ఆది శంకరాచార్య జయంతి



20/04/2018న
ఆదిశంకరాచార్య జయంతి.

ఆదిశంకరుల వారు జన్మించిన పుణ్యదినం వైశాఖ శుద్ధ పంచమి. జగద్గురువు అనే మాటకి సంపూర్ణంగా తగినటువంటి వారు శంకర భగవత్పాదుల వారు. శంకరులను గ్రహించాలి అంటే ఒక నిర్మలమైన అంతఃకరణం ఉండాలి. వ్యాసుని అవతారం తర్వాత మళ్ళీ అంతటి అవతారం శంకరావతారమే. ద్వాపర యుగాంతంలో రానున్న కలియుగ మానవులకి జ్ఞానం అందించాలని చెప్పి వ్యాసుడు తాపత్రయ పడి వేదములను విభజన చేసే వేదాంత శాస్త్రమైన బ్రహ్మ సూత్రాలను రచించి అటుతర్వాత అష్టాదశ పురాణాలు అందించి మహాభారత ఇతిహాసాన్నిచ్చి తద్వారా భగవద్గీత, సనత్ సుజాతీయం మొదలైన బ్రహ్మవిద్యా గ్రంథాలను రచించి ఒక వ్యవస్థను చేశారు వ్యాసభగవానులు. కానీ కలి ప్రభావం చేత ఉన్న వైదిక మతం యొక్క హృదయాన్ని అర్థం చేసుకోలేక అందులో రకరకాల చీలికలు వచ్చి వైవిధ్యాన్ని వైరుధ్యం అనుకునే పద్ధతిలోకి వెళ్ళిపోయారు. అనేక అవైదిక మతాలు పుట్టుకు వచ్చి ఆస్తికత అల్లల్లాడిపోతున్న రోజులవి. ధార్మికత దెబ్బతిన్న రోజులవి, తాత్త్వికత సన్నగిల్లుతున్న రోజులవి. సనాతన ధర్మం క్షీణ దశకు వచ్చిన సమయంలో అవతరించిన సాక్షాత్ శంకరులే శంకరాచార్యుల వారు.

ఏకమేవ అద్వితీయం బ్రహ్మ’ – సృష్టిలో బ్రహ్మ తప్ప అన్యమేదీ లేదనీ, ‘సర్వం ఈశావాస్యం’- సకల చరాచర సృష్టి అంతా ఒకే దివ్య చైతన్యంతో నిండి నిబిడీకృతమై ఉన్నదనీ; భారతీయ వేదాంత విజ్ఞానాన్ని దేశం నలుమూలలా ప్రచారం చేసి, బ్రహ్మ విద్యాసంప్రదాయాన్ని పునఃప్రతిష్ఠించిన వివేకరత్నం – ఆది శంకరాచార్యులు. ధర్మ జిజ్ఞాసను, బ్రహ్మ జిజ్ఞాసతో అనుసంధానం చేశారు. వేద ప్రతిపాదిత ‘అద్వైత’ తత్త్వం ప్రబోధించారు. జాతీయ సమైక్యాన్ని పునరుద్ధరించి సనాతన ధర్మ రక్షణ కోసం జగద్గురు పీఠాలను నెలకొల్పారు.

*ఆది శంకరాచార్యుల వైభవం* :-
ఆది శంకరాచార్యులు 32వ ఏట శరీరాన్ని విడిచిపెట్టేలోపు చేసిన స్తోత్రాలు-రచనలు,-భాష్యాల వివరాలు.

