హైందవ సనాతన సంస్కృతిలోని ముఖ్యమైన సమాచారం


మన హైందవ సనాతన సంస్కృతిలోని ముఖ్యమైన సమాచారం ఈ తరం పిల్లలకు అందబాటులో. నేర్పించండి. చదివించండి.
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

లింగాలు3
        పుం, స్త్రీ, నపుంసక

         వాచకాలు 3.
      మహద్వా, మహతీ, అమహత్తు.

        పురుషలు 3.
    ప్రథమ, మధ్యమ, ఉత్తమ.

        దిక్కులు4
      తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం

          మూలలు4.
         ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం

             వేదాలు4.
                ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అదర్వణ వేదం

            ఉపవేదాలు 4.
              ధనుర్వేద, ఆయుర్వేద, గంధర్వ, శిల్ప.

           పురుషార్ధాలు 4.
ధర్మ, అర్థ, కామ, మోక్షాలు.

            చతురాశ్రమాలు 4.
బ్రహ్మ చర్యం, గార్హస్య్ద, వానప్రస్ధం, సన్యాసం.

            పంచభూతాలు 5.
గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని.

             పంచేంద్రియాలు 5.
కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం.

               భాషా భాగాలు 5.
నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ, అవ్యయం.

               లలిత కళలు 5.
కవిత్వం, చిత్రలేఖనం, నాట్యం, సంగీతం, శిల్పం.

              పంచకావ్యాలు 5.
ఆముక్తమాల్యద, వసుచరిత్ర, మనుచరిత్ర, పారిజాతాపహరణం, శృంగార నైషధం.

               పంచగంగలు 5.
గంగ, కృష్ణ, గోదావరి, కావేరి, తుంగభద్ర.

               దేవతావృక్షాలు 5.
మందారం, పారిజాతం, కల్పవృక్షం, సంతానం, హరిచందనం.

               పంచోపచారాలు 5.
స్నానం, పూజ, నైవేద్యం, ప్రదక్షిణం, నమస్కారం.

                  పంచాగ్నులు 5.
బడబాగ్ని, జఠరాగ్ని, కష్టాగ్ని, వజ్రాగ్ని, సూర్యాగ్ని.

               పంచామృతాలు 5.
ఆవుపాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, తేనె.

           పంచలోహాలు 5.
బంగారం, వెండి, రాగి, సీసం, తగరం.

               పంచారామాలు 5.
అమరావతి, భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, ద్రాక్షారామం

            ధర్మరాజు అడిగిన ఊళ్ళు 5.
ఇంద్రప్రస్థం, కుశస్థం, వృకస్థలం, వాసంతి, వారణావతం.

                వేదాంగాలు(స్మ్రతులు) 6.
శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పం.

                   షడ్రుచులు 6.
తీపి, పులుపు, చేదు, వగరు, కారం, ఉప్పు.

                   అరిషడ్వర్గాలు(షడ్గుణాలు) 6.
కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం.

                  ఋతువులు 6.
వసంత, గ్రీష్మ, వర్ష, శరద్ఋతువు, హేమంత, శిశిర.

                       షట్చక్రాలు 6.
మూలధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రాలు.

                  షట్చక్రవర్తులు 6.
హరిశ్చంద్రుడు, నలుడు,సగరుడు, పురుకుత్సుడు, పురూరవుడు,  కార్తవీర్యార్జునుడు.

               సప్త ఋషులు 7.
కాశ్యపుడు, గౌతముడు, అత్రి, విశ్వామిత్రుడు, భరద్వాజ, జమదగ్ని, వశిష్ఠుడు.

         తిరుపతి సప్తగిరులు 7.
శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వేంకటాద్రి.

              కులపర్వతాలు 7.
మహేంద్ర, మలయ, సహ్యం, శుక్తిమంతం, గంధమాధనం, వింధ్య, పారియాత్ర.

