Posts

న‌వ‌గ్రహ సంబందిత క్షేత్రాలు మన రాష్ట్రంలో

*💠న‌వ‌గ్రహ సంబందిత క్షేత్రాలు*💠 న‌వ‌గ్రహ సంబందిత క్షేత్రాలను సందర్శించాలనుకునే వారు రాష్ట్రఎల్లలు  దాటి పోవాల్సిన అవసరం లేదు.  రాష్ట్రంలోనే చాలా క్షేత్రాలలో నవగ్రహ పూజలు చేసుకోవచ్చు. అలాంటివి మన రాష్ట్రంలోనే చాలా జిల్లాలలో ఉన్నాయి. వీటన్నింట నవగ్రహపూజలు చేసుకోవచ్చు. సూర్యుడు శ్రీ‌కాకుళం జిల్లా 1.హ‌ర్షవ‌ల్లి సూర్యనారాయ‌ణ స్వామి తూర్పుగోదావ‌రి 2. పెద్దాపురం సూర్యనారాయ‌ణ స్వామి తూర్పగోదావ‌రి 3. గొల్లల‌మామిడాడ సూర్యనాయ‌ణ స్వామి క‌ర్నూలు 4. నందికొట్టూరు సూర్యనారాయ‌ణ స్వామి చంద్రుడు ప‌శ్చిమ గోదావ‌రి 1. గునుగుపూడిలో సోమేశ్వర స్వామి (భీమ‌వ‌రం). తూర్పుగోదావ‌రి 2. కోటే ప‌ల్లి సోమేశ్వర స్వామి కృష్ణ 3. విజ‌య‌వాడ‌లో క‌న‌క‌దుర్గాదేవి, పెద్దక‌ళ్ళే ప‌ల్లెలో దుర్గాదేవి. నెల్లూరు 4. జొన్నవాడ కామాక్షిత‌యారు అమ్మవారు. అంగార‌కుడు కృష్ణ 1. మోపిదేవి సుబ్రమ‌ణ్యస్వామి మ‌రియు చోడ‌వ‌రం తూర్పుగోదావ‌రి 2.బిక్కవోలు సుబ్రమ‌ణ్యస్వామి మ‌రియు పెద్దాపురం గుంటూరు 3.పెద్ద నంది పాడు, నాగుల పాడు పుట్ట, పెద్దకూర‌పాడు పుట్ట, మంగ‌ళ‌గిరి సుబ్రమ‌ణ్య స్వామి, పొన్నూరు. బుధుడు ప‌శ్చిమ గోదావ‌రి 1. ద్వా

జన్మ నక్షత్రం - సరిపడే రుద్రాక్షలు

Image
జన్మ నక్షత్రం - సరిపడే రుద్రాక్షలు         జన్మపత్రిక ననుసరించి ఆయా జన్మ నక్షత్రకులకు సంబంధిత రుద్రాక్షలను ధరించటంవలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ దిగువన జన్మనక్షత్ర పరంగా ధరించవలసిన రుద్రాక్షలు ఇవ్వబడినాయి. జన్మ నక్షత్రం          రాశి అధిపతి          ధరించవలసిన రుద్రాక్ష అశ్వని కేతు 9 ముఖి భరణి కుజుడు 3 ముఖి మరియు 11 ముఖి కృత్తిక రవి 1 ముఖి మరియు 12 ముఖి రోహిణి చంద్రుడు 2 ముఖి మృగశిర కుజుడు 3 ముఖి మరియు 11 ముఖి ఆరుద్ర రాహు 8 ముఖి పునర్వసు గురుడు 5 ముఖి పుష్యమి శని 14 ముఖి ఆస్లెష బుధుడు 4 ముఖి మఖ కేతు 9 ముఖి పూర్వ ఫాల్గుణి శుక్రుడు 6 ముఖి మరియు 9 ముఖి ఉత్తర ఫాల్గుణి రవి 1 ముఖి మరియు 12 ముఖి హస్త చంద్రుడు 2 ముఖి చిత్ర కుజుడు 3 ముఖి మరియు 11 ముఖి స్వాతి రాహు 8 ముఖి విశాఖ గురుడు 5 ముఖి అనురాధ శని 14 ముఖి జ్యేష్ఠ బుధుడు 4 ముఖి మూలా కేతు 9 ముఖి పూర్వాషాఢ శుక్రుడు 6 ముఖి మరియు 9 ముఖి ఉత్తరాషాఢ రవి 1 ముఖి మరియు 12 ముఖి శ్రావణ చంద్రుడు 2 ముఖి ధనిష్ట కుజుడు 3 ముఖి మరియు 11 ముఖి శతభిష రాహు 8 ముఖి పూర్వాభాద్ర గురుడు 5 ముఖి ఉత్తరాభాద్ర శని 14 ముఖి రేవతి బుధుడు 4 ముఖ

