Ammavariki ishtamaina naivedyam

*అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం.*

🍁🍁🍁🍁

 లలితా సహస్రనామంలో తెలిపిన వివరాలు:

లలితా సహస్రనామంలో ఎన్నో సాధన రహస్యలతో పాటు ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యం కూడా వివరించి ఉంది అవి ఏంటో తెలుసుకుందాము.

1. *గుడాన్నప్రీత మానసా:*

 గుడాన్నం అంటే బెల్లం, బియ్యం కలిపి చేసే వంట. లలితామ్మవారికి గుడాన్నం అంటే ప్రీతి. బెల్లంకి నిలువ దోషం లేదు. రోజు కొద్దిగా పానకం కానీ బెల్లం ముక్క పెట్టిన చాలు

2. *స్నిగ్ధౌదన ప్రియా:*

స్నిగ్ధ అంటే తెల్లని, ఓదనము అంటే అన్నం, ప్రియా అంటే ఇష్టపడటం. తెల్లటి అన్నాన్ని ఇష్టపడే తల్లి అని లౌకికార్థం. తెల్లటి అన్నం అనగానే తెలుపు వర్ణమని కాదు, స్వచ్ఛమైన పదార్థాన్ని ఇష్టపడే తల్లి అని పారమార్థికార్థం. తెల్లగా ఉండే కొబ్బరిని ఉపయోగించి చేసే కొబ్బరి అన్నం ఆ తల్లికి ఇష్టం.

3. *పాయసాన్నప్రియా* :

 క్షిరాన్నం పయః అంటే పాలు, అన్నం అంటే వండబడిన బియ్యం. పాలు, బియ్యానికి మధుర పదార్థం జత చేసి వండిన వంట. ఆ తల్లికి ఈ వంటకం మీద ప్రీతి ఎక్కువ.

4. *మధుప్రీతా* :

మధు అంటే తేనె అనే అర్థం కూడా ఉంది. ప్రీతా అంటే ఇష్టపడటం. తేనె వంటిపదార్థాలను ఇష్టపడటం అని బాహ్యార్థం. తేన గారెలు కలిపి నివేదిస్తే ఆమెకు చాలా ఇష్టం.

5. *దద్ధ్యన్నాసక్త హృదయా:*

దధి అంటే పెరుగు, అన్నం అంటే బియ్యంతో వండినది. ఆసక్త అంటే అభీష్టాన్ని చూపడం, హృదయా అంటే అంతటి మనస్సు కలిగినది. పెరుగుతో వండిన అన్నం పట్ల ఆసక్తి కలిగిన హృదయం కలిగిన తల్లి అని అర్థం.

6. *ముద్గౌదనాసక్త హృదయా:*

ముద్గ అంటే పెసలు, ఓదనం అంటే అన్నం, ఆసక్త అంటే అభిరుచి కలిగిన, హృదయా అంటే మనసు కలిగిన అని అర్థం. ఆ తల్లికి పెసలతో వండిన అన్నమంటే ప్రీతి. పెసరపప్పు నానబెట్టి కాస్త బెల్లం వేసి పెట్టవచ్చు, పెసరపప్పు పాయసం చేసి నైవేద్యం పెట్టవచ్చు ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యం లో ఇది కూడా ముఖ్యమైనది.

7. *హరిద్రాన్నైక రసికా:*

హరిద్రం అంటే పసుపు, అన్నం అంటే బియ్యంతో వండినది. మనం మన పరిభాషలో పులిహోరగా పిల్చుకుంటాం.ఆ తల్లికి హరిద్రాన్నం మీద ప్రీతి ఎక్కువ.

8. *సర్వౌదనప్రీతచిత్తా* : (కదంబం)

సర్వ అంటే అన్నిరకాల, ఓదనం అంటే అన్నం, ప్రీత అంటే ఇష్టపడటం, చిత్తా అంటే మనసు కలిగి ఉండటం. అన్నిరకాల  ఆహార పదార్థాలను ఇష్టపడే చిత్తం కలిగినది తల్లి అని అర్థం.
 అన్నిరకాల కాయగూరలు , బియ్యంతో చేస్తారు.

ఇవి ఇస్తామని సహస్త్రనామం లో ఉన్న మాట నిజమే అయినా  ఆత్మ నివేదన కన్నా గొప్ప నైవేద్యం ఏముంటుంది .

ఒక పదార్థాన్ని వండే సమయం కూడా ఉపాసన అవుతుంది .
ఆ సమయంలో ఎక్కువగా ఆమె గురించి ఆలోచిస్తూ చేయడం వల్ల ప్రసాదానికి అంత రుచి వస్తుంది.

🌷 *శ్రీ మాత్రే నమః🌷*

Home

Comments

Please follow, Like, Comment and share

101 గ్రామ దేవతల పేర్లు

స్త్రీ కి పర్యాయ పదాలు ఎన్నో తెలుసా?

శని జయంతి 15.5.2018

Homam హోమాలు ఎన్ని రకములు వాటి వివరములు

సంస్కారాలు - ముహూర్తములు

Paka shastram పాక శాస్త్ర వివరణ. భోజనం విధులు

108 శక్తి పీఠాలు:

శనీశ్వరుడు గురించి తెలుసుకుందాం, శని భాదల నుండి విముక్తులం అవుదాం

తిరువణ్ణామలై ( అరుణాచలం )

ఎవరు ఏ రుద్రాక్ష ధరించాలి?