               సప్త సముద్రాలు 7.
ఇక్షు, జల, క్షీర, లవణ, దది, సూర, సర్పి.

              సప్త వ్యసనాలు 7.
జూదం, మద్యం, దొంగతనం, వేట, వ్యబిచారం, దుబారఖర్చు, కఠినంగా మాట్లాడటం.

                  సప్త నదులు 7.
గంగ, యమునా, సరస్వతి, గోదావరి, సింధు, నర్మద, కావేరి.
                    ఊర్ధ్వలోకాలు 7.
భూ, భువర్ణో, సువర్ణో, తపో, జనో, మహా, సత్య.

                    అదో లోకాలు 7.
అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ.

                   జన్మలు 8.
దేవ, మనుష్య, రాక్షస, పిశాచి, పశు, పక్షి, జలజీవ, కీటక.

                    కర్మలు 8.
స్నానం, సంధ్య, జపం, హోమం, స్వాధ్యాయం, దేవపూజ, ఆతిథ్యం, వైశ్యదేవం.

               అష్టదిగ్గజాలు 8.
ఐరావతం, పుండరీకం, కుముదం, సార్వభౌమం, అంజనం, సుప్రతీకం, వామనం, పుష్పదంతం.

               అష్టదిగ్గజకవులు
నందితిమ్మన, పెద్దన, ధూర్జటి, పింగళి సూరన,      తెనాలిరామకృష్ణ, రామరాజభూషణుడు, అయ్యలరాజురామభద్రుడు, మాదయగారిమల్లన

          శ్రీ కృష్ణుని అష్ట భార్యలు
రుక్మిణి, సత్యభామ, జాంబవతి, మిత్రవింద, భద్ర, సుదంత, కాళింది, లక్షణ.

           అష్ట భాషలు 8.
సంస్కృతం, ప్రాకృత, శౌరసేని, పైశాచి, సూళికోక్తి, అపభ్రంశం, ఆంధ్రము.

            నవధాన్యాలు 9.
గోధుమ, వడ్లు, పెసలు, శనగలు, కందులు, నువ్వులు, మినుములు, ఉలవలు, అలసందలు.

            నవరత్నాలు 9.
ముత్యం, పగడం, గోమేధికం, వజ్రం,కెంపు, నీలం, కనకపుష్యరాగం, పచ్చ (మరకతం), ఎరుపు (వైడూర్యం).

           నవధాతువులు 9.
బంగారం, వెండి, ఇత్తడి, రాగి, ఇనుము, కంచు, సీసం, తగరం, కాంతలోహం.

            నవరసాలు 9.
హాస్యం, శృంగార, కరుణ, శాంత, రౌద్ర, భయానక, బీభత్స, అద్భుత, వీర.

     నవబ్రహ్మలు 9.
మరీచ, భరద్వాజ, అంగీరసుడు, పులస్య్తుడు, పులహుడు, క్రతువు, దక్షుడు, వశిష్ఠుడు, వామదేవుడు.

         నవ చక్రాలు 9.
మూలాధార, స్వాధిష్టాన, నాభి, హృదయ, కంఠ, ఘంటికా, భ్రూవు, గగన, బ్రహ్మ రంధ్రం.

         నవదుర్గలు 9.
శైలపుత్రి, బ్రహ్మ చారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి.

        దశ బలములు 10.
విద్య, స్నేహ, బుద్ధి, ధన, పరివార, సత్య, సామర్ధ్య, జ్ఞాన, దైవ, కులినిత.

          దశ సంస్కారాలు 10.
వివాహం, గర్భాదానం, పుంసవనం , సీమంతం, జాతకకర్మ, నామకరణం, అన్నప్రాశనం, చూడకర్మ, ఉపనయనం, సమవర్తనం.

             దశ  మహాదానాలు 10.
గో, సువర్ణ, రజతం, ధాన్యం, వస్త్ర, నెయ్యి, తిల, సాలగ్రామం, లవణం, బెల్లం.

