Posts

స్వర్గానికి దారి

*స్వర్గారోహణ మార్గం* పాండవులు ఈ మార్గం ద్వారానే స్వర్గానికి చేరుకున్నారని ప్రతీతి. భూమి నుండి స్వర్గానికి చేరుకోవచ్చు అనడానికి ఏకైక మార్గం ఇదే. మన : బద్రీనాథ్ క్షేత్రం నుండి 5 km దూరం లో వుండే చిన్న గ్రామం. భారతదేశంలో ఆఖరి గ్రామం ఇదే. ఇక్కడి నుండే ఒకవైపు టిబెట్ ప్రారంభం అవుతుంది. ఈ గ్రామ చివరన సరస్వతి నది మనకు కన్పించే ప్రాంతం ఉంటుంది. ఇక్కడి నుండి కొంత దూరం ప్రవహించాక అలకనంద నది లో కలిసి అంతర్వాహిని గా ప్రవహిస్తుంది. ఇక్కడే సరస్వతి మాత ఆలయం కుడా ఉంటుంది. ఈ సరస్వతి నది పక్కన  భీమపుల్ అనే ఒక పెద్ద రాతిబండ ఉంటుంది. పాండవులు నదిని దాటడానికి భీముడు ఈ రాతిని ఒక వంతెన గా ఏర్పాటు చేసాడు అంటారు. ఈ రాతిమీద భీముని వేలిముద్రలు వున్నట్లు గా పెద్ద పెద్ద అచ్చులు కుడా వుంటాయి. ఈ వంతెన దాటాక స్వర్గారోహణ మార్గం ప్రారంభం అవుతుంది. మన  నుండి చట్మోలి 8 km:- మార్గ మధ్యమం లో భృగుమహర్షి ఆశ్రమం కన్పిస్తుంది. తరవాత మాతమూర్తి ఆలయం కన్పిస్తుంది. ఈవిడే నరనారాయణుల కన్నతల్లి గా కుడా చెప్తారు. ఈ ప్రాంతం 14000 అడుగుల ఎత్తులో ఉంటుంది. తర్వాత కుబేర్ మకుట్ అనే ప్రాంతం వస్తుంది. ఇక్కడే కుబేర

దయ్యాల ఆలయం

*దెయ్యాలయం* – *దయ్యాల ఆలయం.*                 ఆలయం అన గానే సాధారణంగా మనం,ఏ  దేవుడి ఆలయం అని అడుగుతాము. కానీ యెక్కడైతే దేవుడిని విగ్రహాన్ని ప్రతిష్టించి, ప్రాణ ప్రతిష్ట, ఇత్యాది కార్యములు మంత్ర పూర్వకంగా చేస్తే, అక్కడికి  దేవుడు వచ్చి నివసిస్తూ వుంటాడని, దేవుడు నివసిస్తాడు కాన “దేవాలయం” అని అంటాము. ఆలయం అనగా నివసించు ఒక భవనం.  దేవాలయం అనగా దేవుడు నివసించు భవనం.        మరి దెయ్యాలు నివసించు భవనానికి ఏమని పిలువాలి. దెయ్యాలయం అని అనాలా? నేను పొరపాటు పడలేదoడోయి. నిజమే. ఏవరి ఇంట్లోనో దయ్యం కనిపించిందని, భయపడి ఇల్లు ఖాళీ చేసి ఆ దయ్యనికి వదిలి వెళ్ళి పోయిన ఇంటిని మనం “దయ్యాల కొంప” అని అంటాము. మర్రి చెట్టు పై దయ్యం వుంటే “దయ్యాల మర్రి” అని అంటాము. మరి ఒక ఆలయం ఒకటి కట్టి  దానికి “దయ్యాలాలయం” అని అంటే వింతగా లేదు. చూద్దాం రండి.      ఆంధ్ర కర్నాటక సరిహద్దు వద్ద, హిందూపూర్ (అనంతపురం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్) నుండి       కి,మీ దూరం లో “డొడ్డబళ్లాపూర్” అనే వూరు కర్నాటక రాష్ట్రం నకు చెందినది. ఈ వూరి నుండి దేవనహళ్లి అనే వూరి మార్గం  మద్యలో బొమ్మవర సుందరేశ్వర ఆలయాన్ని దెయ్యాలు నిర్మించినాయి అని చెబు

ఏమీ చేయాలి ఏమీ చేయకూడదు ...?

