సంస్కారాలు - ముహూర్తములు
మానవుడు జన్మించినప్పటి నుంచి మరణించే వరకు సంష్కారమయమే. సంస్కారాల వలన జన్మాంతర దోషాలు కూడా వీడిపోయి మానవ జీవిత లక్ష్యమైన మోక్షప్రాప్తి సిద్ధిస్తుంది. జీవి గర్భంలో పడింది మొదలు అంత్య సంస్కారం వరకు జరిగే సంస్కారాలు లేదా కర్మలు ధర్మశాస్త్రల్లో 40 వరకు చెప్పబడ్డాయి. గౌతమ స్మృతుల్లో 40 సంష్కారాలను, అంగీరస మహర్షి 25, వ్యాసుడు 16 సంష్కారాలను చెప్పారు. మనుస్మృతి ఈ సంస్కారాలను 12 సంస్కారాలుగా చెబుతుంది. వివాహము ఒక సత్రంలో ఇద్దరు వ్యక్తులు ఒక్కటవ్వడమే వివాహము. ముహూర్త వారములు: సోమవారం నిషేధం ఆచారమే కానీ శాస్త్రం కాదు. మంగళవారము నిషేధము. మిగిలిన వారములు గ్రాహ్యమే. నక్షత్రములు: ‘మూల మైత్ర మృగ రోహిణి కరైః పౌష్ణమారుత ఘోత్సరాన్వితైః వీర్య వద్ధిరుడుద్ధిర్ముృగీ దృశాం పాణి పీడన విధిర్విధీయతే’ అని శాస్త్రం. అయితే ధనిష్ఠా, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతీ నక్షత్రముల సమయంలో వివాహం శ్రేష్ఠము అని కొందరు, కాదని కొందరు చెప్పారు. అయితే నాలుగు నక్షత్రములు కూడా ఆచారంలో వున్నవి. అందువలన అశ్వినీ, రోహిణీ, మృగశిర, మఘ, ఉత్తర, హస్త, స్వాతీ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతీ నక్షత్రము