            అర్జునుడికి గల పేర్లు10.
అర్జునుడు, పార్ధుడు, కిరీటి, శ్వేతవాహనుడు, బీభత్సుడు, జిష్ణుడు, విజయుడు, సవ్యసాచి, ధనుంజయుడు పాల్గుణుడు.

           దశావతారాలు 10.
మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ, బుద్ధ, కల్కి.

       జ్యోతిర్లింగాలు 12.
హిమలయపర్వతం1.కేదారేశ్వరలింగం
కాశీ 1.కాశీవిశ్వేశ్వరుడు
మధ్యప్రదేశ్ 2.మహాకాలేశ్వరలింగం,                  ఓంకారేశ్వరలింగం.
గుజరాత్ 2.సోమనాధలింగం, నాగేశ్వరలింగం.
మహారాష్ట్ర 4.భీమశంకరం, త్ర్యంబకేశ్వరం,    ఘృష్ణేశ్వరం, వైద్యనాదేశ్వరం.
ఆంధ్రప్రదేశ్ 1.మల్లిఖార్జునలింగం (శ్రీశైలం)
తమిళనాడు 1.రామలింగేశ్వరం

         షోడశ మహాదానాలు 16.
గో, భూ, తిల, రత్న, హిరణ్య, విద్య, దాసి, కన్య, శయ్య, గృహ, అగ్రహార, రధ, గజ, అశ్వ, ఛాగ (మేక), మహిషి (దున్నపోతు).

             అష్టాదశవర్ణనలు 18.
నగరం, సముద్రం, ఋతువు, చంద్రోదయం, అర్కోదయం, ఉద్యానము, సలిలక్రీడ, మధుపానం, రతోత్సవం, విప్రలంభం, వివాహం, పుత్రోత్పత్తి, మంత్రము, ద్యూతం, ప్రయాణం, నాయకాభ్యుదయం, శైలము, యుద్ధం.

                అష్టాదశ పురాణాలు 18.
మార్కండేయ, మత్స్య, భవిష్య, భాగవత, బ్రహ్మ, బ్రహ్మవైవర్త, బ్రహ్మాండ, విష్ణు, వాయు, వరాహ, వామన, అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కాంద.

          భారతంలోపర్వాలు 18.
ఆది, సభా, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్ర్తి, శాంతి, అనుశాసన, అశ్వమేధ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థాన, స్వర్గారోహణ.

సంస్కృతరామాయణంలోకాండలు6.
బాల ,అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర ,యుద్ధ. (తెలుగులో7వకాండ ఉత్తర (లవకుశ కథ))

       భాగవతంలోస్కంధాలు12.
రాముని వనవాసం 14సం.
పాండవుల అరణ్యవాసం12సం.అజ్ఞాతవాసం1సం.
శంఖాలు
భీముడు      - పౌండ్రము
విష్ణువు       -పాంచజన్యం
అర్జునుడు -  - దేవదత్తం.

విష్ణుమూర్తి - - ఆయుధాలు           
ధనస్సు - శారంగం,
శంఖం-పాంచజన్యం,
ఖడ్గం- నందకం,
చక్రం - సుదర్శనం.
 విల్లులు
అర్జునుడు   - - గాంఢీవం
శివుడు        - - పినాకం
విష్ణువు        - శారంగం
      వీణలు--పేర్లు
కచ్చపి---సరస్వతి,
మహతి---నారధుడు,
కళావతి---తుంబురుడు.

