రేపు 10/05/2018 హనుమజ్జయంతి.

 రేపు 10/05/2018 హనుమజ్జయంతి.





వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రం నాడు వైధృతి యోగం కర్కాటక లగ్నమునందు శనివారం మధ్యాహ్నకాలమున కౌండిన్య గోత్రమున ఆంజనేయావతారం జరిగినది.
"ఆంజనేయః పూజిస్తశ్చేత్ పూజితాస్సర్వ దేవతాః"
ఆంజనేయుని పూజిస్తే సకల దేవతలనూ పూజించినట్లేనని శాస్త్రోక్తి. ఆంజనేయస్వామి ఆరాధన సర్వ గ్రహదోషాలను తొలగించి అభీష్టసిద్ధిని కలుగజేస్తుంది.
ఈ రోజున హనుమంతుని అర్చించిన వారికి సర్వకామనలు తీరుతాయి.

హనుమజ్జయంతి జీవితంలో ఒక్కమారు చేసినట్లైతే వంశమంతా తరించిపోతుందన్నారు. జయంతి చేసేరోజు గృహస్థు భోజనం చేయకుండా ఉండకూడదు. ఒకపూట భోజనం చేసి తీరాలి. యతి పురుషులు ఈరోజు భోజనం చేయకూడదు. పూర్ణ ఉపవాసం చేయాలి. హనుమజ్జయంతి చేసే గృహస్థు యొక్క భార్య జీవితంలో ఒక్కహనుమజ్జయంతినాడైనా సరే గురువింద పూసలతో ఉపాసన అని ఒకటున్నది. భర్త పూజ అంతా అయిన పిదప భార్య స్వచ్ఛమైన ఆవునేతిని తీసుకువచ్చి అప్పాలను సాయంకాలం వరకు వేయించాలి. అనగా సాయంకాలం వరకు ఎన్ని చేయగలిగితే అన్ని అని..మాడ్చమని కాదు. ఒకేగోత్రంతో ఉన్న కుటుంబాలలో ఉన్న తోడికోడళ్ళు అందరూ కలిసి హనుమజ్జయంతి చేస్తారు. హనుమ అంత త్వరగా ప్రీతిచెందే మహాపురుషుడు మరొకరుండరు. ఈ అప్పాలను సాయంకాలం సీతారామచంద్రులకు, హనుమకు, పరివారమునకు మంత్రంతో స్వాగతం పలికి నివేదన చేసి సీతారామచంద్రులయందు అపారభక్తికలిగిన వాడు, హనుమను ఉపాసన చేస్తున్నటువంటి వ్యక్తి హనుమజ్జయంతినాడు మీకు తారసపడితే వారి ఇంటికి వెళ్ళేటటువంటి చనువు మీకున్నా వారు మీఇంటికి వచ్చేటటువంటి అనుగ్రహం వారికున్నా ఒక విషయం చేత మీ జన్మ పండుతుంది అన్నారు. అటువంటి పరమభక్తుడైన వ్యక్తితో పరిచయం ఉంటే సూర్యాస్తమయం అయ్యే లోపల ఐదు ఆకులు కానీ, పండ్లు కానీ, అప్పములు కానీ తీసుకెళ్ళి వారికిస్తే వారు ఆ రోజు తీసుకొని ఒక్కపండుముక్క ఆయన నోటిలో వేసుకున్నా మీజన్మ తరించిపోయినట్లే. హనుమజ్జయంతికి అయిదు అంకెతో అంత అనుబంధం. ఒకేజాతికి చెందిన అయిదు ఫలాలను ఇవాళ్టి రోజున సీతారామచంద్ర ప్రభువుయొక్క పాదములయందు అపారమైన భక్తి కలిగినటువంటి వారు, హనుమను సేవించేటటువంటి వాడు, అటువంటి వారి ఇళ్ళకు వెళ్ళగలిగిన చనువు మీకుంటే (నిత్యము, నైమిక్తికము అని రెండు రకాల తిథులుంటాయి. సంధ్యావందనాదులు రోజూ చేస్తూ ఉంటారు. నైమిక్తికము అంటే ప్రత్యేక తిథులు వీటియందు కొన్ని ప్రత్యేకమైన పనులుంటాయి. అవి చేస్తే జన్మ తరిస్తుంది. అవి సులభ మార్గములు.)వారు పుచ్చుకుంటే మీజన్మ తరించిపోయినట్లే. ఎందుకంటే అది సాక్షాత్ హనుమయొక్క స్వీకారమే. ఇలా చెప్పింది పరాశర సంహిత. అయిదంకె మీద పండు, అయిదంకె మీద ఆకు, అయిదంకె మీద నేతి అప్పములు, ఆలయంలో అర్చన చేసేవాళ్ళు, సీతారామచంద్రులను నమ్ముకున్నభక్తులకు ఇవ్వండి. అలా ఇస్తే మీరు తరిస్తారు. హనుమ ఆవాహన ఎక్కడ తొందరగా జరుగుతుందంటే అరటి చెట్లు బాగా కట్టి అరటి గెలలు బాగా వంగి ఉండేటట్లుగా అలంకారం చేసి అప్పుడు హనుమజ్జయంతి చేయాలి. హనుమ తొందరగా ప్రసన్నులైపోవాలంటే అరటితోటలోకి వెళ్ళి హనుమయంత్రం కానీ హనుమ బొమ్మ కానీ హనుమ అని వ్రాసి కానీ అక్కడ పెట్టి మీరు కానీ ఉపాసన చేశారా ప్రత్యక్షమైనటువంటి స్వరూపంతో స్వామి వచ్చి తీసుకొని తీరుతారు అని అభయమిచ్చింది పరాశర సంహిత. అన్నింటికన్నా ఆయన తొందరగా ప్రీతి చెందేది అరటిపండు వల్ల. కదళి పూజ అని ప్రత్యేకమైన పూజ ఆయనకి. అలా చేస్తే ఏదో ఒక రూపంతో మీకు కంటికి కనపడే రూపంతో రాకపోవచ్చు. కానీ ఏదో ఒక రూపంతో ఆయన వచ్చి తీసుకొని వెళ్ళి తీరుతారు. తొందరగా ప్రసన్నుడై వస్తే వానరరూపంలో వస్తారు. తప్పకుండా అరటిపండ్లు నివేదన చేయాలి. పరమ ప్రసన్నుడౌతాడు స్వామి. ఈ రోజు తప్పకుండా దేవాలయంలో హనుమ దర్శనం చేసుకోవాలి. హనుమ గురించి తప్పకుండా నాలుగు మాటలు వినాలి. ఎవరికి హనుమ అనుగ్రహం కలగాలని హనుమ భావిస్తున్నారో వారు మాత్రమే వింటారు.

రెండవది తత్తుల్యమైన రోజు ఒకటున్నది. అది హనుమద్వ్రతం అని చేస్తారు. ఇది వైశాఖ బహుళ దశమి మధ్యాహ్నం స్వామియొక్క ఆవిర్భావం కనుక హనుమజ్జయంతి. హనుమద్వ్రతము మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి నాడు హనుమద్వ్రతం చేస్తారు. దీనికి కూడా కల్పమేదైనా ఉందా? కల్పం ఉంటే అది వైదికము అని గుర్తు. ఋషులు నిర్దేశించిన పద్ధతిలో జరిగిన దానిని కల్పము అంటారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారనుకోండి కల్పోక్త ప్రకారేణ అంటారు. అంటే కల్పము ఎలా చెప్పిందో అలా చేయాలి. దానికి ఒక పద్ధతిని ఋషులు నిర్ణయించి పెట్టారు. అంటే అది ఖచ్చితంగా మీకు ఫలితాన్నిచ్చేస్తుంది. హనుమద్వ్రతమునకు కల్పము ఉన్నది.
హనుమజ్జయంతి
💫💫🌏🌙🌞💫💫💫💫🌞🌙🌏💫💫
హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు.

హనుమంతుడు అంజనాదేవి, కేసరిల పుత్రుడు. వాయుదేవుని ఔరస పుత్రుడు. మహాబలుడు. శ్రీరామ దాసుడు. అర్జునుని సఖుడు. ఎర్రని కన్నులుగల వానరుడు. అమిత విక్రముడు. శతయోజన విస్తారమైన సముద్రమును దాటినవాడు. లంకలో బందీయైన సీతమ్మతల్లి శోకమును హరించినవాడు. ఔషధీ సమేతముగా ద్రోణాచలమును మోసుక వచ్చి యుద్ధమున వివశుడైన లక్ష్మణుని ప్రాణములు నిలిపినవాడు. దశకంఠుడైన రావణాసురుని గర్వమును అణచినవాడు. హనుమంతుని ఈ నామములు నిదురించుటకు ముందు, ప్రయాణమునకు ముందు స్మరించినవారికి మృత్యుభయం లేదు. వారికి సర్వత్ర విజయం లభిస్తుంది.

హనుమాన్ జయంతి సందర్భముగా భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తుంటారు.

ఆంజనేయ స్వామి ధర్యానికి ప్రతీక. శక్తి సామర్ధ్యాలకు ప్రతీక హనుమత్ రూపం. సముద్రం దాటి లంక చేరాడు. ఆకాశ మార్గములో ప్రయాణం చేసి సీతమ్మ జాడ కనిపెట్టారు. సంజీవని పర్వతాన్ని పెకిలించి తీసుకొచ్చిన వీర హనుమాన్ శక్తి యుక్తులను కీర్తించడం సాధ్యమా?