*గణపతి స్తోత్రాలు*:
గణేశ భుజంగ స్తోత్రం
గణేశ పంచరత్న స్తోత్రం
వరద గణేశ స్తోత్రం
గణేశాష్టకం

*సుబ్రహమణ్య స్తోత్రాలు*:
సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం

*శివ స్తోత్రాలు*:
అర్థనాదీశ్వర స్తోత్రం
దశస్లోకి స్తుతి
దక్షిణామూర్తి  స్తోత్రం
దక్షిణామూర్తి  అష్టకం
దక్షిణామూర్తి  వర్ణమాల స్తోత్రం
ద్వాదశ లింగ స్తోత్రం
కాల భైరవ  అష్టకం
శ్రీ  మృత్యుంజయ  మానసిక  పూజ  స్తోత్రం
శివ  అపరాధ  క్షమాపణ  స్తోత్రం
శివానందలహరి
శివ భుజంగ స్తోత్రం
శివ కేశాది పదాంత వర్ణన స్తోత్రం
శివ మానస పూజ
శివ నామావళి అష్టకం
శివ పాదాది కేశాంత వర్ణన స్తోత్రం
శివ పంచాక్షర స్తోత్రం
శివ పంచాక్షర నక్షత్రమాల
సువర్ణ మాల స్తుతి
ఉమా మహేశ్వర స్తోత్రం
వేదసార శివస్తోత్రం
శివాష్టకం

*అమ్మవారి స్తోత్రాలు* :
అన్నపూర్ణ అష్టకం
ఆనంద లహరి
అన్నపూర్ణ స్తోత్రం
అన్నపురణ స్తుతి
అంబాష్టకం
అంబాపంచరత్నం
భగవతి మానస పూజ
భవాని అష్టకం
భవాని భుజంగం
బ్రమరంబ అష్టకం
దేవి భుజంగ స్తోత్రం
దేవి చతుశ్శస్త్య ఉపచార పూజ
దేవి పంచరత్నం
దేవి అపరాధ క్షేమాపణా స్తోత్రం
దేవి అపరాధ భజన స్తోత్రం
గౌరీ దశకం
హరగౌరీ అష్టకం
కాళి అపరాధ భజన స్తోత్రం
కామ భుజంగ  ప్రయత
కామబింబ అష్టకం
కనకధారా స్తోత్రం
శ్రీలలితా పంచరత్నం
మంత్రముత్రిక పుష్పమాలస్థావం
మాతృకా పుష్ప మాల స్తుతి
మీనాక్షి స్తోత్రం
మీనాక్షి పంచరత్నం
నవరత్నమాలిక
రాజరాజేశ్వరి అష్టకం
శారద భుజంగ ప్రయతా అష్టకం
సౌందర్యలహరి
శ్యామల నవరత్న మాలిక స్తోత్రం
త్రిపురాసుందరి అష్టకం
త్రిపురాసుందరి మనసపూజ స్తోత్రం
త్రిపురసుందరి వేదపద స్తోత్రం

*విష్ణు స్తోత్రాలు* :
అచుతాష్టకం
భగవాన్ మానసపూజ
భజగోవిందం
హరిమీడే స్తోత్రం
హరి నామావళి స్తోత్రం
హరి శరణాష్టకం
శ్రీ విష్ణు భుజంగ ప్రయతా స్తోత్రం
జగన్నాథాష్టకం
కృష్ణాష్టకం
లక్ష్మినృసింహ పంచరత్నం
నారాయణ స్తోత్రం
పాండురంగాష్టకం
రామ భుజంగ ప్రయతా స్తోత్రం
రంగనాథాష్టకం
లక్ష్మినృసింహ కరుణారస స్తోత్రం
లక్ష్మినృసింహ కరవలమబ స్తోత్రం
షట్పది స్తోత్రం
విష్ణు పాదాదికేశాంత స్తోత్రం

*హనుమాన్ స్తోత్రాలు*
హనుమత్ పంచరత్నం

*ఇతర స్తోత్రాలు*:
మాతృ పంచకం
కౌపీన పంచకం
కళ్యాణ వృష్టి
నవరత్నమాలిక
పుష్కరాష్టకం
మొహాముద్గ్రహ స్తోత్రం

*క్షేత్ర స్తోత్రాలు*:
కాశి పంచకం
కాశి స్తోత్రం
మణికర్ణికాష్టకం
ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం

