Manchi Vishayalu

 


*ఉత్తమ విషయాలు*.


పిల్లలకు పుట్టు వెంట్రుకలు ‘9 ‘ వ నెలలో కాని, ’11 ‘వ నెలలో కాని, ‘3 ‘వ సంవత్సరంలో కాని తీయవలెను.


పిల్లలకు అన్నప్రాసన ఆడ పిల్లలకు ‘5 ‘ వ నెలలో, 

మగ పిల్లలకు ‘6 ‘ వ నెలలో అన్న ప్రాసన చేయాలి. 

6 నెల 6వ రోజున ఇద్దరికీ పనికివస్తుంది.


 *పంచామృతం, పంచగవ్యములు*


ఆవు పాలు,ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, వీటిని పంచామృతం అని,ఆవు పాలు,ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రము, వీటిని పంచగవ్యములు అంటారు.


*ద్వారం  ప్రాముఖ్యం*


ద్వారానికి పైనున్న కమ్మి లక్ష్మి స్వరూపము, అందుకే దానికి మామిడి తోరణం కడతారు. 

క్రింద కమ్మి పవిత్రమైనది, కనుక దానికి పసుపు రాస్తారు. శాస్ర పరంగా చెప్పాలంటే గడప కు పసుపు రాయడం వల్ల క్రిమి కీటకాలు, విష పురుగులు ఇంట్లోకి రాకుండా.


తీర్థాన్ని మూడుసార్లు తీసుకుంటారు. ఎందుకు.


తొలితీర్థము శరీర శుద్ధికి,శుచికి…

రెండవ తీర్ధం ధర్మ,న్యాయ ప్రవర్తనకు …

మూడవ తీర్ధం పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదము కొరకు.


*తీర్థ మంత్రం*

అకాల మ్రుత్యుహరణం సర్వవ్యాది నివారణం

సమస్త పాప శమనం విశ్నుపాదోధకం శుభం .


*స్నానము ఎలా చేయ వలెను*


నది లో ప్రవహమునకు ఎదురుగ పురుషులు, 

వాలుగ స్త్రీలు చేయవలెను.

చన్నీటి స్నానము శిరస్సు తడుపుకొని, 

వేడి నీటి స్నానము పాదములు తడుపుకొని ప్రారంబించ వలెను.

స్నానము చేయునపుడు దేహమును పై నుండి క్రిందకు రుద్దు కొనిన కామేచ్చ పెరుగును. అడ్డముగా రుద్దుకొనిన కామేచ్చ నశించును.

సముద్ర స్నానము చేయునపుడు బయట మట్టి ని లోపలి వేయవలెను. నదులలో,కాలువలు,చెరువులలో చేయునపుడు లోపల మట్టిని ముమ్మారు బయట వేయవలెను.


*ఏ ప్రదేశాల్లో జపం చేస్తే ఎంత ఫలితము.*

గృహంలో ఎంత చేస్తే అంత ఫలితం ఉంటుంది. 

నది ప్రాంతంలో చేస్తే రెట్టింపు ఫలితం వస్తుంది. 

గోశాలలో చేస్తే వంద రెట్లు, 

యాగశాలలో అంతకు మించి ఫలితం వస్తుంది. 

పుణ్య ప్రదేశాల్లో,దేవాతా సన్నిదిలోను చేస్తే పదివేల రెట్లు వస్తుంది. 

శివసన్నిదిలో చేస్తే మహోన్నతమైన ఫలం వస్తుంది. 

పులి తోలు మీద కుర్చుని జపిస్తే మోక్షం కలుగుతుంది. అలాగే వెదురు తడక మీద కుర్చుని జపం చేస్తే దరిద్రం ఆవహిస్తుంది.

రాతి మీద కుర్చుని జపిస్తే రోగాలు వస్తాయి. 

నేల మీద కూర్చొని చేస్తే దుఖము, 

గడ్డి మీద చేస్తే కీర్తి నాశనం అవుతుంది.


పూజగది తూర్పు ముఖంలో ఉండాలి.

తూర్పునకు అధిపతి ఇంద్రుడు, ఉత్తరానికి అధిపతి కుబేరుడు. అందుకే పూజగది తూర్పుముఖంగా కాని, ఉత్తరముఖం గా కాని ఉండాలని అంటారు. దక్షిణానికి అధిపతి యముడు. అందుకే దక్షిణ ముఖం గా ఉండకూడదని అంటారు.


ఏ ఏ సమయాల్లో ఏ దేవుణ్ణి పూజించాలి.

సూర్య భగవానుని 4.30 నుంచి ఆరులోగా పూజించాలి. ఈ సమయంలో పూజ శ్రీ రామునికి, శ్రీ వెంకటేశ్వరునికి కూడా ప్రీతీ. 

ఆరు నుంచి ఏడున్నర వరకు మహాశివుడ్ని, దుర్గను పూజించిన మంచి ఫలము కలుగును. 

మధ్యాహ్నము పన్నెండు గంటలప్పుడు శ్రీ ఆంజనేయ స్వామిని పూజించిన హనుమ కృపకు మరింత పాత్రులగుదురు. 

రాహువునకు సాయంత్రము మూడు గంటలకు పూజించిన మంచి ఫలితము కలుగుతుంది. 

సాయంత్రం ఆరు గంటల సమయాన అనగా సూర్యాస్తమయమున శివపూజకు దివ్యమైన వేళ.

రాత్రి ఆరు నుంచి తొమ్మిది వరకు లక్ష్మీదేవిని పూజించిన ఆమె కరుణ కటాక్షములు ఎక్కువగా ఉంటాయి. తెల్లవారు జామున మూడు గంటలకు శ్రీమహా విష్ణువును పూజిస్తే వైకుంటవాసుడి దయ అపారంగా ప్రసరిస్తుంది.( ఇది నిబంధన మాత్రం కాదు. సమయానుకూలంగా కూడా మీ ఇష్ట దైవమును పూజించవచ్చు 


ఈశాన్యాన దేవుణ్ణి  పెట్టే  వీలులేకపోతే.

మారిన జీవన పరిణామాల దృష్ట్యా, ఉద్యోగ నిర్వహణ లవల్ల ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తుంది. అలాంటప్పుడు దేవుణ్ణి ఈశాన్యాన పెట్టుకునే అవకాశం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు దేవుడు పశ్చిమాన్ని చూసేలా ఏర్పాటు చేసుకోవాలి.

Comments

Please follow, Like, Comment and share

స్త్రీ కి పర్యాయ పదాలు ఎన్నో తెలుసా?

101 గ్రామ దేవతల పేర్లు

Homam హోమాలు ఎన్ని రకములు వాటి వివరములు

Paka shastram పాక శాస్త్ర వివరణ. భోజనం విధులు

పితృ తర్పణము --విధానము

God photos జీర్ణమైన దేవుని చిత్ర పటాలు ఏమి చేయాలి

సంస్కారాలు - ముహూర్తములు

తద్దినాలు పెట్టడము అవసరమా

శని జయంతి 15.5.2018

Rushi Panchami - Sapta Rushulu