శ్రీదత్తాత్రేయ అష్టచక్రబీజస్తోత్రము

*శ్రీ ఆదిశంకరాచార్య విరచిత*
*శ్రీదత్తాత్రేయ అష్టచక్రబీజస్తోత్రము*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩


*1)దిగంబరం భస్మసుగన్ధలేపనం చక్రం త్రిశూలం డమరుం గదాం చ ।*
*పద్మాసనస్థం ఋషిదేవవన్దితం దత్తాత్రేయధ్యానమభీష్టసిద్ధిదమ్ ॥*

*భావం:-*
*దిగంబరులు, భస్మ, సుగంధములతో అలంకరించిన దేహము కలవాడు, చక్రం,త్రిశూలం, డమరుకం,గద, ధరించినవాడు, పద్మాసనంలో విరాజమానులై ఋషులు, దేవతలతో పూజింపబడుతున్న దత్తాత్రేయుని ధ్యానించువారి అభీష్టములు సిధ్ధించును.*



*2)మూలాధారే వారిజపద్మే సచతుష్కే వం శం షం సం వర్ణవిశాలైః సువిశాలైః ।*
*రక్తం వర్ణం శ్రీభగవతం గణనాథం దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ॥*

*భావం:-*
*మూలాధారచక్రస్థానం లో నాలుగు దళములు వున్న పద్మం వుంటుంది. మనస్సు, బుద్ధి, చిత్తము,అహంకారములకు సంకేతం. చిక్కటి ఎరుపు వర్ణం తో కూడివున్న ఆ దళాలపై వం, శం, షం, సం అనే బీజాక్షరాలు వుంటాయి.దీనికి భగవంతుడు (అధిష్ఠాన దేవత) గణనాథుడు.శ్రీ గురుమూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కరించు చున్నాను.*



*3)స్వాధిష్ఠానే షడ్దల పద్మే తనులింగే బాలాన్తైస్తద్వర్ణవిశాలైః సువిశాలైః ।*
*పీతం వర్ణం వాక్పతిరూపం ద్రుహిణం తం దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ॥*

*భావము:-*
*స్వాధిష్టానచక్రం ( లింగమూలమున వుండు) ఆరు దళములు కలిగిన పద్మము వలె వుండి, అగ్ని తత్వం కలది. సింధూర వర్ణం కల ఈ పద్మం మీద బం, భం,యం,యం,రం , లం, అక్షరాలు వుంటాయి. దీని అధిపతి బ్రహ్మ. వాహనం మొసలి. శ్రీ గురుమూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కరించు చున్నాను.*



*4)నాభౌ పద్మే పత్రదశాంకే డఫవర్ణే లక్ష్మీకాన్తం గరూఢారూఢం మణిపూరే । నీలవర్ణం నిర్గుణరూపం నిగమాక్షం దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ॥*

*భావము:-*
*మణిపూరక చక్రం బొడ్డు మూలములో పది దళములతో కూడిన పద్మము లాగా వుండును. బీజాక్షరాలు డ,ఢ,ణ,త,థ ద,ధ,న,ప,ఫ లిఖించబడి యుండును. అధిపతి లక్ష్మీకాంతుడు ( విష్ణువు).*
*మణిపూరక మందున్న మేఘం నీలవర్ణము కలది, నిర్గుణ రూపం కలది, అంధకారమును పోగొట్టు మెరుపు లాంటిది. శ్రీగురు మూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కరించు చున్నాను.*



*5)హృత్పద్మాంతే ద్వాదశపత్రే కఠవర్ణే అనాహతాంతే వృషభారూఢం శివరూపమ్ ।సర్గస్థిత్యంతాం కుర్వాణం ధవళాంగం దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి !!*

*భావము:-*
*హృదయము వెనుక విలసిల్లే ఈ చక్రం పన్నెండు దళములు కల పద్మము వలె వుండును. క,ఖ,గ,ఘ,ఙ,చ,ఛ,జ,ఝ,ఞ,ట,ఠ అను అక్షరములు కలది.అనాహత (తగలకుండా వచ్చే శబ్దం) చక్రమునకు అధిదేవత సృష్టి స్థితి లయకారకుడు,ధవళ వర్ణము కలవాడు, వృషభ వాహనుడైన శివుడు. శ్రీ గురుమూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కరించు చున్నాను.*



*6)కంఠస్థానే చక్రవిశుద్ధే కమలాన్తే చంద్రాకారే షోడశపత్రే స్వరవర్ణే!మాయాధీశం జీవశివం తం భగవంతం దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ॥*

