Posts

Showing posts from August, 2020

Remedy for wealth and hapiness

Image
 🙏🙏🙏🙏🙏 ఐశ్వ‌ర్యం, ఆనందం కోసం ఏం చేయాలి? 1. ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలను చేసి నది నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడూ నగదును ఇబ్బందులు కలుగవు. త్వరలోనే ఆర్థిక స‌మ‌స్య‌లు తీరిపోతాయి. 2. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా ఉంచుతారో వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి. 3. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను, పంచదారను, కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని కులదేవతకు నైవేద్యంగా ఉంచి అన్నదానాన్ని చేస్తారో వారికి అన్ని రకాల రోగాలు నయం అవుతాయి. 4. తెల్ల అన్నం, శనగపప్పు వేసి పాయసం చేసి మీ ఇంటి దేవునికి నైవేద్యం పెట్టి పాయసాన్ని దానం చేస్తే మీ ఇంట్లో అందరూ ప్రేమ, అభిమానాలను కలిగి ఉంటారు. చాల వరకు శాంతి లభిస్తుంది. మనస్సులో ఉండే భయం, భీతి, బెదిరింపులన్నీ తొలగిపోతాయి. 5. తెల్ల అన్నానికి నల్లని నువ్వులు కలిపి శ్రీ శనైశ్చరునికి నైవేద్యం పెట్టి నువ్వులను కాకులను పెడితే మీకు ఉన్న పితృదేవతల శాపాలన్నీ తొలగిపోతాయి. 6. అన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టి దాన్ని పశువులు తినేందుకు ప్రసాదాన్ని ఇచ్చి, అవివాహితకు తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే మీకు రావలసిన నగదు త్వరగా వచ్

Deepam yela pettali

Image
  🕯️✳️ఇంట్లో దీపం పెట్టెటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి? 🕯️✳️  ✳️ దీపం తేజస్ తత్వానికి ప్రతీక. రోజు రెండు సార్లు, ఉదయం సూర్యోదయానికి ముందు సంధ్యాకాలంలో, సాయంత్రం సూర్యాస్తమయం సంధ్యాకాలంలో తప్పకుండా దీపారాధన చేయాలి. ✳️ దీపప్రజ్వలన అనకుండా దీపారాధన అనడంలోనే ఒక ప్రత్యేకత ఉంది. దీపాన్ని వెలిగించండని చెప్పలేదు, దీపాన్నీ పూజించండి అన్నారు పెద్దలు. ఎందుకంటే దీపం పరబ్రహ్మస్వరూపం, ఆత్మస్వరూపం. మనలోనూ నిత్యం ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది కనుకనే మనం జీవించి ఉన్నాం. ✳️ దీపంలోనే దేవతలందరూ ఉంటారు. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవీశక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే చాలు దేవతలు వస్తారు. అటువంటి దీపారాధనకు ప్రత్యేక నియమాలు ఏమీలేవు. ✳️ ఉదయం స్నానం చేసిన తరువాత వెలిగించినట్టే, సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి. సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖమూ, కాళ్ళూ, చేతులు, నోరు కడుక్కుని దీపారాధన చేయాలి. మాంసాహారం తిన్నేవారు కూడా ప్రతిసారీ తలంటుస్నానం చేయనవసరంలేదు. మామూలు స్నానం సరిపోతుంది. ✳️ ఇక దీపం వెలిగించి ప్రమిద బంగారం కానీ, వెండిది కానీ, ఇత్తడిది, మట్టిదైనా అయి ఉండాలి. స్టీలు, ఇ

Udyoga samasyalaku pariskaralu

Image
 ఉద్యోగ ప్రాప్తి కొరకు "శ్రీరామ పట్టాభిషేక పారాయణ " ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగంలో ఆటంకాలు ఎదురౌతున్నవారు,  ఉద్యోగంలో ఇబ్బందులు పడుతున్న వారు,  ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూసేవారు, ఉద్యోగంలో గుర్తింపును కోరుకునేవారు,  తమస్ధాయికి తగిన ఉద్యోగం లభించాలని కోరుకునేవారు శ్రీమద్రామాయణము నందలి  శ్రీరామ పట్టాభిషేకం ప్రతిరోజు ఉదయాన్నే 21 సార్లు పఠించాలి. నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితోనఘః | రామః సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ || ప్రహృష్టముదితో లోకస్తుష్టః పుష్టః సుధార్మికః | నిరాయమో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః || న పుత్రమరణం కించిద్ద్రక్ష్యంతి పురుషాః క్వ చిత్ | నార్యశ్చావిధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః || న చాగ్నిజం భయం కించిత్ నాప్సు మజ్జంతి జంతవః | న వాతజం భయం కించిత్ నాపి జ్వరకృతం తథా || న చాపి క్షుద్భయం తత్ర న తస్కరభయం తథా | నగరాణి చ రాష్ట్రాణి ధన ధాన్యయుతాని చ || నిత్యం ప్రముదితాస్సర్వే యథా కృతయుగే తథా | అశ్వమేధశతైరిష్ట్వా తథా బహుసువర్ణకైః || గవాం కోట్యయుతం దత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి | అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః || రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి ర

