ప్రదోషకాల ప్రాధాన్యత ఏమిటి మరియు ఉపనిషత్తుల వివరాలు

*ప్రదోషకాల ప్రాధాన్యత ఏమిటి*?
🕉🌻🕉🌻🕉🌻🕉🌻🕉🌻🕉
 వందే శంభు ముమాపతి, సురగురుం వందే జగత్కారణమ్
వందే పన్నగభూషణం, మృగధరం, వందే పశూనాం పతిమ్ !

వందే సూర్య శశాంకవహ్ని నయనం, వందే ముకుంద ప్రియమ్
వందే భక్త జనాశ్రయం చ వరదం, వందే శివం శంకరమ్ !!

ప్రదోష కాలం ఎంతో పవిత్రమైన కాలంగా హైందవ పురాణంలో తెలుపబడింది. ప్రదోషకాలం నెలకి రెండుసార్లు వస్తుంది ఆ సమయంలో పరమేశ్వరుడిని పూజిస్తే శివానుగ్రహానికి పాత్రులు అవుతారని వేదపండితులు తెలియజేస్తున్నారు.

 శుక్లపక్షం (అమావాస్య నుండి పౌర్ణమి వరకు 15రోజులు)లో వచ్చే త్రయోదశి రోజు మరియు కృష్ణపక్షంలో (పౌర్ణమి నుండి అమావాస్య వరకు 15రోజులు)లో వచ్చే త్రయోదశి రోజు. సూర్యాస్తమయం నుంచి 2 గంటల 24 నిమిషాల సమయాన్ని ప్రదోషకాలం అని కొందరు, సూర్యాస్తమయం అయ్యాక మూడు గడియలు 'ప్రదోషోరజనీముఖమ్' రాత్రికి ఆరంభ కాలమే ఈ ప్రదోష సమయం అని కొందరు. ప్రదోష సమయం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ప్రదోషం అంటే పాపా నిర్మూలన అని అర్థం.

ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయంలో చంద్రుడి కదలికల వలన ఏర్పడేది ప్రదోషము అంటే చంద్రుడి గతి వలన ఏర్పడే తిథుల సందులలో సూర్యాస్తమయం అయితే, అప్పుడు ప్రదోషం అంటారు. అందుకే ప్రతోరోజూ సూర్యాస్తమయ సమయానికి తిథి మారితే, అప్పుడు ప్రదోషం కలిగే అవకాశం ఉంది. త్రయోదశి రోజున కలిగే ప్రదోషాన్ని 'మహా ప్రదోషం' అని అంటారు.

ప్రదోష కాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాలను ప్రదర్శిస్తూ ఉంటాడు. ఎడమ భాగంలో పార్వతి కుడి భాగాన పరమేశ్వర రూపంగా 'అర్థనారీశ్వరుడిగా' దర్శనం ఇచ్చే కాలం ఈ ప్రదోషకాలం అని చెప్పబడింది. పరమశివుడు సదా ప్రదోషకాలంలో నాట్యం చేస్తూ ఉంటాడు. పరమేశ్వరుడు అర్థనారీశ్వరుడిగా దర్శనం ఇవ్వడం ద్వారా ఒకే శరీరంలో రెండు రూపాలను ప్రదర్శిస్తున్నాడు. ప్రదోషకాలంలో ఉమామహేశ్వర స్వరూపాన్ని ధ్యానించాలని మనకు గుర్తు చేసేదే ఈ శ్లోకం ...

శ్లో - సాధారణే స్మరజయే నిటలాక్షి సాధ్యే
భాగీ శివో భజతు నామ యశః సమగ్రమ్ !

వామాంచి మాత్ర కలితే జనని త్వదీయే
కావా ప్రసక్తిరిహ కాలజయే పురారే !!

* త్రయోదశి  రోజున సాయంతం 4:30 నుండి 6:00 గంటలవరకు ప్రదోషకాలం ఉంటుంది. ఈ ప్రదోషకాలంలో పరమేశ్వరుడిని పూజించినట్లయితే                     ఎటువంటి పాపాలు అయినా దహించుకు పోతాయి.

* ప్రదోషకాలంలో శివలింగానికి ఆవుపాలతో అభిషేకం చేసినట్లయితే దీర్ఘాయుష్మంతులు అవుతారు.

* ప్రదోషకాలంలో శివలింగాన్ని ఆవునేయ్యితో అభిషేకం చేస్తే మోక్షం లభిస్తుంది.

* మంచి గంధంతో అభిషేకం చేసినట్లయితే శ్రీమహాలక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది.