మనము ఆరాధించే దేవతలే అయినా కొన్ని దేవతా విగ్రహాలు ఇంట్లో ఉంచకూడదు గృహస్థులకు మంచిది కాదు అంటే వాటికి చేయవలసిన విధి విధానం గృహస్థులు చేయలేరు, కొన్ని ఉడటం వల్ల ఏమీ చేసిన చేయక పోయినా ఇంటికి మంచిది అవి ఏంటో చూద్దాము.. 1. పూజ గది విడిగా లేని వారు పంచముఖ హనుమంతుడి ని పెట్టకూడదు ఫోటో కానీ విగ్రహం గాని ఏది పూజ గది విడిగా లేని వారు ఉంచకూడదు. 2. సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు,ఆయనే ప్రత్యేకంగా కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించాలి. 3.ఉగ్ర రూపంలో ఉన్న నరసింహ స్వామి ఫోటో గాని విగ్రహం కానీ ఉంచకూడదు, లక్ష్మీ నరసింహ, యోగ నరసింహ, లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహ స్వామి ఫోటో పెట్టికొని పూజ చేయవచ్చు.. 4.చైతిలో ఫ్లూట్ ఉన్న కృష్ణుడు విగ్రహం ఇంట్లో ఉండకూడదు, కృష్ణుడి విగ్రహం అవుతో ఉన్న ఫొటో గాని చిన్న పరిమాణంలో విగ్రహం కానీ ఉండవచ్చు... 5.గవ్వలు ఎందుకు పెట్టాలి పూజ గదిలో అని అడిగారు, మొదటిది చాలామంది బాగా పూజ చేసే వారు పూజ చేయలేక పోతుంటారు, అసలు కళకళ లాడే పూజ గది దుమ్ము కొట్టేస్తున్న పూజ చేయనీయదు, అలాంటి దిష్టి పూజ గదిలోకి ప్రవేశించదు గవ్వలు ఉంటే, సముద్రపు గవ్వలకు ఆ శక్తి ఉంది గవ్వలు లక్ష్మీ ద

పెళ్లికానివారు దర్శించవలసిన క్షేత్రం

🌼🌿 తిరుప్పరంకుండం.. తమిళనాడు..! సుబ్రమణ్యస్వామి..! పెళ్లి కావడం లేదు అని మదనపడే వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఎన్ని చోట్ల ఎన్ని పూజలు చేసినా, వ్రతాలు చేసినా ఆ వచ్చే శుభవార్తకై కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు ఆ తల్లితండ్రులు. ఇందుకు శారీరక మానసిక బాధలు కారణం. ఇలాంటి వారు తమిళనాడులోని ఒక చోటుకు వెళితే వెంటనే పెళ్లి అవుతుందని చెబుతారు. అంతే కాకుండా ఇక్కడ వివాహం చేసుకున్న వారికి కలిగే సంతానం ఆరోగ్య వంతంగా, బుద్ధిశాలులుగా ఉంటారని నమ్ముతారు. . మధురైకు 9 కిలోమీటర్ల దూరంలో..తిరుప్పరంకుండ్రం తమిళనాడులో గల మదురై మీనాక్షి అమ్మవారి దేవాలయానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో రెండవది తిరుప్పరంకుండ్రం. ఈ క్షేత్రములో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇంద్రుని కుమార్తె అయిన దేవయాని (దేవసేనా) అమ్మతో కళ్యాణం జరిగింది. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఒక్క క్షేత్రంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారు కూర్చుని దర్శనమిస్తారు. మిగతా అన్నిచోట్ల స్వామి నిలబడిన మూర్తినే చూస్తాం ఈ క్షేత్రమునకు సంబంధించిన పురాణము ఈ విధముగా ఉంది. మన బుజ్జి సుబ్రహ్

రంగులు మారే శివలింగం ధర్శించారా?

Image
ఉదయం ఎరుపు, మధ్యాహ్నం నలుపు, సాయంత్రం తెలుపు రంగులోకి మారుతున్న శివలింగం దర్శించారా???  మైసూర్ జిల్లా లో కావేరి నది ఒడ్డున తలకాడు ప్రదేశం కలదు. బెంగళూరుకు దగ్గరలోని తలకాడులోగల పంచముఖేశ్వర స్వామి ఆలయం పేరుకు ఒకటే కానీ, ఐదు ఆలయాలున్నాయి. అయిదూ శివాలయాలే. తలకాడు చాలా చిన్న గ్రామం. అయినప్పటికీ పంచముఖ ఆలయాల కారణంగా ప్రసిద్ధికెక్కింది.వీకెండ్ ట్రిప్ లకై బెంగళూరు నుండి వచ్చేవారికి ఈ ప్రదేశం తప్పక నచ్చుతుంది. బెంగళూరు నుండి 140 కి. మీ ల దూరంలో, మైసూర్ నుండి 50 కి. మీ ల దూరంలో తలకాడు ఉంది. మీరు తలకాడు లో ప్రవేశించగానే అక్కడ ప్రవహించే కావేరి నది, చుట్టూ ఉన్న మట్టిని గమనిస్తే నదీ తీరమా ? లేక బీచా ? అని అనిపిస్తుంది. తలకాడు ఐదు ప్రఖ్యాత శివాలయాలకు ప్రసిద్ధి చెందినది. అవి వైద్యనాధేశ్వర, పాతాళేశ్వర, మరుళేశ్వర, అరకేశ్వర మరియు మల్లిఖార్జుల దేవాలయాలు. బాధాకరమైన విషయం ఏమిటంటే, ప్రతి సంవత్సరం కొద్ది కొద్దిగా ఇవి ఇసుకలోకి కూరుకుపోతున్నాయి. ఈ ప్రాంతంలోనే చెప్పుకోదగ్గ మరో ఆలయం - విష్ణు భగవానుడి ఆలయం. దీనిని స్థానికులు 'కీర్తినాధేశ్వర' ఆలయం పేరుతో పిలుస్తారు. ఈ రోజు మనం పాతాళేశ్వర ఆలయం విశేషాల

