Gomuk shank శంఖం మోగితే ఐశ్వర్యం వస్తుందా


💐💐💐శంఖం మోగితే ఐశ్వర్యం వస్తుందా......!!💐💐💐


అఖండ అదృష్టం,ఐశ్వర్యం,అభివృద్ధి,కీర్తిప్రతిష్టలు,  గౌరవాలను అనుగ్రహించే అఖండ దైవిక వస్తువు..

శంఖాలు..!


శంఖే చంద్ర మావాహయామి!

కుక్షే వరుణ మావాహయామి!

మూలే పృధ్వీ మావాహయామి!

ధారాయాం సర్వతీర్థ మావాహయామి!


శంఖం సంపదలకు ప్రతీక 

ఈ పవిత్రమైన వస్తువులను పూజా గదుల యందు వుంచినట్లు అయితే అన్ని అరిష్ఠాలు మాయమైపోతాయి. సౌభాగ్యాల పంట దక్కుతుంది. 

ఇందువల్లనే భారతీయ సంస్కృతిలో దీనికి ప్రత్యేకమైన స్థానం కలదు. 

మందిరాలలోనూ శుభకార్యాలలోనూ దీని ధ్వని శోభను పెంచుతుంది. 

దీని పుట్టుక సముద్ర మధనంలో జరిగిందని చెబుతారు. సముద్ర మధనంలో వచ్చిన పదనాలుగు రత్నాలలో శంఖం ఒకటి 

విష్ణు పురాణం ప్రకారం లక్ష్మి సముద్రతనయ అయివున్నది. 


శంఖం పూరించకుండా పూజ ముగించకూడదని 

ఒక ఆచారం ఉంది. 

పెద్ద పెద్ద దేవాలయాల్లో గర్భగుడి తలుపులు తీసేటప్పుడు కూడా శంఖాన్ని ఊదుతారు. 


మన భారతీయ సంస్కృతిలో శంఖానికి ఒక ప్రత్యేక స్థానం ఉండటానికి కారణం..అది సముద్ర మథన సమయంలో పాల సముద్రం నుండి బయటకు రావటమే. 

అలా బయటపడిన దానిని శ్రీమహావిష్ణువు ధరించాడు,

దానికే పాంచజన్యం అని పేరు. 

దాని తరువాత వచ్చిన లక్ష్మి దేవిని కూడా స్వామి స్వీకరించాడు. 

ముందుగా శంఖం దాని వెంటే లక్ష్మీదేవి రావటంతో శంఖాన్ని ఆ దేవి అన్నగారిగా వర్ణిస్తారు. 

దేముడు గదిలో శంఖం పెట్టి దానిలో నీరు నింపి ఉంచటం వల్ల శుభాలు జరుగుతాయని ఒక నమ్మకం.


ఈ శంఖంలో రెండు రకాలు ఉన్నాయి. 

ఒకటి దక్షిణావృత శంఖం, 

రెండవది వామావృత శంఖం. 

దక్షిణావృత శంఖాలని ఎక్కువగా పూజావిదానంలో వాడరు. 

ఇవి తెల్లటి తెలుపు రంగులో ఉండి దాని మీద కాఫీరంగు గీత ఉంటుంది. 

ఇది కుడి వైపు తెరుచుకుని ఉంటుంది. 

ఈ శంఖంలో నీరు నింపి సూర్యుడికి ధారపోస్తే కంటికి సంబందించిన రోగాలు తగ్గుతాయి.


ఎడమవైపు తెరుచుకుని ఉండే శంఖాన్ని వామావృత శంఖం అంటారు. 

ఇది పేరుకి తగ్గట్టు ఎడమవైపుకి తెరుచుకుని ఉంటుంది. అన్ని పూజా విధానాల్లో మనం తరచుగా వాడేది దీనినే. ఇది ఇంట్లో ఉంటే దుష్ట శక్తులు ఆ దరిదాపులకి  కూడా రావట. 

