Paka shastram పాక శాస్త్ర వివరణ. భోజనం విధులు
** మనం నిత్యం భోజనం చేసేటపుడు., కొన్ని అలవాట్లు మనకే తెలియక అలవాటుగా చేస్తూ వుంటాము. అవి అలవాట్లు కాదట. మన యొక్క నైజo అనగా మన గుణ గణాల ప్రతిబింబాలని పాక శాస్త్రం చెబుతూoది. చూద్దాము. మనము, మన గుణాలు ఎంత వరకు సరిపోతాయో, మనకు మనమే గమనించు కోవాలి. అలాగే ఎదుటి వారిని మనము అంచనా వేసు కోవచ్చు. భోజనం చేసేటపుడు, మన ఆహారం ఎలా తీసు కొంతున్నామో చూడండి. ఇతరుల లో గమనించండి. వారి నడవడికను, గుణ గణాలు తెలుకోనండి. *ఎవరైతే* :----- 1. చేతి వ్రేళ్ళు కలపక, విడివిగా ఆహారం తింటూ వ్రేళ్ళ మధ్య జార విడుస్తుంటారో వారి వద్ద డబ్బు నిలవదట. 2. అన్నాన్ని పిసికి పిసికి తినే వారి భార్య అతని వల్ల జీవితాంతం భాధ పడుతుందట. అతని మనస్సు క్రూరము, దయా దాక్షిణ్యాలు లేనివాడట. అలాంటి వాడికి మన ఆడకూతురును ఇవ్వ కూడదట. 3. చేతి వ్రేళ్ళకు, తినేది విడి విడి గా అతుక్కుని వుంటే వాడు దరిద్రుడట. 4. ఎవరైతే వ్రేళ్ళు మొత్తం నోట్లో పెట్టుకొని జుర్రుకుంటూ తింటారో, వారి వద్ద డబ్బు నిలవదట. పైపెచ్చు బహు పిసినారులట. 5. తినునపుడు, ఎవరైతే అరచేతిని నాకుతూ తిoటాడో, వాడు మిత్రద్రోహి, నమ్మక ద్రోహం చేసే గుణము