** మనం నిత్యం భోజనం చేసేటపుడు., కొన్ని అలవాట్లు మనకే తెలియక అలవాటుగా చేస్తూ వుంటాము. అవి అలవాట్లు కాదట. మన యొక్క నైజo అనగా మన గుణ గణాల ప్రతిబింబాలని పాక శాస్త్రం చెబుతూoది. చూద్దాము. మనము, మన గుణాలు ఎంత వరకు సరిపోతాయో, మనకు మనమే గమనించు కోవాలి. అలాగే ఎదుటి వారిని మనము అంచనా వేసు కోవచ్చు. భోజనం చేసేటపుడు, మన ఆహారం ఎలా తీసు కొంతున్నామో చూడండి. ఇతరుల లో గమనించండి. వారి నడవడికను, గుణ గణాలు తెలుకోనండి. *ఎవరైతే* :----- 1. చేతి వ్రేళ్ళు కలపక, విడివిగా ఆహారం తింటూ వ్రేళ్ళ మధ్య జార విడుస్తుంటారో వారి వద్ద డబ్బు నిలవదట. 2. అన్నాన్ని పిసికి పిసికి తినే వారి భార్య అతని వల్ల జీవితాంతం భాధ పడుతుందట. అతని మనస్సు క్రూరము, దయా దాక్షిణ్యాలు లేనివాడట. అలాంటి వాడికి మన ఆడకూతురును ఇవ్వ కూడదట. 3. చేతి వ్రేళ్ళకు, తినేది విడి విడి గా అతుక్కుని వుంటే వాడు దరిద్రుడట. 4. ఎవరైతే వ్రేళ్ళు మొత్తం నోట్లో పెట్టుకొని జుర్రుకుంటూ తింటారో, వారి వద్ద డబ్బు నిలవదట. పైపెచ్చు బహు పిసినారులట. 5. త...
పితృ తర్పణము --విధానము శ్రీః శ్రీమతే వేద పురుషాయ నమః పితృ దేవతలకు శ్రాద్ధం చేసినపుడు , తర్పణము కూడా అందులో భాగం గా చెయ్యాలి. దీనిని చదివి , బ్రాహ్మణుడు దొరకకున్ననూ , ఎవరికి వారు తర్పణము చేయవచ్చును తర్పణము అర్థము , అవసరము , ప్రాశస్త్యము వంటి వాటి గురించి వేరొక చోట వ్రాయుచున్నాను ) ముగ్గురు పితృ దేవతలను బ్రాహ్మణులలో ఆవాహన చేసి కూర్చోబెట్టి చేసే శ్రాద్ధాన్ని ’ పార్వణ శ్రాద్ధం ’ లేక ’ చటక శ్రాద్ధం ’ అంటారు..కొన్ని సాంప్ర దాయాలలో బ్రాహ్మణులు లేకుండా కేవలము కూర్చలలో పితృదేవతలను ఆవాహన చేస్తారు .. .తగిన కారణము వలన అది కూడ వీలు కానప్పుడు క్లుప్తముగా చేసే శ్రాద్ధాలు... దర్శ శ్రాద్ధము , ఆమ శ్రాద్ధము , హిరణ్య శ్రాద్ధము. ఆ పద్దతి ముందుగా ఇచ్చి , తదుపరి తర్పణ విధి వివరించడమయినది.. దర్శాది హిరణ్య / ఆమ శ్రాద్దం పుణ్య కాలే | దర్భేషు ఆశీనః | దర్భాన్ ధారయమాణః | ఆచమ్య , పవిత్ర పాణిః ప్రాణానాయమ్య | ఓం భూః ..ఓం భువః...ఓగ్ం సువః.. ఓం మహః.. ఓం జనః.. ఓం తపః.. ఓగ్ం సత్యం..| .....ఓం తత్సవితుర్వరేణ్యం | భర్గో దేవస్య ధీమహి | ధియో యోనః ప్రచోదయాత్ | ఓమాపోజ్యోతీ రసోఽమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ సంకల్ప...