హనుమాన్ జయంతిని కొందరు చైత్ర పౌర్ణమి నాడు చేస్తుండగా మరికొందరు వైశాఖ దశమి నాడు జరుపుకుంటారు. ఇక కేరళ రాష్ట్రం లో మార్గశిర మాసం లో హనుమత్ జయంతిని జరుపుకుంటారు.

హనుమంతుడు అంతులేని పరాక్రమవంతుడయ్యివుండి కూడా శ్రీరాముని సేవలో గడపడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఆన్జనేయునికి శ్రీరాముడంటే ఎంత భక్తి ప్రపత్తులంటే తన మనసునే మందిరంగా చేసి ఆరాధించాడు. హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనం ఇచ్చారని శ్రీరామున్ని సీతమ్మ తల్లికంటె మిన్నగా ప్రమించాడు హనుమంతుడు.

ఒకసారి  సీతమ్మ నుదుటున సిందూరం పెట్టుకోవడ చూసి సింధూరం ఎందుకు పెట్టుకున్నావమ్మా? అని అడుగుతాడు. అందుకు సీతమ్మ నవ్వి " శ్రీరాముడు దీర్ఘాయుష్కుడిగా వుండాలని చెపుతుంది. అంతే హనుమంతుడు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఒళ్ళంతా సింధూరం పూసుకుంటాడు.   అదీ హనుమంతునికి శ్రీరాముని మీద గల నిరుపమానమైన భక్తి.

హనుమంతుని భక్తికి ఇలాంటి తార్కానాలన్ని ఎన్నో ఎన్నోన్నో వున్నాయి.

హనుమాన్ జయంతి విశేష దినాన మరింత భక్తి శ్రద్ధలతో హనుమంతున్ని అర్చిస్తారు.  కలౌ కపి వినాయకౌ: ....... అంటే కలియుగం లో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతా రూపాలు ... వినాయకుడు, హనుమంతుడు.

హనుమంతుడు - అంజనా దేవి, కేసరీల పుత్రుడు. వాయుదేవుని ఔరస పుత్రుడు, మహా బాలుడు. శ్రీరామునికి దాస దాసుడు, అర్జునికి సఖుడు, ఎర్రని కన్నులుగల వానరుడు, అమిత విక్రముడు, శతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినా వాడు, లంకలో బందీయైన సీతమ్మ తల్లి శోకాన్ని హరించిన వాడు, ఔషధీ సమేతముగా ద్రోణాచలం మోసుకుని వచ్చిన యుద్ధంలో వివశుడైన లక్ష్ముని ప్రాణాలు నిలిపిన వాడు.  దశకంటుడు అయిన రావణాసురుని గర్వం అణచినవాడు. హనుమంతుని ఈ నామాలు నిద్రించడానికి ముందు, ప్రయాణానికి ముందు స్మరించిన వారికి మృత్యు భయం లేకుండా వారికి సర్వత్రా విజయం లభిస్తుంది

ఎక్కడైతే రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం. అలాగే భూత ప్రేత పిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తేనే భయపడి పారిపోతాయి. మహా రోగాలు నయం అవుతాయి. శని గ్రహం అనుకూలంగా లేకపోతె వచ్చే బాధలూ తొలగిపోతాయి. మంచి బుద్ధి కలుగుతుంది. బలం పెరుగుతుంది. కీర్తి లభిస్తుంది. ధైర్యం వస్తుంది.

హనుమంతునికి 5 సంఖ్య చాల ఇష్టం. 5 ప్రదక్షిణలు చేయండి.  అరటి పళ్ళు , మామిడి పళ్ళు అంటే ఆయనకు ప్రీతి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.

అలాగే చైత్ర పౌర్ణమి నుండి వైశాఖ బహుళ  దశమి  వరకు గల మండలం రోజుల పాటు ప్రతిరోజూ 1, 3, 5, 11, లేదా 41 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఇలా చేయడం వల్ల అనుకున్న పనులు త్వరగా పూర్తి అవుతాయి. కోరిన కోరికలు నెరవేరే అవకాశాలు వుంటాయి. సంతానం కోరేవారు మండలం పాటు పారాయణ చేసి అరటిపండు నివేదించి ఆ పండును ప్రసాదం గా స్వీకరిస్తే తప్పకుండ సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

💫🚩💫🚩💫🚩💫 
కొంగుబంగారం – శ్రీరామ నామం
💫🚩💫🚩💫🚩💫

సకల లోకాలలో ఆదర్శగుణాలు రాశిగా పోస్తే మనకు కనిపించేవాడు శ్రీరాముడు. రాముడు గొప్పవాడా? రామ నామం గొప్పదా అంటే రామని కంటే రామనామమే గొప్పదని చాటే కథలు చాలా ఉన్నాయి. రామ నామం గొప్పతనం గురించి ముందు తెలుసుకుందాం. రామనామ గొప్పతనాన్ని వివరించే ఈ గాథ చదవండి.

లంకానగరంపై దండెత్తేందుకు రాళ్లతో సముద్రంపై వానరసేన వారధిని నిర్మిస్తూ వుంది. రాయిపై ‘రామ’ అని రాసి ఆ రాయిని నీటిలో వేస్తే అది తేలిపోతూ వుంది. ఇదంతా చూస్తూ వున్న రాముడిలో ‘నా పేరు రాసిన రాయి తేలుతూ వుంది కదా, నేనే రాయి వేస్తే’ అనే ఆలోచన కలిగింది. అంతే శ్రీరాముడు ఒక రాయిని తీసి సముద్రంలోనికి వేసాడు. ఆ రాయి సముద్రంలో మునిగిపోయింది. దీనిని చూసి ఆశ్చర్యానికి లోనైన రాముడు పక్కనే ఉన్న హనుమంతుడికి ఈ విషయాన్ని వివరించి ఎందుకిలా జరిగిందని ప్రశ్నించాడు

అందుకు హనుమంతుడు “రామ” అనే నామం రాసివున్న రాళ్ళే పైకి తేలుతాయి. మీరు వేసిన రాయిపైన రామనామం రాయలేదు కదా! అందుకే మునిగిపోయింది” అని సమాధానం యిచ్చాడు.

అంటే రాముడికంటే కూడా రామనామం మహా శక్తివంతమైందన్నమాట!
రామాయణం కంటే బలమైన రామనామం

రావణాసుర సంహారానంతరం అయోధ్యనగరం చేరుకుని శ్రీరాముడు పట్టాభిషేకం చేసుకుని రాజ్యపాలన చేపట్టాక, అయోధ్యానగరంలో రామసభ కొలువుదీరి వున్న సమయంలో ఒకరోజు విశ్వామిత్ర మహర్షి సభకు వచ్చాడు. మహర్షిని చూస్తూనే రాముడితో సహా సభలోని అందరూ లేచి నిలబడి మహర్షికి నమస్కరించారు. కానీ ఆంజనేయుడు రామనామ జపంలో మునిగి వుండటం వల్ల విశ్వామిత్రుడి రాకను గమనించక నిలబడలేదు, నమస్కరించలేదు. దీనిని ధిక్కారంగా భావించిన విశ్వామిత్రుడు కోపోద్రిక్తుడై “రామా! నీ సేవకుడు నన్ను అవమానించాడు. నీవు అతడిని శిక్షించు” అని రాముడిని ఆదేశించాడు. విశ్వామిత్రుడి మాటను జవదాటలేని శ్రీరాముడు హనుమంతుడిని శిక్షించేందుకు సిద్దమయ్యాడు. ఈ విషయం తెలిసిన హనుమంతుడు నారద మహర్షి సలహా మేరకు ‘రామ’ నామాన్ని జపించడం ప్రారంభించాడు. ఈ విషయంలోనే విశ్వామిత్రుడి ఆజ్ఞ మేరకు శ్రీరాముడు హనుమంతుడిపై బాణాల వర్షం కురిపించసాగాడు. ‘రామ’ నామ జపంలో నిమగ్నమైన ఆంజనేయుని రామబాణాలు ఏమీ చేయలేకపోయాయి. అలసిపోయిన శ్రీరాముడికి పట్టుదల అధికంకాగా చివరకు బ్రహ్మాస్త్రం ప్రయోగించేందుకు సిద్దమయ్యాడు.

ఇంతలో నారదమహర్షి అక్కడకు చేరుకుని “మహర్షీ! హనుమంతుడు నీ రాకను రామనామ జపం వల్ల గమనించక నమస్కరించనంత మాత్రమున మీరు మరణదండన విధించడమా? ‘రామ’ నామ జపం హనుమంతుడిని రామ బాణాల నుంచి రక్షిస్తూ వుంది. యిప్పటికైనా మీ ఆవేశాన్ని కోపాన్ని తగ్గించుకుని ఆజ్ఞను ఉపసంహరించండి” అని విశ్వామిత్రుడితో పలికాడు.

ఈ మాటలను విని విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని నిలుపుదల చేయించి హనుమంతుడి రామభక్తిని మెచ్చుకున్నాడు.

దీనిని బట్టి రామబాణం కంటే కూడా రామనామం గొప్పదని సృష్టమవుతూవుంది. యుగయుగాలను, సర్వలోకాలను తరింపజేసిన మహిమాన్వితమైన నామం – ‘రామనామం’.