వైదికశాస్త్ర ప్రకారం శంఖం పూరించగానే వచ్చే శబ్దానికి 

ఆ చుట్టుపక్కల ఉండే క్రిమికీటకాలు నాశనమైపోతాయట. 

దీనిని ఆధునిక శాస్త్ర విజ్ఞానం కూడా ధృవీకరించింది. 1929లో బెర్లిన్ యూనివర్సిటీలో దీనిని మళ్లీ నిర్ధారించారు. 

ఈ శంఖధ్వనికి రెండువేల ఆరువందల అడుగుల దూరంలో ఉండే క్రిములు కూడా స్పృహ తప్పి పోతాయట.


అంతేకాదు వైద్యశాస్త్రంలో కూడా దీనికి మంచి గుర్తింపు ఉంది. 

రోజూ శంఖాన్ని ఊదేవారికి శ్వాస సంబందిత వ్యాధులు దగ్గరకి రావట. 

ఆస్త్మా కూడా తగ్గుతుందని ఒక అధ్యయనం తెలిపింది. రాత్రి పూట శంఖాన్ని నీళ్ళతో నింపి ఆ నీటిని ఉదయాన్నే చర్మంపై రాసుకుంటే చర్మసంబందిత వ్యాదులు దూరమవుతాయట. 

ఇంట్లో దీనిని ఉంచుకోవటం వల్ల వాస్తు దోషాలు ఉన్నా అన్నీ  తొలగిపోతాయి. 

శంఖాన్ని కాల్చగా వచ్చిన భస్మం వల్ల అనేక రోగాలు నయమవుతాయట. 


ఈ శంఖాల వల్ల 

ఆయువృద్ధి, 

లక్ష్మీ ప్రాప్తి, 

పుత్రప్రాప్తి, 

శాంతి, 

వివాహ ప్రాప్తి 

కలుగుతాయని ఒక నమ్మకం.


శంఖాలలో అనేక రకాలు ఉన్నాయి. 

అందులో గోముఖ శంఖం ఒకటి. 

ఇది ఆవు మొహం ఆకారంలో ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. 


గోముఖ శంఖం.

గోముఖ శంఖం సముద్రంలో లభించే అత్యంత అరుదైన శంఖం..!


గోముఖ శంఖం సముద్రంలో లభించే అత్యంత అరుదుగా లభ్యమయ్యే అత్యాదునికమైన సముద్రపు నత్త పురుగు ద్వారా ఉత్పత్తి అయ్యే శంఖు జాతికి చెందినది.

గోవు ముఖాకృతిని కలిగి వుండటం చేత ఈ శంఖుని గోముఖ శంఖం అంటారు. 


గోముఖ శంఖాలు 

హిమాలయాలలోని కైలాస మానస సరోవరంలోను, శ్రీలంక, 

అండమాన్ నికోబార్ దీవులలోను లభ్యమవుతాయి.


గోముఖశంఖం గోమాతయైన కామదేను స్వరూపం.

శివలింగాన్ని గాని, శివపార్వతులను గాని పూజించేటప్పుడు తప్పనిసరిగా గోముఖ శంఖాన్ని శివుని పాదాల దగ్గర ఉంచి స్వచ్చమైన పూలతో అలంకరించి పూజ చేసిన వారికి గోమాతను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది. 


గోముఖ శంఖం తెలుపు, పసుపుల మిశ్రమ వర్ణం కలిగి ఉంటుంది. 

గోముఖ శంఖాన్ని చెవి దగ్గర పెట్టుకుంటే ఆధ్యాత్మిక శబ్ధ తరంగాలు మనస్సుకు ఆహ్లాదాన్ని ఇస్తాయి. 


శివలింగాన్ని గాని ఇతర దేవతామూర్తుల విగ్రహాలను పూజించటానికి సర్వసాధారణంగా ధక్షిణావృత శంఖాన్ని వాడతారు.