ఇంట్లో పాడైపోయిన విరిగిపోయి న లేదా జీర్ణమైన విగ్రహాలు / చిత్ర పటాలు ( photos ) ఏంచేయాలి ?.. ఈ సమస్య మరియు ప్రశ్న అందరికీ ఉండేదే...చాలా మంది తమ ఇంట్లో పాడైపోయిన విగ్రహాలు, పటాలు ఏ దేవాలయంలోనో లేదా రోడ్డుప్రక్కన చెట్టు క్రిందో వదిలేసి వెళ్లిపోతుంటారు. కానీ తెలిసి తెలియక అలా చేయడం మహాపాపం. క్షమించరాని నేరం. ఇంట్లో వున్నంతకాలం పూజలు చేసి తరువాత అవసరం లేదని లేదా పాడైపోయాని వాటిని ఏ చెట్టు🌳 క్రిందో లేదా ఏ రోడ్డు పక్కన పడవేయకండి. అలా రోడ్డు పక్కన ఉన్న మన "హిందూ దేవుళ్ళ" ఫోటోలు చూసి ఇతర మతస్తులు మన మతం గురించి చాలా అవహేళన చేస్తున్నారు. వారికీ ఆ అవకాశం ఇవ్వకండి. ఇతర మతస్థుల దేవుళ్ళ ఫోటోలు అంత దయనీయంగా మనం ఎక్కడన్నా చూస్తామా మీరే ఆలోచించండి. దయచేసి మనకు అవసరం లేని పటాలను లేదా దేవుడి బొమ్మలను అగ్నికి 🔥ఆహుతి ఇవ్వడం మంచి పద్దతి. అదేంటి దేవుడి పటాలను అలా అగ్నిలో వేస్తారా ఎక్కడైనా ? అన్న సందేహం మీకు రావచ్చు. కానీ అగ్ని 🔥సర్వభక్షకుడు, అన్ని వేళలా పునీతుడు. కనుక పవిత్రాగ్నిలో దేవతా పటాలను సమర్పించడం ఎంతమాత్రం తప్పుకాదు లేదా ప్రవహిస్తున్న నది🌊లో గాని మన ఊరి చెరువుల్లో గాన...
మానవుడు జన్మించినప్పటి నుంచి మరణించే వరకు సంష్కారమయమే. సంస్కారాల వలన జన్మాంతర దోషాలు కూడా వీడిపోయి మానవ జీవిత లక్ష్యమైన మోక్షప్రాప్తి సిద్ధిస్తుంది. జీవి గర్భంలో పడింది మొదలు అంత్య సంస్కారం వరకు జరిగే సంస్కారాలు లేదా కర్మలు ధర్మశాస్త్రల్లో 40 వరకు చెప్పబడ్డాయి. గౌతమ స్మృతుల్లో 40 సంష్కారాలను, అంగీరస మహర్షి 25, వ్యాసుడు 16 సంష్కారాలను చెప్పారు. మనుస్మృతి ఈ సంస్కారాలను 12 సంస్కారాలుగా చెబుతుంది. వివాహము ఒక సత్రంలో ఇద్దరు వ్యక్తులు ఒక్కటవ్వడమే వివాహము. ముహూర్త వారములు: సోమవారం నిషేధం ఆచారమే కానీ శాస్త్రం కాదు. మంగళవారము నిషేధము. మిగిలిన వారములు గ్రాహ్యమే. నక్షత్రములు: ‘మూల మైత్ర మృగ రోహిణి కరైః పౌష్ణమారుత ఘోత్సరాన్వితైః వీర్య వద్ధిరుడుద్ధిర్ముృగీ దృశాం పాణి పీడన విధిర్విధీయతే’ అని శాస్త్రం. అయితే ధనిష్ఠా, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతీ నక్షత్రముల సమయంలో వివాహం శ్రేష్ఠము అని కొందరు, కాదని కొందరు చెప్పారు. అయితే నాలుగు నక్షత్రములు కూడా ఆచారంలో వున్నవి. అందువలన అశ్వినీ, రోహిణీ, మృగశిర, మఘ, ఉత్తర, హస్త, స్వాతీ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, ర...
తద్దినాలు పెట్టడము మానేస్తున్నారు ఈ మధ్యన చాలా మంది. బ్రాహ్మణులు దొరకడము లేదు అని, ఎక్కువ దక్షిణ అడుగుతున్నారు అని, సమయము లేదు అని, మడి తో చేసే వాళ్ళు లేరు అని, వంట వాళ్ళు దొరకడము లేదు అని, ఖర్చు ఎక్కువ అవుతుందని…. ఇలా రకరకాల కారణములతో తద్దినములు పెట్టడము మానేస్తున్నారు. ఇది తప్పు. వంశాభివృద్ధి జరగదు. ఇది నిజము. పిల్లలు పుట్టరు, పుట్టినా ఆడ పిల్లలే పుడతారు. మగ పిల్లలు పుట్టరు. ఇది నిజము. నిజము. నిజము. నిజము. నమ్మండి. అందరికీ చెప్పండి. వంశములను కాపాడండి.పితృ దేవతలు సంతోష పడక పోతే వంశాభివృద్ధి జరగదు. మగ పిల్లలు పుట్టరు. వంశము ఆగి పోతుంది. అందరు తెలుసుకొని, జాగ్రత్తగా, పద్ధతిగా, శాస్త్ర ప్రకారముగా విధిగా ఆచరించాలి. దీని మడి వేరు. తడి బట్ట తోనే వంట చేసి, బ్రాహ్మణులకు భోజనము వడ్డించాలి. పొడి బట్ట పనికి రాదు. ముందు రోజు రాత్రి, ఆ రోజు రాత్రి భోజనము చేయకూడదు, బ్రహ్మ చర్యము పాటించి నేల మీద భార్యా భర్తలు పరుండాలి, భక్తితో, శ్రద్ధతో శ్రాద్ధము పెట్టాలి. ఇంటి కోడలు వంట చేస్తే పితృ దేవతలు శ్రీఘ్రముగా అనుగ్రహిస్తారు. పితృ దేవతలకు తద్దినాలుపెట్టండి, మానకండి, మన వంశాన్ని కాపాడేది వాళ్ళే. వాయన...