అందుకే-
‘రామత్తత్వో అధికం నామ
మితి మన్యా మహేమయమ్
త్వయై కాతౌతారి తాయోధ్యా
నామ్నుతు భువన త్రయమ్

అని స్వయంగా రామభక్తుడైన హనుమంతుడు పేర్కొన్నాడు. అంటే శ్రీరాముడి చేత అయోధ్య తరింపబడింది. రామనామం చేత మూడు లోకాలు తరించాయని అర్థం!
‘ఓం నమో నారాయణాయ’ అనే అష్టాక్షరి మంత్రంలోని ‘రా’ అనే ఐదవ అక్షరం ‘ఓం నమశ్శివాయ’ అనే పంచాక్షరీ మంత్రంలోని ‘మ’ అనే రెండవ అక్షరం కలిస్తే ‘రామ’ అనే నామం అయింది. అంటే హరిహరతత్త్వాలు రెండింటిని ఇముడ్చుకున్న నామం రామనామం!

రామ’ అనే పదాన్ని గమనిస్తే ర, మ,లు కలిస్తే (అమ్మ) ‘రామ’ అవుతుంది ‘ర’ అంటే అగ్ని. ‘ఆ’ అంటే సూర్యుడు. ‘మ’ అంటే చంద్రుడు అని అర్థం. అంటే ‘రామ’ అనే పదంలో విశ్వాసానికి మూలమైన మూడు శక్తులు వున్నాయని చెప్పబడుతూ వుంది. అంతేకాకుండా ‘రామ’ అనే నామంలోని ‘రా’ అనే అక్షరం భక్తులను సంసారసాగరం నుంచి రక్షిస్తుందనీ ‘మ’ అనే అక్షరం భక్తుల మనోరథాలను నెరవేరుస్తుందని మహర్షులు పేర్కొనగా ‘రామ’ అనే పదంలోని ‘రా’ అక్షరం పలికేటప్పుడు నోరు తెరుచుకుని మనలోని పాపాలన్నీ బయటకు వచ్చి అగ్నిజ్వాలల్లో పడి దహించుకుపోతాయనీ, ‘మ’ అనే అక్షరం పలికేటప్పుడు నోరు మూసుకుని బయటి పాపాలని మనలోనికి ప్రవేశించవని ఇందులోని అంతరార్థం.
అందువల్ల త్రిమూర్తులలో లయకారుడైన పరమశివుడు-

‘శ్రీరామ రామ రామేతి
రమే రామే మనోరమే
సహస్రనాయ తత్తుల్యం
రామనామ వరాననే’

అని పేర్కొన్నాడు. ‘రామ రామ రామ’ అని మూడుసార్లు నామ జపం చేస్తే శ్రీ విష్ణుసహస్రనామం చేసినంత ఫలం లభిస్తుందట. కాగామ కటపయాది వర్గసూత్రం ప్రకారం ‘య’ వర్గంలో ‘రా’ రెండవ అక్షరం కాగా ‘ప’ వర్గంలో ‘మ’ అయిదో అక్షరం. అంటే 2 X 5=10. దీనిని బట్టి ‘రామ’ అనే పదం పది సంఖ్యకు సంకేతం. ఇక మూడుసార్లు అంటే (10 X 10 X 10 = 1000) వెయ్యికి సమానమవుతుంది. అందుకే శివుడు ‘రామ’ అనే నామం మూడుసార్లు పలికితే సహస్త్రనామంతో సమానమని చెప్పినట్లు కథనం.

అటువంటి మహిమాన్వితమైన రామనామ గొప్పదనాన్ని చాటే నిదర్శనాలు ఎన్నో మనకు పురాణాల్లో కనిపిస్తాయి.

కిరాతకుని వాల్మీకిగా మార్చిన రామనామం
వాల్మీకి మహర్షి జీవితమే రామనామ మహిమకు చక్కని నిదర్శనం. నిజానికి ఆయన కిరాతకుడు. మహర్షులు చెప్పినట్లుగా’మారా’ అనే మాటకు జపం చేస్తూ కొంతకాలానికి ‘మరా’ అనే పదం ‘రామ’ గా మారింది. ఆయనపై వాల్మీకం(పుట్ట) పెరిగింది. చివరికి నారదమహర్షి ఉపదేశంతో వెలికి వచ్చి రామ నామ గొప్పదనాన్ని తెలుసుకుని ‘వాల్మీకి’ అయి రామయాణాన్ని మనకు అందించాడు. రాముడికంటే రామ నామం గొప్పది.

శనిబాధలు చేరనివ్వని రామనామం

పూర్వం ఒకసారి శనీశ్వరుడు ఎలాగైనా హనుమంతుడిని ఆవహించి కష్టాలపాలు చేయాలని భావించి హనుమంతుడి వద్దకు చేరుకున్నాడు. ఆ సమయంలో హనుమంతుడు రామనామాన్ని జపిస్తూ వున్నాడు. హనుమంతుని సమీపించి శనీశ్వరుడు తన మనస్సులోని కోరికను వెలిబుచ్చగా “నేను ప్రస్తుతం రామనామజపంలో మునిగి వున్నాను. రామనామ జపం ముగిసిన తర్వాత నీవు నన్ను ఆవహించు” అని సమాధానం యిచ్చాడు. అందుకు అంగీకరించిన శనీశ్వరుడు నిరీక్షించసాగాడు. రామనామజపాన్ని హనుమంతుడు ఎప్పుడు ముగిస్తాడా అని శనిదేవుడు ఆతృతగా ఎదురుచూడసాగాడు. గుండెల నిండుగా సీతారాములనే నింపుకున్న హనుమంతుడు రామనామం ఆపేదెన్నడు? చివరకు నిరీక్షించి... నిరీక్షించి విసుగు చెందిన శనిదేవుడు రామనామం జపించేవారి దరిచేరడం కష్టమని తెలుసుకుని వెనక్కు వెళ్ళిపోయాడు. అంటే శనీశ్వరుడిని దరి చేరనీయని శక్తివంతమైన నామం – ‘రామనామం!’ కాబట్టి ‘రామ’ నామాన్ని జపించేవారి శని బాధలతో పాటు ఎటువంటి గ్రహబాధలు వుండవని చెప్తున్నారు. హనుమంతుని రక్షగా వుంచే రామనామం

‘యత్ర యత్ర రఘునాధ కీర్తనం
తత్ర తత్ర కృత మస్తకాంజలి
బాష్ప వారి పరిపూర్ణలోచనం
మారుతీం సమత రాక్షసాంతకం’

అంటే ఎక్కడ రామనామం వినిపిస్తూ వుంటుందో అక్కడ కళ్ళనిండా ఆనందబాష్పాలు నింపుకుని తలవంచి నమస్కరిస్తూ నిలబడి వుంటారట రాక్షసులను దోమల లాగా నలిపి నశింపజేసే రామభక్తుడైన హనుమంతుడు. దీనిని బట్టి రామ నామాన్ని జపించడం వల్ల హనుమంతుడు ఎప్పుడూ పక్కనే వుంటాడు. మనలను రక్షిస్తూ వుంటాడు. అనగా రామనామ జపం కేవలం ‘రాముడి కృపనే కాకుండా హనుమంతుడి కృపను కూడా ప్రసాదింపజేస్తుంది రామనామ సంకీర్తన
‘రామనామము రామనామము రమ్యమైనది రామనామము
రామనామము రామనామము రామనామము రామనామము
శ్రీమదఖిల రహస్తమంత్ర విశేషధామము శ్రీరామనామము
దారి నొంటిగ నడుచువారికి తోడు నీడే శ్రీరామ నామము...’

ఇలా ప్రారంభమై సాగే రామనామ సంకీర్తనను ప్రతిరోజూ ‘ఉభయ’ సంధ్యలలో పఠించడం వల్ల మానసిక శాంతి చేకూరుకుంది. ఎటువంటి సమస్యల నుండి అయినా గట్టెక్కే ధ్యైర్యం కలుగుతుంది. అంతేకాకుండా అనేకసార్లు విష్ణు సహస్ర నామ పారాయణం చేసిన ఫలం లభిస్తుంది. దీనిని ప్రతి ఒక్కరూ చేయవచ్చు. వీలున్నవారు సామూహికంగా కూడా చేయడం మంచిది.
నామమంత్రం
‘శ్రీరామ జయరామ జయజయ రామ’ అనేది పదమూడు అక్షరాల నామ మంత్రం. దీనిని పఠించడం వల్ల కూడా విశేషమైన పుణ్యఫలాలు కలుగుతాయి. సమర్థరామదాసు ఈ మంత్రాన్ని 13 కోట్లసార్లు జపించి శ్రీరాముడి దర్శనాన్ని పొందినట్లు పురాణకథనం. వీలున్నప్పుడు ఈ మంత్రాన్ని జపిస్తూ వుండడం శ్రీరామ రక్ష!

రామకోటి

‘చరితం రఘునాధస్య శతకోటి ప్రవిస్తరం
ఏకైక మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం’ అంటే ‘రామ’ నామాన్ని కోటిసార్లు రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను నశింపజేస్తుందని స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంలో వివరింపబడింది. ‘రామకోటి’ రాయడం అనాది నుంచి మనదేశంలో వున్న ఆచారం. చాలామంది శ్రీరామనవమినాడు రామకోటిని రాయడం మొదలుపెట్టి మళ్ళీ శ్రీరామనవమినాడు ముగిస్తారు. శ్రీరామ నవమి రోజే కాకుండా ఎప్పుడైనా శ్రీరామకోటి రాయడం మొదలుపెట్టవచ్చు. రాసేవారు కొన్ని నియమాలను పాటిస్తే శ్రీరాముడి కరుణా కటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి.