కానీ అంతకంటే ఎక్కువ పవిత్రమైనది ఈ గోవు ముఖాకృతి కలిగిన కామధేను స్వరూపమైన గోముఖ శంఖం.

ఈ గోముఖ శంఖం అత్యంత అరుదుగా లభించటం వలన దీని యొక్క ప్రాముఖ్యత అందరికి తెలియదు.


గోముఖ శంఖాన్ని ముందుగా పరిశుభ్రమైన గంగాజలంతో గాని,పసుపు నీళ్ళతో గాని శుభ్రపరిచి శివలింగం వద్ద ఉంచి స్వచ్చమైన పూలతో అలంకరించి పూజ చేస్తే గోమాతను పూజించిన పుణ్యఫలం దక్కుతుంది.


గోముఖ శంఖాన్ని మొదటిసారి పూజ చేసేటప్పుడు శుక్రవారం రోజుగాని గురువారం రోజు గాని స్నానాదులు ముగించుకొని పరిశుబ్రమైన తెల్లని లేదా పసుపు బట్టమీద పసుపు నీళ్ళతో కడిగిన గోముఖ శంఖాన్ని ప్రతిష్ఠించాలి.


"ఓం నమః కామధేను గోముఖి శంఖాయ మమ సర్వ కార్యసిద్ధి కురు కురు స్వాహా " అనే మంత్రాన్ని 108 సార్లు పఠించిన వారికి సకల కార్యసిద్ధి కలుగుతుంది.  


గోముఖ శంఖంలో గంగాజలాన్ని, ఆవు పాలను నింపి మనం నివసించే ఇంటిలోను వ్యాపార సంస్ధలలోను తీర్ధాన్ని చల్లిన ఎటువంటి నరదృష్టి ప్రభావాలు ఉండవు. మరియు వాస్తు దోష ప్రభావాలు సైతం నివారింపబడతాయి. 


గోముఖ శంఖంతో శివలింగాన్ని గాని, ఇతర దేవతా విగ్రహాలను అభిషేకించి పూజించవచ్చును.

గోముఖశంఖంలో నీటిని ఉంచి ప్రతిరోజు స్వీకరించుట చాలా మంచిది.


గోముఖ శంఖాన్ని పూజించిన వారికి మనస్సులో కోరుకున్న కోరికలు ఆచరణలోకి వస్తాయి. గోముఖశంఖాన్ని పూజించిన, అభిషేకించిన నీటిని స్వీకరించిన వారికి శయ్యాసౌఖ్యం, దాంపత్య సౌఖ్యం కలుగుతుంది.


గోముఖశంఖంలో ఉంచిన నీటిని తాగిన వారు 

చక్కటి తడబాటు లేని వాక్చాతుర్యం, 

సత్యభాషణ చేయువారుగాను,

మృధుభాషి గాను వ్యవహరించగలరు. 

గోముఖశంఖాన్ని ఇంటిలో ఉంచి పూజించినవారికి ఎల్లప్పుడు ధనధాన్యాభివృద్ది కలుగుతాయి.


గోముఖశంఖాన్ని షాపులో ఉంచుకొని పూజించిన వారికి నిత్య వ్యాపార,ధనాభివృద్ది కలుగుతాయి.

గోముఖ శంఖాన్ని పూజించిన వారికి వివాహంలో కలిగే ఆటంకాలను నివారించవచ్చును.

అంతేకాక వైవాహిక జీవితంలో కలిగే ఇబ్బందులు తొలిగిపోతాయి.


దీర్ఘకాలంగా అనారోగ్యంగా ఉన్నవారు గోముఖశంఖంలో ఉంచిన నీటిని తాగిన త్వరితగతిన రోగం నయం కావటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.


మర్మాంగ విషయ పరిజ్ఞానం, అతిసూక్ష్మ పరిశీలన విద్యయైన జ్యోతిష్యవిద్యను గోముఖశంఖాన్ని పూజించిన,అభిషేకించిన నీటిని స్వీకరించిన వారికి ఆయా శాస్త్రాలపై పట్టు సాధించగలరు. 