పూజలోని అంతరార్థాలు

           🌷🌺🌷🌺🌷🌺🌷🌺        🍄 *1. గంటలు* దేవాలయాల్లో పూజ సమయంలో గంటలు వాయిస్తారు. దీనివల్ల రెండు విధాల ప్రయోజనం ఉంది. ఒకటి-బయటి ప్రపంచంలో శబ్దాలు లోపలికి ప్రవేశించకుండా చేయడం, రెండవది-మనస్సును దేవుని మీదికి ఏకాగ్రంగా మళ్లించడంలో తోడ్పడుతుంది.        🍄 *2. దీప హారతి* దీపాన్ని వెలిగించి దేవుని విగ్రహం ముందు తిప్పడం. దీనిలోని అంతరార్థం ఏమిటంటే దైవాన్ని జ్యోతి స్వరూపంగా భావించడం. దైవమే కాంతి. ఆ సమయంలో భక్తుల భావన ఈ విధంగా ఉంటుంది. ” స్వామీ! నీవే ఈ విశ్వంలో స్వయం ప్రభవమైన జ్యోతివి. సూర్యుడు, చంద్రుడు అన్నీ వీటిలోని తేజస్సు. కాంతివి నీవే. నీ దివ్య కాంతిచే మాలోని చీకటిని తొలగించి, మా బుద్ధిని ప్రభావితం చేయి” అని.         🍄*3. ధూపం* భగవంతుని ముందు పరిమళాలు వెదజల్లే అగరువత్తులను వెలిగిస్తాము. వాటి సువాసనలు అన్ని దిక్కులా వ్యాపిస్తాయి. వీటి ధూపం క్రిమిసంహారిణిగా కూడా పనిచేస్తుంది. భగవంతుడు సర్వవ్యాపి. విశ్వమంతా నిండియున్నాడు అన్న భావన అందరిలో కలుగుతుంది. ఈ విషయం అక్కడ ఉన్న వారందరికీ మాటి మాటికీ జ్ఞప్తి చేసినట్లవుతుంది.         🍄*4. కర్పూర హారతి* వ్యక్తిగతమైన అహంకా

పసుపు గురించి తెలుసుకుందాం

పసుపును ప్రసాదంగా ఇంటికి తీసుకొస్తే ఏం చేయాలి.....? పసుపుని సంస్కృతంలో హరిద్ర అని అంటారు. పసుపును అన్ని శుభకార్యాల్లో ఉపయోగిస్తారు. శాస్త్రాల్లో పేర్కొన్న కొన్ని ముఖ్య వస్తువులు ఎవరి నుంచి అయినా పొందవచ్చు. వాటికి మైల ఉండదు. అవేమిటంటే... 1. పసుపు, 2. కుంకుమ, 3. పూలు, 4. పళ్లు, 5. తమలపాకు, 6. వక్క, 7. పాలు, 8. పెరుగు, 9. నేయి, 10. తేనె, 11. కూరగాయలు, 12. తులసి, 13. గంధం అరగదీసే సానరాయి, 14. గంధం చెక్క వీటిలో పసుపుకు మొదటి స్థానం కల్పించబడింది. అలానే సుమంగళులకు తాంబూలం లేదా ఆకు, వక్క ఇచ్చే సమయంలో మొదట పసుపు ఇచ్చి తరువాత కుంకుమ ఇస్తారు. పసుపు సౌభాగ్యానికి చిహ్నం. ఈ కారణం చేతనే సుమంగుళులు తన భర్తకు శుభం కోరుతూ మాంగల్యానికి పసుపును ఉంచి నమస్కరిస్తారు. దేవీ ఆలయాల్లో, నవరాత్రి పూజా సమయంలో దేవికి పసుపుతో చేసే అలంకారాలు ముఖ్యమైనవి. గోదాదేవి లేదా ఆండాళ్ అమ్మవారి దేవాలయానికి మీరు వెళ్లినప్పుడు మీకు పసుపు ప్రసాదాన్ని అందిస్తే మీరు ఏం చేస్తారు? పసుపును ఇంటికి తీసుకు వచ్చి వంటల్లో లేదా స్నానం చేసేందుకు ఉపయోగిస్తారు. అయితే ఇకపై అలా చేయవద్దు. ప్రసాదంగా పసుపును పొంది ఇంటికి తీసుకు వచ్చినప్పుడు చ