*భావము:-*
*విశుద్ధ చక్రం ( పవిత్రము చేయునది) కంఠస్థానంలో వెనుక పదహారు దళములతో కూడిన శ్వేత వర్ణ కమలమువలె వుండును. అ,ఆ,ఇ,ఈ,ఉ,ఊ ,ఋ,ౠ,ఎ,ఏ,ఐ ,ఒ ,ఓ,ఔ,అం, అః అక్షరాలు వుండును.ఇది చంద్రుని ఆకారము లో వుండును. పదహారు అక్షరాలు చంద్రుని పదహారు కళలకు, శుద్ధ చైతన్యమునకు సంకేతము.దీని అధిపతి మాయాధీశుడైన శివుడు.శ్రీ గురుమూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కరించు చున్నాను.*



*7)ఆజ్ఞాచక్రే భృకుటిస్థానే ద్విదలాన్తే హం క్షం బీజం జ్ఞానసముద్రం గురూమూర్తిం!విద్యుత్వర్ణం జ్ఞానమయం తం నిటిలాక్షం దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ॥*

*భావము:-*
*ఆజ్ఞాచక్రం భృకుటి స్థానంలో రెండు దళములతో కూడిన పద్మము వలె వుండును.హం , క్షం అను బీజాక్షరాలు వుండును. దీనినే జ్ఞానచక్షువు అంటారు.ఈ చక్రమును సాధన చేస్తే, ఆత్మ దర్శనం అయి బ్రహ్మ జ్ఞాని అవుతాడు.ప్రకాశవంతమైన వర్ణముతో, జ్ఞానమయుడు,త్రినేత్రుడు, అయిన సదాశివుడు దీనికి అధిపతి.శ్రీ గురు మూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కరించు చున్నాను.*



*8)మూర్ధ్నిస్థానే వారిజపద్మే శశిబీజం శుభ్రం వర్ణం పత్రసహస్రే లలనాఖ్యే!*
*హం బీజాఖ్యం వర్ణసహస్రం తూర్యాంతం దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ॥*

*భావము:-*
*కపాలం పై బాగంలో (బ్రహ్మారంధ్రం అని కూడా అంటారు ) ఓం కారంతో వేయి దళముల పద్మము లాగా వుండును. ప్రకాశించు తెల్లని రంగులో సకల వర్ణములు కలిగి వుండును.హం బీజాక్షరాలు తో వుండును.ఆత్మజ్ఞానం సాధించిన  పరమహంసలు పొందేస్థితి.పరిపూర్ణ జ్ఞానమునకు ప్రతీక. అద్వైత స్థితి.శ్రీ గురు మూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కరించుచున్నాను.*



*9)బ్రహ్మానన్దం బ్రహ్మముకున్దం భగవన్తం బ్రహ్మజ్ఞానం జ్ఞానమయం తం స్వయమేవ పరమాత్మానం!* *బ్రహ్మమునీంద్రం భసితాఙ్గం దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి  ॥*

*భావం:-*
*బ్రహ్మానందము ప్రసాదించువాడు, బ్రహ్మముకుందుడు,భగవంతుడు, బ్రహ్మజ్ఞాని  మరియు జ్ఞానమయుడు,నిర్గుణ శుద్ధ చైతన్య ముతో ప్రకాశించుచూ స్వయంగా పరమాత్మ అయిన వాడు,బ్రహ్మ మునీంద్రుడు, ప్రకాశమానమైన అంగములు కలవాడు,శ్రీగురు మూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కరించు చున్నాను.*


*ఇతి శ్రీమద్శఙ్కరాచార్య విరచితం...*

*శ్రీదత్తాత్రేయ అష్టచక్రబీజస్తోత్రం సమ్పూర్ణమ్ !!*

🕉🌞🌎🌙🌟🚩
HOME

Comments

Please follow, Like, Comment and share

స్త్రీ కి పర్యాయ పదాలు ఎన్నో తెలుసా?

101 గ్రామ దేవతల పేర్లు

Paka shastram పాక శాస్త్ర వివరణ. భోజనం విధులు

Homam హోమాలు ఎన్ని రకములు వాటి వివరములు

ద్రాక్షారామం దగ్గర నక్షత్ర దేవాలయాలు

108 శక్తి పీఠాలు:

ఎవరు ఏ రుద్రాక్ష ధరించాలి?

హోమము వలన కలుగు లాభములు

108 Temples around Draksharamam

శని జయంతి 15.5.2018