వాక్చాతుర్యం కలిగిన బ్రాహ్మణులు, అష్టావధానులు, శతావదానులు తప్పనిసరిగా గోముఖ శంఖాన్ని పూజించిన చక్కటి వాక్శుద్ధి కలిగి పేరు ప్రఖ్యాతలు కలిగి ఉంటారు.


జాతకచక్రంలోని గురువు, శుక్రగ్రహాదోషాలు వున్నవారు తప్పనిసరిగా గోముఖశంఖాన్ని పూజచేస్తూ..శంఖంలోని నీటిని స్వీకరించిన గ్రహాభాదలనుండి నివారించబడతారు.


గోముఖ శంఖాన్ని పూజించిన వారికి మనస్సులో ఉన్న కోరికలు తీరుతాయి. 

దీనిని  షాపులో ఉంచుకొని పూజించిన వారికి రోజూ వ్యాపార,ధనాభివృద్ది కలుగుతుంది . 

శంఖం ఏదైనా దానిని మాత్రం ఎప్పుడూ బోర్లించి ఉంచకూడదు. 

ఏ ఇంట్లో శంఖాన్ని దేముడి గదిలో ఉంచి పూజిస్తారో 

ఆ ఇల్లు ధనధాన్యాలతో తులతూగుతుందిట. 

ఇన్ని ఉపయోగాలున్న శంఖాన్ని పూజించడం, ఆరాదించడం, పూజా విధానాలలో ఉపయోగించడం ఎంతో మంచిది.


శంఖం లక్ష్మికి సోదరి, సోదరుడు కూడాను. 

ఈమె లక్ష్మికి వారసురాలు, 

నవనిధులలో అష్టసిద్ధులలో దీనిని ఉపయోగిస్తారు. పూజ, ఆరాధన, అనుష్ఠాలలో, ఆరతిలో, యజ్ఞాలలో, తాంత్రికక్రియలలో దీనిని ఉపయోగిస్తారు. 


ఆయుర్వేదరీత్యా దీనిలో మంచి గుణాలు వున్నాయి. పురాతన కాలంలో ప్రతి ఇంటిలోనూ దీనిని స్థాపించి ఆరాధించేవారు. 

కూర్మ పీఠం మీద ఎరుపు పట్టు వస్త్రాన్ని వేసి దీనిని స్థాపించి, దేవతగా భావించి పూజించేవారు. 

ఈ పూజలు వల్ల వాళ్లకు ఎంతో అభివృద్ధికల్గేది. 

దీనికి అనేక రకాల పూజా విధానాలు కలవు. 

పూర్వం కొన్నింటిని గృహ కృత్యాలలో తప్పనిసరిగా వాడేవారు. 


శంఖాలలో చాలా రకాలు వున్నాయి. 

రకాలను బట్టి పూజా విధానాలు కలువు. 

శంఖం సాధకుని మనోవాంఛలను పూర్తి చేయును. 

సుఖ సంతోషాలను కలగజేస్తుంది. 


ఈ శంఖాలు..

మానససరోవర్‌, 

లక్షద్వీప్‌, 

కోరమండల్‌, 

శ్రీలంక, 

భారతదేశంలోను లభిస్తున్నాయి. 


శంఖం యొక్క ఆకారాన్ని బట్టి వాటిని విభజిస్తారు ముఖ్యంగా 3 రకాలు 

1. దక్షిణావృత శంఖం, 

2. మధ్యావృత శంఖం, 

3. ఉత్తరావృతవ శంఖం. 


ఎడమ చేతితో పట్టుకునే దానిని దక్షిణావృతమని కుడిచేతితో పట్టుకునే దానిని ఉత్తరావృత శంఖమని మధ్యలో నోరు వున్నదానిని మధ్యావృతమని అంటారు. 