*నదీ స్తోత్రాలు*:
గంగాష్టకం
గంగా స్తోత్రం
నర్మదాష్టకం
యమునాష్టకం

*ప్రకరణ గ్రంధాలు*:
అద్వైత అనుభూతి
అజ్ఞాన భోదిని
అమరు శతకం
అనాత్మశ్రీ వికర్హన
అపరోక్షానుభుతి
ఆత్మ-అనాత్మ వివేకం
ఆత్మ బోధం
ఆత్మజ్ఞాన ఉపదేసనవిధి
దృక్ దర్శన వివేకం
ఆత్మ పంచకం
అత్మశతకమ్
అద్వైత పంచకం
అత్మపూజ-పరపూజ
బాలబోధ సంగ్రహం
భోధసారం
అత్మచింతన
బ్రహ్మచింతన
బ్రాహ్మణా వలిమాల
ధ్యానాష్టకం
జ్ఞానగంగాష్టకం
గురు అష్టకం
జీవన ముక్త్యనందలహరి
యతి పంచకం
మణిరత్నమాల
మానిషా పంచకం
మాయా పంచకం
మతామ్నాయ
నిర్గుణ మనసపూజ
నిర్వాణ దశకం/సిధాంత బిందు
నిర్వాణ మంజరి
నిర్వాణ శతకం/ఆత్మ శతకం
పంచీకరణం
ప్రభోద సుధాకరం
ప్రశ్నోతర రత్నమాలిక
ప్రపంచసార తంత్రం
ప్రాతః స్మరణ స్తోత్రం
ప్రౌడానుభుతి
సదాచార సంతానం
సాధనా పంచకం/ఉపదేశ పంచకం
శంకర స్మృతి
సన్యాస పథ్థతి
సారతత్వ ఉపదేశం
సర్పత పంచారిక
సర్వసిధాంత సంగ్రహం
సర్వ వేదాంత సిద్దాంత సార సంగ్రహం
స్వాత్మ నిరూపణం
స్వాత్మ ప్రకాశికం
స్వరూపానుసంతానాష్టకం
తత్వ బోధం
తత్వ ఉపదేశం
ఉపదేశసహస్రి
వాక్యసిత
వాక్యవృతి
వేదాంత కేసరి
వేదాంత శతశ్లోకి
వివేకచూడామణి
ఏకస్లోకి
యోగ తారావళి

*భాష్య గ్రంధాలు* :
విష్ణు సహస్రనామ భాష్యం
లలిత త్రిశతి భాష్యం
యోగసూత్ర భాష్యం
భగవద్గీత భాష్యం
ఉపనిషద భాష్యం
బ్రహ్మసూత్ర భాష్యం