అష్టదిక్కులు        పాలకులు         ఆయుధాలు
-------------------      - - - - - - - -         - - - - - - - - -
తూర్పు              ఇంద్రుడు           వజ్రాయుధం
పడమర               వరుణుడు          పాశం
ఉత్తర                  కుబేరుడు          ఖడ్గం
దక్షిణం                యముడు          దండం
ఆగ్నేయం            అగ్ని                    శక్తి
నైరుతి                 నిరృతి               కుంతం
వాయువ్యం          వాయువు         ధ్వజం
ఈశాన్యం             ఈశానుడు        త్రిశూలం

మనువులు                   మన్వంతరాలు
------------------         - - - - - - - - - - - -
స్వయంభువు--------    స్వారోచిష
ఉత్తమ   - - - - - - - - -     తామసి
రైతవ    - ---------- - - - -    చాక్షువ
వైవస్వత     - - - - - - -    సవర్ణ
దక్ష సువర్ణ    - - - - - - -  బ్రహ్మ సువర్ణ
ధర్మసవర్ణ   - ----------     రుద్రసవర్ణ
రౌచ్య       ----------------    బౌచ్య
సప్త స్వరాలు
స -   షడ్జమం    - -   (నెమలిక్రేంకారం)
రి    - -   రిషభం    - -    (ఎద్దురంకె)
గ   - -    గాంధర్వం - -   (మేక అరుపు)
మ  - -   మధ్యమ - -    ( క్రౌంచపక్షికూత)
ప - -     పంచమం  - -    (కోయిలకూత)
ద   - -   దైవతం     - -     (గుర్రం సకిలింత)
ని - -     నిషాదం   - -      (ఏనుగు ఘీంకారం)
సప్త ద్వీపాలు
జంబూద్వీపం   - -   అగ్నీంద్రుడు
ప్లక్షద్వీపం         - -    మేధాతిధి
శాల్మలీద్వీపం    - -   వప్రష్మంతుడు
కుశద్వీపం        - -    జ్యోతిష్యంతుడు
క్రౌంచద్వీపం      - -     ద్యుతిమంతుడు
శాకద్వీపం         - -    హవ్యుడు
పుష్కరద్వీపం    - -   సేవకుడు

----------------------------------------------------
తెలుగు వారాలు 7.
ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని.

          ఇంగ్లీషు నెలలు12.
జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్,మే, జూన్,జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్,న వంబర్, డిసెంబర్.

                తెలుగు నెలలు12
చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం.
                 రాశులు 12.
మేషం, వృషభం, మిథునం, కర్కాటకం,
సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం.
                  తిథులు 15.
పాఢ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య /పౌర్ణమి.

                 నక్షత్రాలు 27.
అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రావణం, ధనిష్ఠ, శతభిషం, పూర్వాబాద్ర, ఉత్తరాబాద్ర, రేవతి.