ఈ శంఖాల పేర్లు ఈ విధంగా ఉన్నవి. 

1. లక్ష్మీ శంఖం, 

2. గోముఖ శంఖం, 

3. కామధేను శంఖం, 

4. దేవ శంఖం, 

5. సుఘోష శంఖం, 

6. గరుడ శంఖం, 

7. మణిపుష్పక శంఖం, 

8. రాక్షస శంఖం, 

9. శని శంఖం, 

10. రాహు శంఖం, 

11. కేతు శంఖం, 

12. కూర్మ శంఖం, 


భారత యుద్ధ సమయంలో అనేక రకాల శంఖాలు పూరించారు. 


ఉదా:- శ్రీకృష్ణుడు పాంచజన్యం పూరించాడు, 

అర్జునుడు దేవదత్తాన్ని, 

భీముడు పౌంఢ్ర శంఖాన్ని 

యుధిష్ఠరుడు అనంత విజయ శంఖాన్ని, 

నకులుడు సుఘోష శంఖాన్ని, 

సహదేవుడు మణిపుష్పక శంఖాన్ని, 

కాశీరాజు శిఖండి శంఖాన్ని 

దుష్ఠ ద్యుమ్నుడు, విరాటుడు స్వాతిక శంఖాన్ని 

అలాగే ఇతర రాజులు అనేక రకాల శంఖాలు పూరించారు.


శంఖ ధ్వని విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్ఠలకు, లక్ష్మి ఆగమనానికి ప్రతీక, 

శంఖాన్ని..

శివపూజకు, 

పూజనందు హారతి ఇచ్చేటప్పుడు 

ధార్మిక ఉత్సవాలలో 

యజ్ఞాలలో 

రాజ్యాభిషేకాలకు, 

శుభ సందర్భాలలోనూ, 

పితృదేవతలకు తర్పణలు ఇచ్చేటప్పుడు మరియు దీపావళి, 

హోళి, 

మహాశివరాత్రి, 

విశిష్టమైన కర్మకాండలలో శంఖాన్ని స్థాపించి పూజిస్తారు. 


రుద్రపూజకు, 

గణెశపూజకు, 

దేవిపూజకు, 

విష్ణుపూజకు దీనిని ఉపయోగిస్తారు. 

దీనిని గంగాజలం, పాలు, తేనె, నేయితోను, బెల్లంతోను, అభిషేకిస్తూ వుంటారు. 

దీనిని ధూపదీప నైవేద్యాలతో పూజిస్తారు. 

దీనిని పూజించటం వల్ల వాస్తుదోషాలుపోతాయి. వాస్తుదోషం పోవడానికి ఎర్ర ఆవుపాలతో దానిని నింపి ఇల్లు అంతా చల్లుతారు. 

ఇంటి సభ్యులు అంతా సేవిస్తారు. 

ఇలా చేయడం వల్ల అసాధ్య రోగాలు, దు:ఖాలు దౌర్భాగ్యం దూరమవుతాయి. 


విష్ణు శంఖాన్ని దుకాణాలలోను ఆఫీసుల్లోను ఫ్యాక్టరీలలోను స్థాపించి అభివృద్ధిని పొందుతున్నారు. లక్ష్మి స్వయంగా శంఖం నాసహోదరి అని చెప్పిన సందర్భాలు కలవు. 

దేవి యొక్క పాదాలు వద్ద శంఖాన్ని వుంచుతారు. శంఖాలు వున్న చోట నుండి లక్ష్మి తరలిపోదు. 

ఆడ మగ శంఖాలని రెండు కలిపి స్తాపించాలి. 


గణేష్ శంఖాలలో నీరు నింపి గర్భవతులకు త్రాగించినట్లయితే గ్రుడ్డి, కుంటి, మూగ మొదలైన సంతానం కలగదు. 

అన్నపూర్ణ శంఖాన్ని ఆహారపదార్థాలలో స్థాపించి పూజిస్తారు. 