*15.5.2018 శని జయంతి* మంగళవారం. భరణి నక్షత్రం *(వైశాఖ బహుళ అమావాస్య)* (శని జయంతి సమాచారం అవసరం, ఆసక్తి ఉన్నవారికోసం) *నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం* *ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం ||* నీలాంజన సమాభాసం = నీలవర్ణంలో భాసిల్లెడు (ప్రకాశించే) రవిపుత్రం = సూర్య దేవుని పుత్రుడైన యమాగ్రజం = యమునికి సోదరుడు ఐన ఛాయామార్తాండ సంభూతం = ఛాయాదేవి (శనీశ్వరుని తల్లి), సూర్యుల సంతానమైన తం నమామి శనైశ్చరం = ఓ శనీశ్వరా నీకు నమస్కరిస్తున్నాను *శనైశ్చరాయ* అంటే శనైః = నెమ్మదిగా చరాయ = చరించే/తిరిగేవాడు *శని దేవుడు జీవుల కర్మఫల ప్రదాత* అంటే మనకు ఎందరు దేవుళ్లు, దేవతలు ఉన్నా, మనం చేసిన పను(కర్మ)లకు అవి పుణ్యకార్యం/ మంచి పని ఐనా, పాపం/ చెడు ఐనా ఫలితాన్ని ఇచ్చేది శనిదేవుడే. సమస్త దేవ, రాక్షస, మనుష్య & ఇతర ప్రాణుల కర్మలకు ఫలితాన్ని ఇచ్చి, వాళ్లందరినీ నియంత్రించేందుకు లయకారకుడైన శివుడు శనికి వక్రదృష్టి, ఇతరశక్తులనిచ్చి, కర్మఫలదాతను చేస్తాడు. వాటిసాయంతో శనీశ్వరుడు *క్రమశిక్షణ, మంచి లక్షణాలను కాపాడుతూ, చెడుని, చెడ్డవాళ్లను వారు చేసే కర్మలను అనుసరి...
#ఋషి_పంచమి: భాద్రపద శుద్ధ పంచమి ని #ఋషి_పంచమి: గా వ్యవహరిస్తారు... ఈ రోజున అత్రి, కశ్యప, భరద్వాజ, గౌతమ, వశిష్ట, జమదగ్ని, విశ్వామిత్ర మహర్షుల గురించి ఒక్కసారైనా తలచుకోవాలని చెబుతారు పెద్దలు. అరణ్యవాసం లో సీతారాములకు అభయమిచ్చిన వాడు అత్రి మహర్షి... సాక్షాత్తూ శ్రీహరినే పుత్రునిగా పొందిన మహానుభావుడు. సీతారాములకు చిత్రకూటానికి దారి చూపినవాడు భరద్వాజ మహర్షి. తన భార్య అహల్య ద్వారా రామునికి తన తప:ఫలాన్ని అందింపజేసిన మహారుషి గౌతముడు. రాముని గురువు విశ్వామిత్రుడు. కుల గురువు వశిష్టుడు విష్ణువు అంశావతారమైన పరశురాముని కన్న తండ్రి జమదగ్ని మహర్షి. దశావతారాల్లో ఒకటైన వామనుడి జనకుడు కశ్యప మహర్షి. #ఋషి_పంచమి నాడు రామాయణం చదివితే ఈ మహర్షులందరినీ తలుచుకున్నట్టే. #ఋషి_పంచమి వైశిష్ట్యం: ఋషి పంచమి వ్రతము ను స్త్రీలు తప్పక ఆచరించాలి . వినాయక చవితి మరుసటి రోజు వచ్చే పంచమిని " #ఋషి_పంచమి " అంటారు . సప్త ఋషులు ఆరోజు తూర్పున ఉదయిస్తారు . బ్రహ్మ విద్య నేర్వవలసిన రోజు . సప్తఋషుల కిరణాలు ఈ రోజు సాధకులపై ప్రసరిస్తాయి . . . గనుక బ్రాహ్మీ ముహూర్తముననే ...
Comments
Post a Comment