*15.5.2018 శని జయంతి* మంగళవారం. భరణి నక్షత్రం *(వైశాఖ బహుళ అమావాస్య)* (శని జయంతి సమాచారం అవసరం, ఆసక్తి ఉన్నవారికోసం) *నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం* *ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం ||* నీలాంజన సమాభాసం = నీలవర్ణంలో భాసిల్లెడు (ప్రకాశించే) రవిపుత్రం = సూర్య దేవుని పుత్రుడైన యమాగ్రజం = యమునికి సోదరుడు ఐన ఛాయామార్తాండ సంభూతం = ఛాయాదేవి (శనీశ్వరుని తల్లి), సూర్యుల సంతానమైన తం నమామి శనైశ్చరం = ఓ శనీశ్వరా నీకు నమస్కరిస్తున్నాను *శనైశ్చరాయ* అంటే శనైః = నెమ్మదిగా చరాయ = చరించే/తిరిగేవాడు *శని దేవుడు జీవుల కర్మఫల ప్రదాత* అంటే మనకు ఎందరు దేవుళ్లు, దేవతలు ఉన్నా, మనం చేసిన పను(కర్మ)లకు అవి పుణ్యకార్యం/ మంచి పని ఐనా, పాపం/ చెడు ఐనా ఫలితాన్ని ఇచ్చేది శనిదేవుడే. సమస్త దేవ, రాక్షస, మనుష్య & ఇతర ప్రాణుల కర్మలకు ఫలితాన్ని ఇచ్చి, వాళ్లందరినీ నియంత్రించేందుకు లయకారకుడైన శివుడు శనికి వక్రదృష్టి, ఇతరశక్తులనిచ్చి, కర్మఫలదాతను చేస్తాడు. వాటిసాయంతో శనీశ్వరుడు *క్రమశిక్షణ, మంచి లక్షణాలను కాపాడుతూ, చెడుని, చెడ్డవాళ్లను వారు చేసే కర్మలను అనుసరి...
మానవుడు జన్మించినప్పటి నుంచి మరణించే వరకు సంష్కారమయమే. సంస్కారాల వలన జన్మాంతర దోషాలు కూడా వీడిపోయి మానవ జీవిత లక్ష్యమైన మోక్షప్రాప్తి సిద్ధిస్తుంది. జీవి గర్భంలో పడింది మొదలు అంత్య సంస్కారం వరకు జరిగే సంస్కారాలు లేదా కర్మలు ధర్మశాస్త్రల్లో 40 వరకు చెప్పబడ్డాయి. గౌతమ స్మృతుల్లో 40 సంష్కారాలను, అంగీరస మహర్షి 25, వ్యాసుడు 16 సంష్కారాలను చెప్పారు. మనుస్మృతి ఈ సంస్కారాలను 12 సంస్కారాలుగా చెబుతుంది. వివాహము ఒక సత్రంలో ఇద్దరు వ్యక్తులు ఒక్కటవ్వడమే వివాహము. ముహూర్త వారములు: సోమవారం నిషేధం ఆచారమే కానీ శాస్త్రం కాదు. మంగళవారము నిషేధము. మిగిలిన వారములు గ్రాహ్యమే. నక్షత్రములు: ‘మూల మైత్ర మృగ రోహిణి కరైః పౌష్ణమారుత ఘోత్సరాన్వితైః వీర్య వద్ధిరుడుద్ధిర్ముృగీ దృశాం పాణి పీడన విధిర్విధీయతే’ అని శాస్త్రం. అయితే ధనిష్ఠా, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతీ నక్షత్రముల సమయంలో వివాహం శ్రేష్ఠము అని కొందరు, కాదని కొందరు చెప్పారు. అయితే నాలుగు నక్షత్రములు కూడా ఆచారంలో వున్నవి. అందువలన అశ్వినీ, రోహిణీ, మృగశిర, మఘ, ఉత్తర, హస్త, స్వాతీ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, ర...
పరమేశ్వరుడు పరాశక్తితో వీటన్నింటా సన్నిధి చేసి ఉంటాడు. వీటిని స్మరించినా, విన్నా భక్తులకు పాపాలు తొలగి ముక్తి లభిస్తుంది. అష్టోత్తర శతనామాలను జపించినా, పుస్తకాన్ని ఇంట్లో ఉంచుకున్నా దుష్టగ్రహ పీడలన్నీ తొలగిపోతాయి. శ్రాధ్ధ కాల౦లో వీటిని స్మరి౦చినయెడల పితృదేవతలు సంతృప్తి చెందుతారు. ఇవి సాక్షాత్తు ముక్తి క్షేత్రాలు. 1. వారణాసిలో విశాలాక్షి 2. ముఖనివాసం లో గౌరి ౩. నైవిశం లో లింగధారిణి 4. ప్రయాగలో లలిత 5. గంధమాదనం మీద కౌముకి 6. మానస క్షేత్రం లో కుముద 7. దక్షిణ క్షేత్రం లో విశ్వకామ 8. ఉత్తర క్షేత్రం లో విశ్వకామప్రరూపిణీ 9. గోమంతం లో గోమతి 10. మందరం లో కామచారిణీ 11. చైత్రరథం లో మదోత్కట 12. హస్తినాపురం లో జయంతి 13. కన్యాకుబ్జం లో గౌరి 14. మలయాచలం పై రంభ 15. ఏకామ్ర పీఠం లో కీర్తిమతి 16. విశ్వక్షేత్రం లో విశ్వేశ్వరి 17. పుష్కర క్షేత్రం లో పురుహూతిక 18. కేదారం లో సన్మార్గదాయిని 19. హిమాలయం లో మంద 20. గోకర్ణం లో భద్రకర్ణిక 21. స్థానేశ్వరం లో భవాని 22. బిల్వక్షేత్రం లో బిల్వపత్రిక 23. శ్రీశైలం లో మాధవి 24. భద్రేశ్వరం భద్ర 25. వరాహాశైలం మీద జయ 26. కమలాయం లో కమల 27. ర...
