పసుపు గురించి తెలుసుకుందాం

పసుపును ప్రసాదంగా ఇంటికి తీసుకొస్తే ఏం చేయాలి.....?
పసుపుని సంస్కృతంలో హరిద్ర అని అంటారు. పసుపును అన్ని శుభకార్యాల్లో ఉపయోగిస్తారు. శాస్త్రాల్లో పేర్కొన్న కొన్ని ముఖ్య వస్తువులు ఎవరి నుంచి అయినా పొందవచ్చు. వాటికి మైల ఉండదు. అవేమిటంటే...
1. పసుపు, 2. కుంకుమ, 3. పూలు, 4. పళ్లు, 5. తమలపాకు, 6. వక్క, 7. పాలు, 8. పెరుగు, 9. నేయి, 10. తేనె, 11. కూరగాయలు, 12. తులసి, 13. గంధం అరగదీసే సానరాయి, 14. గంధం చెక్క
వీటిలో పసుపుకు మొదటి స్థానం కల్పించబడింది. అలానే సుమంగళులకు తాంబూలం లేదా ఆకు, వక్క ఇచ్చే సమయంలో మొదట పసుపు ఇచ్చి తరువాత కుంకుమ ఇస్తారు.
పసుపు సౌభాగ్యానికి చిహ్నం. ఈ కారణం చేతనే సుమంగుళులు తన భర్తకు శుభం కోరుతూ మాంగల్యానికి పసుపును ఉంచి నమస్కరిస్తారు.
దేవీ ఆలయాల్లో, నవరాత్రి పూజా సమయంలో దేవికి పసుపుతో చేసే అలంకారాలు ముఖ్యమైనవి. గోదాదేవి లేదా ఆండాళ్ అమ్మవారి దేవాలయానికి మీరు వెళ్లినప్పుడు మీకు పసుపు ప్రసాదాన్ని అందిస్తే మీరు ఏం చేస్తారు?
పసుపును ఇంటికి తీసుకు వచ్చి వంటల్లో లేదా స్నానం చేసేందుకు ఉపయోగిస్తారు. అయితే ఇకపై అలా చేయవద్దు.
ప్రసాదంగా పసుపును పొంది ఇంటికి తీసుకు వచ్చినప్పుడు చేయాల్సిన విధాన క్రమం:
1. దేవుని ప్రసాదమైన పసుపును ప్రతి దినం పూజాస్థానంలో ఉంచి పూజిస్తే ఇంటికి, ఇంట్లో ఉన్నవారికి అన్ని విధాలా ధన, కనక, వస్తు, వాహనాలు వృద్ధి చెందుతాయి.
2. పసుపును నీటిలో వేసి స్నానం చేస్తే దేహ కాంతి పెరుగుతుంది. సమస్త చర్మరోగాలు నయం అవుతాయి. పసుపును నీటిలో వేసి చేసే స్నానాన్ని మంగళ స్నానం అని పిలుస్తారు.
3. పసుపుతో గౌరీదేవిని చేసి పూజించటం ద్వారా ఇంట్లో ఉండే వధువుకు ఉన్న వివాహ దోషాలు తొలగిపోయి, త్వరలో వివాహం నిశ్చయమవుతుంది.
4. దేవికి పసుపు రంగు చీరను ఇస్తే ఇంట్లో ఉండే దోషం మరియు దైవ దోషాలు తొలగిపోతాయి.
5. దుకాణాల్లో చాల రోజులుగా అమ్ముడు కాకుండా మిగిలి ఉండే వస్తువులపై కొద్దిగా పసుపు పొడిని చల్లితే వెంటనే వ్యాపారమవుతుంది.
6. పసుపు నీటితో ఇంటిని కడిగితే ఆ ఇంటికి ఆ ఇంటివారికి డబ్బుకు సమస్య రాదు, అప్పుల బాధ తొలగిపోతుంది.
7. కామెర్లు ఉన్నవారి ఇంటి వారు పసుపును దానంగా ఇస్తే కామెర్ల రోగం తొలగిపోతుంది.
8. ప్రతి సంవత్సరం కామెర్లు వచ్చేవారు సుమంగుళులకు పసుపు రంగు చీర తాంబూలాలను దానంగా ఇస్తే కామెర్ల సమస్య తలెత్తదు.
9. గృహదేవతను పసుపు నీటితో కడిగితే విగ్రహాలకు దైవ కళ పెరుగుతుంది.
10. వ్యాపారం జరుగని దుకాణాల్లో శంఖాన్ని పసుపు రంగు కాగితంలో చుట్టి దానిని గల్లాపెట్టెలో ఉంచితే వ్యాపారం బాగా అవుతుంది.
By
Ch. Shyam sunder Sastry.

Comments

Please follow, Like, Comment and share

101 గ్రామ దేవతల పేర్లు

Homam హోమాలు ఎన్ని రకములు వాటి వివరములు

స్త్రీ కి పర్యాయ పదాలు ఎన్నో తెలుసా?

Paka shastram పాక శాస్త్ర వివరణ. భోజనం విధులు

108 Temples around Draksharamam

పితృ తర్పణము --విధానము

ఎవరు ఏ రుద్రాక్ష ధరించాలి?

South direction dakshina dikku దక్షిణ దిక్కుకి తిరిగి ఎందుకు నమస్కరించ కూడదు?

Bottu ఏ వేలితో బొట్టు పెట్టుకోవాలి ?

శివుడి పుష్పార్చన ఎలా చేయాలి? ఫలితం ఏమిటి?