ఎవరు ఏ రుద్రాక్ష ధరించాలి?


జన్మనక్షత్ర రీత్యా  ధరించవలసిన రుద్రాక్షలు:-
నక్షత్రము      ధరించవలసిన రుద్రాక్ష
అశ్వని   -         నవముఖి
భరణి     -         షణ్ముఖి
కృత్తిక    -         ఏకముఖి, ద్వాదశముఖి
రోహిణి     -       ద్విముఖి
మృగశిర    -     త్రిముఖి
ఆరుద్ర     -       అష్టముఖి
పునర్వసు   -    పంచముఖి
పుష్యమి   -      సప్తముఖి
ఆశ్లేష     -        చతుర్ముఖి
మఖ      -       నవముఖి
పుబ్బ     -      షణ్ముఖి
ఉత్తర     -       ఏకముఖి, ద్వాదశముఖి
హస్త    -        ద్విముఖి
చిత్త     -        త్రిముఖి
స్వాతి    -      అష్టముఖి
విశాఖ   -      పంచముఖి
అనురాధ  -   సప్తముఖి
జ్యేష్ఠ    -       చతుర్ముఖి
మూల    -    నవముఖి
పూర్వాషాఢ   -   షణ్ముఖి
ఉత్తరాషాఢ   -     ఏకముఖి లేదా ద్వాదశముఖి
శ్రవణం     -        ద్విముఖి
ధనిష్ట      -        త్రిముఖి
శతభిషం    -      అష్టముఖి
పూర్వాభాద్ర   -   పంచముఖి
ఉత్తరాభాద్ర    -   సప్తముఖి
రేవతి      -        చతుర్ముఖి.
నవరత్నముల కు బదులు రుద్రాక్షలు కూడా ధరించవచ్చు.

1) కెంపు – ఏకముఖి, ద్వాదశముఖి

2) ముత్యం – ద్విముఖి, ఏకాదశ ముఖి

3) పగడం – త్రిముఖి, అష్టాదశ ముఖి

4) పచ్చ – చతుర్ముఖి, త్రయోదశ ముఖి

5) పుష్యరాగం – పంచ ముఖి, చతుర్దశ ముఖి

6) వజ్రం – షణ్ముఖి, పంచ దశ ముఖి

7) నీలం – సప్త ముఖి, షోడశ ముఖి

8) గోమేధికం – అష్టముఖి, గౌరీ శంకర ముఖి

9) వైఢూర్యం – నవ ముఖి, ఆష్టా దశ ముఖి.

రుద్రాక్షలు ధరించడం వల్ల వచ్చు ఫలితములు

1)  ఏకముఖి రుద్రాక్ష – ఈ రుద్రాక్ష చాలా విలువైనది. ఎటువంటి మంత్ర తంత్ర ప్రయోగాలు అయినా తిప్పి కొట్టగలదు. సిరి సంపదలు, శిరో సంబంధ రోగములు నివారణ అగును.

2)  ద్విముఖి – ఇది బ్రహ్మ రుద్రాక్ష అని కొందరి అభిప్రాయం. అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీక అని కూడా అనుకోవచ్చు. సంతాన ప్రాప్తి, ఏకాగ్రత, వ్యాపార అభివృద్ధి. కల్గును. మనోవ్యాకులతను దూరం చేస్తుంది

3)  త్రిముఖి – ఈ రుద్రాక్ష చాలా అదృష్టదాయకమయినది. ధనధాన్యసమృద్ధి, కామెర్ల వ్యాధి నివారణ మరియు సర్ప దోష నివారణ అగును.

4)  చతుర్ముఖి – పరిశోధకులు, జ్యోతిర్గణిత వేత్తలు ధరించడం వల్ల అదికరాణింపు ఉండును మరియు ఏకాగ్రత పెరుగును.

5)  పంచముఖి – బ్రహ్మ స్వరూపమయిన ఈ రుద్రాక్ష వల్ల అకాలమృత్యునివారణ, గుండెపోటు వంటి హృద్రోగ సంబంధిత వ్యాధులు నివారణ అగును మరియు మలబద్దకం నివారణ అగును.

6)  షణ్ముఖి – ఈ రుద్రాక్ష కుమార స్వామి స్వరూపం, శక్తి, విజయం, శరీర ధారుఢ్యం, ఆరోగ్యం లభించును.

7)  సప్త ముఖి– సభావశ్యత,సంపద, కీర్తి, ఉత్తేజం కల్గును.

8)  అష్ట ముఖి – ఆకస్మిక ధన ప్రాప్తి కల్గును.

9)  నవముఖి రుద్రాక్ష – ఈ రుద్రాక్ష భైరవ స్వరూపమయినది. రాజకీయ పదవులలో ఔన్నత్యం ఆశించువారికి, అపమృత్యు నివారణకు, పరోపకార దక్షులకు ధరించవచ్చు.

10)  దశముఖి రుద్రాక్ష – విష్ణు స్వరూపమయినది. గొంతు సంబంధ రోగాలను, నవగ్రహముల ద్వారా కలుగు కష్టములు, సమస్యలు నివారణ అగును.

11)  ఏకాదశ ముఖి – ఇది శివాత్మకమయిన రుద్రాక్ష. వైవాహిక జీవితం లోఆనందమునకు, గర్భ సంభందరోగాలకు అనుకూలత లభించును.

ఇలా ఏకవింశతి ముఖ రుద్రాక్షలు అన్నియు అనేక విధముల సత్ఫలితములు కల్గును.(తప్పని సరిగా నియమ, నిబందనలు పాటించవలయును)

HOME

Comments

Please follow, Like, Comment and share

స్త్రీ కి పర్యాయ పదాలు ఎన్నో తెలుసా?

101 గ్రామ దేవతల పేర్లు

Paka shastram పాక శాస్త్ర వివరణ. భోజనం విధులు

Homam హోమాలు ఎన్ని రకములు వాటి వివరములు

ద్రాక్షారామం దగ్గర నక్షత్ర దేవాలయాలు

108 శక్తి పీఠాలు:

హోమము వలన కలుగు లాభములు

108 Temples around Draksharamam

శని జయంతి 15.5.2018