తెలుగు సంవత్సరాల పేర్లు. 60

1.ప్రభవ.-1927, 1987, 2047, 2107
2.విభవ.-1928, 1988, 2048, 2108
3.శుక్ల. - 1929, 1989, 2049, 2109
4.ప్రమోదూత. - 1930, 1990, 2050, 2110
5.ప్రజోత్పత్తి. - 1931, 1991, 2051, 2111
6.అంగీరస. - 1932, 1992, 2052, 2112
7.శ్రీముఖ.-1933, 1993, 2053, 2113
8.భావ. - 1934, 1994, 2054, 2114
9.యువ.  - 1935, 1995, 2055, 2115
10.ధాత.  - 1936, 1996, 2056, 2116
11.ఈశ్వర. - 1937, 1997, 2057, 2117
12.బహుధాన్య.-1938, 1998, 2058, 2118
13.ప్రమాది. - 1939, 1999, 2059, 2119
14.విక్రమ. - 1940, 2000, 2060, 2120
15.వృష.-1941, 2001, 2061, 2121
16.చిత్రభాను. - 1942, 2002, 2062, 2122
17.స్వభాను. - 1943, 2003, 2063, 2123
18.తారణ. - 1944, 2004, 2064, 2124
19.పార్థివ. - 1945, 2005, 2065, 2125
20.వ్యయ.-1946, 2006, 2066, 2126
21.సర్వజిత్తు. - 1947, 2007, 2067, 2127
22.సర్వదారి. - 1948, 2008, 2068, 2128
23.విరోధి. - 1949, 2009, 2069, 2129
24.వికృతి. - 1950, 2010, 2070, 2130
25.ఖర. 1951, 2011, 2071, 2131
26.నందన.1952, 2012, 2072, 2132
27 విజయ.1953, 2013, 2073, 2133,
28.జయ. 1954, 2014, 2074, 2134
29.మన్మద.1955, 2015, 2075 , 2135
30.దుర్మిఖి. 1956, 2016, 2076, 2136
31.హేవళంబి. 1957, 2017, 2077, 2137
32.విళంబి. 1958, 2018, 2078, 2138
33.వికారి.1959, 2019, 2079, 2139
34.శార్వారి. 1960, 2020, 2080, 2140
35.ప్లవ. 1961, 2021, 2081, 2141
36.శుభకృత్. 1962, 2022, 2082, 2142
37.శోభకృత్. 1963, 2023, 2083, 2143
38. క్రోది.1964, 2024, 2084, 2144,
39.విశ్వావసు.1965, 2025, 2085, 2145
40.పరాభవ.1966, 2026, 2086, 2146
41.ప్లవంగ. 1967, 2027, 2087, 2147
42.కీలక. 1968, 2028, 2088, 2148
43.సౌమ్య. 1969, 2029, 2089, 2149
44.సాధారణ . 1970, 2030, 2090, 2150
45.విరోధికృత్. 1971, 2031, 2091, 2151
46.పరీదావి. 1972, 2032, 2092, 2152
47.ప్రమాది. 1973, 2033, 2093, 2153
48.ఆనంద. 1974, 2034, 2094, 2154
49.రాక్షస. 1975, 2035, 2095, 2155
50.నల.1976, 2036, 2096, 2156,
51.పింగళ. 1977, 2037, 2097, 2157
52.కాళయుక్తి. 1978, 2038, 2098, 2158
53.సిద్ధార్ధి. 1979, 2039, 2099, 2159
54.రౌద్రి. 1980, 2040, 2100, 2160
55.దుర్మతి. 1981, 2041, 2101, 2161
56.దుందుభి. 1982, 2042, 2102, 2162
57.రుదిరోద్గారి.1983, 2043, 2103, 2163
58.రక్తాక్షి. 1984, 2044, 2104, 2164
59.క్రోదన.1985, 2045, 2105, 2165
60.అక్షయ.1986, 2046, 2106, 2166.

కులవృత్తులు.
బ్రాహ్మణ,క్షత్రియ, వైశ్య, రజక, మంగలి, వడ్రంగి, కుమ్మరి, కమ్మరి, కంసాలి, సాలెలు, జాలరి, మేదరి, కర్షకుడు, చెప్పులుకట్టేవారు.

జానపద కళలు.
హరికథ, బుర్రకథ, ఒగ్గుకథ, తోలుబొమ్మలాట, బుడబుక్కలాట, కోలాటం, పులివేషం, యక్షగానం, వీధినాటకాలు, డప్పులనృత్యం, గంగిరెద్దులమేళం, కర్రసాము.


Comments

Please follow, Like, Comment and share

స్త్రీ కి పర్యాయ పదాలు ఎన్నో తెలుసా?

101 గ్రామ దేవతల పేర్లు

Paka shastram పాక శాస్త్ర వివరణ. భోజనం విధులు

Homam హోమాలు ఎన్ని రకములు వాటి వివరములు

ద్రాక్షారామం దగ్గర నక్షత్ర దేవాలయాలు

108 శక్తి పీఠాలు:

ఎవరు ఏ రుద్రాక్ష ధరించాలి?

హోమము వలన కలుగు లాభములు

108 Temples around Draksharamam

God photos జీర్ణమైన దేవుని చిత్ర పటాలు ఏమి చేయాలి