12000 మరణాలను చూసిన వ్యక్తి చెబుతున్న జీవిత సత్యాలు
12000 మరణాలను చూసిన వ్యక్తి చెబుతున్న జీవిత సత్యాలు కాశీలో మరణిస్తే “మోక్షం” ప్రాప్తిస్తుంది అని హిందువులలో ఒక విశ్వాసం. అందుకోసం జీవిత అంత్యకాలం కాశీలో గడపడానికి వెళుతూ ఉంటారు . అటువంటి వారికీ వసతిని కల్పించే ముఖ్యమైన మూడింటిలో కాశీలాభ్ ముక్తిభవన్ ఒకటి. మిగతా రెండూ ముముక్షు భవన్, గంగాలాభ్ భవన్ . 1908లో కాశీలాభ్ ముక్తి భవన్ స్థాపించబడింది. 44 సంవత్సరాల పాటు కాశీలాభ్ ముక్తి భవన్ మేనేజరుగా పనిచేసిన భైరవనాద్ శుక్లా ఆ భవనం ఎదుట ఎర్రని గోడల ముందు చెక్క కుర్చీలో కూర్చుని చెప్పిన విషయాలు ఇపుడు నేను మీ ముందు ఉంచబోతున్నాను. 1. Resolve all conflicts before you go (అంత్య కాలానికి ముందే క్రోధాన్ని విడనాడు): శ్రీరాం సాగర్ అనే ఒక సంస్కృత పండితుడు ఆరుగురు అన్నదమ్ములలో పెద్దవాడు. చిన్న తమ్ముడు అంటే ఇష్టం. కానీ కాలక్రమంలో ఇద్దరి మధ్య గొడవలు వచ్చి ఇంట్లో అడ్డుగా గోడ కట్టించే వరకూ వెళ్ళింది. ఆయన తన అంత్యకాలంలో కాశీలాభ్ ముక్తి భవన్ లో మూడవ నెంబరు రూమ్ బుక్ చేసుకున్నారు. తాను ఇంకొక పదహారు రోజులలో చనిపోతాను అని ఆయనకు ముందే తెలుసు. 3 రోజులు గడిచిపోయాయి. 4వ రోజున ఆయన తన త