Posts

మానవుడు నిత్యమూ అచరించవలసిన ధర్మములు ?

*మానవుడు నిత్యమూ అచరించవలసిన ధర్మములు ?* *1. పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఎప్పుడు తీయాలి?* జ. పిల్లలకు ‘9 ‘ వ నెలలో కాని, ’11 ‘వ నెలలో కాని, ‘3 ‘వ సంవత్సరం లో కాని తీయవలెను. *2. పిల్లలకు అన్నప్రాసన ఎన్నో నెలలో చేయాలి ?* జ. ఆడ పిల్లలకు ‘5 ‘ వ నెలలో, మగ పిల్లలకు ‘6 ‘ వ నెలలో అన్న ప్రాసన చేయాలి. *6 నెల 6వ రోజున ఇద్దరికీ పనికివస్తుంది.* *3 .పంచామృతం, పంచగవ్యములు అని దేనిని అంటారు   ?* జ. ఆవు పాలు,ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, వీటిని  పంచామృతం అని, ఆవు పాలు,ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రము, వీటిని పంచగవ్యములు అంటారు. *4. ద్వారానికి అంత ప్రాముక్యం ఎందుకు ఇస్తారు?* జ. ద్వారానికి పైనున్న కమ్మి లక్ష్మి స్వరూపము, అందుకే దానికి మామిడి తోరణం కడతారు.  క్రింద కమ్మి పవిత్రమైనది, కనుక దానికి పసుపు రాస్తారు.  శాస్ర పరంగా చెప్పాలంటే గడప కు పసుపు రాయడం వల్ల క్రిమి కీటకాలు, విష పురుగులు ఇంట్లోకి రాకుండా ఉండటానికి అనుకోవచ్చు. *5. తీర్థాన్ని  మూడుసార్లు తీసుకుంటారు. ఎందుకు?* జ. తొలితీర్థము  శరీర శుద్ధికి,శుచికి…రెండవ తీర్ధం ధర్మ,న్యాయ ప్రవర్తనకు …మూడవ తీర్ధం పవిత్రమ

Karthika pournami రేపు 12/11/2019 కార్తీక పొర్ణమి

Image
రేపు కార్తీక పొర్ణమి ఏమి చేయాలి,దీపం ఏ దిక్కు ఉంచాలి,ఉపవాసము ఎలా చేయాలి.. రేపు కార్తీక పొర్ణమి సాయంత్రం 7 లోపులో పూర్తి అవుతుంది ఆ లోపులో ఇలా చేయండి.. కార్తీకమాసంలో ఉన్నవన్నీ పర్వదినాలే. అయితే ఈ పర్వదినాలన్నింటిలోకీ పర్వదినం కార్తీక పున్నమి అని చెప్పవలసి ఉంటుంది. మాసంలో మిగిలిన అన్ని రోజులూ చేసే స్నానం దానం దీపం జపం ఉపవాసం వంటివన్నీ ఒక ఎత్తు. పున్నమినాడు చేసేవన్నీ ఒక ఎత్తు. అంతటి విశిష్టత ఉంది కార్తీక పున్నమికి. కార్తీక పౌర్ణమినాడు తెల్లవారు జామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయానే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుని దర్శించుకుంటారు.  రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక వత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ వత్తులు. కొందరు దీపాలను అరటిదొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేనివారు ఇంట్లోనే దేవునిముందు లేదా తులసికోట ఎదుట దీపం వెలిగిస్తారు. మన గృహం తులసికోట ముందు మంచిది అని శాస్త్ర వచనం..  దేవాలయాల్లో సహస్ర లింగార్చ

ఏ నామాన్ని జపిస్తే ఏ ఫలితం వస్తుంది.

• శ్రీ రామ అని జపిస్తే జయం లభిస్తుంది. • కేశవ అని స్మరిస్తే అనేక నేత్ర వ్యాదులు మటుమాయం అవుతాయి. • దమోదరున్ని జపిస్తే బందముల నుంచి విముక్తి లబిస్తుంది. • నారాయణ అని స్మరిస్తే సకల సర్వ గ్రహాల దోషాలు సమశిపోతాయి. • మాధవా అని స్మరిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి. • ఆచ్యుతా అని స్మరిస్తే తీసుకున్న ఆహారమే ఔషదంగా పనిచేస్తుంది. • నరసింహ అని స్మరిస్తే మీ శత్రువుల పై మీదే విజయం అవుతుంది, అదే నారసింహ అని స్మరిస్తే సకల భయాల నుచి విముక్తి కలుగుతుంది. • గోవింద అని స్మరిస్తే సకల పాపాల నుండి విముక్తి కలుగుతుంది. • శ్రీ లక్ష్మినారాయణ లను స్మరిస్తే సకల సంపదలతో మీ గృహం కలకలాడుతుంది. • సర్వేశ్వర అని స్మరిస్తే మనం చేపట్టిన కార్యం సత్వరమే జరుగుతుంది, విజయం కలుగుతుంది. • జగన్నాతా అని స్మరిస్తే సర్వ భయాలు తీరి ప్రశాంతత వస్తుంది. • కృష్ణ కృష్ణ అని స్మరిస్తే కష్టాలు తొలుగుతాయి. • శివ శివ అని అని స్మరిస్తే సకలమూ దరిచేరుతాయి. HOME

