Grahanam - Darbhalu గ్రహణం-దర్భలు


దర్భల మీద 1982-83 ప్రాంతంలొ భారతదేశంలొ సూర్య గ్రహణం రోజున పరిశొధన జరిగింది.గరిక గడ్డి జాతికి చెందినది.అది నిటారుగా పైకి నిలబడి,సూర్యరశ్మి ద్వారా మొత్తం సూర్యశక్తిని గ్రహించి తనలొ దాచి ఉంచుకుంటుంది.అతినీలలొహిత కిరణాలను,గ్రహణ సమయంలొ భూమికి వచ్చే హానికరమైన కిరణాలను తన శక్తితొ అడ్డుకుంటుందని ఆ పరిశొధన ఫలితాలను అన్ని ప్రధాన దిన పత్రికల్లొ ప్రచురించడం జరిగింది
సూర్య గ్రహణం లేదా చంద్రగ్రహణం సమయంలో గరికను ఆహార పదార్థాల్లో, ధాన్యాల్లో వేసి వుంచడం మనం గమనిస్తుంటాం. అయితే గరికను గ్రహణం సమయంలో ధాన్యాలు, ఆహార పదార్థాలకు చెందిన పాత్రలపై ఎందుకు ఉంచుతారనేది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. గ్రహణం సమయంలో భూమి మీదకు ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాల్లాంటివి ఎక్కువగా ప్రసరించే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో ఈ పని చేయకూడదని, ఆహార పదార్థాలు ముట్టకూడదని పెద్దలు అంటారు. దాదాపు అన్ని ఆలయాలు మూసివేస్తారు. గ్రహణం విడిచాక ఆలయాలన్నీ... గృహాలన్నీ సంప్రోక్షణ చేయడానికి గల కారణాలు కూడా ఆ కిరణాల విషప్రభావాన్ని తొలగిస్తాయి.
ఈ క్రమంలో దర్భలను కూడా ఆహార పదార్థాలు, ధాన్యాల్లో ఉంచుతారు. గరిక అనేది యాంటీ రేడియేషన్ గుణాలు కలిగివున్నది. అందుకే గ్రహణం సమయంలో  మన ఇంట్లోని అన్ని పాత్రలపై, నీటి ట్యాంకులపై వీటిని ఉంచడం వలన రేడియేషన్ ప్రభావాన్ని కొంచెం తప్పించుకోవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇక ఈ గ్రహణ సమయంలో వీలైనంత వరకు బయటకు వెళ్ళకపోతే మంచిది.
గ్రహణ సమయంలో జాగ్రత్తలు
వాతావరణంలో అనేక మార్పులు జరుగుతాయి. అందుకని గర్భిణీస్త్రీలపైఆ కిరణాలు పడకుండా ఉంటే మంచిదని శాస్రాలలో చెప్పడం జరిగింది.  కాని సృష్టితీరులో ప్రతిచర్యకు ప్రతిచర్యకు ఉంటుంది.
ఏది జరిగినాదాని ప్రభావం ఏదో ఒకరూపంలో వెల్లడి అవుతుంది. ఆ కారణంగా సాధారణంగా మంత్ర సాధకులు నిత్యపూజాది కార్యక్రమాలు దేవాలయాలు మూసిశాంత్యోపచరాలు చేసుకోవలసినదని జపతపాదులు చేసుకొమ్మని, సముద్రపు ఆటు పోటులు జాగ్రత్తగా పరిశీలించుకొమ్మని చెప్పడం జరిగింది.
ముఖ్యంగాగర్భిణీ స్త్రీలు వీటి ప్రభావం ఎక్కువై శరీరములో అధిక వేదనలు పడతాయనిదానికోసమే గ్రహణములు చూడరాదని కాస్మోటిక్ రేడియేషన్ తగలకుండా ఉంటుందని శాస్త్రజ్ఞలు పరిశోధన ఫలితాలు తెలియచేస్తున్నాయి.ఇంటిలో గ్రహణం పడుతున్నదని తెలిసినప్పడు ముందుగా దర్భలు ఇంటిలో వేసితరువాత పచ్చళ్ళమీద, ఆహారపద్ధారాల మీద దర్భలను వేయవలయును. సాధారణంగా గ్రహణానికి రెండుగంటల ముందే భోజనము పూర్తి చేయవలెను. గ్రహణం పట్టు, తర్వాత స్నానము, విడుపుస్నానము చెయ్యవలెను.