అంతటి శక్తివంతమైన రామనామ జపం వీలున్నప్పుడు చేద్దాం. శ్రీరామ, హనుమంతుల కృపకు పాత్రులమవుదాం.
శ్రీరామ నామ జపం ఎక్కడ జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు.

సూర్యాంజనేయం

శ్రీఆంజనేయం, ప్రసన్నాంజనేయం అనే స్తోత్రాలు చదివాం, విన్నాం కానీ ఈ సూర్యాంజనేయం అంటే? సూర్యుడు, ఆంజనేయుడికి ఉన్న సంబంధం మనం తెలుసుకోవలసిందే. వాల్మీకి రామాయణం, ఇతర పురాణాలు సూర్యుడికీ, హనుమంతుడికీ ఉన్న అనుబంధాన్ని సవివరంగా తెలియజేశాయి/ హనుమంతునికి సూర్యునితో ఉన్న అనుబంధం మరెవ్వరితోనూ కనబడడు.

బాలాంజనేయుడికి సూర్యుడు ఆహారం : హనుమంతుడు బాలుడుగా ఉన్నప్పుడు ఒకసారి ఉదయభానుడిని చూసి ఆకలిగా ఉన్న బాలాంజనేయుడు ఎఱ్ఱని సూర్యబింబాన్ని పండుగా భ్రమించి ఆరగించడానికి ఆకాశానికి ఎగిరాడు. కాని ఇంద్రుని వజ్రఘాతం వల్ల అతని ప్రయత్నం విఫలమైన విషయం మనకు తెలిసిందే. దీనివల్ల అర్థమయ్యేది ఏమిటంటే సూర్యుడు బాల్యంలోనే హనుమంతుని ఆకర్షించాడు. ఇది సూర్యాంజనేయుల మొదటి అనుబంధం.

సూర్యశిష్యరికం :

బాల్యంలోనే గాక విద్యార్థి దశకు వచ్చాక కూడా హనుమంతుని దృష్టిని సూర్యుడు ఆకర్షించాడు. తనకు తగిన గురువు సూర్యుడేనని నిర్ణయించుకొని ఆంజనేయుడు ఆయన వద్దకు వెళ్ళి నమస్కరించి విద్యనూ అర్థించాడు. నిత్యం సంచరించే తన దగ్గర విద్య నేర్చుకోవడం అంత సులభం కాదని సూర్యుడు హనుమంతునికి నచ్చజెప్పటానికి చూశాడు. కాని చివరికి హనుమంతుడి విద్యా జిజ్ఞాసను అర్థం చేసుకొని శిష్యుడిగా చేసుకోవడానికి సూర్యుడు అంగీకరించాడు. హనుమంతుడు సూర్యుని వద్ద విద్యనూ అభ్యసించిన వివిధ పురాణాలు వేరు వేరుగా చెబుతున్నాయి. ఉదయాద్రిపై ఒక పాదం, అస్తాద్రిపై ఒక పాదం ఉంచి నిత్యం సంచరించే సూర్యుని దగ్గర హనుమంతుడు వేదవేదాంగాలు, ఆరు శాస్త్రాలు, దర్శనాలు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, నాటకాలంకారాలు, 64 కళలు అభ్యసించాడు (గడియకు లక్షా డెబ్బై వేళ యోజనాల వేగంతో ప్రయాణించే సూర్యరథంతో సమానంగా సంచరిస్తూ హనుమంతుడు విద్యాభ్యాసం చేశాడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి) జిజ్జ్వల్యమానంగా ప్రకాశించే నిత్య గమనశీలి సూర్యుని వద్ద శిష్యరికం చేసిన ఘనుడు వాయుపుత్రుడు ఒక్కడే. సూర్యుని శిష్యరికం వల్లనే శ్రీరాముని మొదటి సమగామంలోనే తన సంభాషణా చాతుర్యంతో హనుమంతుడు ఆకర్షించగలిగాడు. మైనాకుని వినయంతోను, సింహికను శక్తితోను, సురసను యుక్తితోను జయించగలగడం సూర్యుని దగ్గర నేర్చుకున్న 64 కళల ఫలితమే.

సూర్యుపుత్రునికి స్నేహితుడు :

సూర్యభగవానుని శిష్యుడైన హనుమంతుడు సూర్యపుత్రుడైన సుగ్రీవునికి మంత్రిగా, మిత్రునిగా సలహాలను, సహాయాన్ని అందించాడు. వాలికి భయపడి దేశాలు పట్టి తిరిగిన కాలంలో సుగ్రీవునికి చేదోడు వాదోడుగా మెలిగాడు. సూర్యపుత్రుడైన సుగ్రీవునికి, సూర్యవంశీయుడైన శ్రీరామునికి చెలిమి ఏర్పడటానికి కారకుడు ఆంజనేయుడే. అంతేగాక రావణ సంహారానికి తోడ్పడే నరవానర మైత్రికి బీజం వేసినవాడు కూడా హనుమంతుడే.

సూర్యుని మనుమడు : కొన్ని పురాణాల ప్రకారం హనుమంతుని తల్లి అంజనాదేవి సూర్యుసుతుడైన సుగ్రీవునికి సోదరి. అంటే హనుమంతుడు సుగ్రీవునికి మేనల్లుడు. కనుక సూర్యుడు హనుమంతుడికి తాత.

సూర్యుని అల్లుడు : వాల్మీకి రామాయణంలో హనుమంతుని వివాహం గురించి కాని, భార్య గురించి కాని ఎటువంటి ప్రస్తావన లేదు. కొన్ని పురాణాల ప్రకారం సూర్యభగవానుని కుమార్తె సువర్చల ఆంజనేయుని భార్య. అంటే సూర్యాంజనేయుల మధ్య మామా అల్లుళ్ళ సంబంధం కూడా ఉంది. పార్వతీదేవి అంశతో అయోనిజగా సువర్చల జన్మించింది.

సూర్యవంశీయుని భక్తుడు : హనుమంతుని ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడు సూర్యవంశీయుడు కావడం విశేషం. తన గురువు వంశంలో అవతరించిన మహాపురుషుని సేవించుకునే మహాద్భాగ్యం హనుమంతునికి దక్కింది. గురువు ఋణం తీర్చుకోవడానికి ఇది గొప్ప అవకాశం. శ్రీరామునితో పరిచయమైనా నాటినుండి హనుమంతుడు రాముని సేవకే అంకితమయ్యాడు. అనితర సాధ్యమైన సముద్ర లంఘనం చేసి, శత్రు దుర్భేద్యమైన లంకలో సీతమ్మ జాడ కనిపెట్టడం ద్వారా శ్రీరామునికి అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడు. సంజీవినిని తెచ్చి లక్ష్మణుని ప్రాణాలు కాపాడాడు. సీతారాములను హృదయంలో నిలుపుకోవడం హనుమంతుని భక్తికి పరాకాష్ట. శ్రీరామభక్తులకు హనుమంతుడు సర్వదా సంరక్షకుడిగా ఉంటాడు.

త్రిమూర్తుల శక్తి : సూర్యవంశ సంజాతుడైన శ్రీరాముడు మహావిష్ణువు అవతారం. హనుమంతుడు శివాంశ సంభూతుడు. అంటే రామాంజనేయుల అనుబంధం శివకేశవుల అభేదానికి ప్రతీక. హనుమంతుని భవిష్యబ్రహ్మగా కూడా పురాణాలు పేర్కొన్నాయి. కనుక వీరిద్దరి కలయికతో త్రిమూర్తులు ఏకామైనట్టే. సూర్యుని కూడా త్రిమూత్రుల స్వరూపంగా శాస్త్రాలు నిర్వచించాయి. కాబట్టి శ్రీ సూర్యరామాంజనేయులను ద్విగుణీకృతమైన శక్తికి సంకేతంగా అభివర్ణించ వచ్చు. ఇలా గురుశిష్య బంధంగా మొదలైన సూర్యాంజనేయుల అనుబంధం త్రిమూర్త్యాత్మకంగా విస్తరించింది.

