచనా విధానం లో మార్పులు వస్తాయి.  సుఖ వ్యాధులు దరి చేరవు.  మోదుగాకు ను మెత్త గా నూరి పాలతో తాగిన స్త్రీలకు ఋతు సంబంధ సమస్యలు, గర్భ సంబంధ సమస్యలు ఉండవు.  మోదుగ పువ్వులు, గింజలు ఎండ బెట్టి నీటి లో ఒక పావు చెంచా వేసి కాగబెట్టు కొని తాగితే లావుగా ఉన్న వారు సన్న గా అవుతారు. వైద్య పరం గా చూస్తే జీర్ణ వ్యవస్థ ను అద్భుతం గా పునరుజ్జీవింప చేసే శక

Gomuk shank శంఖం మోగితే ఐశ్వర్యం వస్తుందా

Image
💐💐💐శంఖం మోగితే ఐశ్వర్యం వస్తుందా......!!💐💐💐 అఖండ అదృష్టం,ఐశ్వర్యం,అభివృద్ధి,కీర్తిప్రతిష్టలు,  గౌరవాలను అనుగ్రహించే అఖండ దైవిక వస్తువు.. శంఖాలు..! శంఖే చంద్ర మావాహయామి! కుక్షే వరుణ మావాహయామి! మూలే పృధ్వీ మావాహయామి! ధారాయాం సర్వతీర్థ మావాహయామి! శంఖం సంపదలకు ప్రతీక  ఈ పవిత్రమైన వస్తువులను పూజా గదుల యందు వుంచినట్లు అయితే అన్ని అరిష్ఠాలు మాయమైపోతాయి. సౌభాగ్యాల పంట దక్కుతుంది.  ఇందువల్లనే భారతీయ సంస్కృతిలో దీనికి ప్రత్యేకమైన స్థానం కలదు.  మందిరాలలోనూ శుభకార్యాలలోనూ దీని ధ్వని శోభను పెంచుతుంది.  దీని పుట్టుక సముద్ర మధనంలో జరిగిందని చెబుతారు. సముద్ర మధనంలో వచ్చిన పదనాలుగు రత్నాలలో శంఖం ఒకటి  విష్ణు పురాణం ప్రకారం లక్ష్మి సముద్రతనయ అయివున్నది.  శంఖం పూరించకుండా పూజ ముగించకూడదని  ఒక ఆచారం ఉంది.  పెద్ద పెద్ద దేవాలయాల్లో గర్భగుడి తలుపులు తీసేటప్పుడు కూడా శంఖాన్ని ఊదుతారు.  మన భారతీయ సంస్కృతిలో శంఖానికి ఒక ప్రత్యేక స్థానం ఉండటానికి కారణం..అది సముద్ర మథన సమయంలో పాల సముద్రం నుండి బయటకు రావటమే.  అలా బయటపడిన దానిని శ్రీమహావిష్ణువు ధరించాడు, దానికే పాంచజన్యం అని పేరు.  దాని తరువాత వచ్చిన లక్ష్మి