శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం_

_ఘనంగా శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం_29-04-2018

తిరుపతి చిత్రాపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 5.00 గంటలకు ఆలయం నుండి శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి, ఆండాల్‌ అమ్మవారు, శ్రీకృష్ణస్వామి, విష్వక్సేనులవారు తదితర తొమ్మిది మంది దేవేరుల ఊరేగింపు ప్రారంభమైంది. ఉదయం 7.00 గంటలకు తనపల్లి రోడ్డులో గల పొన్నకాల్వ మండపానికి ఊరేగింపు చేరుకుంది.

అనంతరం అక్కడ ఉదయం 8.00 నుండి 10.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్ళతో స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు అభిషేకం చేశారు. అనంతరం వాహన మండపంలో సేవాకాలం, శాత్తుమొర, ఆస్థానం నిర్వహించారు.










సాయంత్రం 4.30 నుండి 5.30 గంటల వరకు ఊంజలసేవ, ఆస్థానం చేపట్టనున్నారు. ఆ తరువాత సాయంత్రం 5.30 గంటలకు శ్రీగోవిందరాజస్వామివారు అక్కడినుండి బయలుదేరి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. గోవిందరాజస్వామివారు వచ్చే సమయంలో అమ్మవారి ఆలయంలో ఒక తలుపు మూసి ఉంచుతారు. బావగారైన గోవిందరాజస్వామివారు వచ్చారని పద్మావతి అమ్మవారు లోపలి నుండి ఆసక్తిగా తొంగి చూస్తారని, అందుకే ఆలయం ఒక తలుపు మూసి ఉంచుతారని పురాణాల ద్వారా తెలుస్తోంది. అక్కడ పూజాధికాలు ముగించుకుని గోవిందరాజస్వామివారు ఊరేగింపుగా బయలుదేరి రాత్రి 9.30 గంటలకు తిరిగి శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకోవడంతో పొన్నకాల్వ ఉత్సవం ముగుస్తుంది.


ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి వరలక్ష్మీ, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

🦑ఓం...నమో...వేంకటేశాయా...* 🦑_

Comments

Post a Comment

Please follow, Like, Comment and share

101 గ్రామ దేవతల పేర్లు

స్త్రీ కి పర్యాయ పదాలు ఎన్నో తెలుసా?

శని జయంతి 15.5.2018

Homam హోమాలు ఎన్ని రకములు వాటి వివరములు

సంస్కారాలు - ముహూర్తములు

Paka shastram పాక శాస్త్ర వివరణ. భోజనం విధులు

simhadri Appanna nijarapu darshanam

శనీశ్వరుడు గురించి తెలుసుకుందాం, శని భాదల నుండి విముక్తులం అవుదాం

తద్దినాలు పెట్టడము అవసరమా

తిరువణ్ణామలై ( అరుణాచలం )