⚜💫⚜💫⚜💫⚜
                     శ్రీ రాముని చిత్రంలో ,మనకు శ్రీరాముడు ,సీత ,లక్షణుడు ,హనుమంతుడు సాధారణంగా కనిపిస్తారు . శ్రీరాముడు  జ్ఞానం ,సీత భక్తి ,లక్ష్మణుడు వైరాగ్యం ,హనుమంతుడు బుద్ధి యోగం . సర్వే సర్వత్ర ఉన్నది సీతా రాములే . లక్ష్మణుడనే జీవుడు , వైరాగ్య భావంతో ,నాది అనే భావాన్నిశరీరానికి  [ఊర్మిళలా]నిద్రాణంగాఉంచి , ప్రచోదనం చెందిన హనుమంతునివంటి బుద్ధితో, సర్వే సర్వత్ర సీతారాములే ఉన్నారని ,తానంటూ వేరుగా లేనని పొందే  అనుభవం ఒక  వ్యక్తిదే కానీ ,సాధన స్వరూపాన్నే మనకు 4మూర్తులుగా పరిచయం చేస్తున్నది ,రామాయణం. శరీరమే తను . శరీరానికి సంబంధించినవి తనవి . ఇదే జీవతత్వం . తాను శరీర మాత్రుడు కాదని, సృష్టి, దృష్టిలో ఉన్నా అనుభవానికి రావడం పరతత్వం . దృష్టిలో, సృష్టి కదలుతున్నా , మెలకువలో బుద్ధి పరతత్వంలో మేలుకొని సృష్టిలో కదలు తున్నదంతా పరమాత్ముని శక్తి మాత్రమే, అనే అనుసంధానాన్ని కొనసాగించి ,ప్రతి కదలికను జ్ఞానాగ్ని పునీత సీతగా గ్రహించి అష్ట సిద్ధి రూపంగా కలుగుతున్న భౌతిక ,ఆధ్యాత్మిక సంపదను మాయగా గుర్తెరిగి ,సాక్షాత్తుగా సీతా మహాదేవి ప్రసాదించిన మాల,అయినా,తన అంతరంగంలో శాంతికి ఏ మాత్రం భంగం కలగకుండా సాధనలోని ఏకాగ్రతను సడలనివ్వక ప్రతి క్షణంలో,రామపట్టాభిషేకాన్నిద్రుష్టి నుండి దూరం కానియక[అంతా పరమాత్మదే]అని,నిద్రలోనడిచే వ్యక్తిలా[భరతుడు] అవసరమైనంత వరకే ,సృష్టిలో చరిస్తూ,చేరే ,జీవన్ముక్త స్థితికి నిర్వచనమే,రామాయణం.ప్రతి అవతార గాధ, వివిధ,మానవ స్వభావాలకు,వివిధ మార్గాలను గమ్యాన్ని చేరడానికి నిర్దేసించినవి. ఎన్నో మానవ స్వభావాలకు వేరు,వేరుగా బోధ సాగడానికి అనువుగా పెద్దలు వివిధ దేవతా రూపాలుగా,తత్వాన్ని పరిచయం చేశారు .విద్యుచ్చక్తి అనేక ఉపకరణాలుగా , వినియోగించ బడినంతమాత్రాన,దాని ఏకత్వానికి ఏభంగం లేనట్లే ,అనేకదేవతారాధన అని అందరూ భావించేది,అవగాహనా రాహిత్యమే కానీ,నిజం కాదు .దీన్ని కూడా అవసరం లేని వారిని లోపలికి రానివ్వని కంచెలా , అర్హత లేని వారిని సాధనకు రాకుండా కాపాడే మాయ మాత్రమే.

           'హనుమాన్ చాలీసా ' లో "అష్టసిద్ధి నవనిధికే దాతా" అనే నామం ఉన్నది.......🌷🌠💡 అష్టసిద్ధులు,నవనిధులు అంటే ఏమిటి?
    అష్టసిద్ధులు...
    1.అణిమా
    2.మహిమ
    3.లఘిమ
    4.ప్రాప్తి
    5.ప్రాకామ్యము
    6.ఈశత్వం
    7.వశిత్వం
    8.సర్వ కామసిద్ధి (కామావసాయిత్వము)

            🌷🌠💡 ........   " అణువులా" సూక్ష్మరూపాన్ని పొందడం "అణిమాసిద్ధి" ,అనేక కోట్ల బ్రహ్మాండాల కంటే అధికుడవడం "మహిమా"సిద్ధి, పరమాణువుల కంటే తేలిక కావడం " లఘిమా" సిద్ధి, గొప్ప బరువుగా మారగలగడం "గరిమ", ఇష్టపదార్థాలను పొందగలగడం "ప్రాప్తి"సిద్ధి....... లౌకిక పారలౌకిక పదార్థాలలో దేనిని కావాలంటే దానిని పొందడం "ప్రాకామ్యసిద్ధి" అన్నిటిపై, అందరిపై అధికారాన్ని పొంది, తన ఇచ్చ మేరకు నడిపించడం "వశిత్వం" దేవతలతో సహా తాను కోరిన వారిని వశం చేసుకొనడం "వశిత్వం" అన్ని కోరికలను పూర్తిగా తీర్చుకొనడం "కామావసాయిత్వం"   .....🌷🌠💡

    నవనిధులు...
    1. పద్మం
    2. మహాపద్మం
    3. శంఖం
    4. మకరం
    5. కచ్చపం
    6. ముకుందం
    7. నీలం
    8. కుందం
    9. వరం

    ఇవి ఐశ్వర్య ప్రతీకలైన నిధులు...... ఇవి కుబేరుని వద్ద మహాలక్ష్మి దయవలన కలిగి ఉన్నాయి..... ఈ నిధి దేవతల వలన భూ,జల, లోహ భోగాది సంపదలు లభిస్తాయి....
                🌷🌷🌷🌷

⏩🚩🔀⏩🚩🔀⏩🚩🔀⏩🚩🔀⏩

సంస్కృతంలో ఉన్న ఒక ఏకాక్షర శ్లోకం
        .....
రరో రరే రర రురో రురూ రూరు రురో రరే
రేరే రీరా రార రరే రారే రారి రిరా రిరా!!

ర = రామ శబ్దంలోని “ర” రేఫ వలన !!!
రోః = భయం కల !!
అర = వేగంగా పరుగెత్తే !!
రురోః = జింకయైన మారీచునికి !!!
అరేః = శత్రువైన శ్రీరాముని !!
రేరే = (ర+ఈరే) = కౌస్తుభమణి పొందియున్న !!
ఉరో రరే = వక్షము నందు!!
రీరారా = లీల నాపాదించునట్టి !!!
ఊరూరూః = ఊరువులచే గొప్పనైన !!!
ఉః = లక్ష్మి = సీత !!
అర రర = తన నివాసానికి తీసుకువెళ్ళిన !!!
ఇరార = లంకను పొందిన !!
ఇరారి = భూ శత్రువైన రావణునికి !!!
రిః = నాశం కల్గించినదై !!!
ఆరిరా = చెలికత్తెలను !!
రా = పొందిన దాయెను !!

శ్రీరామ పత్ని సీత లంకలో రావణ నాశనం సూచించే త్రిజట వంటి చెలికత్తెల్ని పొందిందని అర్థం....

🌹🌻🌷🌹🌻🌷🌹🌻🌷🌹🌻🌷🌹

తిలకాలు మరియు తిలక ప్రసాదాల్లో గాని చాలా రకాలు ఉన్నాయి.

వాటిలో కొన్నిటిని కింద పేర్కొన్నాము
పసుపు
దీనికి సంస్కృతంలో హరిద్ర అని కూడా అంటారు.......పసుపును అన్ని శుభకార్యాలలో ఉపయోగిస్తారు ..... శాస్త్రాలలో పేర్కొన్న ప్రకారం ఈ క్రింది వస్తువులను ఎవరి నుంచి అయేనా పొందవచ్చు.....వాటికి మైల(అంటు) ఉండదు......🌷🌷🌷

1.పసుపు 2.కుంకుమ 3.పూలు 4.పళ్ళు 5.తమలపాకు 6.వక్క 7.పాలు 8.పేరుగు 9.నేయి10.తేనే 11.కూరగాయలు 12. తులసి13.గంధం తీసే సానరాయి14.గంధం చేక్క.

              🌷🌷🌷🌷 ......వీటిలో పసుపుకు మొదటి స్థానం కల్పించబడింది.....అలానే సుమంగళి కి తాంబూలం లేదా ఆకు,వక్క ఇచ్చే సమయములో మొదట పసుపును ఇచ్చి తరువాత కుంకుమ ఇస్తారు.....
పసుపు సౌభాగ్యనికి చిహ్నం.....అందుకే పసుపును ముందుగా ఇస్తారు....ఈ కారణం చేతనే సుమంగళి తన భర్తకు శుభం కోరుతూ మాంగళ్ల్యానికి పసుపు ఉంచి నమస్కరిస్తారు......

                 🌷🌷🌷🌷🌷🌷🌷

  .....ఇక దైవ కార్యక్రమాలలో
అమ్మవారి ఆలయాలలో నవరాత్రి పూజా సమయములో దేవికి పసుపుతో చేసే అలంకారాలుముఖ్యమైనవి ....గోదా దేవీ లేదా అoడాళ్ అమ్మవారి దేవాలయములోనికి వెళ్లినప్పుడు పసుపు ప్రసాదాన్ని ఇస్తారు.....కొంత మంది చాలా వరకు పసుపును ఇంటికి తీసుకువచ్చి వంటల్లో లేదా స్నానం చేసేoదుకు ఉపయోగిస్తారు అలాచేయడం చాలా తప్పు కూడా......
పసుపును ప్రసాదంగా స్వీకరించాక ఇంటికి తీసుకువచ్చినప్పుడు చేయవల్సిన విధాన క్రమం