హనుమాన్_చట్టీ, బదరీనాథ్, ఉత్తరాఖండ్

Image
#హనుమాన్_చట్టీ, బదరీనాథ్, ఉత్తరాఖండ్ మనందరికీ #మహాభారతంలోని విషయాలు పరిచయమే. అందులోని #అరణ్యపర్వం లోని కథ గుర్తు తెచ్చుకోండి. భీముడు సౌగంధికాకమలాలను ద్రౌపదికోసం  తీసుకునిరావడానికి బయలుదేరతాడు. అలా వెళ్ళినభీముడు గంధమాదనపర్వతం పైన ఉన్న కదళీవనం గుండా వెళుతూ అరటిచెట్లను పెకలించివేస్తూ అక్కడ ఒక సరోవరాన్ని చూస్తాడు. అందులో జలకాలాడి సింహగర్జన చేస్తాడు. ఆ గర్జనను ఆ కదళీవనంలో ఉన్న హనుమంతుడు వింటాడు. విని , భీముడు ఇదే ఊపుతో , బలగర్వితుడై ఉంటే తనకు దేవతలో,యక్షులో, మహర్షులో శాపం పెట్టక మానరు కనుక భీముని కాపాడాలంటే అతనికి గర్వభంగం చేయాలని అనుకుంటాడు. అనుకున్నదే తడవుగా దారికి అడ్డంగా ఒక ముసలివానర రూపంలో పడుకుంటాడు. అటుగా వచ్చిన భీముడు హనుమను చూస్తాడు. భీముడు దారికి అడ్డు తొలగమంటాడు. అపుడు హనుమ నాకు ఓపికలేదని తనని దాటి వెళ్ళమంటాడు. అపుడు భీముడు చక్కని సమాధానమిస్తాడు. నిర్గుణః పరమాత్మా తు దేహం వ్యాప్యావతిష్ఠతే। తమహం జ్ఞానవిజ్ఞేయం నావమన్యే న లంఘయే।। "నిర్గుణుడైన పరమాత్మ ప్రాణులన్నిటి శరీరమున వ్యాపించి ఉన్నాడు. జ్ఞానం ద్వారా మాత్రమే తెలుసుకోగలిగిన అటువంటి భగవానుని నేను దాటి అవమానింపల

రేపు 10/05/2018 హనుమజ్జయంతి.

Image
 రేపు 10/05/2018 హనుమజ్జయంతి. వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రం నాడు వైధృతి యోగం కర్కాటక లగ్నమునందు శనివారం మధ్యాహ్నకాలమున కౌండిన్య గోత్రమున ఆంజనేయావతారం జరిగినది. "ఆంజనేయః పూజిస్తశ్చేత్ పూజితాస్సర్వ దేవతాః" ఆంజనేయుని పూజిస్తే సకల దేవతలనూ పూజించినట్లేనని శాస్త్రోక్తి. ఆంజనేయస్వామి ఆరాధన సర్వ గ్రహదోషాలను తొలగించి అభీష్టసిద్ధిని కలుగజేస్తుంది. ఈ రోజున హనుమంతుని అర్చించిన వారికి సర్వకామనలు తీరుతాయి. హనుమజ్జయంతి జీవితంలో ఒక్కమారు చేసినట్లైతే వంశమంతా తరించిపోతుందన్నారు. జయంతి చేసేరోజు గృహస్థు భోజనం చేయకుండా ఉండకూడదు. ఒకపూట భోజనం చేసి తీరాలి. యతి పురుషులు ఈరోజు భోజనం చేయకూడదు. పూర్ణ ఉపవాసం చేయాలి. హనుమజ్జయంతి చేసే గృహస్థు యొక్క భార్య జీవితంలో ఒక్కహనుమజ్జయంతినాడైనా సరే గురువింద పూసలతో ఉపాసన అని ఒకటున్నది. భర్త పూజ అంతా అయిన పిదప భార్య స్వచ్ఛమైన ఆవునేతిని తీసుకువచ్చి అప్పాలను సాయంకాలం వరకు వేయించాలి. అనగా సాయంకాలం వరకు ఎన్ని చేయగలిగితే అన్ని అని..మాడ్చమని కాదు. ఒకేగోత్రంతో ఉన్న కుటుంబాలలో ఉన్న తోడికోడళ్ళు అందరూ కలిసి హనుమజ్జయంతి చేస్తారు. హనుమ అంత త్వరగా ప్రీతి

