Gomuk shank శంఖం మోగితే ఐశ్వర్యం వస్తుందా
💐💐💐శంఖం మోగితే ఐశ్వర్యం వస్తుందా......!!💐💐💐 అఖండ అదృష్టం,ఐశ్వర్యం,అభివృద్ధి,కీర్తిప్రతిష్టలు, గౌరవాలను అనుగ్రహించే అఖండ దైవిక వస్తువు.. శంఖాలు..! శంఖే చంద్ర మావాహయామి! కుక్షే వరుణ మావాహయామి! మూలే పృధ్వీ మావాహయామి! ధారాయాం సర్వతీర్థ మావాహయామి! శంఖం సంపదలకు ప్రతీక ఈ పవిత్రమైన వస్తువులను పూజా గదుల యందు వుంచినట్లు అయితే అన్ని అరిష్ఠాలు మాయమైపోతాయి. సౌభాగ్యాల పంట దక్కుతుంది. ఇందువల్లనే భారతీయ సంస్కృతిలో దీనికి ప్రత్యేకమైన స్థానం కలదు. మందిరాలలోనూ శుభకార్యాలలోనూ దీని ధ్వని శోభను పెంచుతుంది. దీని పుట్టుక సముద్ర మధనంలో జరిగిందని చెబుతారు. సముద్ర మధనంలో వచ్చిన పదనాలుగు రత్నాలలో శంఖం ఒకటి విష్ణు పురాణం ప్రకారం లక్ష్మి సముద్రతనయ అయివున్నది. శంఖం పూరించకుండా పూజ ముగించకూడదని ఒక ఆచారం ఉంది. పెద్ద పెద్ద దేవాలయాల్లో గర్భగుడి తలుపులు తీసేటప్పుడు కూడా శంఖాన్ని ఊదుతారు. మన భారతీయ సంస్కృతిలో శంఖానికి ఒక ప్రత్యేక స్థానం ఉండటానికి కారణం..అది సముద్ర మథన సమయంలో పాల సముద్రం నుండి బయటకు రావటమే. అలా బయటపడిన దానిని శ్రీమహావిష్ణువు ధరించాడు, దానికే పాంచజన్యం అని పేరు. దాని తరువాత వచ్చిన లక్ష్మి