1.దేవుని ప్రసాదమైన పసుపును ప్రతి దినం పూజాగదిలో ఉంచి పూజిస్తే ఇంటికి ,ఇంట్లో ఉన్నవారికి అన్ని విధాలధన,కనక,వస్తు,వాహనాలు వృద్ది చేoదుతాయి .....
2. పసుపులో నీటిలో వేసి స్నానం చేస్తే దేహ కాంతి పేరుగుతుంది.....సమస్త చర్మ రోగాలు నయం అవుతాయి..... పసుపును నీటిలో వేసి చేసే స్నానం మంగళ స్నానం అని అంటారు .....
3.పసుపుతో గౌరీ దేవీని చేసి పూజించటం ద్వార ఇంట్లో వుండే వధువుకు ఉన్న వివాహ దోషాలు తొలగిపోతాయి త్వరలో వివాహం నిశ్చయం అవుతుంది......
4.దేవికి పసుపు రంగు చీరను ఇస్తే ఇంట్లో ఉండే దోషం మరియు దైవ దోషాలు తొలగిపోతయి ......
5.దుకాణల్లో చాల రోజులుగా అమ్ముడు కాకుండా మిగిలివుండే వస్తువులఫై కొద్దిగా పసుపు పొడిని చల్లితే వెంటనే వ్యాపారం అవుతుంది.....
6.పసుపు నీటితో ఇంటిని కడిగితే అ ఇంటికి శుభం జరగడం కాక,ఆ ఇంటి వారికీ ధన సమస్య రాదు....అప్పుల బాధ తొలగిపోతుంది.....
7.కామెర్లు ఉన్నవారి గృహస్థులు వారు పసుపును దానంగా ఇస్తే కామెర్ల రోగం తొలిగిపోతుంది....
8.ప్రతి సంవత్సరం కామేర్లు వచ్చేవారు సుమంగళికి పసుపు రంగు చీర తాంబూలాలను దానంగా ఇస్తే కామెర్ల సమస్య తొలగడం కాకా మల్లి తలెత్తదు ......
9.గృహ దేవతను పసుపు నీటితో కడిగితే విగ్రహాలకు దైవకళ పేరుగుతుంది ......
10.వ్యాపారం జరగని దుకాణాల్లో శంఖాన్ని పసుపు రంగు కాగితంలో చుట్టి దానిని గల్లా పెట్టిలో ఉంచితే వ్యాపారం వృద్ది అవుతుంది......

                     కుంకుమ
⏩🔀🌹⏩🔀🌹⏩🔀🌹⏩🔀🌹
   కుంకుమనుసుమంగళిలకు,దేవతలకు,దేవికి చాలఇష్టం. కుంకుమలకు దృష్టి పరిహారం చేసే శక్తీ ఉంది ....

1.కుంకుమతో చేసే అర్చనతో అన్ని రకాల దేవతలు,దేవిలు తృప్తి చేందుతారు .....
2. సుమంగళిలు ఇచ్చే కుంకుమతో ఇంటిలో ఉంటే వివిధ దోషాలుతొలగిపోతాయి ..... దేవి అనుగ్రహం కూడా ఉంటుంది......
3.కుంకుమ దానంతో ఇంటిలో ఉండే సమస్త దోషాలు నివారించాబడుతాయి......
4.కుంకుమను గుమ్మడి కాయలో ఉంచి దిష్టి తీసి కొడితే అన్ని రకాల దిష్టి దోషాలు దూరమౌతాయి .....
5.ఎవరైతే కుంకుమను ప్రతి రోజు నుదుట ధరిస్తారో వారికీ దేవతలందరి ఆశీర్వాదం ఉంటుంది.....
6.కుంకుమను నీటితో దిష్టి తీసి విధిలో పారపోస్తే అన్ని రకాల దృష్టి దోషాలు తొలగిపోతాయి .....
7.అన్నంలో కుంకుమను కలిపి దిష్టి తీసి మూడు రోడ్డ్లు కలిపే స్థలంలో ఉంచితే త్వరగా అన్నం దిష్టి దోషాలు తొలగిపోతాయి.....

                    చంద్ర
💠🌠🌷💠🌠🌷💠🌠🌷💠🌠🌷💠
చంద్ర (కుంకుమ పువ్వు రంగు కుంకుమ )
ఈ కుంకుమ శ్రీమహాలక్ష్మి దేవికీ,ఆంజనేయ స్వామికి చాల ఇష్టం

1.చంద్రతో శ్రీ మహాలక్ష్మికి అర్చన చేస్తూవస్తే ఇంట్లో ధనంకి ఎప్పుడు ఎటువంటి సమస్య ఉండదు....
2.చంద్రతో దేవుడిని పూజిస్తే దేవునికి కళ వస్తుంది....తేజస్సు వస్తుంది....
3.చంద్రతో మంగళగౌరికి పూజ చేస్తే మన మనస్సును ఇష్టమైన అబ్బాయి లేదా అమ్మాయి పరిచయం అయీ త్వరలో వివాహం అవుతుంది.....
4. చంద్రతో శ్రీ రాధాకృష్ణ దేవునికి అష్టోత్తరం చేస్తే ఇంటిలో మంగళ కార్యాలు ఎటువంటి సమస్యలు లేకుండా జరిగిపోతాయి ......
5..చంద్ర కలిపిన అన్నం పార్వతిపరమేశ్వరులకు నైవేద్యం పెట్టి ప్రసాదాన్ని తింటే అన్ని వ్యాధులు తొలగిపోతాయి.....

                   సింధూరం
🌷🌠🌹🌷🌠🌹🌷🌠🌹🌷🌠🌹🌷
సింధురాన్ని హనుమంతునికి అలంకరిస్తారు
1.ఎవరింట్లో అయెతే నిత్యం కలహాలు జరుగుతుంటాయో అటువంటి వారు ప్రతిరోజు సింధూర ధారణ చేపడితే అన్ని రకాల దాంపత్య సమస్య్యలు తొలగిపోతాయి.....
2.ఎవరింట్లో అయితే భీతి,భయం,వెంటాడు తున్నాయో అటువంటి వారు సింధురాన్ని పెట్టుకొంటే భయం తొలగిపోతాయి.....
3.ఎవరి ఇంట్లో అయితే భార్య,భర్తలు,పిల్లల మధ్య సఖ్యత ఉండదో అటువంటి వారు సింధురాన్ని పెట్టుకొంటే సుఖం, సంతోషం, ప్రశాంతత లభిస్తుంది.....
4.చిన్న పిల్లలకు బాలగ్రహ దోషాలు ఉంటే
 ఆ పిల్లలకు సింధురాన్నిపెడితే, భయం, భీతీ, రోగ బాధలు,ఏమిదరిచేరవు....  ఆరోగ్యవంతులుగా ఉంటారు .
5.వివాహమైన కొత్త దంపతులు ఆంజనేయ స్వామి సింధురాన్ని పెట్టుకొంటే వారికీ పిల్లలు కలగరని పెద్దల మాట....
6.విద్యార్ధులు ,విద్యార్దునులు ఆంజనేయస్వామి గుడికి వెళ్లి సింధురాన్ని పెట్టుకుంటే పరీక్షా సమయంలో చదివిన విషయాలన్నిటిని మరిచి పోకుండా ఉంటారు.....
7. తక్కువ రక్తపోటు(లో బిపీ) ఉన్నవారు రక్త హీనత సమస్యలతోభాదపడేవారు. ఆంజనేయ స్వామి తీర్థాన్ని సేవించి సింధురాన్ని నుదుటన పెట్టుకొంటే ఆరోగ్యభాగ్యం సిద్దిస్తుంది.....
8.గ్రహ బాధలు ఉన్నవారు ప్రతి రోజు సింధురాన్ని పెట్టుకొంటే గ్రహాల బాధ తొలగిపోతుంది
9.ఇంట్లో ఆంజనేయ స్వామికి గంధాన్ని అలంకరించాలనుకున్న వారు దేవుని చిత్రానికి దక్షిణవైపు ఉంచి కొద్దిగా గంధాన్ని స్వామి కిరిటానికి పెట్టాలి....తరువాత అంతా గంధం పుసుకుంటూ వచ్చి చివరగా గంధాన్ని పాదం వద్ద పెట్టి పూజిస్తే తలచినవన్ని నేరవేరుతాయి .....
10.ఆంజనేయ స్వామికి సింధురాన్ని పెట్టి తరువాత దానిని పాలల్లో లేదా నీటిలో కలిపి తాగుతూ వుంటే దేహం వజ్రమయం అవుతుంది....

            పచ్చ కర్పూర తిలకం
🌻⏩🔀🌻⏩🔀🌻⏩🔀🌻⏩🔀
పచ్చ కర్పూర తిలకాన్ని తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతి రోజు పెడతారు.....భక్తులూ దేవునునికి కానుకులను పంపిస్తే దేవాలయం వారు ప్రసాదమైన పచ్చ కర్పూరాన్ని పోస్టు ద్వార పంపిస్తారు......