త్రయోదశి ఆదివారం రోజు వస్తే రవి ప్రదోషం
 త్రయోదశి సోమవారం వస్తే దాన్ని సోమ ప్రదోషం
 త్రయోదశి మంగళవారం వస్తే భూమ ప్రదోషం
 త్రయోదశి బుధవారం వస్తే బుధ ప్రదోషం
త్రయోదశి గురువారం వస్తే గురు ప్రదోషం
త్రయోదశి శుక్రవారం వస్తే శుక్ర ప్రదోషం
త్రయోదశి శనివారం వస్తే శని త్రయోదశి
శని ప్రదోషం అని పిలుస్తారు.
 అన్ని త్రయోదశులలో కూడా శివపూజ తప్పనిసరి. ప్రదోషకాలం రోజూ వస్తున్నా, త్రయోదశి రోజున వచ్చే ప్రదోష సమయం చాలా పవిత్రమైనది.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🕉🕉🕉🕉🕉🕉

*🌸ఉపనిషత్తులు…*🌸

ఉపనిషత్తులంటే తెలియకపోయినా వేదాంతం అనే మాట ఉపయోగించని తెలుగువారంటూ ఎవరూ ఉండరు. వేదాలను మధించాగ్గా వాటి సారాంశంగా చివరగా పుట్టినవి కాబట్టి ఉపనిషత్తులు వేదాంతాలుగా పేరుపడ్డాయి. ఇవి వైదిక సాహిత్యంలోని చివరి భాగాలు. అన్ని ధర్మాలకూ వేదమే మూలం. వేదసారంగా మహోన్నత మార్గ దర్శకాలుగా వెలుగొందుతున్న జ్ఞానజ్యోతులే ఉపనిషత్తులు.  సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలలాగే ఇవి కూడా వేద విజ్ఞానానికి చివరిగా లభిస్తున్నాయి. అయితే మిగిలిన విభాగాలన్నీ కర్మకాండను గురించి కూడా చెబుతాయి. కానీ ఉపనిషత్తులు మాత్రం పూర్తిగా జ్ఞానకాండకు సంబంధించినవి. అందుకే ఉపనిషత్తులలో బోధించిన విషయాన్ని బ్రహ్మవిద్య అని కూడా అంటారు. బ్రహ్మవిద్య పరావిద్య, అపరావిధ్య అని రెండురకాలుగా ఉంది. జ్ఞానకాండ వల్ల జీవాత్మ, పరమాటం జ్ఞానంతో పాటు మోక్షం, పరబ్రహ్మ స్వరూపం తెలుస్తాయి. ఉపనిషత్ నే పదానికి సమీపంలో ఉండడం అని అర్థం. సత్యాలను తెలుసుకునేందుకు గురువు దగ్గర ఉండడం లేదా ఆత్మ (పరమాత్మ) కు సమీపంలో ఉండడం అనేవి ఈ శబ్దార్ధం వెనుక ఉన్న ఆంతరిక అర్థాలు. ఉపనిషత్తులలో జీవాత్మ, బ్రహ్మముల భావనను సునిశితంగా చర్చిచడం జరిగింది. ఈ చర్చ ఫలితంగా జీవాత్మ-పరమాత్మలు అభిన్నులు అనే అద్వైతం, జీవుడు-బ్రహ్మము వేరువేరు అనే ద్వైత భావాలకు ఆస్కారం కలిగింది. ఈ రెండు సిద్ధాంతాల ఆధారంగానే ప్రస్తుతం హైందవం అని పిలువబడే ధార్మికభావనలోని అనేక దార్శనిక సిద్ధాంతాలు ఆవిర్భవించాయి. అనేకమంది ఆచార్యులు ఉపనిషత్తుల ఆధారంగానే తమ సిద్ధాంతాలను రూపొందించి, ప్రచారంలోకి తీసుకువచ్చారు. శంకరాచార్యుల అద్వైతవాదం, రామానుజుల విశిష్టాద్వైతం, నింబార్కాచార్యుల ద్వైతాద్వైతవాదం, వల్లభును శుద్ధాద్వైతవాదం ఇలా అన్నీ ఉపనిషత్ మూలాలున్నవే.

*🌹ఉపనిషత్తుల సంఖ్య*

వేదాలలాగే ఉపనిషత్తుల సంఖ్య కూడా అసంఖ్యాకం అని కొందరి వాదన. మొదట 1008 ఉపనిషత్తులు ఉన్నట్లూ భావించగా వాటిలో 108 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అన్నింటిలోనూ కలిపి పది ఉపనిషత్తులు ముఖమైనవిగా అధ్యయనం చేస్తారు. ఆదిశంకరాచార్యులు ప్రస్థానత్రయ భాష్యంలో పది ఉపనిషత్తులనే చెప్పారు.

