Posts

Showing posts from April, 2018

శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం_

Image
_ఘనంగా శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం_29-04-2018 తిరుపతి చిత్రాపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 5.00 గంటలకు ఆలయం నుండి శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి, ఆండాల్‌ అమ్మవారు, శ్రీకృష్ణస్వామి, విష్వక్సేనులవారు తదితర తొమ్మిది మంది దేవేరుల ఊరేగింపు ప్రారంభమైంది. ఉదయం 7.00 గంటలకు తనపల్లి రోడ్డులో గల పొన్నకాల్వ మండపానికి ఊరేగింపు చేరుకుంది. అనంతరం అక్కడ ఉదయం 8.00 నుండి 10.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్ళతో స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు అభిషేకం చేశారు. అనంతరం వాహన మండపంలో సేవాకాలం, శాత్తుమొర, ఆస్థానం నిర్వహించారు. సాయంత్రం 4.30 నుండి 5.30 గంటల వరకు ఊంజలసేవ, ఆస్థానం చేపట్టనున్నారు. ఆ తరువాత సాయంత్రం 5.30 గంటలకు శ్రీగోవిందరాజస్వామివారు అక్కడినుండి బయలుదేరి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. గోవిందరాజస్వామివారు వచ్చే సమయంలో అమ్మవారి ఆలయంలో ఒక తలుపు మూసి

నవ గ్రహలకు ప్రదక్షిణలు ఎలా చేయాలి?

🏵️పద్ధతి ప్రకారం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే ఫలితం🍁🌿 🏵️నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి.. పద్ధతి ప్రకారం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. ఎలా చేయాలి ? ఎన్నిసార్లు చేయాలి ?🌿 🏵️నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి. కానీ వాటిని పూజించడానికి ప్రజలు జంకుతుంటారు. కారణం ఎప్పుడు, ఎలా ప్రదక్షిణలు చేయాలో తెలియదు. ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలియదు. నవ గ్రహాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలో తెలియదు. అయితే నవగ్రహ ప్రదక్షిణలకు ఒక పద్ధతి ఉంది. పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలుంటాయి. మానవ జీవం, మానసిక పరిస్థితి ప్రధానంగా వారి వారి గ్రహాల స్థితిపై ఆధారపడి వుంటుందని జ్యోతిష్క శాస్త్రం చెబుతోంది.🌿 🏵️గ్రహస్థితిలో మార్పులు వల్లనే ఎవరి జీవితంలో అయినా ఒడిదుడుకులు ఎదురవ్వడం గానీ, లాభాలు, సంతోషాలు కలిసిరావడం గానీ వస్తుంటాయి. నవగ్రహ ప్రదక్షిణ మనిషి కష్టనష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుంది. నవగ్రహ ప్రదక్షిణలకు ఒక నిర్దిష్టమైన పద్ధతి వుంది. ఆ పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది.🌿 🏵️కొంతమంది ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు నవగ్రహాలను తాకుతూ ప్రదక్షి

ఈ రోజు 29-04-2018 కూర్మ జయంతి

Image
_*ఈ  రోజు కూర్మ జయంతి సందర్భంగా* *శ్రీకూర్మం" క్షేత్రాన్ని దర్శించుకోండి!*_ దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలెత్తాడు. అందులో రెండో కూర్మావతారం. కృతయుగంలో దేవ, దానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలకడం మొదలు పెట్టారు. మందరగిరిని కవ్వంగా, వాసుకుని తాడుగా చేసుకుని దేవాసురులు పాలసముద్రాన్ని చిలుకుతుండగా మందరగిరి సముద్రంలోకి జారిపోతూ సముద్ర మధనానికి ఆటంకం కలిగింది. ఈ ఆటంకం నుంచి బయటపడేలా అనుగ్రహించమని దేవతలు మహావిష్ణువు వేడుకున్నారు. అప్పుడు నారాయణుడు కూర్మరూపం దాల్చి సముద్రంలోకి మందరగిరిని మునిగిపోకుండా చేశాడు. అలా ఉద్భవించినదే కూర్మావతారం. కూర్మవతారాన్ని కొలిచే ఆలయాలు దేశంలోనే కాదు ప్రపంచంలోనూ చాలా తక్కువ. కానీ ప్రపంచంలోనే ఏకైక కూర్మదేవాలయంగా చెప్పబడుతున్న పుణ్యక్షేత్రం శ్రీకూర్మం. అరుదైన శిల్పకళతో రూపుదిద్దిన ఈ ఆలయం శివకేశవ అబేధాన్ని సూచించే క్షేత్రంగా విరాజిల్లుతోంది. శ్రీకాకుళం జిల్లాలోని గార మండలంలో శ్రీకాకుళం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వంశధారా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. కళింగరాజైన అనంగభీముడు కూర్మనాధస్వామి ఆలయాన్ని పునర్‌నిర్మించినట్లు చరిత్ర చ