Ganapathi Types

Image
 🕉️🐘🕉️🐘🕉️🐘🕉️🐘🕉️🐘🕉️🐘🕉️🐘🕉️🐘🕉️🐘 *🐘🕉108 రూపాలలోని  శ్రీ గణపతి🕉️🐘* "ఓం గం గణపతియేనమః" 1. ఏకాక్షర గణపతి.💐  ప్రాతర్భజామ్య్భయదం ఖలు భక్త శోకదావానలం గణ్విభుంవర  కుంజరాస్యమ్ అజ్ఞాన కానన వినాశన హవ్యవాహం ఉత్సాహ వర్ధనమహం సుతమీశ్వరస్య! 2. మహా గణపతి.💐 భిభ్రాణోబ్జక బీజాపూరక కదా దంతేక్షు బాణైస్సమం భిభ్రాణో మణికుంభశాలి కణిశం పాశంచ వక్ర్తాంచితం గౌరంగ్యారుచి రారవిందయుతయా దేవ్యాసనాధాంతిక: శోణాంగ శ్శుభమాతనోతుభవతాం నిత్యం గణేశో  మహాన్  3. బాల గణపతి.💐 కరస్ధ కదళీచూత పనసేక్షు కపిత్ధకం బాలసూర్యప్రభందేవం వందే బాలగణాధిపం 4. తరుణ గణపతి.💐 పాశాంకుశాపూస కపిత్ధ జంబూ ఫలం తిలాం చేక్షు మపిసవ హసై: ధత్తే సదాయ స్తరుణారుణాంభ: పాయాత్సయుష్మాన్ తరుణో గణేశ: 5. విఘ్నరాజ గణపతి.💐 విఘ్నరాజావతారశ్చ శేషవాహన ఉచ్చతే  మమతాసుర సంహర్తా విష్ణు బ్రహ్మేతివాచక: 6. సిద్ది గణపతి.💐 ఏకదంతం చతుర్హస్తం పాశాంకుశ ధారిణమ్ అభయంచవరదం హసైర్ద దానమూషకధ్వజమ్ 7. బుద్ధి గణపతి.💐 త్రయీమయాఖిలం బుద్ధిధాత్రే బుద్ధి ప్రదీపాయ సురాధిపాయ | నిత్యాయ సత్యాయచ నిత్యబుద్ధే నిత్యం నిరీహాయ నమోస్తు నిత్యమ్ ||  8. లక్ష్మీ గణపతి.💐 బిభ్రాణశ్శ

Durga Stotram

  ............................................ *దుర్గా దుర్గార్తి శమనీ దుర్గాపద్వినివారిణీ* *దుర్గమచ్ఛేదినీ దుర్గసాధినీ దుర్గనాశినీ* *ఓం దుర్గతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా* *ఓం దుర్గమజ్ఞానదా దుర్గ దైత్య లోక దవానలా* *ఓం దుర్గ మాదుర్గమాలోకా దుర్గమాత్మ స్వరూపిణీ* *ఓం దుర్గమార్గప్రదా దుర్గమవిద్యా దుర్గమాశ్రితా* *ఓం దుర్గమ జ్ఞాన సంస్థానా దుర్గమ ధ్యాన భాసినీ* *ఓం దుర్గ మోహాదుర్గ మాదుర్గమార్ధ స్వరూపిణీ* *ఓం దుర్గ మాసుర సంహంర్త్రీ దుర్గమాయుధధారిణీ* *ఓం దుర్గమాంగీ దుర్గమాతా దుర్గమాదుర్గమేశ్వరీ* *ఓం దుర్గభీమా దుర్గభామా దుర్లభా దుర్గ దారిణీ* *నామావళి మిమాం యస్తు దుర్గాయా మమ మానవః* *పఠేత్సర్వ భయాన్ముక్తో భవిష్యతి నసంశయః*  ...................................... *ఎవరైనా అమితమైన కష్టాలను*  *అనుభవిస్తున్నారనుకున్న వారికి ఈ స్తోత్రాన్ని ఇవ్వగలరు.* *ఈ శ్లోకం చాలా శక్తిమంతమయిన శ్లోకం.  దుర్గాదేవికి సంభందించిన 32 నామాలు ఇందులో ఉన్నాయి .  ఈ శ్లోకం దుర్గాసప్తసతి లో కనిపిస్తుంది . ఈ శ్లోకాన్ని ఎవరు  రోజూ చదువుతారో వారు అన్ని భయాలనుంచీ కష్ఠాలనుంచీ  విముక్తులవుతారు.*

