Posts

హైందవ సనాతన సంస్కృతిలోని ముఖ్యమైన సమాచారం

మన హైందవ సనాతన సంస్కృతిలోని ముఖ్యమైన సమాచారం ఈ తరం పిల్లలకు అందబాటులో. నేర్పించండి. చదివించండి. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 లింగాలు3         పుం, స్త్రీ, నపుంసక          వాచకాలు 3.       మహద్వా, మహతీ, అమహత్తు.         పురుషలు 3.     ప్రథమ, మధ్యమ, ఉత్తమ.         దిక్కులు4       తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం           మూలలు4.          ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం              వేదాలు4.                 ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అదర్వణ వేదం             ఉపవేదాలు 4.               ధనుర్వేద, ఆయుర్వేద, గంధర్వ, శిల్ప.            పురుషార్ధాలు 4. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు.             చతురాశ్రమాలు 4. బ్రహ్మ చర్యం, గార్హస్య్ద, వానప్రస్ధం, సన్యాసం.             పంచభూతాలు 5. గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని.              పంచేంద్రియాలు 5. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం.                భాషా భాగాలు 5. నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ, అవ్యయం.                లలిత కళలు 5. కవిత్వం, చిత్రలేఖనం, నాట్యం, సంగీతం, శిల్పం.               పంచకావ్యాలు 5. ఆ

ఏవి దానం చేస్తే ఏమి లాబం కలుగుతుంది

1. బియ్యాన్ని దానం చేస్తే - పాపాలు తొలుగుతాయి. 2. వె౦డిని దానం చేస్తే - మనశ్మా౦తి కలుగుతుంది. 3.  బ౦గారం దానం చేస్తే - దోషలు తొలుగుతాయి. 4. ప౦డ్లను దానం చేస్తే - బుద్ధి. సిద్ధి కలుగుతాయి. 5. పెరుగు దానం చేస్తే - ఇ౦ద్రియ నిగ్రహ౦కలుగుతుంది. 6. నెయ్యి దానం చేస్తే - రోగాలు పోతాయి. ఆరోగ్య౦గా ఉ౦టారు. 7. పాలు దానం చేస్తే - నిద్ర లేమిఉండదు. 8. తేనె దానం చేస్తే - స౦తానంకలుగుతుంది. 9. ఊసిరి కాయలు దానం చేస్తే - మతిమరుపు పోయి, జ్ఞాపకశక్తీ పెరుగుతు౦ది. 10. టె౦కాయ దానం చేస్తే - అనుకున్న కార్య౦సిద్ధిస్తు౦ది. 11. దీపాలు దానం చేస్తే - క౦టి చూపు మెరుగు పడుతుంది. 12. గోదానం చేస్తే - ఋణ విముక్తులౌతారు ఋషుల ఆశీస్సులు లభిస్తాయి. 13. భూమిని దానం చేస్తే - బ్రహ్మలోకదర్శనం లభిస్తుంది 14. వస్త్రదానం చేస్తే - ఆయుష్షు పెరుగుతు౦ది. 15. అన్న దానం చేస్తే - పెదరికంపోయి, ధనవృద్ధి కలుగుతుంది పైవన్నీమన వేదాల్లో చెప్పినవే.. వీటి‌లో మీకు సాధ్యపడేది ఒక్కటైన చేయ్యమని అర్థం. చేసే సహాయం చిన్నదైనా సరే మనస్తూర్తిగా, శ్రద్ధగా చేస్తే ఫలితం అధికంగా కలదు.

మహభారత యుద్ధం పై ఆసక్తికరమైన విశ్లేషణ

మహాభారత యుద్ధంలో అస్త్రాలన్నీ మిస్సైల్సే మహాభారతయుద్ధంలో పాల్గొన్న సైన్యం సంఖ్య 18 రోజులు జరిగిన మహాభారత యుద్ధంలో మొత్తం 18 అక్షౌహిణిల సైన్యం పాల్గొంది. అసలు అక్షౌహిణి అంటే ఎంత?ఒక రథము, ఒక ఏనుగు, మూడు గుర్రాలు, అయిదుగురు కాల్బంబులు (పదాతి దళం) కలిసిన సైన్యానికి ‘పత్తి' అని పేరు. అనగా 1:1:3:5 నిష్పత్తిలో ఉంటుంది సేన. దీనికి మూడు రెట్లయిన సైన్యాన్ని ‘సేనాముఖము' అంటారు. మూడు రథాలు, మూడు ఏనుగులు, తొమ్మిది గుర్రాలు, పదిహేను మంది కాల్బలము ఇందులో ఉంటారు. సేనాముఖానికి మూడు రెట్లును ‘గుల్మము' అంటారు. ఇందులో తొమ్మిది రథాలు, తొమ్మిది ఏనుగులు, 27 గుర్రాలు, 45 మంది కాలిబంట్లు వుంటారు. గుల్మానికి మూడు రెట్లు ‘గణము' ఇందులో 27 రథాలు, 27 ఏనుగులు, 81 గుర్రాలు, 135 మంది కాలిబంట్లుంటారు. గణానికి మూడు రెట్లు ‘వాహిని'. ఇందులో 81 రథాలు, 81 ఏనుగులు, 2432 గుర్రాలు, 405 మంది కాలిబంట్లు వుంటారు.  వాహినికి మూడు రెట్లు ‘పౄతన' అంటే 243 రథాలు, 243 ఏనుగులు, 729 గుర్రాలు, 1215 మంది కాలిబంట్లు. పౄతనకు మూడు రెట్లు ‘చమువు' ఇందులో 729 రథాలు, 729 ఏనుగులు, 2187 గుర్రాలు, 3645 మంది కాలిబంట్లు