గ్రహ శాంతి పరిహారాలు

గ్రహ శాంతి పరిహారాలు  గ్రహాలకు సంబంధించిన వారం నాడు, మూట గట్టిన నవధాన్యాలు వేపచెట్టుకి కట్టాలి. ఆ గ్రహానికి సంబంధించిన ధాన్యం నానబెట్టి ఆవుకు పెట్టాలి. గ్రహాలు – వివరాలు 1. సూర్యుడు - ఆదివారం ధాన్యం : గోధుమలు పుష్పం : తామర వస్త్రం : ఎర్రని రంగు గల వస్త్రం జాతి రాయి : కెంపు 2. చంద్రుడు - సోమవారం ధాన్యం : బియ్యం / వడ్లు పుష్పం : తెల్లని తామర వస్త్రం : తెల్లని వస్త్రం జాతి రత్నం : ముత్యం నైవేద్యం : పెరుగన్నం 3. కుజుడు - మంగళవారం ధాన్యం : కందిపప్పు పుష్పం : సంపంగి మరియు తామర వస్త్రం : ఎరుపు రంగు వస్త్రం జాతి రత్నం : ఎర్రని పగడం నైవేద్యం : కందిపప్పు తో కూడిన అన్నం 4. బుధుడు - బుధవారం ధాన్యం : పచ్చ పెసర పప్పు వస్త్రం : పచ్చని రంగు వస్త్రం జాతి రత్నం : పచ్చ నైవేద్యం : పెసరపప్పు తో కూడిన అన్నం 5. గురు - గురువారం ధాన్యం : వేరుసెనగ పప్పు పుష్పం : మల్లె వస్త్రం : బంగారు రంగు వస్త్రం జాతి రత్నం : పుష్య రాగం నైవేద్యం : సెనగపప్పు తో కూడిన అన్నం 6. శుక్రుడు - శుక్రవారం ధాన్యం : చిక్కుడు గింజలు పుష్పం : తెల్లని తామర వస్త్రం : తెల్లని వస్త్రం జాతి రత్నం : వజ్ర

108 శక్తి పీఠాలు:

పరమేశ్వరుడు పరాశక్తితో వీటన్నింటా సన్నిధి చేసి ఉంటాడు. వీటిని స్మరించినా, విన్నా భక్తులకు పాపాలు తొలగి ముక్తి లభిస్తుంది. అష్టోత్తర శతనామాలను జపించినా, పుస్తకాన్ని ఇంట్లో ఉంచుకున్నా దుష్టగ్రహ పీడలన్నీ తొలగిపోతాయి. శ్రాధ్ధ కాల౦లో వీటిని స్మరి౦చినయెడల పితృదేవతలు సంతృప్తి చెందుతారు. ఇవి సాక్షాత్తు ముక్తి క్షేత్రాలు. 1. వారణాసిలో విశాలాక్షి 2. ముఖనివాసం లో గౌరి ౩. నైవిశం లో లింగధారిణి 4. ప్రయాగలో లలిత 5. గంధమాదనం మీద కౌముకి 6. మానస క్షేత్రం లో కుముద 7. దక్షిణ క్షేత్రం లో విశ్వకామ 8. ఉత్తర క్షేత్రం లో విశ్వకామప్రరూపిణీ 9. గోమంతం లో గోమతి 10. మందరం లో కామచారిణీ 11. చైత్రరథం లో మదోత్కట 12. హస్తినాపురం లో జయంతి 13. కన్యాకుబ్జం లో గౌరి 14. మలయాచలం పై రంభ 15. ఏకామ్ర పీఠం లో కీర్తిమతి 16. విశ్వక్షేత్రం లో విశ్వేశ్వరి 17. పుష్కర క్షేత్రం లో పురుహూతిక 18. కేదారం లో సన్మార్గదాయిని 19. హిమాలయం లో మంద 20. గోకర్ణం లో భద్రకర్ణిక 21. స్థానేశ్వరం లో భవాని 22. బిల్వక్షేత్రం లో బిల్వపత్రిక 23. శ్రీశైలం లో మాధవి 24. భద్రేశ్వరం భద్ర 25. వరాహాశైలం మీద జయ 26. కమలాయం లో కమల 27. ర

