రేపటి నుండి నిజ జ్యేష్టమాసం ప్రారంభం
రేపటి నుండి నిజ జ్యేష్టమాసం ప్రారంభం చాంద్రమానం ప్రకారం జ్యేష్ఠమాసం మూడవ నెల. ఈ మాసంలోని పూర్ణిమనాడు చంద్రుడు జ్యేష్ఠానక్షత్రంలో సంచరిస్తూ ఉండడం వల్ల దీనికి జ్యేష్ఠమాసం అని పేరు ఏర్పడింది. ఈ మాసం అత్యంత ఫలప్రదమైంది. మహా విష్ణువుకు వైశాఖ మాసం ప్రీతిపాత్రమైనట్లు ఈ మాసం బ్రహ్మదేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. బ్రహ్మదేవుడికి ప్రీతిపాత్రమైన ఈ మాసంలో ప్రతిరోజూ బ్రహ్మదేవుడిని పూజించాలని శాస్త్రవచనం.
ఈ మాసంలో శుక్లపక్ష పాడ్యమి మొదలు దశమి వరకు అంటే తొలి పదిరోజులూ కాశీలోని దశాశ్వమేధఘాట్ లో బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకుని గంగానదిలో స్నానం చేయడంతో పాటు గంగానదిని పూజించాలి. అందుకు వీలుకాని వారు సమీపంలోని నది గానీ, లేదా ఇంటిలో గానీ గంగానదిని స్మరిస్తూ స్నానం చేయాలి.
జ్యేష్ఠమాసంలో త్రివిక్రముని ప్రీతి కొరకు నీటి కుంభమును, నీరు, విసనకర్రను, చందనమును దానం చేయాలి.🙏🙏🙏👍🌹
నిర్జల ఏకాదశి నాడు నీరు తాగకూడదట! ఏంటిది అనుకుంటున్నారా?అయితే ఈ కథనం చదవండి. ఈ నెల (జులై 9 సోమవారం) నిర్జల ఏకాదశి వస్తోంది. ఈ నిర్జల ఏకాదశి గురించి తెలుసుకుందామా. ధర్మరాజు ఒకరోజు 'నిర్జల ఏకాదశి' గురించి తెలియజేయాల్సిందిగా వ్యాస మహర్షిని కోరాడు.
వ్యాసుడు.. *_జేష్ఠ మాసంలోని రెండు పక్షాలలోని ఏకాదశినాడు భోజనం చేయకు, ద్వాదశినాడు స్నానాదికాలు పూర్తిచేసి బ్రాహ్మణ సంతర్పణ చేసి భోజనం చేయమ'ని చెబుతుండగానే ఈ విషయం వినిన భీముడు 'మా తల్లి కుంతి, అన్న ధర్మరాజు, ద్రౌపది, అర్జునుడు, నకుల, సహదేవులంతా కూడా ఏకాదశి నాడు ఉపవాసం చేస్తారు_*
కానీ నేను మాత్రం ఆకలికి తాళలేక సంవత్సరానికొకమారే ఉపవాసం చేస్తాను. నాకు ఏ వత్రంతో స్వర్గలోక ప్రాప్తి కల్గుతుందో అటువంటి ఏకాదశిని గురించి ఉపదేశించమని ' కోరుతాడు.
వ్యాసులవారు 'ఓ! భీమసేనా! జేష్ఠమాసంలో సూర్యుడు వృషభ రాశి నుండి మిథునరాశిలోకొస్తాడు అప్పుడు శుక్ల పక్షంలోని ఏకాదశి నాడు కేవలం ఆచమనం తప్ప ఇక ఎటువంటి నీటిని (నిర్జల) తాగకుండా ఉండు. తాగావో వ్రత భంగమవుతుంది.
ఏకాదశి సూర్యోదయం నుండి ద్వాదశి సూర్యోదయం వరకు నీటిని త్యాగం చేసి ద్వాదశినాడు స్నానాదికాలు పూర్తిచేసి, బ్రాహ్మణులకు నీటితోపాటు సువర్ణదానం చెయ్యి. తర్వాత జితేంద్రియులైన బ్రాహ్మణులతో కలసి భోజనం చెయ్యి. శ్రీమహావిష్ణువు నాతో ' *ఏ మానవుడు నన్ను తలచి ఏకాదశి వ్రతం చేస్తారో వారు పాపాల నుండి విముక్తులవుతారు*' అని తెలియజేశాడు.
ఏకాదశి వ్రతం చేసిన వారికి స్వర్గం ప్రాప్తిస్తుంది. ఏకాదశి రోజు ఎవరైతే నీటిని కూడా తాగకుండా వుంటారో వారికి ఒక్కొక్క ఏకాదశికి కోటి సువర్ణ ముద్రలు దానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. నిర్జల ఏకాదశినాడు చేసిన స్నానం దానం, జపం, హోమం, మొదలైనవన్నీ అక్షయమవుతాయని పండితులు అంటున్నారు.
*_నిర్జల ఏకాదశి' ని విధి పూర్వకంగా చేసినవారు వైష్ణవపదమును పొందుతారు. నిర్జల ఏకాదశి నాడు అన్నం, వస్త్రం, గోవు, జలం, మంచం, కమండలం, గొడుగు దానం చేయాలి అని వ్యాసుల వారు భీమసేనునికి చెప్పారు._*
*_పూజ ఎలా చేయాలి?_*
సూర్యోదయానికి ముందే లేవాలి
*_పూజకు దీపాలంకరణ, పండ్లు, తులసీ ఆకులను వాడాలి_*
*విష్ణు దేవాలయంలో పూజలు, హోమాలు చేయించే మంచి ఫలితం ఉంటుంది.*
*నీరు సేవించకుండా వ్రతమాచరించాలి*
*పాలు, పెరుగు, నెయ్యి,(లేదా వెన్న) తేనె, చక్కెరతో విష్ణుమూర్తికి అభిషేకం చేయించాలి.*
వస్త్రాలు, ధాన్యాలు, గొడుగులు, చేతి విసనకర్రలు, బంగారం దానం చేయాలి. ఆ రోజు రాత్రి జాగరణ చేసి.. మరుసటి రోజు శుచిగా స్నానమాచరించి ఇతరులకు ఆహారం, దుస్తులు, పండ్లు, పాలు వంటివి దానం చేసి నీరు తాగి ఉపవాసాన్ని ముగించుకోవాలి
*శుభం భూయాత్*
Comments
Post a Comment