1.స్వామి ప్రసాదమైన పచ్చ కర్పూరాన్ని పాలలో వేసుకొని తాగాలి....దాంతో స్వామి ప్రసాదాన్ని సేవించినట్లు అవుతుంది.....
2.పచ్చ కర్పూరాన్ని కొబ్బరి నూనెలో కలిపి తలకు పూసుకొంటే జుట్టు సుగంధమయం అవుతుంది ......
3.పచ్చ కర్పూరాన్ని కుంకుమలో కలిపి నుదిటికి పెట్టుకొంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎప్పటి కి ఉంటుంది ......
4.పచ్చ కర్పూరాన్ని నీటిలో కలిపి ముక్కు,ఎద,నుదిటికి రాసుకొంటే ఎటువంటే జలుబు ఆయినవేళ్ళవలిసిందే....తలనొప్పి సగం పోతుంది........
5.పచ్చ కర్పూరం కుంకుం పువ్వు కలిపి డబ్బుల పెట్టెలో పెడితే ఎక్కువ ధన లాభం కలుగుతుంది .....
6.వ్యాపారులు ప్రతి రోజు పచ్చ కర్పూరాన్ని కుంకుమను నుదిటికి పెట్టుకొంటే ఆ రోజు ఎక్కువ వ్యాపారం జరుగుతుంది......
7.పచ్చ కర్పూరాన్ని తీపి పదార్దాలకు కలిపి దేవునుకి నైవేద్యంగా పెట్టి దానం చేస్తే ఇంటి యందు శుభకార్యాలు త్వరగా జరుగుతాయి .......
8.పచ్చ కర్పూరాన్ని కలిపినా నీటిని ప్రతి రోజు త్రాగితే గ్యాస్ట్రిక్ సమస్య,దంత దుర్గంధం దరిచేరవు ......
9.పచ్చ కర్పూరం తో హోమం చేస్తే అన్నీ వసికరణ అవుతాయి .....
10.పచ్చ కర్పూరాన్ని దేవాలయానికి దానం చేస్తే మీకు రాజ సన్మాన గౌరవం ఎక్కువ అవుతుంది.......
11.పిల్లలు లేని వారు పాలకు పచ్చ కర్పూరాన్ని జోడించి మంగళవారం శ్రీ సుబ్రమణ్య స్వామికి అబిషేకం చేసి ఆ పాలను త్రాగుతూ వుంటే అన్ని రకాల గర్భ దోషాలు నివారణ అయి సంతానం కలుగుతుంది......
12.పచ్చ కర్పూరాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తే అన్ని పనులు త్వరగా నెరవేరి గౌరవం పెరుగుతుంది.......

     రక్త చందనం(లేదా)ఎరుపు గంధం
🌸🌷🌻🌸🌷🌻🌸🌷🌻🌸🌷🌻🌸
1.రక్త చందనం లేదా ఎరుపు గంధం దేవునికి నివేదిస్తే దేవునికి కళ వస్తుంది.....
2.రక్త చందనపు తిలకాన్ని నుదిటికి పెట్టుకుంటే శారీరంలో ఉన్న ఉష్టాన్ని తొసివేస్తుంది....
3.ఎరుపు గంధాన్ని నుదుటికి పూసుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది .....
4.రక్త చందనపు లేపనాన్ని నుదిటికి రాసుకుంటే తలలోని నీరు లాగేస్తుంది అని శాస్త్రంలో చేప్పబడింది......
5.రక్త చందనం తిలకాన్ని భాలింతలకు పెడితే చలువ కలగదు....
6.రక్త చందనం చెక్కను వేడి నీటిలో వేసి కాచి స్నానం చేస్తే ఉబ్బసం తగ్గిపోతుంది......
7.ఎరుపు గంధాన్ని నీటిలో ఉంచి ఆ నీటిని ప్రతి రోజు తాగితే అన్ని రోగాలు తగ్గి పోతాయి.....

                    గోపి చందనం
💡🌠🌻💡🌠🌻💡🌠🌻💡🌠🌻💡
1.గోపిచందనంలో ఎవరైతే పెట్టుకొని కేశవాది ద్వాదశ నామాలను జపిస్తారో వారిని సాక్షాత్ నారాయణ అని పిలుస్తారు.....
2.గోపి చందనంలో దేవుని ప్రసాదాన్ని ఉంచుకుంటారో వారికీ శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది......
3.గోపి చందనంతో పంచ ముద్రికలను ఎవరు ధరిస్తారో వారిని శ్రీ కృష్ణ అని పిలుస్తారు......
4.గోపి చందనంతో దేహానికి ఎటువంటి అపాయం కలగదు...ఈ చందనంతో రక్త పోటు రాదు....మరియు ఎటువంటి ఒత్తిడులు దరిచేరవు....
5.గోపి చందనంతో ఇంట్లో ఉంటే ఇంట్లో వారికీ గొడవలు రావు......కోపం దరి చేరదు.....

                తిరుమణం
     ..... 🌹🌠🌹🌠🌹🌠.....
వైష్ణవులకు ఇది ప్రత్యేకం .నామాలు పెట్టుకొనేందుకు ఉపయోగించే తెల్లని సున్నపు గడ్డ తిరుమణం లేదా శ్రీ చూర్ణం అని పేరు....
1.శాస్త్రోక్తంగా వైష్ణవ బ్రాహ్మణులు తిరుమణం నుంచి ద్వాదశ నామాలను వేసుకోవాలన్న నియమం ఉంది....దీనిని ఎవరు వేసుకొంటారో వారు నారాయణ స్వరూపం అని అంటారు......
2.తిరుమణం ధారణ దేహంలో భక్తిని శాంతిని ఇస్తుంది.....
3.తిరుమణం ధరించిన వారికీ కోపం,రక్తపోటు,ఒత్తిడులు ధరి చేరవు ......
4.తిరుమణం ధారణ నియమానుసారంగా చేపడితే వైకంఠ లోకం ప్రాప్తిస్తుంది....

                   అంగార
     ..... ⏩💠🌷⏩🌷🔀.....
        ....కదళి ఫలంతోను పద్మ పుష్పాలను బాగా ఎండించి గంధాన్ని తీసి దానితోను అంగారను చేసి దేవునికి పెడతారు......
1.కదళి ఫలం అంటే అరటికాయ తోలు నుంచి ,తామర దంటు నుంచి తీసిన అంగరం శ్రీ సీతారామ దేవునికి పెడితే
జేవితాంతం అన్నదమ్ములు కలసిమెలసి ఉంటారు.....
2.అంగారాన్ని శ్రీ లక్ష్మి నారాయణ దేవునికి పెడితే సంసారంలో సుఖ సంతోషాలకు కొరత ఉండదు.....
3.శ్రీ మహాలక్ష్మికి అంగరాన్ని పూస్తే ఎప్పటికి దరిద్రం ధరి చేరదు....
4.సాలగ్రమానికి అంగరాన్ని పూస్తే సుభిక్షంగా ఉంటారు.....
5.శ్రీ లక్ష్మి నరసింహ దేవునికి అంగరాన్ని పెడితే ఇంటిలో ఎవరికీ చేడుజరగదు. ....మాంత్రికుల బాధ ఉండదు...దైవ శక్తీ ఎక్కువగా అవుతుంది.......

                చాదు(కాటుక)
        ..... 🌹🌿⏩🌹🌿⏩......
          🌷🌷🌷 ....నందివర్దన పూవు,నల్లని ఎండు కొబ్బరి పెచ్చుతో తయారుచేస్తారు ......
కాటుక దేవుని అలంకార సమయంలో కళ్ళకు అలంకారం చేసే సమయంలో కళ్ళకు చాదుతో(కాటుక) అలంకారం చేస్తారు ......🌷🌷🌷

1.దేవునునికి చాదు పెడితే అశాంతి నాశనం అవుతుంది.....
2.దేవునుని కళ్ళకు చాదు పెడితే కళ్ళకు మంచి మెరుపు వస్తుంది......
3.చాదు పెట్టుకొంటే దిష్టి తగలదు అందుకే మన పెద్దలు చిన్న పిల్లలకు కాటుక పెట్టమంటారు......
4.చాదు పెట్టుకొంటే దేహంలో కొవ్వు అంశాలు తగ్గిపోతాయి.......
5.చాదు పెట్టుకొంటే లావుగా ఉన్నవారు సన్నగా అవుతారు.......🌷🌷🌷🌷

              తిలక ప్రసాదం
   ..... 🌿⏩🌠🌿⏩🌠......
దేవుని ప్రసాదాన్ని నుదుట ధరిస్తే దానిని తిలకం అని పిలుస్తారు......తిలక ధారణను శుభ,అశుభ కార్యాలు రెండింటిలోను ధరిస్తారు . ........వీటిలో మూడు రకాలు ఉన్నాయి .......🌷🌷🌷🌷

1.భస్మాలు
2 రక్షలు
3.తిలకాలు

                        భస్మాలు
            .... 🌿⏩🌠🌿⏩🌠.....
భస్మాలు ఆరు రకాలుగా ఉంటాయి

1.విభూది.
2.శివుని దేవాలయ భస్ముం
3.శ్రీ సుబ్రమణ్య దేవాలయ భస్మం
4.సుద్ద భస్మం
5.హోమ భస్మం
6.చితా భస్మం .
.
                      విభూది
          ..... 🌹🌠⏩🌹🌠⏩......
           🌷🌷🌷🌷🌷  ......సామాన్యమైన విభూది ని నుదిటికి పెట్టుకోవడం వల్ల ఎటువంటి దైవ శక్తీ లభించదు.... ఈశ్వరాలయం లోని భస్మం ధరించడం ద్వార దేహంలో కాంతి వస్తుంది దేహంలో అన్ని రకాల వ్యాధులు తొలగిపోతాయి ......  రక్త పోటు లేదా హైపర్ టెన్షన్ ఉన్నవారు దీనిని పెట్టుకొంటే రక్త పోటు సాధారణ స్టితికి వస్తుంది..... మనస్సుకు ప్రశాoతాత లభిస్తుంది....అధిక భాగం ఒంటరితనాని ఇష్టపడతారు.......
ఎక్కువుగా మాట్లాడే వారు తక్కువ చేస్తారు.........  మనసును ఏది భాదించదు ....🌷🌷🌷