************************************

ఒకసారి శ్రీశంకరాచార్యులవారికి లలిత అమ్మవారు 64 కళలతో, 64 యోగినీ దేవతలు చతుఃషష్టి ఉపచారాలు చేస్తూ ఉన్న రూపంతో, దర్శనమిచ్చినపుడు ఆ ఆనందపారవశ్యములో ఆశువుగా రచించిన స్తోత్రంలో అమ్మవారికే అధికారం ఉన్న చతుఃషష్టి ఉపచారాలను ఈ విధంగా వివరించారు. అవి.
1. అర్ఘ్యం,పాద్యం,ఆచమనీయం – అమ్మవారి కాళ్ళు, చేతులు జలముతో కడిగి, త్రాగుటకు జలము సమర్పించడం
2. అభరణ అవరోపణం – ముందురోజు వేసియున్న ఆభరాణాలు తీయడం
3. సుగంధ తైలాభ్యంజనం – వంటికి నూనె పట్టించడం
4. మజ్జనశాలా ప్రవేశము – స్నానాల గదికి తీసుకొని వెళ్ళడం
5. మణిపీఠోపవేశనం – మణులతో అలంకరించిన పీఠముపై కూర్చోపెట్టడం
6. దివ్యస్నానీయ ఉద్వర్తనం – నలుగు పెట్టుట
7. ఉష్ణోదక స్నానము – వేడి నీటితో స్నానము చేయించుట
8. కనక కలశచ్యుత సకల తీర్థాభిషేచనం – బంగారుకలశలలో పవిత్రనదులనుండి తీసుకువచ్చిన సకల పవిత్ర తీర్థములతో అభిషేకము
9. ధౌతవస్త్ర పరిమార్జనం – పొడిగుడ్డతో శుభ్రంగా తుడవడం
10. అరుణ దుకూల పరిధానం – ఎర్రని వస్త్రము ధరింపజేయడం
11. అరుణకుచోత్తరీయం – ఎర్రని ఉత్తరీయమును (జాకెట్టు) ధరింపజేయడం
12. ఆలేపన మంటప ప్రవేశనం – అత్తరు మొదలైన అలేపనలు పూసే గృహానికి అమ్మవారిని తీసుకొని వెళ్ళడం అక్కడ మళ్ళీ మణిపీఠముపై కూర్చోపెట్టడం
13. చందన అగరు కుంకుమ సంకు మృగమద కర్పూర కస్తూరీ గోరోజనాది దివ్య గంధ సర్వాంగీణ ఆలేపనం – వివిధ దివ్య గంధములను అమ్మవారికి అలదింపజేయడం
14. కేశాభరస్య కలాదుల అగరు ధూపం – కేశములు విస్తారపరచి సుగంధధూపం వేయడం
15. జడవేసి, మల్లికా మాలతీ చంపక అశోక శతపత్ర పూగ క్రముక మంజరీ పున్నాగ కల్హార ముఖ్య సర్వ ఋతు కుసుమమాల సంప్రయం - వివిధఋతువులలో పూచిన సుగంధ పుష్పములతో అల్లిన మాలతో అమ్మవారిని అలంకరించడం
16. భూషణమండప ప్రవేశము – అలంకార గది ప్రవేశము
17. మణిపీఠోపవేశనము - అక్కడమళ్ళీ మణిపీఠం పై కూర్చోపెట్టడము
18. నవమణిమకుట ధారణ – తొమ్మిది రకాల మణులతో కూర్చిన కిరీటం పెట్టడం
19. దానిపైన చంద్ర శకలం పెట్టడం
20. సీమంతంలో సిధూరాన్ని దిద్దడం
21. తిలక ధారణము – నుదుటిపై తిలకంతో బొట్టు పెట్టడం
22. కాలాంజనం దిద్దడం – అమ్మవారి కళ్ళకు కాటుక పెట్టడం
23. పాళీయగళం – అమ్మవారికి చెంప స్వరాలు (మావటీలు) అలంకారం చేయడం
24. మణికుండళయుగళం - మణికుండలములు రెండు చెవులకు అలంకరించడం
25. నాసాభరణం – ముక్కుకి నాసాభరణం అలంకరించడం
26. అధరయావక లేపనం – పెదవులకు పూసే లత్తుక పూయడం
27. ఆర్య భూషణం - ప్రధాన భూషణం అలంకరించడము
28. మాంగల్య సూత్రము – మాంగల్య సూత్రమును అలంకరించుట
29. హేమచింతాకం – బంగారుతో కూడిన చింతామణులమాల వేయడం
30. పతకం – బంగారు పతకం
31. మహాపతకం – పెద్దదిగా ఉన్న బంగారు పతకం
32. ముక్తావళి – మూడు వరుసల ముత్యాలహారం
33. ఏకావళి – 27 ముత్యాలతో కూడిన ఒక వరుస ముత్యాలహారం