మణిపుష్పక్‌, పాంచ జన్యాలను కూడా అక్కడ స్థాపించి పూజిస్తారు. 

చిన్న శంఖ మాలలను ధరించి కూడా అనేక సిద్ధులను పొందుచున్నారు. 


శాస్త్రవేత్తలు అభిప్రాయానుసారం శంఖ ధ్వని వల్ల వాతావరణ లోపాలు, కీటకముల నాశనం జరుగుతుందని -అనేక ప్రయోగాలు చేసి నిరూపించారు. 

శంఖ బస్మము వల్ల అనేక రోగాలు నయము అగుచున్నవి. ఋషి శృంగుడు చెప్పిన విధానం ప్రకారం చంటి పిల్లలకు శంఖమాలలు ధరింపచేసి వాటితో నింపిన నీరును త్రాగించినట్లయితే పిల్లలు ఆరోగ్యవంతులు అవుతారు. 


శంఖాన్ని పూరించుట వల్ల శ్వాసకోశ రోగాలు నశిస్తాయి. కొన్ని శంఖాలు చెవి దగ్గర పెట్టుకుంటే ఓంకార నాధం వినిపిస్తుంది. 

దానివల్ల భక్తుల కోర్కెలు తీరును. 

ఈ శంఖాలు వల్ల ఆయువృద్ధి, లక్ష్మీ ప్రాప్తి, పుత్రప్రాప్తి, శాంతి, వివాహ ప్రాప్తి కలుగుచున్నవి. 

శంఖము పాపనాశిని 

ప్రతి ఇంటిలోను శంఖము వుండవలసిన వస్తువు 

శంఖము వున్న ఇల్లు లక్ష్మీ నివాసము.


కొన్ని శంఖాల వివరణ:-

దక్షిణావృత శంఖాలను పూజకు మాత్రమే ఉపయోగిస్తారు. 

ఉత్తరావృతాన్ని ఊదుటకు ఉపయోగిస్తారు. 


దక్షణావృతంలో శివశంఖం, పాంచజన్యం మొదలగు రకాలున్నవి. 

పాంచజన్యం పురుష శంఖం ఇది దొరుకుట కష్టం. 


శని శంఖాలకు నోరు పెద్దది పొట్ట చిన్నది. 

రాహు, కేతు శంఖాలు సర్పాకారంలో ఉంటాయి. 

రాక్షస శంఖానికి అన్నీ ముళ్లుంటాయి. 

ముత్యపు శంఖాలు పాలిష్‌ వల్ల వెండిలా మెరుస్తూ వుంటాయి. 

వినాయక శంఖం తొండాలతో కూడి ఉంటుంది. 

కూర్మ, వరాహ శంఖాలు తాబేలు, పంది ఆకారంలో ఉంటాయి. 

శంఖాలు ఎక్కువుగా 

రామేశ్వరం, 

కన్యాకుమారి, 

మద్రాసు, 

విశాఖపట్నం 

కలకత్తా, 

బొంబాయి మరియు 

పూరీలో ఎక్కువుగా దొరుకుచున్నవి.


సముద్రతనయాయ విద్మహే శంఖరాజాయ ధీమహీ తన్నో శంఖప్రచోదయాత్!


హృదయము నందు పరమాత్ముని యొక్క దివ్య నామమును, గాధలను స్మరించడము 

స్మరణ భక్తీ అందురు. 

పరమాత్ముని యొక్క అఖండ నామములను 

అఖండ రీతిన నిత్యము నియమము తప్పక నిరంతరముగా నామ స్మరణ చేయవలెను. నామస్మరణము వలన మనస్సుకు శాంతి, 

సమాధానము దొరుకును. 


ఆనంద సమయమున, 

దుఖ సమయమున, 

ఆపద సమయమున, 

ఉద్వేగ సమయమున, 

చింతా సమయమున, 

ఇంతయేల సర్వ కాల సర్వావస్థల యందు భగవన్నామ స్మరణము చేయ వలెను. 