లలితాసహస్రనామ స్త్రోత్రం చదివిన లాభం ఏమిటి

Image
లలితా సహస్రనామ స్తోత్రం వ్యాస ప్రోక్తం కాదు. అది సాక్షాత్తు లలితాదేవి యొక్క అనుగ్రహం చేత ఆమె యొక్క ఆజ్ఞ చేత వశిన్యాది దేవతలు పలికితే ఈ స్తోత్రం ప్రచారం లోకి వచ్చింది. ఈ నామాలని ఎవరు అనుసంధానం చేస్తారో ఎవరు ప్రతిరోజు ఈ లలిత సహస్ర స్తోత్రాన్ని చదువుతూ ఉంటారో వారి యందు నాకు ప్రీతీ కలిగి వారికి సంబంధించిన సమస్త యోగక్షేమాలను తానే స్వయంగా విచారణ చేస్తాను అని అమ్మవారు ఆనాడు ప్రతిన పూనింది. కాబట్టి కలియుగంలో మనకి లలిత సహస్రనామం వంటి సహస్రనామ స్తోత్రం లభించడం కేవలం భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం తప్ప అన్యము కాదు. ఇది తల్లి యొక్క పూర్ణానుగ్రహముగా మనకు అందినటువంటి స్తోత్రం. నామము అంటే పేరు. లలితా సహస్రనామ స్తోత్రము అని ఒక మాట అంటున్నాం.....కానీ బాహ్యంలో అది రహస్య నామా స్తోత్రం అనే విషయాన్ని కాసేపు పక్కన పెట్టండి. లలితా సహస్రనామ స్తోత్రం అని అవసరం అవతుందా!!! ఆవిడ పేరు లలిత అయతే ఆవిడని సహస్రము అంటే అనంతము అని పేరు. అనంతము అంటే లెక్కపెట్టలేనన్న్ని. సహస్ర శీర్ష వాదనా సహస్రాక్షీ సహస్రపాత్‌ అంటే ఖచ్చితంగా లెక్కపెట్టడానికి 1000 తలకాయలు ఉన్నది అని కాదు దాని అర్ధం. అనంతమైన తలలు కలిగినది

మీ జంట ఏ రకమైన జంటో తెలుసుకోండి

*🍀ప్ర'పంచ' దంపతులు*🍀 """"""""""""""""""""" ఈ లోకంలో కోట్లాది కోట్ల దంపతులున్నా వాళ్ళంతా 5 విధాలు గానే ఉంటారు. *మొదటిది* *లక్ష్మీనారాయణులు* విష్ణుమూర్తికి లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉంటుంది, వక్షస్థలంలోని హృదయం ఆలోచనలకు కూడలి, అక్కడే లక్ష్మి ఉంటుంది, అంటే ఏభార్య భర్తల హృదయం ఒక్కటై ఆలోచనకూడా ఆ ఇద్దరిదీ ఒకటై ఉంటుందో ఆ జంట లక్ష్మీనారాయణుల జంట *రెండవది*  *గౌరీశంకరులు* అర్థనారీశ్వరరూపం, తలనుంచి కాలిబొటనవ్రేలివరకు నిట్టనిలువునా చెరిసగంగా ఉంటారు, రెండు కలిసిన ఒకే రూపంతో ఉండటం వీరి ప్రత్యేకత,ఆలోచనలకు తల,కార్యనిర్వాహణానికి కాలూ సంకేతం, కాబట్టి భార్యను గొప్పగా చూసుకునే భర్త, బోలాబోలీగా ఉన్న భర్త ఆపదలో ఉంటే రక్షించే భార్య –ఇలా ఉన్నవారు గౌరీశంకరులజంట. *మూడవది* *బ్రహ్మ సరస్వతుల జంట* బ్రహ్మ నాలుక మీద సరస్వతి ఉంటుందంటారు, నాలుకనేది మాటలకు సంకేతం, దాని అర్థం ఇద్దరి మాట ఒకటే అవుతుందని ఇలా ఏ మాట మాట్లాడినా, ఆ భార్య మాటే మాట్లాడే భర్త, ఆభర్త మాటే మాట్లాడే భార్య ..ఏ జంట ఇలా