శ్రీదత్తాత్రేయ అష్టచక్రబీజస్తోత్రము

*శ్రీ ఆదిశంకరాచార్య విరచిత* *శ్రీదత్తాత్రేయ అష్టచక్రబీజస్తోత్రము* 🕉🌞🌏🌙🌟🚩 🔥ఓంశ్రీమాత్రే నమః🔥 అద్వైతచైతన్యజాగృతి 🕉🌞🌏🌙🌟🚩 *1)దిగంబరం భస్మసుగన్ధలేపనం చక్రం త్రిశూలం డమరుం గదాం చ ।* *పద్మాసనస్థం ఋషిదేవవన్దితం దత్తాత్రేయధ్యానమభీష్టసిద్ధిదమ్ ॥* *భావం:-* *దిగంబరులు, భస్మ, సుగంధములతో అలంకరించిన దేహము కలవాడు, చక్రం,త్రిశూలం, డమరుకం,గద, ధరించినవాడు, పద్మాసనంలో విరాజమానులై ఋషులు, దేవతలతో పూజింపబడుతున్న దత్తాత్రేయుని ధ్యానించువారి అభీష్టములు సిధ్ధించును.* *2)మూలాధారే వారిజపద్మే సచతుష్కే వం శం షం సం వర్ణవిశాలైః సువిశాలైః ।* *రక్తం వర్ణం శ్రీభగవతం గణనాథం దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ॥* *భావం:-* *మూలాధారచక్రస్థానం లో నాలుగు దళములు వున్న పద్మం వుంటుంది. మనస్సు, బుద్ధి, చిత్తము,అహంకారములకు సంకేతం. చిక్కటి ఎరుపు వర్ణం తో కూడివున్న ఆ దళాలపై వం, శం, షం, సం అనే బీజాక్షరాలు వుంటాయి.దీనికి భగవంతుడు (అధిష్ఠాన దేవత) గణనాథుడు.శ్రీ గురుమూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కరించు చున్నాను.* *3)స్వాధిష్ఠానే షడ్దల పద్మే తనులింగే బాలాన్తైస్తద్వర్ణవిశాలైః సువిశాలైః ।* *పీతం

యజ్ఞం అంటే ఏమిటి?

Image
యజ్ఞం - ఓ పవిత్ర కార్యం 'యజ్ఞం' అనేది అనాదిగా వస్తున్న ఒక హిందూ సంప్రదాయం. వేదంలో యజ్ఞో వై విష్ణుః అని చెప్పబడింది. అనగా యజ్ఞం విష్ణు స్వరూపంగా భావించవచ్చు. ‘యజ్ఞం’ అను శబ్దం ‘యజ దేవపూజయాం’ అనుదాతువు నుంచి ఏర్పడింది. దైవపూజే యజ్ఞం. మన దేశంలో పురాణకాలం నుంచి వివిధ రకాలైన యజ్ఞాలు జరిగాయి. యజ్ఞం అంతిమ లక్ష్యం దేవతలకు తృప్తి కలిగించడమే. వారిని మెప్పించడమే. సాధారణంగా యజ్ఞం అనేది అగ్ని (హోమం) వద్ద వేదమంత్రాల సహితంగా జరుగుతుంది. ఇందుకు అనుబంధంగా అనేక నియమాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంశం. యజ్ఞంలోని అగ్నిలో 'వేల్చినవి' దేవతలందరికి చేరుతాయని విశ్వాసం. యజ్ఞ విధానం వైదిక యజ్ఞంలో అధ్వర్యుడు ప్రధాన అర్చకుడు. అతని అధ్వర్యంలో అన్ని యజ్ఞ కార్యక్రమాలూ జరుగుతాయి. అతనికి సహాయంగా అనేక మంది అర్చకులు, పండితులు ఉంటారు. వేద మంత్రాలు చదువుతారు. యజ్ఞంలో ఒకటి గాని అంతకంటే ఎక్కువగాని హోమాగ్నులు ఉంటాయి. ఆ అగ్నిలో నెయ్యి, పాలు, ధాన్యం వంటి అనేక సంభారాలు పోస్తుంటారు. యజ్ఞాలు కొద్ది నిముషాల నుంచి కొన్ని సంవత్సరాల వరకూ జరుగవచ్చు. యజ్ఞాల్లో భాగంగా.. అశ్వమేధ