Manchi Vishayalu

  *ఉత్తమ విషయాలు*. పిల్లలకు పుట్టు వెంట్రుకలు ‘9 ‘ వ నెలలో కాని, ’11 ‘వ నెలలో కాని, ‘3 ‘వ సంవత్సరంలో కాని తీయవలెను. పిల్లలకు అన్నప్రాసన ఆడ పిల్లలకు ‘5 ‘ వ నెలలో,  మగ పిల్లలకు ‘6 ‘ వ నెలలో అన్న ప్రాసన చేయాలి.  6 నెల 6వ రోజున ఇద్దరికీ పనికివస్తుంది.  *పంచామృతం, పంచగవ్యములు* ఆవు పాలు,ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, వీటిని పంచామృతం అని,ఆవు పాలు,ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రము, వీటిని పంచగవ్యములు అంటారు. *ద్వారం  ప్రాముఖ్యం* ద్వారానికి పైనున్న కమ్మి లక్ష్మి స్వరూపము, అందుకే దానికి మామిడి తోరణం కడతారు.  క్రింద కమ్మి పవిత్రమైనది, కనుక దానికి పసుపు రాస్తారు. శాస్ర పరంగా చెప్పాలంటే గడప కు పసుపు రాయడం వల్ల క్రిమి కీటకాలు, విష పురుగులు ఇంట్లోకి రాకుండా. తీర్థాన్ని మూడుసార్లు తీసుకుంటారు. ఎందుకు. తొలితీర్థము శరీర శుద్ధికి,శుచికి… రెండవ తీర్ధం ధర్మ,న్యాయ ప్రవర్తనకు … మూడవ తీర్ధం పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదము కొరకు. *తీర్థ మంత్రం* అకాల మ్రుత్యుహరణం సర్వవ్యాది నివారణం సమస్త పాప శమనం విశ్నుపాదోధకం శుభం . *స్నానము ఎలా చేయ వలెను* నది లో ప్రవహమునకు ఎదురుగ పురుషులు,  వాలుగ స్త్రీలు చేయ

Rushi Panchami - Sapta Rushulu

 #ఋషి_పంచమి: భాద్రపద శుద్ధ పంచమి ని  #ఋషి_పంచమి: గా వ్యవహరిస్తారు... ఈ రోజున అత్రి,  కశ్యప, భరద్వాజ, గౌతమ, వశిష్ట, జమదగ్ని,  విశ్వామిత్ర  మహర్షుల గురించి ఒక్కసారైనా తలచుకోవాలని చెబుతారు పెద్దలు. అరణ్యవాసం లో సీతారాములకు అభయమిచ్చిన వాడు అత్రి మహర్షి... సాక్షాత్తూ శ్రీహరినే పుత్రునిగా పొందిన మహానుభావుడు.    సీతారాములకు చిత్రకూటానికి దారి చూపినవాడు భరద్వాజ మహర్షి.  తన భార్య అహల్య ద్వారా రామునికి తన తప:ఫలాన్ని అందింపజేసిన మహారుషి గౌతముడు. రాముని గురువు విశ్వామిత్రుడు. కుల గురువు వశిష్టుడు విష్ణువు అంశావతారమైన పరశురాముని కన్న తండ్రి  జమదగ్ని మహర్షి. దశావతారాల్లో ఒకటైన వామనుడి జనకుడు కశ్యప మహర్షి. #ఋషి_పంచమి నాడు రామాయణం చదివితే ఈ మహర్షులందరినీ తలుచుకున్నట్టే.  #ఋషి_పంచమి వైశిష్ట్యం: ఋషి పంచమి వ్రతము ను స్త్రీలు తప్పక ఆచరించాలి . వినాయక చవితి మరుసటి రోజు వచ్చే పంచమిని " #ఋషి_పంచమి " అంటారు . సప్త ఋషులు ఆరోజు తూర్పున ఉదయిస్తారు . బ్రహ్మ విద్య నేర్వవలసిన రోజు . సప్తఋషుల కిరణాలు ఈ రోజు సాధకులపై ప్రసరిస్తాయి . . .  గనుక బ్రాహ్మీ ముహూర్తముననే లేచి ధ్యానం చేసుకోవాలి . సప్తఋషులే గాయత్రీ మ