34. చన్నభీరము – యజ్ఞోపవితం లాగ భుజములమీదనుండి వేసే ఒక ఆభరణము
35. కేయూర యుగళ భూషణ చతుష్టయము – నాలుగు చేతులకు నాలుగు కేయీరములు ( దండ కడియాలు)
36. వలయావళి – నాలుగు చేతులకు కంకణములు
37. ఊర్మికావళి – నాలుగు చేతులకు ఉంగరములు
38. కాంచీధామము – వడ్డాణము అని పెలువబడే నడుము చుట్టూ అలంకరించే ఆభరణము
39. కటిసూత్రము – వడ్డాణానికి చుట్టూ మువ్వలతో ఉండే సూత్రము
40. సౌభాగ్యాభరణం – అశోకచెట్టు ఆకులాగ ఉండే ఒక ఆభరణం (కుత్తిగంటు)
41. పాదకటకం – కాలి అందెలు
42. రత్ననూపురములు – దానిచుట్టూ మువ్వల రత్ననూపురములు
43. పాదంగుళీయములు - మట్టెలు
44. పాశం – పైన ఉన్న కుడి చేతిలో తాడు
45. అంకుశం – పైన ఉన్న ఎడమ చేతిలో అంకుశం
46. పుండ్రేక్షు చాపము – క్రింద ఉన్నకుడి చేతిలో చెరుకువిల్లు
47. పుష్పబాణములు – కింద ఉన్న ఎడమ చేతిలో పుష్పములతో చేసిన బాణములు
48. శ్రీ మణి మాణిక్య పాదుక – ఎర్రని మణులతో ప్రకాశించే పాదుకలు
49. స్వ సామన వేషభి ఆవరణ దేవతాభి సహ మహాచక్రాథిరోహణము – సర్వాలంకాణలతో ఉన్న ఆవరణదేవతలతో కూడిన మహాసింహాసనముపై అమ్మవారిని అధిష్టింపజేయడం
50. కామేశ్వరాంగ పర్యాంక ఉపవేశము – అమ్మవారిని కామేశ్వరుని పర్యంకముపై కూర్చొండబెట్టుట
51. అమృతచషకము – అమ్మవారికి త్రాగుటకు పాత్రతో మధువును అందించుట
52. ఆచమనీయము – జలమునందించుట
53. కర్పూరవీటిక – కర్పూర తాంబూలము నందించుట ( కర్పూరతాంబూలం అంటే ఎలాఉంటుందో, అందులో ఏ ఏ సుగధద్రవ్యాలు ఉంటాయో ఈ క్రింద వివరించడమనది)
54. ఆనందోల్లాస విలాస హాసము – అమ్మవారు తాంబూలం సేవిస్తూ ఆమె సంతసము, అనుగ్రహము తో కూడిన చేసే మందహాసము
55. మంగళార్తికం – దీపముల గుత్తి ని అమ్మవారి చుట్టూ తిప్పడం
56. ఛత్రము – అమ్మవారికి గొడుగు పట్టుట
57. చామరము – అమ్మవారికి చామరము వీచుట
58. దర్పణమ్ – అమ్మవారికి దర్పణం చూపించుట
59. తాళావృతం – అమ్మవారికి విసనకర్రతో విసురుట
60. చందనం – గంధం పమర్పించుట
61. పుష్పం – పుష్పాలను సమర్పించుట
62. ధూపము – సువాసనభరితమైన ధూపమును వేయుట
63. దీపము – దీప దర్శనము చేయించుట
64. నైవేద్య,తాంబూల,నీరాజన నమస్కారములు – నవరసభరితమైన నైవేద్యమును సమర్పించుట, తరువాత తాంబూల నీరాజనాది సత్కారములతో నమస్కరించుట
ఏకాంతము..
ఆదిశంకరాచార్య చరిత్ర  కొరకు క్రింద క్లిక్ చేయండి.
ఆదిశంకరాచార్య చరిత్ర


Comments

Please follow, Like, Comment and share

స్త్రీ కి పర్యాయ పదాలు ఎన్నో తెలుసా?

101 గ్రామ దేవతల పేర్లు

108 శక్తి పీఠాలు:

Paka shastram పాక శాస్త్ర వివరణ. భోజనం విధులు

Homam హోమాలు ఎన్ని రకములు వాటి వివరములు

సంస్కారాలు - ముహూర్తములు

సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు

_*ఉండ్రాళ్ళతద్ది నోము గురించి తెలుసు కుందాం రండి*_

శనీశ్వరుడు గురించి తెలుసుకుందాం, శని భాదల నుండి విముక్తులం అవుదాం

వరలక్ష్మి వ్రతం