** మనం నిత్యం భోజనం చేసేటపుడు., కొన్ని అలవాట్లు మనకే తెలియక అలవాటుగా చేస్తూ వుంటాము. అవి అలవాట్లు కాదట. మన యొక్క నైజo అనగా మన గుణ గణాల ప్రతిబింబాలని పాక శాస్త్రం చెబుతూoది. చూద్దాము. మనము, మన గుణాలు ఎంత వరకు సరిపోతాయో, మనకు మనమే గమనించు కోవాలి. అలాగే ఎదుటి వారిని మనము అంచనా వేసు కోవచ్చు. భోజనం చేసేటపుడు, మన ఆహారం ఎలా తీసు కొంతున్నామో చూడండి. ఇతరుల లో గమనించండి. వారి నడవడికను, గుణ గణాలు తెలుకోనండి. *ఎవరైతే* :----- 1. చేతి వ్రేళ్ళు కలపక, విడివిగా ఆహారం తింటూ వ్రేళ్ళ మధ్య జార విడుస్తుంటారో వారి వద్ద డబ్బు నిలవదట. 2. అన్నాన్ని పిసికి పిసికి తినే వారి భార్య అతని వల్ల జీవితాంతం భాధ పడుతుందట. అతని మనస్సు క్రూరము, దయా దాక్షిణ్యాలు లేనివాడట. అలాంటి వాడికి మన ఆడకూతురును ఇవ్వ కూడదట. 3. చేతి వ్రేళ్ళకు, తినేది విడి విడి గా అతుక్కుని వుంటే వాడు దరిద్రుడట. 4. ఎవరైతే వ్రేళ్ళు మొత్తం నోట్లో పెట్టుకొని జుర్రుకుంటూ తింటారో, వారి వద్ద డబ్బు నిలవదట. పైపెచ్చు బహు పిసినారులట. 5. త...
నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని పండితులు అంటున్నారు. జనన వృత్తాంతము : అదితి , కస్యపు ముని కుమారుడైన సుర్యభావానునికి ముగ్గురు భార్యలు -- ఉషా(సంజ్ఞా) , చాయ , పద్మిని . లోకాలన్నితికి వెలుగునిచ్చే సుర్యాడు త్వష్ట ప్రజాపతి "విశ్వకర్మ" కూతురు సంజ్ఞా(ఉమా) దేవిని పెళ్ళిచేసుకున్నాడు . పెళ్ళైన నుండే సూర్యకాంతిని , తేజస్సును భారిచలేక , చూడలేక విచారము తో ఉన్న ఉమాదేవి ని నారదుడు చూసి , విషయము తలుసుకొని ... ఈశ్వరుని తపస్సు చేసి శక్తిని పొందమని ఉపాయమార్గము జప్పెను . అప్పటికే తనకి ముగ్గురు పిల్లలు -మొదటివాడు వైవాస్తవ . రెండేవ వాడు యముడు . మూడవది కూతురు యమున. నారద సలహా మేరకు ఉమాదేవి తన నీడకు ప్రాణము పోసి "చాయాదేవి" గా సూర్యుని వద్ద పెట్టి పుట్టింటికి వెళ్ళిపోయెను, కూతురు భర్తకి చెప్పకుండా పుట్టింటికి వచ్చినందున అనరాని మాటలతో నిందించి తిరిగి సుర్యునివద్దకే వెళ్ళిపొమ్మని చెప్పగా ....
హోమము వలన కలుగు లాభములు హోమ ధూమము కంటి ని కప్పుట వలన కంటి లో ఉన్న నలతలన్నీ కన్నీటి రూపము లో వెళ్లి పోతుంది. హోమాగ్ని సెగ మోకాళ్ళ కు తాకటం వలన మోకాళ్ళ నొప్పులు రాకుండా నివారించు కోవచ్చు. గ్రహాలకు వేరు వేరు వృక్షాల సమిధల తో హోమం చేస్తే వేరు వేరు సత్ఫలితాలు వస్తాయి. రవి:- తెల్ల జిల్లేడు వాత,కఫ వ్యాదులను తగ్గిస్తుంది. తెల్ల జిల్లేడు సమిధల తో ఇంట్లో హోమం చేస్తే వాస్తుదోషాలు నివారణ అవుతాయి. కళ్ళ కు సంబంధించిన అనారోగ్యాలు నయ మవుతాయి. కోపము యొక్క తాపము తగ్గుతుంది. తల నొప్పి భాధలు ఉండవు. ఆయుర్వేదం ప్రకారం తెల్ల జిల్లేడు కు కుష్టు వ్యాధి ని నయం చేసే శక్తి వుందని ఆయుర్వేద వైద్యులు చెప్పేవారు. చంద్రుడు:- మోదుగ సమిధల తో హోమం చేస్తే మానసిక సమస్యలు ఉండవు. ఆలోచనా విధానం లో మార్పులు వస్తాయి. సుఖ వ్యాధులు దరి చేరవు. మోదుగాకు ను మెత్త గా నూరి పాలతో తాగిన స్త్రీలకు ఋతు సంబంధ సమస్యలు, గర్భ సంబంధ సమస్యలు ఉండవు. మోదుగ పువ్వులు, గింజలు ఎండ బెట్టి నీటి లో ఒక పావు చెంచా వేసి కాగబెట్టు కొని తాగితే లావుగా ఉన్న వారు సన్న గా అవుతారు. వైద్య పరం ...
Comments
Post a Comment