శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ వసంతోత్సవాలు

తిరుపతి శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వసంతోత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు.

 శ్రీ భూ సమేత వేంకటేశ్వరస్వామి, శ్రీసీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి, రుక్మిణి, సత్యభామ సమేత శ్రీక ష్ణుని ఉత్సవమూర్తులను వసంత మండపంలో వేంచేసి ఉన్న ఆస్థానం పై నిర్వహించారు.

 ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం వైభవంగా జరిగింది. ఇందులో పంచద్రవ్యాలైన పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు.
 ఆలయం వెలుపల గల మండపంలో ఊంజల్‌ సేవ జరిగింది.
 స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన మిచ్చారు.









*ఓం...నమో...వేంకటేశాయా...* 

Comments

Please follow, Like, Comment and share

స్త్రీ కి పర్యాయ పదాలు ఎన్నో తెలుసా?

101 గ్రామ దేవతల పేర్లు

108 శక్తి పీఠాలు:

Paka shastram పాక శాస్త్ర వివరణ. భోజనం విధులు

ఎవరు ఏ రుద్రాక్ష ధరించాలి?

ద్రాక్షారామం దగ్గర నక్షత్ర దేవాలయాలు

Homam హోమాలు ఎన్ని రకములు వాటి వివరములు

108 Temples around Draksharamam

హోమము వలన కలుగు లాభములు