కాశీ అన్నపూర్ణే శ్వరీ దేవీ ప్రదక్షిణ మహత్యం

Image
కాశీ అన్నపూర్ణే శ్వరీ దేవీ ప్రదక్షిణ మహత్యం కాశీ మహానగరం ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం. కాశీలో మరణించిన కుక్క కోడా స్వర్గానికే వెళుతుందన్నది నమ్మకం.  కాశీ మహానగరంలో ఉండే అన్నపూర్ణమ్మ తల్లి, విశ్వేశ్వరుడు నమ్మిన భక్తులకు కొంగుబంగారం లాంటివారు. కాశీ నగర మహాత్మ్యాన్ని తెలిపే కథ ఒకటి దేవీభాగవతం పదకొండో స్కంధంలో కనిపిస్తుంది. కాశి నగరంలోని అన్నపూర్ణాదేవి గుడి చుట్టూ చేసిన ప్రదక్షిణల ప్రభావం ఎంత గొప్పదో ఈ కథ సూచిస్తుంది. పూర్వం హిమాలయ పర్వతాల్లో ఒక చక్రవాక పక్షి ఉండేది. అది ప్రతిరోజూ ఉదయాన్నే ఆహారం కోసం తన నివాసాన్ని వదిలి ఆకాశమార్గాన అలా అలా పయనిస్తూ ఎన్నెన్నో దేశాలను దాటుకుంటూ కాశీ నగరానికి వచ్చి చేరేది. అంత దూరం ప్రయాణించి మిట్టమధ్యాహ్న సమయానికి ఆ చక్రవాక పక్షి కాశీలోని అన్నపూర్ణాదేవి మందిరానికి చేరేసరికి దానికి ఆకలి వేస్తుండేది. ఆ ఆకలి తీర్చుకోవటం కోసం అన్నపూర్ణాదేవి మందిరం చుట్టూ పడిఉన్న మెతుకులను ఏరుకొని తింటూ పొట్ట నింపుకొనేది. ఇలా మెతుకులను ఏరి తినేందుకు దానికి తెలియకుండానే అది గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేది.  అలా చాలాకాలం గడిచింది. కాలాంతరంలో ఆ చక్రవాక పక్షి ఆయువు తీరి మ

అయోధ్య గురించి కె.కె.మహ్మద్‌ గారు వ్రాసిన ఆర్టికల్

ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త డా||కరింగమన్ను కుజ్హియిళ్‌ మహమ్మద్‌ (కె.కె.మహ్మద్‌) గారు అయోధ్యపై రాశిన ఓ ఆర్టికల్...తప్పకుండా చదవాల్సిన అంశాలు... డా|| కె.కె.మహ్మద్‌ – ”ఈ అయోద్య విషయాన్ని వివరించ కుండా నా జీవిత కథ పూర్తికాదు. ఇది ఎవరి మత విశ్వాసాలను కించపరచడానికి గాని, వేరొకరి మత విశ్వాసాలను సమర్థించడానికి గాని ఉద్దేశించినది కాదు. అటువంటి ఉద్దేశాలతో గాని, అటువంటి ప్రయోజనాలకు గాని దీనిని ఏవిధంగానూ ఉపయోగించకూడదు. 1990లో అయోధ్య సమస్య తీవ్రంగా మారింది. కాని అంతకుముందే 1978లోనే ఒక పురావస్తు శాస్త్ర విద్యార్థిగా అయోధ్యను పరిశీలించడానికి నాకు అవకాశం దొరికింది. దిల్లీలోని పురావస్తు శాస్త్ర పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడు, అయోధ్య వద్ద విస్తృత పరిశీలన (సర్వే) జరుపుతున్న ప్రొఫెసర్‌ బి.బి.లాల్‌ నేతృత్వంలోని బృందంలో నేనొక సభ్యునిగా ఉన్నాను. అంతకు ముందే ఉనికిలో ఉన్న దేవాలయ స్తంభాలను ఆధారంగా కనుగొన్నాము. ఆ రోజుల్లో ఇటువంటి ఆవిష్కరణను ఎవరూ వివాదాస్పదంగా చూడలేదు. చారిత్రక భావనతో పురాతత్వ శాస్త్ర నిపుణులుగా వాస్తవాలను మేము పరిశీలించాం. బాబ్రి మసీదు గోడలపై పొందుపరచిన ఆలయ స్తంభాలున్నాయి. ఈ స్తంభాలు నల

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ వసంతోత్సవాలు

Image
తిరుపతి శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వసంతోత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు.  శ్రీ భూ సమేత వేంకటేశ్వరస్వామి, శ్రీసీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి, రుక్మిణి, సత్యభామ సమేత శ్రీక ష్ణుని ఉత్సవమూర్తులను వసంత మండపంలో వేంచేసి ఉన్న ఆస్థానం పై నిర్వహించారు.  ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం వైభవంగా జరిగింది. ఇందులో పంచద్రవ్యాలైన పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు.  ఆలయం వెలుపల గల మండపంలో ఊంజల్‌ సేవ జరిగింది.  స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన మిచ్చారు. *ఓం...నమో...వేంకటేశాయా...*