రేపటి నుండి నిజ జ్యేష్టమాసం ప్రారంభం

Image
రేపటి నుండి నిజ జ్యేష్టమాసం ప్రారంభం చాంద్రమానం ప్రకారం జ్యేష్ఠమాసం మూడవ నెల. ఈ మాసంలోని పూర్ణిమనాడు చంద్రుడు జ్యేష్ఠానక్షత్రంలో సంచరిస్తూ ఉండడం వల్ల దీనికి జ్యేష్ఠమాసం అని పేరు ఏర్పడింది. ఈ మాసం అత్యంత ఫలప్రదమైంది. మహా విష్ణువుకు వైశాఖ మాసం ప్రీతిపాత్రమైనట్లు ఈ మాసం బ్రహ్మదేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. బ్రహ్మదేవుడికి ప్రీతిపాత్రమైన ఈ మాసంలో ప్రతిరోజూ బ్రహ్మదేవుడిని పూజించాలని శాస్త్రవచనం. ఈ మాసంలో శుక్లపక్ష పాడ్యమి మొదలు దశమి వరకు అంటే తొలి పదిరోజులూ కాశీలోని దశాశ్వమేధఘాట్ లో బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకుని గంగానదిలో స్నానం చేయడంతో పాటు గంగానదిని పూజించాలి. అందుకు వీలుకాని వారు సమీపంలోని నది గానీ, లేదా ఇంటిలో గానీ గంగానదిని స్మరిస్తూ స్నానం చేయాలి. జ్యేష్ఠమాసంలో త్రివిక్రముని ప్రీతి కొరకు నీటి కుంభమును, నీరు, విసనకర్రను, చందనమును దానం చేయాలి.🙏🙏🙏👍🌹 నిర్జల ఏకాదశి నాడు నీరు తాగకూడదట! ఏంటిది అనుకుంటున్నారా?అయితే ఈ కథనం చదవండి. ఈ నెల (జులై 9 సోమవారం) నిర్జల ఏకాదశి వస్తోంది. ఈ నిర్జల ఏకాదశి గురించి తెలుసుకుందామా. ధర్మరాజు ఒకరోజు 'నిర్జల ఏకాదశి

ఇంట్లో పాడైపోయిన దేవుడు చిత్ర పటాలు ఏంచేయాలి ?

ఇంట్లో పాడైపోయిన విరిగిపోయిన లేదా జీర్ణమైన విగ్రహాలు / చిత్ర పటాలు (photos) ఏంచేయాలి ?.. ఈ సమస్య మరియు ప్రశ్న  అందరికీ ఉండేదే...చాలా మంది తమ ఇంట్లో పాడైపోయిన విగ్రహాలు, పటాలు   ఏ దేవాలయంలోనో లేదా రోడ్డుప్రక్కన చెట్టు క్రిందో వదిలేసి వెళ్లిపోతుంటారు. కానీ తెలిసి తెలియక అలా చేయడం మహాపాపం.  క్షమించరాని నేరం.    ఇంట్లో వున్నంతకాలం పూజలు చేసి తరువాత అవసరం లేదని లేదా పాడైపోయాని  వాటిని ఏ చెట్టు🌳 క్రిందో లేదా ఏ రోడ్డు పక్కన పడవేయకండి. అలా రోడ్డు పక్కన ఉన్న మన "హిందూ దేవుళ్ళ" ఫోటోలు చూసి ఇతర మతస్తులు మన మతం గురించి చాలా అవహేళన చేస్తున్నారు. వారికీ ఆ అవకాశం ఇవ్వకండి.  ఇతర మతస్థుల దేవుళ్ళ ఫోటోలు అంత దయనీయంగా మనం ఎక్కడన్నా చూస్తామా మీరే ఆలోచించండి. దయచేసి మనకు అవసరం లేని  పటాలను ప్రవహిస్తున్న నది🌊లో గాని మన ఊరి చెరువుల్లో గాని "నిమజ్జనం"  చేయండి. అయితే అగ్నిలో వేయాలనుకున్న నదిలో వదలానుకున్నా ముందుగా ఆ విగ్రహానికి 🙏నమస్కరించి '' గచ్చ గచ్చ సుర శ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర ''  అని వదిలేయండి. ఇది కూడా నిమజ్జనం అని తెలుసుకోండి. దీనిని గురించి మీ మిత్రులకూ 🗣సమాచ