నడుచుచు, 

మాటలాడుచు, 

తినుచు, త్రాగుచు, 

సుఖించుచు, బహు విధముల భోగములను 

తనివి తీర అనుభవించుచున్నప్పుడు కూడా ఏమరపాటు లేకుండా శ్రీహరి నామమును స్మరించు చుండవలెను. 


సంపదలతో తుల తూగుచున్నప్పుడు, 

ఆపదలలో మునిగి తేలుచున్నప్పుడు, 

కాలగతులు వ్యతిరేకించి, 

చిక్కులు వాటిల్లి నప్పుడు కూడా శ్రీహరి నామ స్మరణ మానరాదు. 

భగవన్నామ స్మరణకు ఇది సమయం, 

ఇది సమయం కాదు అనేది లేదు, 

సర్వ కాల సర్వావస్థల యందు శ్రీహరి నామ స్మరణ చేస్తూనే ఉండవలెను. 

వైభవము, సామర్ధ్యము, బలము, ధనము, కీర్తి గలిగిన సమయము లందు కూడా భగవన్నామ స్మరణ చేయవలెను. 

భగవంతుని నామమును నిరంతరము హృదయము నందు తలుచు భాగ్యవంతునికి ఆపదలు దరిచేరవు, అంత్యమున సద్గతి కలుగును. 

రోగ భాధలు యందు ఊరట లభించి శాంతి చేకూరును. 


రామ నామ మహత్వము చేతనే కాశీనగరమునకు 

ముక్తి క్షేత్రమను నామము కల్గినది. 

వాల్మీకి "మరా, మరా, మరా"... అని జపించి 

ముక్తి నొందినాడు. 

ప్రహ్లాదుడు శ్రీహరి నామము జపించి ముక్తి నొందినాడు. పాపియగు అజామిలుడు సైతము నారాయణ స్మరణము వలననే పవిత్రుడు అయి మోక్ష గామి అయినాడు. పరమేశ్వురుని నామములు అనంతములు. 

వానిని నిత్యమూ నియమ బద్దముగా హృదయము నందు స్మరించుచు భక్తులు తరించెదరు. 

మహా పాపులు కూడా నామస్మరణ చేత పరమ పవిత్రులై మోక్షము నొందిరి.


నిరంతరము శ్రీహరి నామము గావించు వాడే పుణ్యాత్ముడు. 

నామ స్మరణ వలన పాపములు నశించి సుకృతము పొందును. 

అన్ని వర్ణముల వారికినీ నామస్మరణ యందు అధికారము కలదు. ఇదియే స్మరణ భక్తీ.


నవ విధ భక్తి మార్గములు.

(అనుసరించినవారు)

1. శ్రవణం         : పరీక్షన్మహా రాజు

2. కీర్తన           : శ్రీ శుక మహాఋషీ

3. అర్చన         : పృధు చక్రవర్తి

4. నమస్కారం  : అక్రూరుడు

5 . దాస్యం       : హనుమంతుడు

6. సౌఖ్యం        : అర్జునుడు

7. ఆత్మసమర్పణ : బలి చక్రవర్తి

8. పాద సేవనం    : లక్ష్మీ దేవి

9. స్మరణం        : ప్రహ్లదుడు.

 

Comments

Please follow, Like, Comment and share

స్త్రీ కి పర్యాయ పదాలు ఎన్నో తెలుసా?

101 గ్రామ దేవతల పేర్లు

Paka shastram పాక శాస్త్ర వివరణ. భోజనం విధులు

Homam హోమాలు ఎన్ని రకములు వాటి వివరములు

ద్రాక్షారామం దగ్గర నక్షత్ర దేవాలయాలు

108 శక్తి పీఠాలు:

ఎవరు ఏ రుద్రాక్ష ధరించాలి?

హోమము వలన కలుగు లాభములు

108 Temples around Draksharamam

శని జయంతి 15.5.2018