       శ్రీ సుబ్రమణ్య దేవాలయ భస్మం
  ......... 🌾🍁⏩🌾🍁⏩🌾🍁.......
1.ఈ భస్మం ధారణకు యోగ్యమైనది....ఈ భస్మం దేహంలో కాంతి తేజస్సు వృద్ది చేస్తుంది..... నరాల బలహీనత ఉన్నవారు దీన్ని ధరిస్తే త్వరగా కోలుకొంటారు ......మూర్చ వ్యాధి ఉన్నవారు సుబ్రమణ్య దేవుని ప్రసాద భస్మంనీ 18 నేలలు పెట్టుకొంటే మరల ఎప్పుడు మూర్చ దరిచేరదు ...... చిన్నపిల్లలకు వచ్చే బాలాగ్రహ దోషాలు భస్మం పెట్టుకోవడం ద్వార తొలగిపోతాయి . .......🌷🌷🌷🌷
2.ఎవరికీ అయితే నత్తి సమస్య ఉంటుందో అటువంటి వారు దేవుని పేరు చేప్పుకొని ఈ భస్మాన్ని నుదుట పెట్టుకొని భక్తితో భస్మాన్ని పాలలో వేసుకొని త్రాగుతూ ఉంటీ నత్తి పూర్తిగా తొలగి అందరిలాగా చక్కగా మాట్లడుతారు ......🌷🌷🌷🌷
3. ఎవరికి అయితే వివాహం జరిగే వయస్సు వచ్చినా ఎదోక కారణంతో పెళ్ళి వాయిదా పడుతూ వస్తుందో అట్టివారు శ్రీగణపతి లేదా శ్రీ సుబ్రమణ్య స్వామికి పూజ చేసి భస్మాన్ని ధరిస్తూ ఉంటే వివాహానికి అడ్డంగా ఉన్న అన్ని విఘ్నాలు తొలగి,ఎటువంటి సమస్యలు తలేత్తకుండ వివాహం జరుగుతుంది .......🌷🌷🌷
4. ఎవరికైతే మందబుద్ది కలిగిన పిల్లలు ఉంటీ అటువంటి వారికి 18 నెలల పాటు భస్మధారణ చేయిస్తే బుద్ది సరిగ్గా కుదుటపడుతుంది ......🌷🌷🌷
5.ఎవరికైతే సంతాన భాగ్యం ఉండదో,లేదా పుట్టినా సంతానం చనిపోతుంటారో అటువంటి వారు విభూది ధారణ చేసి మంగళవారం శ్రీ సుబ్రమణ్యశ్వర సేవను చేస్తే వారికీ పిల్లలు కలుగుతారు.....లేదా బుధవారం శ్రీ మహాగణపతి పూజ సోమవారం శివుని పూజ చేసి భస్మధారణ చేస్తే ఇష్ఠసిద్ది కలుగుతుంది ........🌷🌷🌷
6.విద్యాబ్యాస కాలంలో మరుపు ఎక్కువుగా ఉంటీ శ్రీ సుబ్రమణ్య దేవాలయ భస్మాన్ని నుదుట ధరిస్తే జ్ఞాపక శక్తీ వృద్ది చేoదుతుంది ....🌷🌷🌷
7.జాతకం ప్రకారం దోషాలు ఉంటీ శ్రీ సుబ్రమణ్య స్వామిని పూజించి భస్మాన్ని ధరిస్తే,ఉత్తమ వాక్కుశుద్ది కలిగి పలికినట్లే జరుగుతుంది .......🌷🌷🌷
8.భస్మధారణ విధానాన్ని శాస్త్రభద్డంగా,మంత్రోక్తంగా చేసుకొంటే దైవబలం వృద్ది చేoదుతుంది .......🌷🌷🌷

             సుద్ధ భస్మం(తెల్లని సుద్ద )
       ......  🌿🌹🌠🌿🌹🌠.......
1. దీన్ని తెల్లని సుద్ద మట్టితో తయారు చేస్తారు....ఈ భస్మాన్ని ధరిస్తే విభూది చాల గట్టిగా ఉండి త్వరగా చేరిగిపోదు.....దీని ద్వార గొప్ప ఫలితం ఎమి కలగదు......అయితే దీన్ని మంత్రభద్దంగా ధరిస్తే మాత్రం మంచి ఫలితం ఉంటుంది...... 🌷🌷🌷

                    హోమ భస్మం
        ....... 🌹🌠🔀🌹🌠🔀........
            .🌷🌷🌷..... హోమ భస్మం ధరిస్తే అన్ని భస్మంలకన్నా ఇది విశిష్టత కలిగినది.....హోమ భస్మ ధారణతో మనిషిలో ఉండే అన్ని రకాల దోషాలు నివారించబడుతాయి ...... హోమభస్మ ధారణతో దేవుని అనుగ్రహం కలిగి అన్ని పనులు నిరాటంగా జరుగుతాయి ......
భస్మధారణతో అన్ని రకాల గోచర,అగోచర, దృశ్య,అదృశ్య రోగాలు తొలగిపోతాయి .....🌷🌷🌷

💠శ్రీమహగణపతి హోమ భస్మం ధరిస్తే అన్ని పనులు నిరాటంగా జరుగుతాయి ......
💠శ్రీ సుబ్రమణ్య స్వామి హోమంలోని భస్మం ధరిస్తే ఇంటిలో ఉండే కలహాలు తొలగి అందరికి శాంతి లబిస్తుంది ......
💠శ్రీ దుర్గా హోమంలోని భస్మాన్ని ధరిస్తే సకల శత్రువుల నాశనం జరిగి ప్రసాంతత గల జీవితాన్ని సాగించవచ్చు ......
💠శ్రీ ధన్వంతరి హోమంలోని భస్మాన్ని ధరిస్తే అన్ని రోగాలు నివారించబడి దేహం వజ్ర సమానంగా మారుతుంది ......
💠శ్రీ నవగ్రహ హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఎటువంటి గ్రహాల చేడు ప్రభావం పడదు .....
శ్రీ మృతoజయ హోమంలోని భస్మంతో అన్ని రకాల అకాల మరణాలు తొలగిపోతాయి ......
💠శ్రీ లలితా త్రిపురసుందరి,శ్రీ రాజరాజేశ్వరి దేవి,శ్రీ గాయత్రిదేవి హోమం,శ్రీ చక్ర హోమంలోని భస్మాన్ని ధరిస్తే అన్నీ పనుల్లో విజయం సిద్దించటంతో పాటు జీవితాంతం సుఖమయ జీవితాన్ని అనుభవిస్తారు .....
💠శ్రీ సుదర్శన హోమం భస్మధారణతో శత్రువుల నిర్మూలం జరుగుతుంది .....
💠శ్రీ లక్ష్మి నారాయణ హోమంలోని భస్మాన్ని ధరిస్తే భార్య భర్త మధ్య స్పర్ధలు తొలగిపోతాయి .......

దేవుని హోమంలో ని భస్మాన్ని రజస్వల అయిన మహిళలు తాకకూడదు.....మైల పరచకూడదు......ఒక వేళ మైల పరిస్తే పుణ్యాహం చేయిoచాలి ......
హోమ భస్మధారణతో ఎటువంటి మాంత్రికుల బాధ,దృష్టి,శాపం,గ్రహ బాధలు వేదించవు ......🌷🌷🌷

                    చితా భస్మం
   ........... 💠🌸🌿💠🌸🌿.........
                  🌷🌷🌷🌷 .....ఉజ్జయనిలోని శ్రీ మహాకాల అనే జ్యోతిర్లింగానికి చితా భస్మంతో అభిషేకం చేస్తారు .......🌷🌷🌷

చితాభస్మాన్ని  కాపాలికులు, మాంత్రికులు, ఆఘోరిలు శవసాధకులు, ప్రేతాత్మలను పూజించేవారు, వామచారులు, వామ వర్గాలకు చేoదినవారు ఉపయోగిస్తారు......
మాoత్రికుల్లో ఒక నమ్మకం ఉంది.....తమ గురువుల చితాభస్మాన్ని మాత్రమే ఉపయోగిస్తారు.....దేన్నీ వాడటం ద్వార తమ గురువుల ఆత్మ తమతోనే ఉంటుంది అని నమ్మకం......నియమనుసారం చితాభస్మాన్ని ధరిస్తే ప్రేతాత్మలు భస్మ ధారణ చేసిన వారి మాటను ఎప్పుడు వింటునే ఉంటాయని మంత్ర రహస్యాలలో వివరించబడింది......
శ్రీ మహాకాల జ్యోతిర్లింగానికి అభిషేకం చేసిన భస్మం ప్రసాదంగా మారుతుంది.... .ఇది ఎటువంటి హాని కలిగించాదు..... ఇది క్షేత్ర మహిమ.....

🚩🌹🌻🚩🌹🌻🚩🌹🌻🚩🌹🌻🚩
                   !!!!! జై శ్రీరామ్ !!!!
* Please subscribe to get info of latest posts.
Go to Home page

Comments

Please follow, Like, Comment and share

స్త్రీ కి పర్యాయ పదాలు ఎన్నో తెలుసా?

101 గ్రామ దేవతల పేర్లు

Paka shastram పాక శాస్త్ర వివరణ. భోజనం విధులు

Homam హోమాలు ఎన్ని రకములు వాటి వివరములు

ద్రాక్షారామం దగ్గర నక్షత్ర దేవాలయాలు

108 శక్తి పీఠాలు:

ఎవరు ఏ రుద్రాక్ష ధరించాలి?

హోమము వలన కలుగు లాభములు

108 Temples around Draksharamam

శని జయంతి 15.5.2018