ఆసమయంలో మంత్ర పునరశ్చరణ చేయుటవలన అధిక ఫలితముల నొసగుననిశాస్త వచనము. భూమి ఎన్నో మార్పులకు లోనౌతుంది. ఎప్పడైనా మార్పులువస్తే దానికి అనుగుణంగా మన శరీరంలోను మన జీవన విధానంలోనుమార్పులు చేసుకోవాలి. అప్పడే ఆరోగ్యం బాగుంటుంది .సూర్య, చంద్రులు ఆరోగ్యకారకులు అన్నది ఆరోగ్య జ్యోతిషసూక్తిగా చెప్పకోవాలి. గ్రహణ సమయాలలో మనం వాటి కనుగుణంగా మార్పులు చేసుకుని మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి.
గ్రహణ సమయంలో దర్భలను ఆహారపదార్థలపైనే వేయవలసిన అవసరం
ఉన్నది. దర్భలు గరిక జాతిలో సన్నటి ఆకులు. వాటి చివళ్ళ చాలా పదునుగా సూదంటు గా ఉంటాయి. దర్భలను పుష్యమి నక్షత్ర యుక్త ఆదివారం నాడుకొయ్యాలి.
ఆ విధంగా చేసినటైతే ఆ దర్భలు రేడియేషన్ను తొలగిస్తాయి. గ్రహణ సమయాలలో ఉత్పత్తిఅయ్యే ఫలితాన్ని అల్త్రావైలెట్ కిరణాల ప్రభావాన్నిఅవి నిరోధిస్తాయి. ఆ కారణంగా నీటిలో గాని పచ్చళ్ళపైగాని వేసినటైతేఅవి బూజు పటతీరికుండా ఉంటాయని ఎన్విరాన్మెంట్ బయాలజీ విభాగంవారు పరిశోధించి తెలిపిన విషయం.
అందువల్ల దర్భలను పచ్చళ్ళవీుదనీళ్ళలో దర్భలను వేస్తారు. గ్రహణ సమయంలో ఆహారం తీసుకుంటే ఆహారంజీర్ణం కాదు. వాతావరణ మార్పులే దీనికి కారణం.ఈ గ్రహణాల వల్ల గర్భస్థ శిశువులకు హాని జరుగుతుందని భావిస్తారు. గ్రహణం రోజున బయట తిరిగితే అరిష్టమని స్త్రీలు ప్రగాఢంగా నమ్ముతారు. అందుకే కడుపుతో ఉన్నవారిని ఇంట్లోనే ఉంచుతారు. గ్రహణం ఉన్నంతసేపు వీరిని బయటికి రానివ్వరు. నిద్రపోనివ్వరు. ఇంట్లోనే మెల్లిగా నడవమని చెబుతుంటారు. గర్భం ధరించిన స్త్రీలు గ్రహణ సమయంలో ఇంటికే పరిమితమవ్వడం మంచిదని, అంతేగాక తమ నివాస గృహాలలో ఆ సమయంలో సూర్యుడి ఛాయలు పడకుండా జాగ్రత్తపడాలని వారంటున్నారు. గ్రహణ సమయంలో ప్రసరించే అతినీలలోహిత కిరణాలు గర్భిణీ స్త్రీలపై తీవ్ర ప్రభావం చూపుతాయని పండితులు హెచ్చరించారు. గ్రహణం ఏర్పడటానికి మూడు గంటల ముందు, ఏర్పడిన అనంతరం మరో మూడు గంటల వరకు పసి పిల్లలు, వృద్ధులు ఎలాంటి ఆహారం తీసుకోకూడదని, యుక్తవయస్కులు మాత్రం గ్రహణ సమయానికి 12 గంటల ముందు ఆహారాన్ని తీసుకోవాలి

Comments

Please follow, Like, Comment and share

స్త్రీ కి పర్యాయ పదాలు ఎన్నో తెలుసా?

101 గ్రామ దేవతల పేర్లు

Paka shastram పాక శాస్త్ర వివరణ. భోజనం విధులు

Homam హోమాలు ఎన్ని రకములు వాటి వివరములు

ద్రాక్షారామం దగ్గర నక్షత్ర దేవాలయాలు

108 శక్తి పీఠాలు:

ఎవరు ఏ రుద్రాక్ష ధరించాలి?

హోమము వలన కలుగు లాభములు

108 Temples around Draksharamam

శని జయంతి 15.5.2018