ఈశ కేన కఠ ప్రశ్న ముండా మాండూక్య తిత్తిరిః
ఐతరేయం చ ఛాందోగయం బృహదారణ్యకం తథా

అనే నామసూచికా శ్లోకాధారంగా దశోపనిషత్తుల పేర్లు ఇవి:

1. ఈశోపనిషత్తు
2. కేనోపనిషత్తు
3. కఠొపనిషత్తు
4. ప్రశ్నోపనిషత్తు
5. ముండకోపనిషత్తు
6. మాండూక్యోపనిషత్తు
7. తైత్తిరీయోపనిషత్తు
8. ఐతరీయోపనిషత్తు
9. ఛాందోగ్యోపనిషత్తు
10. బృహదారణ్యకోపనిషత్తు

*🌹ఉపనిషత్తుల కర్తలు*

ఉపనిషత్తులు ఏ ఒక్కరి రచనలో కాదు. ఎందరో ఋషులు వీటి రచనాకార్యాన్ని నిర్వహించారు. యాజ్ఞవల్క్యుడు, ఉద్దాలకుడు, అరుణి, శ్వేతకేతు, శాండిల్య, ఐతరేయ, పిప్పలాడ, సనత్కుమార, గార్గి, మైత్రేయ లాంటి ఎందరెందరో ఉపనిషత్తుల ఆవిర్భావానికి కారణమయ్యారు.

*🌹శైవ వైష్ణవ ఉపనిషత్తులు*

ఈ ఉపనిషత్తులలో కొన్నింటిని శైవులు సొంతం చేసుకోగా, మరికొన్ని ఉపనిషత్తులు వైష్ణవ ఉపనిశాట్టులుగా ప్రసిద్ధికెక్కాయి. అక్షమాలికోపనిషత్తు, అథర్వశిరోపనిషత్తు, అథర్వశిఖోపనిషత్తు, కాలాగ్ని రుద్రోపనిషత్తు, కైవల్యోపనిషత్తు, గణపతి ఉపనిషత్తు, జాబాలోపనిషత్తు, దక్షిణామూర్తి ఉపనిషత్తు, పంచబ్రహ్మోపనిషత్తు, బృహజ్జాబాలోపనిషత్తు, భస్మజాబాలోపనిషత్తు, రుద్రహృదాయోపనిషత్తు, రుద్రాక్షజాబాలోపనిషత్తు, శరభోపనిషత్తు, శ్వేతాశ్వరోపనిషత్తు అనే పదిహేను ఉపనిషత్తులు శైవ ఉపనిషత్తులు.

వైష్ణవులకు సంబంధించిన ఉపనిషత్తులుగా చెప్పుకునే పద్నాలుగు ఉపనిషత్తులు ఉన్నాయి. అవ్యక్తోపనిషత్తు, కలిసంతరణోపనిషత్తు, కృష్ణోపనిషత్తు, గరుడోపనిషత్తు, గోపాలతాపసోపనిషత్తు, తారసోపనిషత్తు, త్రిపాద్విభూతి ఉపనిషత్తు, దత్తత్రేయాపనిషత్తు, రామతాపన ఉపనిషత్తు, రామరహస్యొపనిషత్తు, వాసుదెవ ఉపనిషత్తు, హయగ్రీవ ఉపనిషత్తు. శైవ వైష్ణవ విభాగాలే కాకుండా ఉపనిషత్తులలో మరెన్నో విభాగాలు కనిపిస్తాయి.

*🌹ఏ వేదానికి ఎన్ని?*

ఉపనిషత్తుల వేదాల సారమైన వేదాంతాలు అనుకున్నప్పుడు ఏ వేదానికి ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి అనే సందేహం కలగడం సహజం. ఈ సందేహానికి 108 ఉపనిషత్తుల వర్గీకరణ కొంతవరకూ సమాధానంగా కనిపిస్తుంది. ఈ నూటఎనిమిది ఉపనిషత్తులలో వేదాల వారీ విభజన ఇలా ఉంది. ఋగ్వేదానికి 10 ఉపనిషత్తులు ఉన్నాయి. కృష్ణ యజుర్వేదానికి 32, శుక్ల యజుర్వేదానికి 19 ఉపనిషత్తులు లభిస్తున్నాయి. సామవేదానికి 16, అథర్వణ వేదానికి 31 గా ఉపనిషత్తులు ఉన్నట్లూ కనిపిస్తుంది. ఈ నూట ఎనిమిది ఉపనిషత్తుల నుంచి ముఖ్యమైన పది ఉపనిషత్తులను ప్రధానంగా ఎంచుకున్నారు. వాటికే దశోపనిషత్తులు అని పేరు.

🕉🕉🕉🕉🕉🕉

Comments

Please follow, Like, Comment and share

స్త్రీ కి పర్యాయ పదాలు ఎన్నో తెలుసా?

101 గ్రామ దేవతల పేర్లు

108 శక్తి పీఠాలు:

Paka shastram పాక శాస్త్ర వివరణ. భోజనం విధులు

Homam హోమాలు ఎన్ని రకములు వాటి వివరములు

సంస్కారాలు - ముహూర్తములు

సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు

_*ఉండ్రాళ్ళతద్ది నోము గురించి తెలుసు కుందాం రండి*_

శనీశ్వరుడు గురించి తెలుసుకుందాం, శని భాదల నుండి విముక్తులం అవుదాం

వరలక్ష్మి వ్రతం