చిత్తా పౌర్ణమి సందర్భంగా తిరువన్నామలై విశేషాలు

Image
చిత్తా పౌర్ణమి సందర్భంగా తిరువన్నామలై లో 26-04-2018 నాటి విశేషాలు

వివిధ రూపంలో సాలగ్రామాలు

వివిధ రూపంలో సాలగ్రామాలు

_శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము_

      *_శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము_* ఓం శ్రీమాతా, శ్రీమహారాజ్ఞీ, శ్రీమత్సింహాసనేశ్వరీ | చిదగ్నికుండ సంభూతా, దేవకార్య సముద్యతా | | 1 ఉద్యద్భాను సహస్రాభా, చతుర్బాహు సమన్వితా | రాగస్వరూప పాశాడ్యా, క్రోధాకారాంకుశోజ్జ్వలా | | 2 మనో రూపేక్షు కోదండా, పంచతన్మాత్ర సాయకా | నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా | | 3 చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా | కురువింద మణిశ్రేణీ కనత్కోటీర మండితా | | 4 అష్టమీ చంద్రవిభ్రాజ దళికస్థల శోభితా | ముఖచంద్ర కళాంకాభ మృగనాభి విశేషకా | | 5 వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా | వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా | | 6 నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితా | తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా | | 7 కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా | తాటంక యుగళీభూత తపనోడుప మండలా | | 8 పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః | నవవిద్రుమబింబశ్రీ న్యక్కారి రదనచ్ఛదా | | 9 శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలా | కర్పూరవీటికామోద సమాకర్షద్దిగంతరా | | 10 నిజసల్లాప మాధ్య్ర్య వినిర్భర్విత కచ్ఛపీ | మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా | | 11 అన

Sri Kailasanathar temple Kumbabhishekam

Image
On the eve of Taramangalam (Salem) Sri Kailasanathar temple  Kumbabhishekam, today 26-04-2018 people are in procession to temple with  khumbhams like ocean waves.

దత్తాత్రేయ స్వామి చరిత్ర

                    దత్తాత్రేయ స్వామి చరిత్ర :                     🕉🚩🕉🚩🕉🚩                      ⚜🚩⚜🚩⚜🚩. మసక చీకటిలో త్రాడును చూచి పామని భ్రమించి భయపడతాము. కాని తర్వాత దీపం సహాయంతో అది తాడని తెలియగానే ఆ భ్రాంతి, భయము తోలుగుతాయి. అలానే వాస్తవానికి బ్రహ్మమనబడు పరమాత్మా ఒక్కడే ఉన్నాడు. అజ్ఞానం వలన మనకు ఆయన స్థానే జగత్తు గోచరించి భయము, ఆశ, దుఃఖము కల్గుతాయి. ఆత్మజ్ఞానమనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితము, ఆనందమయము అయిన బ్రహ్మమే సత్యమని అనుభవమవుతుంది. అపుడు భయానికి, దుఃఖానికి కారణమైన జగత్తున్నదనే భ్రాంతి తొలుగుతుంది. అంటే ఈ జగత్తు మిధ్యయని తేలిపోతుంది. సర్వత్రా నిండియున్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్త్వం. సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయ పూర్వక నమస్కారము. ఆ పరబ్రహ్మమే సత్యమైనది. అజ్ఞానం వలన దుఃఖంలో మ్రగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిధి తన నిజతత్త్వాన్ని బోధించడానికి అత్రైమహాముని పుత్రుడై జన్మించి, శ్రీ దత్తాత్రేయుడని పేరు పొందాడు. భక్తితో తనను ఆశ్రయించిన కార్తవీర్యార్జునుడు, యదువు మొ||న వారిని ఈ సంసారమనే దుఃఖసాగరం నుండి ఉద్దరించాడు. ఆయనన

నెల్లూరు, శ్రీరంగనాధుని పుష్పపల్లకి మహోత్సవం

Image
నెల్లూరు, శ్రీరంగనాధుని పుష్పపల్లకి మహోత్సవం

Floating idol in Nepal

भगवान विष्णु जी 1300 वर्षो  से तैरते हुए पर कडाल आदि शैया पर यह मंदिर भूतनीकंटा , जो नौ कि.मी.नेपाल की राजधानी से दूरी पर स्तिथ हैं विश्व के अनेक वैज्ञानिकों के लिऐ यह शोध और कौतूहल का विषय रहा है यह 14 फीट पानी पर तैरती विश्व की एक मात्र मूर्ती है । Lord Vishnu ji floating for 1300 years, but this temple on Kadal etc. Shayya, this temple is located at a distance of nine kilometers from Nepal's capital, for many scientists in the world, it has been the subject of research and curiosity on 14 feet of water. This idol is the only swimming idol in the world.

