Thamalapaku lo dagunna health secrets
తమలపాకులో దాగున్న హెల్త్ సీక్రెట్స్
తమలపాకులతో భారతీయులకు విడదీయరాని అనుబంధం ఉంది. ఆధ్యాత్మిక విషయాలను పక్కన పెడితే, తాంబూల సేవనం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. తమలపాకు, తాంబూలం.. పూజలకు మాత్రమే వాడతారని మనందరికీ తెలుసు. కానీ తమలపాకు ఔషధంగా కూడా పనిచేస్తుంది. ఎముకల దృఢత్వానికి తోడ్పడే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఏ, సిలు తమలపాకులో పుష్కలంగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నిత్య జీవితంలో తమలపాకును ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకుందాం..
🌿 జలుబు చేసి చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్న సమయంలో తమలపాకును వేడిచేసి, దానిపై కొద్దిగా ఆముదాన్ని రాసి ఛాతిపై వేసి కడితే ఫలితం ఉంటుంది.
🌿 తమలపాకులోని చెవికాల్ అనే పదార్థం హానికారక బ్యాక్టీరియా పెరుగుదలను కట్టడి చేస్తుంది. ఇందులో ఉండే ఎస్సెన్షియల్ ఆయిల్ ఫంగస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంది.
🌿 తమలపాకు యాంటాక్సిడెంట్‌గా పనిచేస్తుంది. దీని వల్ల వృద్ధాప్యపు చాయలు కనిపించవు.
🌿 చెవుల మీద తమలపాకులను వేసి కట్టుకుంటే తలలో చేరిన వాతం శాంతించి తల నొప్పి తగ్గుతుంది. తమలపాకు రసాన్ని ముక్కులో డ్రాప్స్‌గా వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.
🌿 అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. జీర్ణవ్యవస్థకు ఆకుకూరలు ఎలా మేలు చేస్తాయో తమలపాకులు కూడా అంతే మేలు చేస్తుంది.
🌿 అధిక బరువుతో సతమతమయ్యే వారు రెండు నెలలపాటు రోజూ ఒక తమలపాకు, పది గ్రాముల మిరియాలు కలిపి తిపి, వెంటనే చన్నీళ్లు తాగితే ఫలితం ఉంటుంది.
🌿 పరిశోధనలు ప్రకారం ఇందులో యాంటీ డయాబెటిక్ గుణాలు, షుగర్ వ్యాధుగ్రస్తుల చికిత్సకు చాలా ఉపయోగకరంగా ఉపయోగపడుతాయి.
🌿 వైరల్ ఇన్‌ఫెక్షన్ ఎక్కువగా ఉండి గొంతు పూడుకుపోతే తమలపాకు రసం తీసుకుంటే కంఠం పెగులుతుంది. మాట స్పష్టతను సంతరించుకోవడమే కాకుండా కఫం తెగి వెలుపలకు వచ్చేస్తుంది.
🌿 తమలపాకులను వేడిచేసి వాపు, నొప్పి కలిగిన కీలు మీద కడితే నొప్పి తగ్గుతుంది.
Comments
Post a Comment