Paka shastram పాక శాస్త్ర వివరణ. భోజనం విధులు

**

           మనం  నిత్యం భోజనం చేసేటపుడు., కొన్ని అలవాట్లు మనకే తెలియక అలవాటుగా చేస్తూ వుంటాము. అవి అలవాట్లు కాదట. మన యొక్క నైజo అనగా మన గుణ గణాల ప్రతిబింబాలని పాక శాస్త్రం చెబుతూoది. చూద్దాము.

        మనము, మన గుణాలు ఎంత వరకు సరిపోతాయో, మనకు  మనమే గమనించు కోవాలి. అలాగే ఎదుటి వారిని మనము అంచనా వేసు కోవచ్చు. భోజనం చేసేటపుడు, మన ఆహారం ఎలా తీసు కొంతున్నామో చూడండి. ఇతరుల లో గమనించండి.  వారి నడవడికను, గుణ గణాలు  తెలుకోనండి. *ఎవరైతే* :-----

1. చేతి వ్రేళ్ళు కలపక, విడివిగా ఆహారం తింటూ వ్రేళ్ళ మధ్య జార విడుస్తుంటారో వారి వద్ద డబ్బు నిలవదట. 

2. అన్నాన్ని పిసికి పిసికి తినే వారి భార్య అతని వల్ల జీవితాంతం భాధ పడుతుందట. అతని మనస్సు క్రూరము, దయా దాక్షిణ్యాలు లేనివాడట. అలాంటి వాడికి మన ఆడకూతురును ఇవ్వ కూడదట.

3. చేతి వ్రేళ్ళకు,  తినేది  విడి విడి గా అతుక్కుని వుంటే వాడు దరిద్రుడట.

4. ఎవరైతే వ్రేళ్ళు మొత్తం నోట్లో పెట్టుకొని జుర్రుకుంటూ తింటారో, వారి వద్ద డబ్బు నిలవదట. పైపెచ్చు బహు పిసినారులట.

5. తినునపుడు, ఎవరైతే అరచేతిని నాకుతూ తిoటాడో, వాడు మిత్రద్రోహి, నమ్మక ద్రోహం చేసే గుణము కల వాడట.

6. తినునపుడు, ఎవరైతే ముట్టెను కూడా (అనగా అరచేయి వెనుక భాగం) నాకుతూ తింటాడో, వాడికి స్త్రీ వ్యామోహం అధిక మట.

7. అరచేయి ప్రక్కలు నాకు వాడు కూడా పరస్త్రీ వ్యామోహి ఆట.

8. నోటిలోనికి నాలుగు వ్రేళ్ళు పెట్టుకొని జుర్రుకుంటూ, తిను వాడు లోభి ఆట.

9. మొదట కారం కలుపుకొని తినువాడు లోభి, డబ్బే పరమావది అని తలoచు వాడును, భాoధవ్యాలకు విలువ ఇవ్వని వాడు, ఛాందస్తుడట.

10. పదార్థములన్ని కలగూర గంపగా కలుపుకొని తిను వాడు,  ఎల్లప్పుడు వివిధ రకాల ఆలోచనలు, అన్నింటా తల దూర్చి ఏదీ పూర్తి చేయని వాడును, అన్ని విషయాలను కొద్ది కొద్దిగా తెలుసుకొని, ఎందులోనూ ప్రావీణ్యత లేని వాడట.

11. ఎ పదార్థానికి ఏది కలుపుకొని తినాలో తెలియక, అన్నింటిని అటు ఇటు చేసుకొని, తీపు లో కారం , కారం లో తీపు,  పులుపు ఇలా అర్థం లేకుండా లేకుండా తినువాడు జీవితంలో స్పష్టీకరణ లేనివాడు, ఎపుడు ఏమి కావాలో తెలియని వాడట.

12. ప్రక్క వాళ్ళు ఎలా తింటున్నారో గమనించి  తేనే వాడు అనుకరణ చేయు వాడట.

 *భోజనం చేయు వాడి, ఉత్తమ లక్షణాలు.*

1. ఎవరైతే తినునపుడు శబ్ధం లేకుండా బోజనo చేస్తాడో వాడు సుగుణ వంతుడు మరియు ఐశ్వర్య వంతుడట.

2. అరచేతికి ఏమి అంటక తిను వాడు లక్ష్మి కటాక్షం కలవాడును, వాడి వద్ద లక్ష్మి స్థిరంగా వుండునట.

3. ఉచ్ఛ్వాస నిశ్వాస్వలకు అనుగుణంగా తిoటూ వుండే వాడి వద్ద లక్ష్మి స్థిరంగా వుంటుందట.

4. శబ్ధం లేకుండా తిను వాడు ఆరోగ్యవంతుడట.

5. మొట్ట మొదట ఎవరు తీపు పదార్థం తింటారో వారు ప్రేమ హృదయం కల వారట.
             
     చూసారా! భోజనం కూడా మనిషి యొక్క  ప్రకృతి,  , వారి హృదయ భావాలు, గుణాలను సూచిస్తున్నదంటే ఆశ్చర్యంగా లేదా! ఎంతటి మేధావులు మన ప్రాచీనులు. ఇవన్నీ పాక శాస్త్రంలో ఏ నాడో వ్రాసినారు. మన హైందవ సంస్కృతి కి మనం ఎంత ఋణపడి వున్నామో. ఇంకనూ మన పెద్దలు, పూర్వీకులు ఇలాంటి విషయాలు ఎన్ని వ్రాసి వున్నారో తెలుసుకొనటానికి, మన జీవిత కాలం సరి పోదను కుంటా!
Home

           

Comments

Please follow, Like, Comment and share

స్త్రీ కి పర్యాయ పదాలు ఎన్నో తెలుసా?

101 గ్రామ దేవతల పేర్లు

Homam హోమాలు ఎన్ని రకములు వాటి వివరములు

పితృ తర్పణము --విధానము

God photos జీర్ణమైన దేవుని చిత్ర పటాలు ఏమి చేయాలి

సంస్కారాలు - ముహూర్తములు

తద్దినాలు పెట్టడము అవసరమా

శని జయంతి 15.5.2018

Rushi Panchami - Sapta Rushulu