Pune's Dhagadu seth ganapati decorated with 11,000 mangoes

Image
Pune's Dhagadu seth ganapati decorated with 11,000 mangoes

Fruit & flower decoration in Tirumala venkateswara swamy temple

తిరుమల పద్మావతి పరిణయం సందర్భంగా వివిధరకాల పల ,పుష్ప  అలంకరణతో చేసిన వేదిక చూసి తరించండి తిరుమల శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.  అష్టలక్ష్మీ మండపంలో వేడుకగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు ప్రారంభం తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో స్వర్ణకాంతులు విరజిమ్మేలా ఏర్పాటుచేసిన అష్టలక్ష్మీమండపంలో మంగళవారం నాడు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వైశాఖశుద్ధ దశమి పూర్వ ఫల్గుణి నక్షత్రంలో ఆకాశరాజు తన కుమార్తె అయిన శ్రీ పద్మావతిని శ్రీవేంకటేశ్వరునికి ఇచ్చి వివాహం చేసినట్టు పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. ఆనాటి పద్మావతీ శ్రీనివాసుల కల్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా 1992వ సంవత్సరం నుంచి ప్రతి వైశాఖ శుద్ధ దశమినాటికి ముందు ఒక రోజు, తరువాత ఒక రోజు కలిపి మొత్తం మూడురోజుల పాటు పద్మావతీ పరిణయోత్సవాన్ని టిటిడి నిర్వహిస్తోంద శ్రీమలయప్పస్వామివారు తొలిరోజు గజవాహనం, రెండవరోజు అశ్వ వాహనం, చివరిరోజు గరుడవాహనంపై వేంచేపు చేస్తారని, మరోపక్క ఉభయనాంచారులు ప్రత్యేక పల్లకీలలో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారని, ఆ తరువాత కల్య

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి 25-04-2018

Image
పెనుగొండ శ్రీ వాసవి కన్యకపరమేశ్వరి మూలవిరాట్ కు లక్ష మల్లెలు పూజ. అందరూ దర్శించుకొని వాసవిమాత అనుగ్రహం పొందగలరు శ్రీ వాసవి మాత కు వారాహి అలంకారం       పెనుగొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి*_ 🔔🕉🔔🕉🔔🕉🔔🕉🔔🕉🔔 వాసవి దేవి జననం: వేంగి దేశాన్ని ఏలే కుసుమ శ్రేష్టి వైశ్యులకు రాజు. ఈ ప్రాంతం విష్ణు వర్ధనుడు (విమలాదిత్య మహారాజు) ఆధీనంలో ఉండేది. క్రీ.శ. 10, 11వ శతాబ్ధాలలో కుసుమ శ్రేష్టి సుమారు 18 పరగణాలను పెనుగొండ ను రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉండేవాదు. ఆయన,ఆయన భార్య కుసుమాంబ ఆదర్శ దంపతులుగా మెలిగి ప్రశాంతమైన జీవనం గడిపేవారు. శివుని(నాగేశ్వర స్వామి) ఆరాధన వారి దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండేది. వివాహం అయిన చాల సంవత్సరాలకి కూడా ఆ దంపతులకి సంతానం కలుగలేదు. రాజ్యానికి వారసులు లేక వారు చింతిచేవారు. ఎన్ని ప్రార్ధనలు చేసినా, నోములు నోచినా వారి కోరిక తీరలేదు. అపుడు వారు తమ కుల గురువు అయిన భాస్కరాచార్యులను సంప్రదించగా, వారికి దశరధుడు చేసిన పుత్ర కామేష్టి యాగాన్ని చేయమని చెప్పారు. ఒక పవిత్ర కాలంలో వారు ఆ యాగాన్ని తలపెట్టారు. దేవతలు అనుగ్రహించి యజ్ఞ ఫలాన్ని ప్రస

శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు

Image
 అష్ఠ లక్ష్మీ మండపం లో వేడుకగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు ప్రారంభం తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో స్వర్ణకాంతులు విరజిమ్మేలా ఏర్పాటుచేసిన అష్టలక్ష్మీమండపంలో మంగళవారం నాడు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ వైశాఖశుద్ధ దశమి పూర్వ ఫల్గుణి నక్షత్రంలో ఆకాశరాజు తన కుమార్తె అయిన శ్రీ పద్మావతిని శ్రీవేంకటేశ్వరునికి ఇచ్చి వివాహం చేసినట్టు పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. ఆనాటి పద్మావతీ శ్రీనివాసుల కల్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా 1992వ సంవత్సరం నుంచి ప్రతి వైశాఖ శుద్ధ దశమినాటికి ముందు ఒక రోజు, తరువాత ఒక రోజు కలిపి మొత్తం మూడురోజుల పాటు పద్మావతీ పరిణయోత్సవాన్ని టిటిడి నిర్వహిస్తోందన్నారు. శ్రీమలయప్పస్వామివారు తొలిరోజు గజవాహనం, రెండవరోజు అశ్వ వాహనం, చివరిరోజు గరుడవాహనంపై వేంచేపు చేస్తారని, మరోపక్క ఉభయనాంచారులు ప్రత్యేక పల్లకీలలో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారని, ఆ తరువాత కల్యాణ మహోత్సవం